మొత్తం ఇన్వెంటరీ 1,01,091
వీటి విక్రయానికి పట్టే కాలం 19 నెలలు
టాప్–7 మెట్రో నగరాల్లో 5.64 లక్షల యూనిట్లు
డిమాండ్‌కు మించి సరఫరా జరుగుతుండటంతో హైదరాబాద్‌లో అమ్మకానికి ఉన్న ఇళ్లు(ఇన్వెంటరీ) పెరిగిపోతున్నాయి. దేశంలోని ఏడు ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే ముంబై తర్వాత హైదరాబాద్‌లోనే అత్యధిక ఇన్వెంటరీ ఉంది. ఇక, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలతో పోలిస్తే మన దగ్గరే ఎక్కువ. ప్రస్తుతం గ్రేటర్‌లో 1,01,091 ఇళ్ల ఇన్వెంటరీ (వీటిలో నిర్మాణంలో ఉన్నవి, పూర్తయినవి కలిపి) ఉంది. వీటి విక్రయానికి కనిష్టంగా 19 నెలల కాలం పడుతుంది.
రెండేళ్లలో నగరంలో గృహాల సరఫరా పెరగడమే ఇన్వెంటరీ పెరుగుదలకు ప్రధాన కారణం. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఏడాది తొలి తొమ్మిది నెలల కాలంలో మొత్తం 5,64,416 యూనిట్ల ఇన్వెంటరీ మిగిలి ఉందని, వీటి విక్రయానికి కనిష్టంగా 14 నెలల కాలం పడుతుందని అనరాక్ గ్రూప్ నివేదిక వెల్లడించింది.
ఇదీ చదవండి: ట్రంప్ కలం నుంచి జాలువారిన అక్షరాలు
నగరాల వారీగా ఇన్వెంటరీ (యూనిట్లలో)
ఎన్‌సీఆర్ ఢిల్లీ 85,460
ఎంఎంఆర్ ముంబయి 1,86,677
బెంగళూరు 46,316
పుణే 88,176
హైదరాబాద్ 1,01,091
చెన్నై 28,758
కోల్‌కతా 25,938
Comments
Please login to add a commentAdd a comment