సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది హెచ్1లో రియల్ ఎస్టేట్ సర్వీసెస్ కన్సల్టెన్సీ అనరాక్ గ్రూప్ విక్రయాలలో 80 శాతం వృద్ధిని నమోదు చేసింది. రూ.8,084 కోట్ల విలువ చేసే ఇన్వెంటరీని విక్రయించింది. గతేడాది హెచ్1లో సేల్స్ విలువ రూ.4,446 కోట్లుగా ఉందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో 20 శాతం అఫర్డబుల్ హౌసింగ్ విభాగం వాటా ఉంది. 13 నగరాల్లో సేవలందిస్తున్న అనరాక్ అమ్మకాల సగటు ధర రూ.90 లక్షలుగా ఉంది.
హెచ్1లోని విక్రయాలలో నాలుగింట ఒక వంతు అమ్మకాలు 2021 ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనే జరిగాయని, రెండో త్రైమాసికంలో విక్రయాలు మూడింతలు పెరిగాయని పేర్కొంది. ఈ ఏడాది హెచ్1లో జరిగిన విక్రయాలు నగరాల వారీగా చూస్తే.. రూ.5 వేల కోట్లతో ముంబై ప్రథమ స్థానంలో ఉండగా.. ఎన్‌సీఆర్‌లో రూ.832 కోట్లు, బెంగళూరులో రూ.657 కోట్లుగా ఉన్నాయి. ఆ తర్వాత పుణే, అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నై, లక్నో, కోల్‌కత్తా నగరాలున్నాయి. అనరాక్ విక్రయాలలో రూ.10 కోట్లకు పైగానే ధర ఉన్న ప్రాపర్టీల ఇన్వెంటరీ వాటా 10 శాతం, రూ.2.5 కోట్ల ధర ఉన్న గృహాల వాటా 20 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment