విజయవాడలో క్రెడాయ్ ఆధ్వర్యంలో త్వరలో ప్రాపర్టీ షో నిర్వహించనున్నారు.
విజయవాడ: రియల్ ఎస్టేట్ పరిశ్రమను అభివృద్ధి చేసే క్రమంలో విజయవాడలో త్వరలో ప్రాపర్టీ షో నిర్వహించనున్నట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా(క్రెడాయ్) విజయవాడ చాప్టర్ ప్రతినిధులు తెలిపారు. మంగళవారం సాయంత్రం వారు విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. జనవరి ఆరో తేదీ నుంచి స్థానిక ఏ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగనున్న ఈ ప్రదర్శన 8వ తేదీ వరకు కొనసాగనుంది.
ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న సుప్రసిద్ధ సంస్థలు దాదాపు 80 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నాయి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షోను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని సంస్థ ప్రెసిడెంట్ సీహెచ్.సుధాకర్, ప్రధాన కార్యదర్శి పీవీఆర్ రాజు తెలిపారు.