Rise Again
-
ఇళ్ల ధరలు 12 శాతం అప్
న్యూఢిల్లీ: దేశీయంగా హైదరాబాద్ సహా ఎనిమిది ప్రధాన నగరాల్లో ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు సగటున 12 శాతం పెరిగాయి. ఢిల్లీ–ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్)లో అత్యధికంగా 30 శాతం ఎగిశాయి. రియల్టర్ల సమాఖ్య క్రెడాయ్, ప్రాపర్టీ కన్సల్టెంట్ కోలియర్స్, డేటా అనలిటిక్స్ సంస్థ లైజాస్ ఫోరాస్ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం వార్షిక ప్రాతిపదికన జూన్ త్రైమాసికంలో ఎనిమిది ప్రధాన నగరాలకు గాను ఏడు నగరాల్లో ఇళ్ల ధరలు పెరిగాయి. ‘గత కొద్ది త్రైమాసికాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో బుల్ రన్ కొనసాగుతోంది. టాప్ 8 నగరాల్లో నమోదవుతున్న లావాదేవీల పరిమాణం, హౌసింగ్‌పై సానుకూల సెంటిమెంట్ దీన్ని ధృవీకరిస్తోంది. డిమాండ్‌కి మాత్రమే పరిమితం కాకుండా ప్రాధాన్య అసెట్ క్లాస్‌గా ప్రజలు రియల్ ఎస్టేట్ వైపు మళ్లుతుండటమనేది హౌసింగ్ ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది‘ అని క్రెడాయ్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ తెలిపారు. రేట్లు పెరిగినప్పటికీ పలు నగరాల్లో అమ్మకాలు కూడా పెరిగినట్లు లైజాస్ ఫోరాస్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ కపూర్ వివరించారు. గత కొద్ది త్రైమాసికాలుగా హౌసింగ్‌కు డిమాండ్ మెరుగ్గా ఉంటోందని కోలియర్స్ ఇండియా సీఈవో బాదల్ యాగి్నక్ పేర్కొన్నారు. అదే సమయంలో వడ్డీ రేట్లు స్థిరంగా ఉండటం, ఇటీవల బడ్జెట్లో సానుకూల ప్రతిపాదనలు చేయడం మొదలైనవి హౌసింగ్ మార్కెట్‌కి ఊతమిచ్చినట్లు వివరించారు. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు.. → హైదరాబాద్‌లో హౌసింగ్ ధరలు 7 శాతం పెరిగాయి. చ.అ.కు రేటు రూ. 10,530 నుంచి రూ. 11,290కి చేరింది. → బెంగళూరులో 28 శాతం వృద్ధితో ధరలు రూ. 8,688 నుంచి రూ. 11,161కి చేరాయి. → చెన్నైలో పెద్దగా మార్పులు లేకుండా చ.అ. రేటు రూ. 7,690 స్థాయిలోనే ఉంది. → ఢిల్లీ–ఎన్సీఆర్లో అత్యధికంగా 30 శాతం పెరిగి రూ. 8,652 నుంచి రూ. 11,279కి చేరింది. → ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో ఇళ్ల ధరలు చ.అ.కి 6 శాతం పెరిగి రూ. 19,111 నుంచి రూ. 20,275కి చేరాయి. → కోల్‌కతాలో 7 శాతం వృద్ధి చెంది రూ. 7,315 నుంచి రూ. 7,745కి చేరాయి. → పుణెలో రెసిడెన్షియల్ ప్రాపరీ్టల రేట్లు 13% పెరిగి రూ. 9,656కి చేరాయి. → అహ్మదాబాద్‌లో ఇళ్ల ధరలు 13% వృద్ధితో రూ. 6,507 నుంచి రూ. 7,335కి పెరిగాయి. -
కరోనా కలకలం
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా కోరలు చాస్తోంది. దేశవ్యాప్తంగా కేసులు రెట్టింపయ్యాయి. గత 24 గంటల్లో 2,067 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. 40 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 0.49గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య 12 వేలు దాటింది. ఢిల్లీ, ముంబైలలో అత్యధికంగా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా ఒకరి నుంచి మరొకరికి ఎంత త్వరగా వ్యాపిస్తుందో చెప్పే ఆర్ వాల్యూ మూణ్నెల్ల తర్వాత మళ్లీ 1ని దాటి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దాంతో ఫోర్త్ వేవ్ రావచ్చన్న అనుమానాలు వస్తున్నాయి. ఢిల్లీలో కేసుల్లో ఒకేసారి 26% పెరుగుదల కనిపించింది. 632 కొత్త కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 4.42 శాతంగా ఉంది. దాంతో ఢిల్లీలో కరోనా నిబంధనలు కఠినతరం చేశారు. మాస్కులు పెట్టుకోకపోతే రూ.500 జరిమానా విధిస్తామని ఢిల్లీ ప్రభుత్వం హెచ్చరించింది. మూణ్నెల్ల తర్వాత... కరోనా వ్యాప్తిని సూచించే ఆర్ వాల్యూ 1 దాటినట్టు చెన్నైలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ అంచనా వేసింది. ఇది 1 దాటడం మూడు నెలల తర్వాత ఇదే తొలిసారి. ఢిల్లీ, హరియాణా, యూపీల్లో ఆర్ వాల్యూ కొద్ది వారాలుగా క్రమంగా పెరుగుతోంది. ఈ వాల్యూ ఒకటి కంటే తక్కువ ఉంటే కరోనా అదుపులో ఉన్నట్టు. 1 కంటే ఎక్కువ ఉంటే ప్రమాదకరమే. ‘‘ఏప్రిల్ 5–11 మధ్య 0.93 ఉన్న ఆర్ వాల్యూ 12–18 నాటికి 1.07కి చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై వంటి మెట్రోల్ల 1 కంటే ఎక్కువగా, ఢిల్లీ, యూపీల్లో ఏకంగా 2గా ఉంది’’ అని చెన్పై యూనివర్సిటీ శాస్త్రవేత్త సితాభ్ర సిన్హా వివరించారు. -
రైజింగ్ యూత్
స్టాస్... అంటే గ్రీకులో రైజ్ అగైన్ అని అర్థం. పేరుకు తగినట్టుగానే పునరుజ్జీవం చెందిందా యువత. ఫేస్బుక్ అంతా ఫేక్‌బుక్ అయిపోతోందని వాపోతున్న సమయంలో దానినే వేదికగా చేసుకుని సేవకు అంకితమయ్యారు. ముగ్గురు స్నేహితుల్లో వికసించిన ఆలోచన మూడు వేల మందికి విస్తరించింది. స్టాస్ ఫౌండేషన్‌గా రూపుదిద్దుకొని పదిహేడు జిల్లాల్లో సేవలందిస్తోంది. - దార్ల వెంకటేశ్వరరావు, రాంగోపాల్‌పేట్ మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి కార్తీక్, కడప జిల్లాకు చెందిన మానస, మెదక్‌కు చెందిన నవీన్‌లు ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యారు. ఆ పరిచయాన్ని ఉబుసుపోని కబుర్లకు పరిమితం చేయలేదు. సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడాలన్న ఆలోచనతో ఫేస్బుక్లో స్టాస్ ఫౌండేషన్‌ను స్థాపించారు. ఎప్పటికప్పుడు తమ సేవా కార్యక్రమాలను ఫేస్బుక్ ద్వారానే వివరిస్తూ వేల మందిని సభ్యులుగా చేశారు. అలా ముగ్గురుతో ప్రారంభమైన ఆ ఫౌండేషన్ ఇప్పుడు 300 మంది చురుకైన వలంటీర్లు, 3వేల మంది సభ్యులతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని 17 జిల్లాలకు విస్తరించింది. అనాథలు, వృద్ధులకు కొత్త జీవితం ‘సుభిక్ష’ పేరుతో నిరుపేదలు, అనాథలు, రోడ్డు పక్కన ఉండే వారికి ఆహారం, దుస్తులు, దుప్పట్లు సమకూరుస్తున్నారు. పంక్షన్హాళ్లలో మిగిలిపోయిన అన్నం వృథా చేయకుండా, నిర్వాహకులను ఒప్పించి తెచ్చి పేదలకు పంచుతున్నారు. పాత దుస్తులు సేకరించి అవసరం ఉన్నవారికి అందిస్తున్నారు. రోడ్డుపై ఉన్న అనాథలను ఆశ్రమాల్లో చేర్పిస్తుంటారు. నిరాదరణకు గురైన వృద్ధులకు, వికలాంగులకు తామున్నామనే భరోసా కల్పించే కార్యక్రమమే ‘ఆసరా’. తమ పుట్టిన రోజు వేడుకలను ఇంట్లోనో, కాలేజీల్లోనో కాకుండా.. వృద్ధాశ్రమాల్లో జరుపుకొంటూ నిరాదరణకు గురైన వృద్ధులకు మేమున్నామనే భరోసా కలిగిస్తున్నారు. వారితో కొంత సమయం గడిపి బాధను దూరం చేస్తున్నారు. చదువుల వెలుగులు ‘వెలుగు’ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచడం, విద్యార్థులకు పుస్తకాలు, స్టేషనరీ, ఆర్థిక సహాయం, స్కాలర్షిప్లు అందించి ఆదుకోవడం చేస్తున్నారు. తలసేమియా వ్యాధితో బాధపడే వారికి, ప్రమాదాల్లో రక్తం అందక చనిపోవడాన్ని తగ్గించేందుకు ‘ఆయుష్’తో రక్తదానాలు చేసి ఆయువు పోస్తున్నారు. అలాగే అవయవదానంపై అవగాహన కల్పిస్తున్నారు. అనాథాశ్రమాల్లో తాము ఒంటరిమనే ఆత్మన్యూనతతో కాలం వెళ్లదీసే చిన్నారులను ‘విహార్’ పేరుతో విహారయాత్రలకు తీసుకుని వెళ్లి మానసిక ఆనందాన్ని పంచుతున్నారు. వారితో కలిసి ఆడిపాడి మానసిక ధైర్యాన్ని అందిస్తున్నారు. ‘ఉపాధి’ పేరుతో నిరుద్యోగులకు, వికలాంగులకు, బాలికలకు శిక్షణ అందించి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నారు. పేద అమ్మాయిల వివాహాలకు ఆర్థిక సహాయం చేస్తుంది స్టాస్. పర్యావరణ ‘ప్రాణధాత్రి’ పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించేందుకు పర్యావరణంపై అవగాహన పెంచేందుకు ‘ప్రాణధాత్రి’ పేరుతో విస్తృతంగా మొక్కల పంపిణీ, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి సమాజాన్ని చైతన్యపరుస్తున్నారు. రసాయన ఎరువుల వల్ల మనిషికి , భూమికి ఎదురయ్యే సమస్యల్ని ఇటు విద్యార్థులకు, అటు రైతులకు వివరిస్తూ సేంద్రియ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. ‘జాబిల్లి’ పేరుతో ఒక చిన్నారితో అనాథాశ్రమాన్ని మొదలు పెట్టింది స్టాస్. రోజుకు ఒక్కొక్కరు ఒక రూపాయి కూడబెట్టి అవసరమైతే ఇంకా వెచ్చించి, దాతల సహకారాన్ని తీసుకుంటూ ఈ బృహత్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. వృద్ధాశ్రమాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాం. ఏదైనా మంచి పని ఒక్కరే చేయాలని లేదు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా కొంత సమాజహితానికి పాటుపడితే ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది’ అంటున్నారు స్టాస్ ప్రధాన కార్యదర్శి మానస. ‘సమాజ సేవ చేయాలనే తపన ఉండి, నెలకు రెండు రోజులు సమయం కేటాయించగలిగిన ప్రతి ఒక్కరు తమ ఫౌండేషన్‌లో చేరవచ్చు’ అని చెప్పారు స్టాస్ వ్యవస్థాపకుడు కార్తీక్.