National Housing Bank (NHB)
-
హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల ధరలు
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల ధరలు జూన్ త్రైమాసికంలో 6.9 శాతం పెరిగినట్టు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) విడుదల చేసిన ‘హౌసింగ్ ప్రెస్ ఇండెక్స్’ డేటా తెలియజేస్తోంది. దేశవ్యాప్తంగా 43 పట్టణాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కరోనా ముందు నాటితో పోలిస్తే గృహ రుణాల రేట్లు ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయని, దీంతో ఇళ్ల ధరల అందుబాటు ఆరోగ్యకర స్థాయిలో ఉన్నట్టు ఎన్‌హెచ్‌బీ నివేదిక తెలిపింది. అహ్మదాబాద్‌లో ఇళ్ల ధరలు 9.1 శాతం పెరగ్గా, బెంగళూరులో 8.9 శాతం, కోల్‌కతాలో 7.8 శాతం చొప్పున ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఎగిశాయి. చెన్నైలో 1.1 శాతం, ఢిల్లీలో 0.8 శాతం, ముంబైలో 2.9 శాతం, పుణేలో 6.1 శాతం చొప్పున ఇళ్ల ధరలు పెరిగాయి. ఎన్‌హెచ్‌బీ హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ 50 పట్టణాల్లోని ప్రాపర్టీల విలువల సమాచారాన్ని బ్యాంక్‌లు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి తీసుకుని ప్రతి త్రైమాసికానికి నివేదిక విడుదల చేస్తుంటుంది. మొత్తం మీద 50 పట్టణాల్లో ఇళ్ల ధరలు జూన్ క్వార్టర్లో, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు 4.8 శాతం వృద్ధి చెందాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఇళ్ల రేట్ల పెరుగుదల 7 శాతంగా ఉండడం గమనార్హం. ఇక ఈ ఏడాది మార్చి త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు 50 పట్టణాల్లో ఇళ్ల ధరలు 0.7 శాతం పెరిగాయి. 2021 జూన్ నుంచి ప్రతీ త్రైమాసికంలోనూ ఇళ్ల ధరల సూచీ పెరుగుతూ వస్తోందని ఎన్‌హెచ్‌బీ నివేదిక వెల్లడించింది. -
హైదరాబాద్‌లో పెరిగిన ప్రాపర్టీల ధరలు
న్యూఢిల్లీ: హైదరాబాద్ సహా దేశంలోని ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఇళ్ల ధరలు జనవరి–మార్చి మధ్య పెరిగినట్టు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) గణాంకాలు వెల్లడించాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్లో ధరలు 7.9 శాతం పెరిగాయి. అత్యధికంగా కోల్‌కతాలో 11 శాతం, అహ్మదాబాద్‌లో 10.8 శాతం, బెంగళూరులో 9.4 శాతం మేర ఇళ్ల ధరలు ఎగిశాయి. చెన్నైలో 6.8 శాతం, ఢిల్లీలో 1.7 శాతం, ముంబైలో 3.1 శాతం, పుణెలో 8.2 శాతం చొప్పున పెరిగినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా టాప్–50 పట్టణాల్లో కేవలం ఏడు పట్టణాల్లోనే ఇళ్ల ధరలు తగ్గాయి. గృహ రుణాలపై రేట్లు ఇప్పటికీ కరోనాకు ముందున్న నాటితో పోలిస్తే తక్కువలోనే ఉండడం, కొనుగోళ్లకు మద్దతుగా నిలుస్తోంది. 50 పట్టణాల్లో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంక్‌ల వద్దనున్న ప్రాపర్టీ వ్యాల్యూషన్లను ఎన్‌హెచ్‌బీ పరిగణనలోకి తీసుకుంది. ఈ పట్టణాల్లో ఇళ్ల ధరలు సగటున 5.8 శాతం మేర మార్చి త్రైమాసికంలో పెరిగినట్టు తెలుస్తోంది. (సరికొత్త ఫీచర్లతో ప్రీమియం హీరో బైక్ వచ్చేస్తోంది: ఎప్పుడంటే?) క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రేట్ల పెరుగుదల 5.3 శాతంగా ఉండడం గమనార్హం. టాప్–50లో అత్యధికంగా గాంధీనగర్‌లో ఇళ్ల ధరలు 19.6 శాతం పెరిగితే, లుధియానాలో 12.9 శాతం తగ్గాయి. ఇక త్రైమాసికం వారీగా చూస్తే.. అంటే 2022 చివరి మూడు నెలలతో పోలిస్తే, 2023 మొదటి మూడు నెలల్లో ఇళ్ల ధరలు 50 పట్టణాల్లో సగటున 1.3 శాతం పెరిగాయి. 2021 జూన్ నుంచి ప్రతీ త్రైమాసికానికి రేట్లు పెరుగుతూ వస్తుండడాన్ని ఉండడాన్ని నివేదిక ప్రస్తావించింది. ఇదీ చదవండి: 1200 లోన్‌తో మొదలై.. రూ 2.58 లక్షల కోట్లకు మరిన్ని రియల్టీ వార్తలు, బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
Hyderabad: హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు పెరిగాయ్
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 11.5 శాతం పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో దేశవ్యాప్తంగా 42 పట్టణాల్లో ఇళ్ల ధరలు పెరిగినట్టు నేషనల్ హౌసింగ్ బ్యాంకు (ఎన్‌హెచ్‌బీ)కు చెందిన రెసిడెక్స్ (ఇళ్ల ధరల సూచీ) ప్రకటించింది. ఎనిమిది మెట్రోల్లోనూ ధరల పెరుగుదల నమోదైనట్టు పేర్కొంది. ఎనిమిది మెట్రోల్లో అహ్మదాబాద్‌లో అత్యధికంగా 13.5 శాతం, చెన్నైలో 12.5 శాతం చొప్పున ధరల పెరుగుదల ఉండగా, ఆ తర్వాత ఎక్కువగా పెరిగింది హైదరాబాద్ మార్కెట్లోనే కావడం గమనించాలి. బెంగళూరులో 3.4 శాతం, ఢిల్లీలో 7.5 శాతం, కోల్‌కతాలో 6.1 శాతం, ముంబైలో 2.9 శాతం, పుణెలో 3.6 శాతం చొప్పున ఇళ్ల ధరల్లో వృద్ధి నెలకొంది. ఇక దేశవ్యాప్తంగా ఐదు పట్టణాల్లో ఇళ్ల ధరలు తగ్గగా, మూడు పట్టణాల్లో స్థిరంగా ఉన్నాయి. ఎన్‌హెచ్‌బీ రెసిడెక్స్ ఇండెక్స్ 50 పట్టణాల గణాంకాలను ట్రాక్ చేస్తుంటుంది. సీక్వెన్షియల్‌గా చూస్తే (మార్చి త్రైమాసికం నుంచి) ఈ 50 పట్టణాల్లో ఇళ్ల ధరలు 1.7 శాతం పెరిగాయి. 2017–18 నుంచి 50 పట్టణాల్లో ఇళ్ల ధరలను త్రైమాసికం వారీగా ఎన్‌హెచ్‌బీ రెసిడెక్స్ ప్రకటిస్తోంది. చదవండి: (Electric Vehicles In India: 2030 నాటికి 5 కోట్ల ఈవీలు) -
తనఖా రుణాలలో వృద్ధి
సాక్షి, హైదరాబాద్: దేశంలో మార్టిగేజ్ లోన్స్ శరవేగంగా వృద్ధి చెందుతున్నాయి. 1990లో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 1 శాతంగా ఉన్న తనఖా రుణాల వాటా.. ప్రస్తుతం 11 శాతానికి చేరిందని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) తెలిపింది. దీని విలవు సుమారు రూ.27 లక్షల కోట్లుగా ఉందని ఇటీవల జరిగిన ‘ట్రాన్స్ఫార్మింగ్ మార్టిగేజ్ లెండింగ్ ఫర్ డిజిటల్ ఇండియా’ వెబినార్ సదస్సులో పాల్గొన్నారు. ఎన్‌హెచ్‌బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాహుల్ భావే తెలిపారు. గత ఐదేళ్లుగా దేశీయ గృహ రుణ మార్కెట్ 30 శాతం మేర వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. అంతకుక్రితం ఏడాదితో పోలిస్తే 2021 ఆర్థిక సంవత్సరంలో రుణ పంపిణీ 185 శాతం పెరిగిందని చెప్పారు. ఇందులో 65 శాతం లోన్లు బ్యాంక్‌లు అందించాయి. ఇప్పటివరకు దేశంలోని అన్ని హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు తెలంగాణలో రూ.17,970 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ.5,730 కోట్ల గృహ రుణాలను అందించాయి. చదవండి: గృహ రుణాలలో 26 శాతం వృద్ధి -
హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 2% అప్
విజయవాడలో 0.6% క్షీణత ఎన్‌హెచ్‌బీ త్రైమాసిక నివేదిక న్యూఢిల్లీ: హైదరాబాద్, ఢిల్లీ, ముంబై సహా దేశవ్యాప్తంగా 12 ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు జనవరి - మార్చి క్వార్టర్లో 7.1 శాతం వరకు పెరిగాయి. డిమాండు పెరగడమే ఇందుకు కారణమని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) నివేదికలో తెలిపింది. ఇదే త్రైమాసికంలో మరో 12 నగరాల్లో ధరలు తగ్గాయని పేర్కొంది. అక్టోబరు - డిసెంబరు క్వార్టర్‌తో పోలిస్తే జనవరి - మార్చి మధ్యకాలంలో అహ్మదాబాద్‌లో 6.1, చెన్నైలో 5.8, కోల్‌కతాలో 5.1, లక్నోలో 4.9, రాయిపూర్లో 4.4, ముంబైలో 3.2, నాగ్‌పూర్‌లో 2.9, డెహ్రాడూన్‌లో 2.7, హైదరాబాద్‌లో 2.2, ఢిల్లీలో 1.5, భోపాల్‌లో 1.3 శాతం ధరలు వృద్ధిచెందాయి. ఇదేకాలంలో జైపూర్‌లో 3.8, గువాహటిలో 3.75, బెంగలూరులో 3.6, మీరట్‌లో 3.5, భువనేశ్వర్‌లో 3.47, లూధియానాలో 3.3, కోయంబత్తూరులో 1.7, విజయవాడలో 0.6 శాతం మేరకు ఇళ్ల ధరలు క్షీణించాయి. ఫరీదాబాద్, కోచ్చిల్లో రేట్లు స్థిరంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 26 నగరాల్లో వివరాలను సేకరించింది. రియల్టీలోకి రూ.4,800 కోట్లు మార్చి క్వార్టర్లో దేశీయ రియల్టీ రంగంలోకి సుమారు 80 కోట్ల డాలర్ల (రూ.4,800 కోట్లు) పెట్టుబడులు వచ్చాయని సీబీఆర్ఈ సౌత్‌ఆసియా ఓ ప్రకటనలో తెలిపింది. ప్రైవేట్ ఈక్విటీల రూపంలో ఈ పెట్టుబడులు పెట్టారని పేర్కొంది.