inventory assets
-
పశ్చిమం డీలా.. సౌత్ సూపర్!
సాక్షి, హైదరాబాద్: అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ) విక్రయాలలో పశ్చిమాది నగరాలు ముందుండగా.. దక్షిణంలో కాస్త నెమ్మదించాయి. కరోనా కంటే ముందుతో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికం నాటికి దక్షిణాది నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఇన్వెంటరీ 32 శాతం మేర పెరిగాయి. ఇదే సమయంలో పశ్చిమాది నగరాలైన ముంబై, పుణేలో ఇన్వెంటరీ 10 శాతం తగ్గిందని అనరాక్ గ్రూప్ తెలిపింది. 2020 క్యూ1లో దక్షిణాది నగరాలలో 1.21 లక్షల యూనిట్ల ఇన్వెంటరీ ఉండగా.. ఈ ఏడాది క్యూ1 నాటికి 1.60 లక్షలకు పెరిగింది. అయితే హైదరాబాద్‌లో అత్యధిక స్థాయిలో కొత్త ప్రాజెక్ట్‌ల లాంచింగ్‌లే ఇన్వెంటరీ వృద్ధికి ప్రధాన కారణం. ఇక పశ్చిమాది నగరాల్లో 2020 క్యూ1లో 3.07 లక్షల యూనిట్ల ఇన్వెంటరీ ఉండగా.. ప్రస్తుతమది 2.75 లక్షలకు క్షీణించింది. 2020 క్యూ1లో దక్షిణాది నగరాలలో 15,650 యూనిట్లు లాంచింగ్ కాగా.. 2022 క్యూ1 నాటికి 142 శాతం వృద్ది రేటుతో 37,810 యూనిట్లకు పెరిగింది. అదే పశ్చిమాది నగరాలలో 18,270 యూనిట్ల నుంచి 142 శాతం వృద్ధితో 38,130 యూనిట్లకు చేరాయి. ఎన్సీఆర్లో 12 శాతం క్షీణత.. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, రెరా వంటి నిర్ణయాలతో కరోనా కంటే ముందు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో ప్రాజెక్ట్‌ల అప్పగింత ఆలస్యమయ్యాయి. దక్షిణాది నగరాలలో కంటే ఎన్సీఆర్లో డెలివరీ ఎక్కువ కాలం పట్టేది. కానీ, కరోనా తర్వాతి ఎన్సీఆర్లో దక్షిణ, పశ్చిమాది నగరాలలో కంటే చెప్పుకోదగిన స్థాయిలో మార్పులు వచ్చాయని.. దీంతో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఎన్సీఆర్లో ఇన్వెంటరీ 12 శాతం తగ్గిందని అనరాక్ గ్రూప్ వైస్ చైర్మన్ సంతోష్ కుమార్ తెలిపారు. 2021 క్యూ1లో ఎన్సీఆర్లో ఇన్వెంటరీ 1.73 లక్షలుగా ఉండగా.. ఈ ఏడాది క్యూ1 నాటికి 1.53 లక్షల యూనిట్లకు క్షీణించాయి. చదవండి: రియల్ ఎస్టేట్ డీల్స్.. ఏప్రిల్‌లో ఇదే రికార్డు.. -
సప్లయి తగ్గింది.. డిమాండ్ పెరిగింది!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి నేపథ్యంలో అందుబాటు గృహాల సరఫరా తగ్గినప్పటికీ.. డిమాండ్ మాత్రం పుంజుకుంది. దీంతో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఇన్వెంటరీ 21 శాతం క్షీణించాయి. 2020 జనవరి–మార్చి (క్యూ1)లో 2,34,600 అఫర్డబుల్ యూనిట్ల ఇన్వెంటరీ ఉండగా.. ఈ ఏడాది క్యూ1 నాటికి 1,86,150 యూనిట్లకు తగ్గాయని అనరాక్ డేటా వెల్లడించింది. ► రెండేళ్ల కోవిడ్ కాలంలో అఫర్డబుల్ గృహాల సప్లయి తగ్గింది. కరోనా కంటే ముందు 2019 జనవరి–మార్చి (క్యూ1)లో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 70,480 యూనిట్లు ప్రారంభం కాగా.. ఇందులో అందుబాటు గృహాల వాటా 44 శాతంగా ఉంది. కరోనా మొదలైన ఏడాది 2020 క్యూలోని గృహాల సప్లయిలో అఫర్డబుల్ వాటా 38 శాతం, 2021 క్యూ1లో 30 శాతం, ఈ ఏడాది క్యూ1 నాటికి 25 శాతానికి తగ్గింది. సప్లయి తగ్గడం వల్ల డెవలపర్లు అమ్ముడుపోకుండా ఉన్న గృహాల (ఇన్వెంటరీ)ని విక్రయించడంపై దృష్టిసారించారని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. దీంతో గత రెండేళ్లలో ఏడు నగరాల్లోని అఫర్డబుల్ హౌసింగ్ ఇన్వెంటరీ 21 శాతం, లగ్జరీ గృహాల ఇన్వెంటరీ 5 శాతం తగ్గుముఖం పట్టాయి. ► ఈ ఏడాది తొలి త్రైమాసికం ముగింపు నాటికి దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 6,27,780 గృహాల ఇన్వెంటరీ ఉండగా.. ఇందులో 1,86,150 యూనిట్లు రూ.40 లక్షల లోపు ధర ఉన్న అందుబాటు గృహాలే. అదే గతేడాది క్యూ1లో ఇవి 2,17,63, 2020 క్యూ1లో 2,34,600 యూనిట్లున్నాయి. 2021 క్యూ1లో అత్యధికంగా చెన్నైలో 52%, పుణేలో 33 శాతం, ముంబైలో 27% అఫర్డబుల్ హౌసింగ్ ఇన్వెంటరీ తగ్గాయి. ► ఇదే రెండేళ్ల కరోనా సమయంలో రూ.2.5 కోట్లకు పైగా ధర ఉన్న అల్ట్రా లగ్జరీ గృహాల ఇన్వెంటరీ 5 శాతం మేర తగ్గింది. 2020 క్యూ1లో 41,750 యూనిట్ల ఇన్వెంటరీ ఉండగా.. గతేడాది క్యూ1 నాటికి 42,080కు, ఈ ఏడాది క్యూ1 నాటికి 39,810 యూనిట్లకు క్షీణించాయి. అత్యధికంగా ముంబైలో 16 శాతం, కోల్‌కతాలో 15 శాతం అల్ట్రా లగ్జరీ హౌసింగ్ ఇన్వెంటరీ తగ్గాయి. -
పెరిగిపోతున్న అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య, హైదరాబాద్‌లో ఎన్ని గృహాలు ఉన్నాయంటే!
సాక్షి, హైదరాబాద్: దేశంలో అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ) పెరిగింది. 2021 మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చి నాటికి ఇన్వెంటరీ 4% మేర పెరిగిందని ప్రాప్‌టైగర్.కామ్ సర్వేలో తేలింది. గతేడాది మార్చి నాటికి దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 7,05,344 గృహాల ఇన్వెంటరీ ఉండగా..ఈ ఏడాది మార్చి నాటికి 7,35,852కి పెరిగిందని తెలిపింది. ఇన్వెంటరీ అత్యధికంగా ముంబైలో 35% ఉండగా.. పుణేలో 16% మేర ఉన్నాయి. కాగా.. గృహాలకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో గతేడాది ఇన్వెంటరీ విక్రయానికి 47 నెలల సమయం పట్టగా.. ఈ ఏడాది మార్చి ఇన్వెంటరీకి 42 నెలల సమయం పడుతుంది. నగరాల వారీగా అమ్ముడుపోకుండా ఉన్న గృహాల సంఖ్యను చూస్తే.. హైదరాబాద్‌లో 73,651 యూనిట్లున్నాయి. వీటి విక్రయానికి 42 నెలల సమయం పడుతుంది. అహ్మదాబాద్‌లో 62,602 గృహాలు, బెంగళూరులో 66,151, చెన్నైలో 34,059, ఢిల్లీ–ఎన్సీఆర్లో 1,01,404, కోల్‌కతాలో 23,850, ముంబైలో 2,55,814 గృహాల ఇన్వెంటరీ ఉంది. చదవండి: లబోదిబో! హైదరాబాద్‌లో ఇళ్లు అమ్ముడుపోని ప్రాంతాలివే! -
రూ.8,084 కోట్ల ఇన్వెంటరీ అమ్మకాలు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది హెచ్1లో రియల్ ఎస్టేట్ సర్వీసెస్ కన్సల్టెన్సీ అనరాక్ గ్రూప్ విక్రయాలలో 80 శాతం వృద్ధిని నమోదు చేసింది. రూ.8,084 కోట్ల విలువ చేసే ఇన్వెంటరీని విక్రయించింది. గతేడాది హెచ్1లో సేల్స్ విలువ రూ.4,446 కోట్లుగా ఉందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో 20 శాతం అఫర్డబుల్ హౌసింగ్ విభాగం వాటా ఉంది. 13 నగరాల్లో సేవలందిస్తున్న అనరాక్ అమ్మకాల సగటు ధర రూ.90 లక్షలుగా ఉంది. హెచ్1లోని విక్రయాలలో నాలుగింట ఒక వంతు అమ్మకాలు 2021 ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనే జరిగాయని, రెండో త్రైమాసికంలో విక్రయాలు మూడింతలు పెరిగాయని పేర్కొంది. ఈ ఏడాది హెచ్1లో జరిగిన విక్రయాలు నగరాల వారీగా చూస్తే.. రూ.5 వేల కోట్లతో ముంబై ప్రథమ స్థానంలో ఉండగా.. ఎన్సీఆర్లో రూ.832 కోట్లు, బెంగళూరులో రూ.657 కోట్లుగా ఉన్నాయి. ఆ తర్వాత పుణే, అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నై, లక్నో, కోల్కత్తా నగరాలున్నాయి. అనరాక్ విక్రయాలలో రూ.10 కోట్లకు పైగానే ధర ఉన్న ప్రాపర్టీల ఇన్వెంటరీ వాటా 10 శాతం, రూ.2.5 కోట్ల ధర ఉన్న గృహాల వాటా 20 శాతంగా ఉంది. -
ఆర్టీసీ ఆస్తుల పంపక వ్యవహారం వీడని పీటముడి
హైదరాబాద్‌లోని ఆస్తుల పంపకంపై వివాదం సీమాంధ్రలో కొత్తగా నిర్మించుకోవడం వ్యయభరితమంటున్న ఆర్టీసీ కార్మికులు హక్కు కల్పిస్తే ఊరుకునేది లేదంటున్న తెలంగాణ ఉద్యోగులు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్టీసీ ఆస్తుల పంపకం వ్యవహారం చిక్కుముడిగా మారింది. హైదరాబాదులోని కేంద్ర కార్యాలయాల ఆస్తుల పంపిణీపై ఇరువర్గాల మధ్య సమన్వయం కుదరటం లేదు. సీమాంధ్రకు హక్కు కల్పిస్తే ఊరుకునేది లేదని తెలంగాణ ఉద్యోగులు, ఉమ్మడిగా ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది కాబట్టి తమకూ హక్కు కావాలని సీమాంధ్ర ఉద్యోగులు వాదిస్తున్నారు. సాక్షి, విజయవాడ : ఆర్టీసీ ఆస్తుల పంపకం విషయంలో పీటముడి వీడడం లేదు. ప్రభుత్వ రంగ సంస్థలపై నిర్లక్ష్యం కారణంగా తమ అంశాన్ని పట్టించుకోవడం లేదని సీమాంధ్ర ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ వివాదం కొత్త ప్రభుత్వం వచ్చే వరకు తేలే సూచనలు కనబడడం లేదు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రవాణా శాఖ మంత్రులు కూర్చుని పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే అక్కడ గెలిచిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు చేస్తున్న విద్వేషపూరిత వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ప్రాంతానికి న్యాయం జరిగే అవకాశాలు కనపడడం లేదని కార్మిక సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయాల ఆస్తుల పంపిణీపై ఇరువర్గాల మధ్య సమన్వయం కుదరలేదు. ఈ ప్రాంతంలోని ఆస్తులపై సీమాంధ్రకు హక్కు కల్పిస్తే ఊరుకునేది లేదని తెలంగాణా ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. ఉమ్మడిగా ఉన్న సమయంలోనే వీటన్నింటి అభివృద్ధి జరిగింది కాబట్టి తమకు హక్కు కావాలని ఇక్కడి ఉద్యోగులు వాదిస్తున్నారు. జనాభా ప్రాతిపదికన ఆస్తుల పంపకం కోసం నిర్థారించిన 58ః42 నిష్పత్తి ప్రకారం ఆర్టీసీ ప్రధాన కార్యాలయమైన బస్‌భవన్, ఎంజీబీఎస్ ఆర్టీసీ కల్యాణమండపం, ఆర్టీసీ ఆస్పత్రి, ఇతర డిపోలపై సీమాంధ్రకు హక్కు ఉండాలని కార్మికులు వాదిస్తున్నారు. వీటన్నింటినీ సీమాంధ్రలో ఏర్పాటు చేసుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్న పని కావడంతో వీటిని ఉమ్మడి ఆస్తులుగా పరిగణించి తమకు వాటా ఇవ్వాలనేది కార్మికుల డిమాండ్. 1973-78 మధ్య ప్రతి కార్మికుడి వద్ద నుంచి జీతంలో కొంత మొత్తాన్ని వసూలు చేసి తార్నాకలో ప్రభుత్వం ఇచ్చిన భూమిలో ఆర్టీసీ ఉద్యోగుల కోసం ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. దీనిలో తమకు హక్కు ఉందని సీమాంధ్ర ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అన్ని సదుపాయాలు పదేళ్లపాటు తెలంగాణలో కూడా కొనసాగించాలని, బస్సుల పర్మిట్ల విషయంలో తెలంగాణలో మినహాయింపు ఇవ్వాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేకంగా తెలంగాణకు పర్మిట్లు తీసుకుంటే అది ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీపై పెనుభారం పడుతుందని కార్మికులు చెబుతున్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నందున అక్కడికి వెళ్లే బస్సులపై పర్మిట్ మినహాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులకు పార్కింగ్ కోసం ఎంజీబీఎస్, బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్ మూడు ప్రాంతాల్లో స్థలాలు కేటాయించాలని, దానికి ప్రత్యామ్నాయంగా ఈ ప్రాంతంలో కూడా మూడుచోట్ల వారికి స్థలాలు కేటాయిస్తామని సీమాంధ్ర కార్మికులు చెబుతున్నారు. ఈ ప్రతిపాదనను తెలంగాణ ఉద్యోగులు అంగీకరించడం లేదు. బస్సులు తిరిగే భూభాగం పరిధి ఏ ప్రాంతానికి ఎంత అనే అంశం ఆధారంగా పరిశీలిస్తే దాదాపు సగం బస్సులపై తమకు హక్కు ఉంటుందని తెలంగాణవారు వాదిస్తున్నారు. సీమాంధ్ర నుంచి తెలంగాణకు తిరుగుతున్న బస్సులను ఈ ప్రాంతానికే కేటాయించాలని, లేనిపక్షంలో రెండువేల మంది వరకు మిగులు కార్మికులుగా మారిపోయే ప్రమాదం ఉంది. దీంతో సీమాంద్ర ఉద్యోగులు అంగీకరించడం లేదు సీమాంధ్ర నుంచి వచ్చే బస్సులకు పార్కింగ్ మరమ్మతులకు అవసరమైన గ్యారేజి, సిబ్బందికి విశ్రాంతి గదుల నిర్మాణం కోసం ఖాళీస్థలాలు కేటాయించాలని ఇక్కడి వారు డిమాండ్ చేస్తుండగా, తెలంగాణ ఉద్యోగులు అంగీకరించడం లేదు. ఈ అంశాలపై పీటముడి వీడకపోవడంతో ఆస్తుల పంపకంపై వేసిన కమిటీ గవర్నర్‌కు తన నివేదిక ఇచ్చింది. అయితే గవర్నర్ కూడా దీనిపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్ర విభజనకు మరో వారం మాత్రమే సమయం ఉండటంతో ఈలోగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించడంలేదు. విద్యుత్ కార్మికులు తమ డిమాండ్ల కోసం మూడు రోజులు సమ్మె చేసినా సానుకూల స్పందన లేకపోవడం చూస్తుంటే తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని కార్మికసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆస్తుల పంపకంలో అన్యాయం జరిగితే తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని గుర్తింపు కార్మిక సంఘం నేత వై.వి.రావు హెచ్చరించారు.