భారీగా పెరిగిన సిమెంట్ ధరలపై భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
చెన్నై: భారీగా పెరిగిన సిమెంట్ ధరలపై భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పెరిగిన 25 శాతం ధర తగ్గించాలని, లేకుంటే జూలై 7 నుంచి దక్షిణ భారత్ లో నిర్మాణాలు నిలిపివేస్తామని హెచ్చరించింది. ధరల పెంపు అసమంజసంగా ఉందని క్రెడాయ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఉపాధ్యక్షుడు, కన్వీనర్ సురేష్ కృష్ణ ఆరోపించారు.
సిమెంట్ ఉత్పత్తిలో ముడిసరుకు, విద్యుత్, కూలీల ఖర్చులు పెరగకుండానే అనూహ్యంగా ఉత్పత్తిదారులు ధరలు పెంచారన్నారు. జూన్ 1 నుంచి సిమెంట్ ధర 25 శాతం(బస్తాకు రూ.70) పెరిగిందని తెలిపారు. పెంచిన ధరలు తగ్గించకుంటే ఈనెల 30 నుంచి సిమెంట్ బస్తాలు కొనొద్దని తమ సభ్యులను కోరనున్నట్టు వెల్లడించారు.