సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలలో ప్రాజెక్ట్‌ల లాంచింగ్‌లు పెరిగాయి. దీంతో అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ) 12 శాతం మేర వృద్ధి చెందాయి. ఇన్వెంటరీలో 95 శాతం యూనిట్లు నిర్మాణంలో ఉన్నవే. ఏడాదిలో హైదరాబాద్‌లో ఇన్వెంటరీ 38 శాతం పెరిగింది. గచ్చిబౌలి, కొండాపూర్, నానక్‌రాంగూడ, కోకాపేట వంటి ప్రాంతాలలో కొత్త ప్రాజెక్ట్‌లు భారీ స్థాయిలో ప్రారంభం కావటమే ఇన్వెంటరీ పెరుగుదలకు ప్రధాన కారణమని క్రెడాయ్ - కొల్లియర్స్ నివేదిక వెల్లడించింది. (హరిత భవనాలు: దేశంలోనే తొలిసారిగా గ్రీన్ ప్రాపర్టీ షో!)
గత తొమ్మిది త్రైమాసికాలుగా నగరంలో గృహాల ధరలు స్థిరంగానే ఉన్నాయని, 2023 తొలి త్రైమాసికం (క్యూ1)లో మాత్రం రేట్లు 13 శాతం మేర పెరిగాయి. గృహాలకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో 8 నగరాలలో ఇళ్ల ధరలు 8 శాతం వృద్ధి చెందాయి. అత్యధికంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ధరలు 16 శాతం, కోల్‌కతాలో 15 శాతం, బెంగళూరులో 14 శాతం మేర పెరిగాయి. (రూ. 1600 కోట్ల ఇంద్రభవనం అమ్మకానికి ఎక్కడో తెలుసా? భారతీయుడి మోజు)
గత కొన్ని త్రైమాసికాలుగా గృహ కస్టమర్ల సెంటిమెంట్ సానుకూలంగా ఉంది. వడ్డీ రేట్ల పెరుగుదల, నిర్మాణ సామగ్రి వ్యయాల వృద్ధి గృహాల ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలని క్రెడాయ్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment