inventory
-
హైదరాబాద్‌లో ఎన్ని ఇళ్లు అమ్మకానికి ఉన్నాయంటే..
డిమాండ్‌కు మించి సరఫరా జరుగుతుండటంతో హైదరాబాద్‌లో అమ్మకానికి ఉన్న ఇళ్లు(ఇన్వెంటరీ) పెరిగిపోతున్నాయి. దేశంలోని ఏడు ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే ముంబై తర్వాత హైదరాబాద్‌లోనే అత్యధిక ఇన్వెంటరీ ఉంది. ఇక, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలతో పోలిస్తే మన దగ్గరే ఎక్కువ. ప్రస్తుతం గ్రేటర్లో 1,01,091 ఇళ్ల ఇన్వెంటరీ (వీటిలో నిర్మాణంలో ఉన్నవి, పూర్తయినవి కలిపి) ఉంది. వీటి విక్రయానికి కనిష్టంగా 19 నెలల కాలం పడుతుంది.రెండేళ్లలో నగరంలో గృహాల సరఫరా పెరగడమే ఇన్వెంటరీ పెరుగుదలకు ప్రధాన కారణం. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఏడాది తొలి తొమ్మిది నెలల కాలంలో మొత్తం 5,64,416 యూనిట్ల ఇన్వెంటరీ మిగిలి ఉందని, వీటి విక్రయానికి కనిష్టంగా 14 నెలల కాలం పడుతుందని అనరాక్ గ్రూప్ నివేదిక వెల్లడించింది.ఇదీ చదవండి: ట్రంప్ కలం నుంచి జాలువారిన అక్షరాలునగరాల వారీగా ఇన్వెంటరీ (యూనిట్లలో)ఎన్సీఆర్ ఢిల్లీ 85,460 ఎంఎంఆర్ ముంబయి 1,86,677 బెంగళూరు 46,316 పుణే 88,176 హైదరాబాద్ 1,01,091 చెన్నై 28,758 కోల్‌కతా 25,938 -
పేరుకుపోతున్న వాహన నిల్వలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డీలర్ల వద్ద ప్యాసింజర్ వాహన నిల్వలు పోగవడం సహజం. ప్రస్తుతం ఉన్న 80–85 రోజుల ఇన్వెంటరీ(గోదాముల్లో అమ్ముడవకుండా ఉన్న నిల్వలు) స్థాయి ఆందోళన కలిగిస్తోందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) చెబుతోంది. దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 7.9 లక్షల యూనిట్ల ప్యాసింజర్ వాహనాల నిల్వలు పేరుకుపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అవగతమవుతోంది.డీలర్ల వద్ద పోగైన వాహనాల విలువ ఏకంగా రూ.79,000 కోట్లు అని ఎఫ్ఏడీఏ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే సెప్టెంబర్ నెలలో ప్యాసింజర్ వాహనాల రిటైల్ విక్రయాలు 19 శాతం క్షీణించి 2,75,681 యూనిట్లకు వచ్చి చేరాయి. టూవీలర్స్ అమ్మకాలు 8 శాతం తగ్గి 12,04,259 యూనిట్లుగా ఉంది. త్రిచక్ర వాహనాలు స్వల్పంగా పెరిగి 1,06,524 యూనిట్లు నమోదయ్యాయి. వాణిజ్య వాహనాల అమ్మకాలు 10 శాతం పడిపోయి 74,324 యూనిట్లకు వచ్చి చేరాయి. ట్రాక్టర్లు 15 శాతం దూసుకెళ్లి 74,324 యూనిట్లను తాకాయి. ఇక అన్ని విభాగాల్లో కలిపి రిజిస్ట్రేషన్స్ 18,99,192 నుంచి 9 శాతం క్షీణించి 17,23,330 యూనిట్లకు పడిపోయాయి. ఇది చివరి అవకాశం..‘భారీ వర్షపాతం, మందగించిన ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని మరింత తీవ్రతరం చేశాయి. గణేష్ చతుర్థి, ఓనం వంటి పండుగలు ప్రారంభమైనప్పటికీ పరిశ్రమ పనితీరు చాలా వరకు నిలిచిపోయిందని డీలర్లు పేర్కొన్నారు’ అని ఫెడరేషన్ ప్రెసిడెంట్ సి.ఎస్.విఘ్నేశ్వర్ తెలిపారు. మరింత ఆలస్యం కాకముందే మార్కెట్ పునరుద్ధరణకు మద్దతు ఇవ్వడానికి తయారీ సంస్థలకు ఇది చివరి అవకాశం అని అన్నారు. అదనపు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోకుండా నిరోధించడానికి డీలర్ సమ్మతి, వాస్తవ పూచీకత్తు ఆధారంగా మాత్రమే కఠినమైన ఛానల్ ఫండింగ్ విధానాలను తప్పనిసరి చేస్తూ బ్యాంకులకు సలహా జారీ చేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్‌ను ఫెడరేషన్ కోరిందన్నారు. ఇదీ చదవండి: ‘పెయిడ్ ట్వీట్’ అంటూ వ్యాఖ్యలుడీలర్లు, తయారీ సంస్థలు పండుగలకు ఎక్కువ అమ్మకాలు ఉంటాయని భావిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ మార్కెట్లలో సానుకూల నగదు ప్రవాహం, మెరుగైన వ్యవసాయ పరిస్థితులు డిమాండ్‌ను పెంచుతాయని ఆశించినప్పటికీ ఆశించినమేర ఫలితం లేదని ఫెడరేషన్ తెలిపింది. అదనపు ఇన్వెంటరీని క్లియర్ చేయడానికి, 2024–25 ఆర్థిక సంవత్సరం మిగిలిన కాలానికి సానుకూల వృద్ధి పథాన్ని నడపడానికి అక్టోబర్ నెల చాలా అవసరమని పేర్కొంది. ఊహించిన విక్రయాలు కార్యరూపం దాల్చకపోతే కొత్త సంవత్సరంలోకి వెళ్లే క్రమంలో డీలర్లతోపాటు తయారీ సంస్థలను కూడా కష్టతర పరిస్థితి ఎదురవుతుందని చెప్పింది. -
హైదరాబాద్‌లో 38 శాతం ఇళ్లు అమ్ముడు పోవడం లేదట!ఎందుకో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలలో ప్రాజెక్ట్‌ల లాంచింగ్‌లు పెరిగాయి. దీంతో అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ) 12 శాతం మేర వృద్ధి చెందాయి. ఇన్వెంటరీలో 95 శాతం యూనిట్లు నిర్మాణంలో ఉన్నవే. ఏడాదిలో హైదరాబాద్‌లో ఇన్వెంటరీ 38 శాతం పెరిగింది. గచ్చిబౌలి, కొండాపూర్, నానక్‌రాంగూడ, కోకాపేట వంటి ప్రాంతాలలో కొత్త ప్రాజెక్ట్‌లు భారీ స్థాయిలో ప్రారంభం కావటమే ఇన్వెంటరీ పెరుగుదలకు ప్రధాన కారణమని క్రెడాయ్ - కొల్లియర్స్ నివేదిక వెల్లడించింది. (హరిత భవనాలు: దేశంలోనే తొలిసారిగా గ్రీన్ ప్రాపర్టీ షో!) గత తొమ్మిది త్రైమాసికాలుగా నగరంలో గృహాల ధరలు స్థిరంగానే ఉన్నాయని, 2023 తొలి త్రైమాసికం (క్యూ1)లో మాత్రం రేట్లు 13 శాతం మేర పెరిగాయి. గృహాలకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో 8 నగరాలలో ఇళ్ల ధరలు 8 శాతం వృద్ధి చెందాయి. అత్యధికంగా ఢిల్లీ-ఎన్సీఆర్లో ధరలు 16 శాతం, కోల్‌కతాలో 15 శాతం, బెంగళూరులో 14 శాతం మేర పెరిగాయి. (రూ. 1600 కోట్ల ఇంద్రభవనం అమ్మకానికి ఎక్కడో తెలుసా? భారతీయుడి మోజు) గత కొన్ని త్రైమాసికాలుగా గృహ కస్టమర్ల సెంటిమెంట్ సానుకూలంగా ఉంది. వడ్డీ రేట్ల పెరుగుదల, నిర్మాణ సామగ్రి వ్యయాల వృద్ధి గృహాల ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలని క్రెడాయ్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ తెలిపారు. -
హైదరాబాద్‌లో 39 వేల గృహాల ఇన్వెంటరీ
న్యూఢిల్లీ: దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ) 9 శాతం తగ్గి.. 7.18 లక్షలకు చేరాయి. ఇందులో 48 శాతం అఫర్డబుల్ విభాగంలోని గృహాలు కాగా.. 8 శాతం రెడీ–టు–మూవ్ హోమ్స్ ఉన్నాయని ప్రాప్‌టైగర్ తెలిపింది. ‘రియల్ ఇన్సైట్స్ క్యూ–2020’ రిపోర్ట్ ప్రకారం.. 2019 డిసెంబర్ నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 7.92 లక్షల ఇన్వెంటరీ ఉండగా.. గతేడాది డిసెంబర్ 31 నాటికివి 7.18 లక్షలకు తగ్గాయి. 2019లో ఇన్వెంటరీ విక్రయానికి 27 నెలల సమయం పడితే.. ఇప్పుడవి 47 నెలలకు పెరిగిందని పేర్కొంది. హైదరాబాద్‌లో 39,308 గృహాల ఇన్వెంటరీ ఉంది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో 2,67,987, పుణేలో 1,21,868, ఎన్సీఆర్లో 1,06,689, బెంగళూరులో 71,198, అహ్మదాబాద్‌లో 38,614, చెన్నైలో 36,609, కోల్‌కత్తాలో 30,210 గృహాలున్నాయి. ఇన్వెంటరీ విక్రయానికి అత్యధికంగా ఢిల్లీలో 72 నెలల సమయం పడితే.. హైదరాబాద్‌లో అత్యల్పంగా 29 నెలల సమయం పడుతుంది. చదవండి: ద్వితీయార్ధంలో ఖరీదైన గృహ విక్రయాల హవా -
లాభాల కోసం చూడొద్దు.. అమ్మేసుకోండి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ఏటేటా పెరుగుతున్న అమ్ముడుపోకుండా ఉన్న గృహాల (ఇన్వెంటరీ) మీద కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డెవలపర్లు అత్యాశగా లాభాల కోసం ఎదురుచూడకుండా ఇన్వెంటరీ గృహాలను విక్రయించుకోవాలని.. దీంతో కనీసం బ్యాంక్ వడ్డీ భారాౖన్నైనా తగ్గించుకోవాలని సలహా ఇచ్చారు. నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) ఏర్పాటు చేసిన వెబ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఇన్వెంటరీ గృహాల విషయంలో అత్యాశ వద్దు. ఎంత ధర వచ్చినా సరే విక్రయించడమే ఉత్తమం. కనీసం చేతిలో నగదు లభ్యత అయినా పెరుగుతుంది. ముంబైలో చాలా మంది బిల్డర్లు ప్రీమియం ధర రావాలని ఇన్వెంటరీని విక్రయించడం లేదు. చ.అ.కు రూ.35–40 వేల ధర వచ్చే వరకు ఎదురుచూస్తున్నారని’’ వివరించారు. ఇన్వెంటరీ కొనుగోళ్ల కోసం వచ్చే కస్టమర్లతో డెవలపర్లు ధరల గురించి చర్చించాలని, బ్యాంక్‌లు, ప్రైవేట్ రుణదాతల వడ్డీ వ్యయ భారం నుంచి విముక్తి కోసమైనా వీటిని విక్రయించడమే మేలని చెప్పారు. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి, గృహ విభాగంలో డిమాండ్‌ను సృష్టించడానికి గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు విస్తరించాలన్నారు. రూ.10 లక్షల లోపు ధర ఉండే అందుబాటు గృహాలను నిర్మించాలని కోరారు. రోడ్లు, రహదారుల విభాగంలో భారీ వ్యాపార అవకాశాలున్నాయి. ప్రీకాస్ట్ టెక్నాలజీ వినియోగంతో లాజిస్టిక్ పార్క్‌లు, రహదారుల నిర్మాణంలోకి రావాలని సూచించారు. రహదారుల వెంట బస్ డిపోలు, పెట్రోల్ పంప్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు, రైల్ ఓవర్ బ్రిడ్జ్‌లు వంటివి అభివృద్ధి చేస్తున్నామని.. ఆసక్తివున్న నిర్మాణ సంస్థలు భాగస్వామ్యం కావాలని సూచించారు. ముంబై–ఢిల్లీ కారిడార్‌లో టౌన్‌షిప్‌ల నిర్మాణం ప్రణాళికలో ఉందని చెప్పారు. సొంతంగా ఫైనాన్స్ కంపెనీలు పెట్టుకోండి.. నిర్మాణ కంపెనీలు తమ వ్యాపార విభాగాలను మార్చుకోవాలని, సొంతంగా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలను స్థాపించాలని సూచించారు. ఉదాహరణకు ఆటోమొబైల్ పరిశ్రమలో చాలా తయారీ కంపెనీలకు సొంతంగా ఆటో ఫైనాన్స్ కంపెనీలున్నాయని తెలిపారు. అలాగే నిర్మాణ సంస్థలు కూడా సొంతంగా గృహ రుణ కంపెనీలను ఏర్పాటు చేసుకొని కస్టమర్లకు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందించాలని సూచించారు. దీంతో బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థల మీద పూర్తిగా ఆధారపడాల్సిన అవసరముండదని పేర్కొన్నారు. ప్రైవేట్ వ్యక్తులు, ఇన్వెస్టర్లలకు ఈక్విటీ ఇష్యూల ద్వారా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ)లను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వడ్డీ రేట్లు తక్కువగా ఉన్న అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఎన్బీఎఫ్సీలు నిధులను సమీకరించాలని సూచించారు. -
రెరాతో ఇన్వెంటరీ తగ్గింది
సాక్షి, హైదరాబాద్: దేశంలో అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ)లకు రెక్కలొస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) అమల్లోకి వచ్చాక డెవలపర్లు కొత్త ప్రాజెక్ట్‌ల లాచింగ్స్ కంటే ఇన్వెంటరీ అమ్మకాల మీదే ఎక్కువ దృష్టిసారిస్తున్నారు. ఎందుకంటే? ప్రాజెక్ట్ ప్రారంభిస్తే చాలు రెరాలో నమోదు, నాణ్యత, నిర్మాణ గడువు, నిర్వహణ ప్రతి అంశంలోనూ కఠినమైన నిబంధనలుండటంతో డెవలపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో 2017–18 ఆర్ధిక సంవత్సరం చివరి త్రైమాసికం (క్యూ4)లో 8,90,719 గృహాల ఇన్వెంటరీ ఉంటే 2018–19 క్యూ4 నాటికి 8,00,438 గృహాలకు చేరాయి. అంటే ఏడాదిలో 10 శాతం తగ్గాయని ప్రాప్‌టైగర్.కామ్ ‘‘రియల్ ఎస్టేట్: 2018–19 ఆర్ధిక సంవత్సరం నాల్గవ త్రైమాసికం (క్యూ4)’’ నివేదిక తెలిపింది. అహ్మదాబాద్, చెన్నై మినహా.. అహ్మదాబాద్, చెన్నై మినహా అన్ని నగరాల్లో ఇన్వెంటరీ తగ్గింది. అహ్మదాబాద్‌లో 2018 క్యూ4లో 61,683 గృహాలుండగా.. 2019 క్యూ4 నాటికి 63,114 యూనిట్లకు, చెన్నైలో 37,728 నుంచి 38,226 యూనిట్లకు పెరిగాయి. బెంగళూరులో 87,110 నుంచి 77,835 యూనిట్లకు, గుర్గావ్లో 47,793 నుంచి 44,046 గృహాలకు, కోల్‌కతాలో 48,629 నుంచి 44,689లకు, ముంబైలో 3,32,719 నుంచి 2,88,679లకు, నోయిడాలో 79,605 నుంచి 65,006లకు, పుణేలో 1,53,182 నుంచి 1,41,695లకు తగ్గాయి. హైదరాబాద్ రియల్టీ టాప్‌గేర్ హైదరాబాద్ రియల్టీ రంగం టాప్‌గేర్‌లో పడింది. బెంగళూరు, చెన్నై, నోయిడా వంటి ఇతర మెట్రో నగరాల్లోని గృహాల అమ్మకాల్లో కనిపించని వృద్ధి భాగ్యనగరంలోనే జరిగింది. 2018–19 ఆర్ధిక సంవత్సరం చివరి త్రైమాసికం (క్యూ4)లో నగరంలో 7,059 గృహాలు అమ్ముడయ్యాయి. 2017–18 క్యూ4తో పోలిస్తే 26 శాతం వృద్ధి. 2018 క్యూ4లో 5,618 గృహాలు విక్రయమయ్యాయి. ఇక, కొత్త ప్రాజెక్ట్‌ల లాంచింగ్స్లను గమనిస్తే.. నగరంలో 2018 క్యూ4లో 6,285 యూనిట్లు ప్రారంభం కాగా.. 2019 క్యూ4లో 3 శాతం క్షీణించి 6,066లకు తగ్గాయి. ఇన్వెంటరీలను గమనిస్తే.. నగరంలో 2018 క్యూ4లో 42,270 గృహాల ఇన్వెంటరీ ఉండగా.. 2019 క్యూ4 నాటికి 35,148 యూనిట్లకు తగ్గాయి. అంటే ఏడాదిలో 17 శాతం తగ్గిందన్నమాట. అద్దెల విషయంలోనూ అంతే! హైదరాబాద్‌లో మినహా అన్ని నగరాల్లో ఏడాదిలో అద్దెలు 14 శాతం పెరిగాయి. -
ఇన్ఫీబీమ్ చేతికి స్నాప్‌డీల్ ’యూనికామర్స్’
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ సంస్థ స్నాప్‌డీల్ అనుబంధ కంపెనీ యూనికామర్స్‌ను కొనుగోలు చేయనున్నట్లు ఇన్ఫీ బీమ్ వెల్లడించింది. ఈ–కామర్స్ సాఫ్ట్వేర్ సేవలందించే యూని కామర్స్ కొనుగోలుకు రూ. 120 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపింది. స్నాప్‌డీల్ మాతృసంస్థ జాస్పర్ ఇన్ఫోటెక్‌కు ఆప్షనల్లీ కన్వర్టబుల్ డిబెంచర్స్‌ను జారీ చేయటం ద్వారా ఈ డీల్‌ను పూర్తి చేస్తామని, నగదు చెల్లింపులు ఉండబోవని వివరించింది. మూడు నుంచి అయిదు నెలల్లోగా డీల్ పూర్తి కాగలదని అంచనా. సమగ్రమైన ఈ–కామర్స్ సర్వీసులు అందించేందుకు ఈ కొనుగోలు ఉపయోగపడగలదని ఇన్ఫీ బీమ్ ఎండీ విశాల్ మెహతా ధీమా వ్యక్తంచేశారు. యూనికామర్స్ డీల్‌కు ఆమోదముద్ర వేసిన ఇన్ఫీబీమ్ కార్పొరేషన్ బోర్డు.. తమ సంస్థ పేరును కూడా ఇన్ఫీబీమ్ అవెన్యూస్‌గా మార్చే ప్రతిపాదనను ఓకే చేసింది. 2012లో ఏర్పాటైన యూనికామర్స్ సంస్థకు 10,000 పైగా విక్రేతలు క్లయింట్స్‌గా ఉన్నారు. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ టర్నోవరు రూ.20 కోట్లుగాను, నికర విలువ రూ.25 కోట్లుగాను ఉంది. ఇతరత్రా వ్యాపార విభాగాలను విక్రయించి, ప్రధాన వ్యాపారంపై మరింతగా దృష్టి పెట్టేందుకు ఉద్దేశించిన వ్యూహంలో భాగంగానే యూనికామర్స్‌ను విక్రయిస్తున్నట్లు స్నాప్‌డీల్ చీఫ్ స్ట్రాటెజీ, ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ జేసన్ కొఠారి తెలిపారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ల నుంచి తీవ్రమైన పోటీతో కుదేలయిన స్నాప్‌డీల్.. మళ్లీ పుంజుకునేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే పేమెంట్ సేవల విభాగం ఫ్రీచార్జ్‌ను యాక్సిస్ బ్యాంక్‌కి రూ. 385 కోట్లకు, లాజిస్టిక్స్ విభాగం వల్కన్ ఎక్స్‌ప్రెస్‌ను ఫ్యూచర్ సప్లై చెయిన్ సొల్యూషన్స్‌కి రూ.35 కోట్లకు అమ్మేసింది. -
రూ.760 కోట్లు ఇన్పుట్ అప్లోడ్
అనంతపురం అగ్రికల్చర్ : పెట్టుబడిరాయితీ (ఇన్పుట్ సబ్సిడీ) పంపిణీలో భాగంగా శనివారం నాటికి రూ.760 కోట్ల పరిహారంకు సంబంధించి జాబితాలు అప్లోడ్ చేసినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. జిల్లాకు మంజూరైన రూ.1,032.42 కోట్లలో రూ.760 కోట్లు బిల్లులు ట్రెజరీకి సమర్పించినట్లు తెలిపారు. ఇందులో రూ.500 కోట్లకు పైగా పరిహారం రైతుల ఖాతాల్లోకి జమ అయినట్లు తెలుస్తోందన్నారు. రెండు మూడు రోజుల్లో అప్లోడ్, పంపిణీ పూర్తీ చేయడంపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఆ తర్వాత మిస్‌మ్యాచింగ్ జాబితాలు బ్యాంకుల వారీగా సేకరిస్తామని తెలిపారు. -
బీఎస్-3 ఎఫెక్ట్ : డిస్కౌంట్లతో స్టాకంతా ఖతం
న్యూఢిల్లీ : దీపావళి ఫెస్టివల్ టూ-వీలర్స్ కంపెనీలకు కాస్త కాదు, చాలా ముందుగానే వచ్చింది. దీపావళికి ప్రకటించే డిస్కౌంట్ ఆఫర్లతో ఆటో షోరూంలన్నీ కళకళలాడుతాయి. కానీ సుప్రీంకోర్టు బీఎస్-3 వాహనాల బ్యాన్ ఎఫెక్ట్ తో దీవాళి సరదా అంతా ఇప్పుడే కనిపించింది. బీఎస్-3 వాహనాలను నేటి నుంచి(ఏప్రిల్ 1) బ్యాన్ చేయబోతున్నట్టు సుప్రీంకోర్టు మూడు రోజుల క్రితం తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఆర్థిక సంవత్సరం ముగింపుకు ఇంకో మూడు రోజులు ముగుస్తుందనగా సుప్రీం ఈ తీర్పు చెప్పడంతో చివరి రెండు రోజుల్లో భారీ డిస్కౌంట్ ఆఫర్లతో కంపెనీలు వినియోగదారులు ముందుకు వచ్చాయి. అసలు ఇన్వెంటరీని ఎలా సేల్ చేసుకోవాలా? అనే కంపెనీల ఆందోళనలను పట్టాపంచలు చేస్తూ టూవీలర్స్ స్టాక్ అంతా ఒక్కసారిగా అమ్ముడుపోయింది. బీఎస్-3 నియమాలు కలిగిన వెహికిల్స్ పై టూవీలర్ దిగ్గజం హోండా మోటార్ కార్పొరేషన్ 20-40 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేసి, రూ.10,000 నుంచి రూ.22,500 మధ్యలో ధర తగ్గింపును ఇచ్చింది. దీంతో మెట్రోస్ ముంబాయి, ఢిల్లీ, బెంగళూరులలో తమ షాపుల్లో స్టాకంతా అయిపోయినట్టు కంపెనీ చెప్పింది. మార్చి 31 వరకు అన్ని బీఎస్-3 వాహనాలను అమ్మినట్టు హీరో చైర్మన్ పవన్ ముంజల్ కూడా తెలిపారు. ఇలా హీరో, హోండా కంపెనీలే కాదు, అన్ని టూ-వీలర్స్ కంపెనీలు దాదాపు బీఎస్-3 వాహనాలను పండుగ సీజన్ లో సేల్ చేసుకున్న మాదిరిగా అమ్మేసుకున్నాయట. దీనిలో బెస్ట్ సెల్లింగ్ వెహికిల్ గా యాక్టివా స్కూటర్ నిలిచింది. గురువారం డిస్కౌంట్లు ప్రకటించిన అనంతరం అర్బన్ మార్కెట్ల నుంచి స్ట్రాంగ్ డిమాండ్ వచ్చినట్టు కంపెనీలు పేర్కొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఆ రోజు సాయంత్రం కల్లా స్టాకంతా ఖతం అయినట్టు తెలిపాయి. టూ-వీలర్స్ ఇండస్ట్రి 90-95శాతం స్టాక్ ను లిక్విడిటీగా మార్చుకున్నట్టు తెలిసింది. మిగిలిపోయిన వెహికిల్స్ ను ఇతర దేశాలకి తరలించడం లేదా బీఎస్-4లోకి మార్చుకోవడం చేయనున్నట్టు వీఈ కమర్షియల్ వెహికిల్స్ సీఈవో వినోద్ అగర్వాల్ చెప్పారు. -
అలవాట్లో పొరపాట్లు..
మంచి జీతం వచ్చే ఉద్యోగమైనా .. ఆర్థిక క్రమశిక్షణ విషయంలో నరేష్‌కి అలసత్వ ధోరణి కాస్త ఎక్కువే. కరెంటు బిల్లులు కట్టాలంటే.. బోలెడంత సమయం ఉంది తర్వాత కట్టొచ్చులే అంటాడు... అడ్డగోలుగా ఖర్చులు చేయడం మంచిది కాదని తెలిసినా ఏం ఫర్వాలేదని తనకు తాను సర్ది చెప్పుకుంటాడు. చిట్టచివరికి అన్నీ కట్టేసి పర్సు చూసుకునే సరికి ఖాళీ. ఇంకా కొన్ని బకాయిలు అలాగే మిగిలిపోతుంటాయి. దీంతో, మళ్లీ లాటరీ కొట్టాల్సిన పరిస్థితి. ప్రతి నెలా ఇదే తంతు. కనీసం వచ్చే నెల నుంచైనా చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాడు. అయినా సరే, సేమ్ టు సేమ్. ఇలా అలవాటుగా పొరపాట్లు చేసే నరేష్‌లు మనలో చాలా మందే ఉంటారు. ఇలాంటి కొన్ని పొరపాట్ల గురించి తెలిపేదే ఈ కథనం.. ఇష్టారీతిగా కొనుగోళ్లు.. కొందరు ఆకర్షణీయమైన ఆఫర్ అంటూ కనిపిస్తే అవసరమున్నా, లేకున్నా కొనే దాకా వదలరు. ఎలాంటి ప్రలోభాలకు లోను కాకూడదనుకున్నా షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు మొదలైనవాటిల్లో అంత సులభం కాదు. చిట్టచివర్న ఉండే బిల్లింగ్ కౌంటరు దగ్గర కూడా స్పెషల్ ఆఫర్లు ఊరిస్తుంటాయి. షాపింగ్ లిస్టులోకి చేరిపోతుంటాయి. దీంతో ఎంత స్ట్రిక్టుగా షాపింగ్ చేశామనుకున్నా చివర్లో పర్సుపై భారం తప్పదు. అలాగే, అనవసరమైనవన్నీ కొనేయడం వల్ల ఇంటి నిండా సరంజామా పేరుకుపోవడం తప్ప ప్రయోజనం ఉండదు. కాబట్టి, ఇలాంటి అలవాటు ఉంటే సాధ్యమైనంత వరకూ పర్సులపై భారాలు మోపే మార్కెట్స్ వైపు వెళ్లకుండా ఇతరత్రా షాపింగ్ మార్గాలు అన్వేషించే ప్రయత్నం చేస్తే ఉత్తమం. ఒకవేళ వెళ్లినా.. వీలైనంత వరకూ అవసరమైన వాటి జాబితాను రాసుకుని, దానికే కట్టుబడి ఉండేందుకు ప్రయత్నం చేస్తే మంచిది. అన్నింటికీ రేట్లు పోల్చి చూసుకోవడం.. ఖర్చులు తగ్గించుకునే క్రమంలో అన్నింటి రేట్లు పోల్చి చూసుకుంటూ ఉంటాం. ఉదాహరణకు.. ఒకే ఉత్పత్తిని రెండు, మూడు కంపెనీలు ఆఫర్ చేస్తుంటే.. అందులో అత్యంత తక్కువకి ఏది వస్తుందో చూసుకుని, దాన్ని కొనేందుకే ప్రాధాన్యం ఇస్తుంటాం. ఈ క్రమంలో నాణ్యతను విస్మరిస్తుంటాం. కొన్ని సార్లు దీని వల్ల మరింత మూల్యం చెల్లించుకోవాల్సి రావొచ్చు. అలాగని, చౌకగా ఉండేవన్నీ నాణ్యత లేనివనీ చెప్పలేము. కానీ, అంతిమంగా రేటు మాత్రమే కాకుండా నాణ్యతను కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి. బిల్లులు కట్టడంలో ఆలస్యం.. కరెంటు బిల్లులు, నీటి బిల్లులు, క్రెడిట్ కార్డుల బిల్లులు.. ఇలాంటి వాటన్నింటినీ ఆఖరు నిమిషం దాకా కట్టకుండా వాయిదా వేస్తుంటాం. తీరా ఆఖర్లో గుర్తుకొచ్చి హడావుడిగా పరుగెత్తినా.. ఏదో ఒక అడ్డంకి రావొచ్చు. చివరికి ఫైన్లు కట్టుకోవాల్సీ రావొచ్చు. ప్రతి సారీ ఇదే పరిస్థితి ఎదురవుతుంటే.. ఆలోచించాల్సిన విషయమే. సాధ్యమైనంత వరకూ బిల్లులు కట్టడానికంటూ ఒక పద్ధతిని రూపొందించుకోవాలి. ఏయే బిల్లులు ఎప్పుడెప్పుడు కట్టాలన్నది ముందుగానే రిమైండర్లు సెట్ చేసి ఉంచుకోవాలి. మరోవైపు, చెక్కుల విషయంలోనూ ఒకోసారి పొరపాట్లు జరుగుతుంటాయి. కొన్ని సార్లు చెక్కులు ఇచ్చిన తర్వాత గుర్తొస్తుంది .. ఖాతాలో సరిపడేంత డబ్బు లేదని. తర్వాత వే ద్దాంలే అనుకుంటూ కాలయాపన చేస్తాం. తీరా సదరు చెక్కు బౌన్సు అయితే, అవతలి వారికి సర్ది చెప్పుకోవడం మాట ఎలా ఉన్నా.. ఇటు బ్యాంకు మాత్రం పెనాల్టీలు వేస్తుంది. ఫలితంగా జరిమానా కట్టాల్సి రావడం ఒకెత్తై క్రెడిట్ హిస్టరీ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ తరహా పరిస్థితులు తలెత్తకుండా చూసుకోవాలి. క్రెడిట్ కార్డుల వాడకం .. తర్వాతెప్పుడో కట్టొచ్చని, రివార్డు పాయింట్లు గట్రా వస్తాయి కదాని అయిన దానికి, కాని దానికి క్రెడిట్ కార్డులను ఉపయోగించేస్తుంటారు కొందరు. దీంతో కార్డుపై రుణ భారం పెరిగిపోతుంది. క్రెడిట్ కార్డు ఉంటే చేతిలో డబ్బు ఉన్నట్లే.. కానీ అది అప్పుగా తీసుకుంటున్నదేనని గుర్తుంచుకోవాలి. ఇతరత్రా ఏదైనా అవసరాల వల్ల బిల్లులను చెల్లించలేకపోతే .. తర్వాత తర్వాత బడ్జెట్ తలకిందులవడంతో పాటు క్రెడిట్ రిపోర్టుపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుందని తెలుసుకోవాలి. సాధ్యమైనంత వరకూ ఆదాయం కన్నా ఖర్చులు చాలా తక్కువగా ఉండేలా చూసుకోవడం మంచిది.