Property Show
-
ప్రాపర్టీ షోలో నటి అను ఇమ్మాన్యుయల్ సందడి (ఫొటోలు)
-
ప్రాపర్టీ షోల పండుగ!
సాక్షి, హైదరాబాద్: కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (క్రెడాయ్) హైదరాబాద్ చరిత్రలోనే తొలిసారిగా ఒకే నెలలో మూడు ప్రాపర్టీ షోలను నిర్వహించనుంది. క్రెడాయబిలిటీ నేపథ్యంలో ఆగస్టు నెలలో వేర్వేరు తేదీల్లో, వేర్వేరు ప్రాంతాల్లో స్థిరాస్తి ప్రదర్శనలు జరగనున్నాయి. హైదరాబాద్ అభివృద్ధి, అవకాశాలను గృహ కొనుగోలుదారులకు వివరించడంతో పాటు వారి నిర్దిష్ట అవసరాలు, ప్రాంతాల ప్రాధాన్యతలు, బడ్జెట్‌కు అనుగుణంగా ప్రాపర్టీల ఎంపికకు వీలుంటుంది. క్రెడాయ్ సభ్యులు, రెరాలో నమోదైన ప్రాజెక్ట్‌లు మాత్రమే ప్రదర్శనలో ఉంటాయి కాబట్టి పారదర్శకత, విశ్వసనీయత ఉంటుంది. మూడు ప్రాపర్టీ షోలలో కలిపి సుమారు 200 నిర్మాణ సంస్థలు, 600–700 ప్రాజెక్ట్‌లు ప్రదర్శించనున్నాయి. ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాలు అన్ని రకాల నివాస సముదాయాలు షోలో ఉంటాయి. ఈమేరకు శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ వి. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. మెరుగైన మౌలిక సదుపాయాలు, అనుకూలమైన వ్యాపార వాతావరణం, పెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టి సారించిన స్థిరమైన పాలన, ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రతిభావంతులైన శ్రామికశక్తిని కలిగిన ప్రపంచ నగరంగా హైదరాబాద్ నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులకు అపార వ్యాపార అవకాశాలున్నాయని తెలిపారు. జనరల్ సెక్రటరీ బీ జగన్నాథరావు మాట్లాడుతూ.. స్థిరాస్తి పెట్టుబడులకు మాత్రమే కాకుండా హైదరాబాద్ సురక్షితమైన పని వాతావరణం, కాస్మోపాలిటన్ సిటీగా గుర్తింపు పొందిందని చెప్పారు. అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ ఉన్నాయని గుర్తు చేశారు. నూతన అధ్యక్షుడిగా ఎన్ జైదీప్ రెడ్డి.. క్రెడాయ్ హైదరాబాద్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఎన్ జైదీప్ రెడ్డి మాట్లాడుతూ.. క్రమబద్ధమైన, స్థిరమైన వృద్ధిని కలిగిన హైదరాబాద్ మెరుగైన జీవన నాణ్యతను, ఆర్ధిక స్థిరత్వాన్ని, సప్టెయినబులిటీతో ఉందని తెలిపారు. ప్రస్తుతం నగరంలో 884 ఐజీబీసీ గుర్తింపు పొందిన ప్రాజెక్ట్‌లు ఉండగా.. వీటిలో ఎక్కువ భాగం క్రెడాయ్ సభ్యుల ప్రాజెక్టులేనని గుర్తు చేశారు. ప్రాపర్టీ షోలో ప్రదర్శించే అన్ని ప్రాజెక్ట్‌లు గ్రీన్ లివింగ్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్మితమైనవేని చెప్పారు.ప్రాపర్టీ షోలు ఎప్పుడంటే..» ఆగస్టు 2 – 4న మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో » ఆగస్టు 9 – 11న కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్స్‌లో » ఆగస్టు 23 – 25న నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఖాళీ స్థలంలో ఎగ్జిబిషన్ సెంటర్లోమూడు షోలు ఎందుకంటే...» ప్రస్తుతం గృహ కొనుగోలుదారులు వేచి చూసే ధోరణిలో ఉండటంతో హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్ స్తబ్ధుగా ఉంది. ఇలాంటి తరుణంలో నగర రియల్టీ మార్కెట్ అభివృద్ధి, అవకాశాలను నగరవాసులకు తెలియజేయాలి.» హైదరాబాద్‌లో 70 శాతం అఫర్డబుల్ హౌసింగ్ మార్కెట్టే. అయా ప్రాపర్టీల వివరాలతో పాటు ఏ ఏ ప్రాంతాల్లో ఎంత రేటు ఉందో తెలిసిపోతుంది. ఎప్పటిలాగే ఒకే ప్రాంతంలో ప్రాపర్టీ షో నిర్వహిస్తే కేవలం లగ్జరీ, ఎగువ మధ్యతరగతి ప్రాపర్టీలే ప్రదర్శనలో ఉంటాయి. అందుకే ప్రాంతాల వారీగా ప్రాపర్టీ షో నిర్వహిస్తే ఆయా ప్రాంతాల్లోని అన్ని తరగతుల గృహాలు ప్రదర్శనలో ఉంటాయి.» క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోకు విశ్వసనీయత ఉంది. ఇలాంటి వేదిక మీదుగా స్థిరాస్తి రంగం, నగరాభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, ప్రతిపాదనలను ప్రజలకు చేరవేసే వీలుంటుంది. -
అట్టహాసంగా నరెడ్కో ప్రాపర్టీ షో
సాక్షి, హైదరాబాద్: నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) తెలంగాణ 13వ ప్రాపర్టీ షో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ టీ భానుప్రసాద్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ విప్లవాత్మక విధానాలతో ఐటీ రంగంతో పాటు ఫార్మా, ఏవియేషన్, ఆటోమొబైల్ వంటి అన్ని రంగాలలో జోరుగా పెట్టుబడులు వస్తున్నాయని, దీంతో ఆయా రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. బహుళ జాతి కంపెనీలకు హైదరాబాద్ పెట్టుబడుల కేంద్రంగా మారిందని చెప్పారు. ఐటీ ఉద్యోగ అవకాశాలు పెరిగాయని, దీంతో గృహ విభాగంలో డిమాండ్ ఏర్పడిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో హైదరాబాద్‌తోపాటు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలలో కూడా స్థిరాస్తి రంగం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. జిల్లాలో పట్టణీకరణ పెరగడంతో చాలా మంది కొనుగోలుదారులు ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్లను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. (డ్రీమ్ హౌస్ కొనేముందు...వీటి కోసమే వెదుకుతున్నారట!) నరెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ బీ సునీల్ చంద్రారెడ్డి మాట్లాడుతూ.. మెరుగైన మౌలిక వసతులు, కనెక్టివిటీతో ప్రధాన నగరంతో పాటు శివారు ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ పరుగులు పెడుతుందని చెప్పారు. స్థిరాస్తిలో పెట్టుబడులకు ఇదే సరైన సమయమన్నారు. జనరల్ సెక్రటరీ విజయసాయి మేక మాట్లాడుతూ.. నరెడ్కో తెలంగాణ కేవలం స్థిరాస్తి రంగానికి మాత్రమే పరిమితం కాలేదని, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలలోనూ భాగస్వామ్యం అవుతున్నామని చెప్పారు. రెరా సర్టిఫికెట్ పొందిన ప్రాజెక్ట్‌లు,లావాదేవీలలో పారదర్శకత ఉండే ప్రాజెక్ట్లనుమాత్రమే ప్రాపర్టీలో ఉన్నాయని, కొనుగోలుదారులు ధైర్యంగా నిర్ణయం తీసుకోవచ్చని సూచించారు. (రూ. 2.18 లక్షల కోట్లు: విదేశీ ఇన్వెస్టర్లు తెగ కొనేస్తున్నారు) నేడు, రేపు కూడా.. మూడు రోజుల ఈ ప్రాపర్టీ షో శని, ఆదివారం కూడా ఉంటుంది. ప్రవేశం ఉచితం. ఈ ప్రదర్శనలో వందకు పైగా డెవలపర్లు, ఆరి్ధక సంస్థలు ఈ ప్రదర్శనలో తమ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. సుమారు నగరంలో నలుమూలలో నిర్మాణంలో ఉన్న, పూర్తయిన 300లకు పైగా ప్రాజెక్ట్‌లు ప్రదర్శనలో ఉన్నాయి. ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్లు, విల్లాలు, ఫామ్ ల్యాండ్స్ ఇలా అన్ని రకాల ప్రాపరీ్టలు అందుబాటులో ఉన్నాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, కొటక్ హోమ్ లోన్స్ వంటి బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు కూడా ప్రదర్శనలో స్టాళ్లను ఏర్పాటు చేశాయి. -
తెలంగాణలో అంతా ‘గ్రీన్’!
మాదాపూర్ (హైదరాబాద్): పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా గ్రీన్ బిల్డింగ్ మూవ్మెంట్ 2001 నుంచి ప్రారంభమైందని, దాని ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉండడం గర్వకారణమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో శుక్రవారం నుంచి మూడురోజుల పాటు నిర్వహిస్తున్న ఐజీబీసీ (ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్) గ్రీన్ ప్రాపర్టీ షో–2023ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ దేశంలోనే మొదటి గ్రీన్ బిల్డింగ్, గ్రీన్‌హోమ్స్, గ్రీన్ ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్, ఫ్యాక్టరీ బిల్డింగ్లు తెలంగాణలో ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో గ్రీన్ ఫుట్‌ప్రింట్స్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ భవనాలు, ఆస్పత్రులు, ఇండస్ట్రియల్ పార్కులు, ఐటీ పార్కులు ఐజీబీసీ ప్రమాణాలతో ఉండేలా చూస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన సెక్రటేరియేట్, టీహబ్, టీవర్క్స్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, 33 జిల్లాల్లోని నూతన కలెక్టరేట్ భవనాలు, ప్రతి జిల్లాలో ఆస్పత్రులు, హెల్త్‌కేర్ క్యాంపస్‌లు గ్రీన్ సర్టిఫికేషన్‌కు లోబడి ఉన్నాయని చెప్పారు. భవనాలే కాకుండా హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ వంటి పట్టణాలు ఐజీబీసీ ప్రమాణాలను పాటిస్తున్నాయని తెలిపారు. తెలంగాణలో హరితహారం 24 శాతం నుంచి 33 శాతానికి పెరిగిందన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఏఐపీహెచ్ గ్రీన్‌సిటీ అవార్డు హైదరాబాద్‌కి దక్కిందని చెప్పారు. ఎనిమిదేళ్లలో 2.60 కోట్ల మొక్కలు పట్టణాలు, గ్రామాలకు కేటాయించిన బడ్జెట్లో 10 శాతం పచ్చదన పరిరక్షణకు కేటాయించామని కేటీఆర్ తెలిపారు. గత 8 సంవత్సరాలలో 2.60 కోట్ల మొక్కలు నాటామని, వాటిలో కనీసం 85 శాతం మొక్కలను రక్షించే విధంగా కార్యక్రమాలను చేపట్టినట్టు చెప్పారు. గ్రామాలలో కూడా ఎల్ఈడీ లైట్లను అమర్చినట్టు తెలిపారు. వరంగల్‌లోని గంగాదేవి పల్లి గ్రామానికి గ్రీన్ విలేజ్ రేటింగ్‌లో ప్లాటినం అవార్డు వచ్చిందని చెప్పారు. అన్ని పట్టణాల్లో స్వచ్ఛబడి తెలంగాణలోని అన్ని పట్టణాల్లో స్వచ్ఛబడి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఆసియాలోనే అతిపెద్ది వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ జవహర్‌నగర్‌లో ఉంది. బిల్డర్లు రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రీచార్జి వంటి నాలుగు సూత్రాలను పాటించి గృహ నిర్మాణాలను చేపట్టాలని సూచించారు. సీఐఐ (కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్) తెలంగాణ చైర్మన్, ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ సి.శేఖర్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో రూఫ్ అండ్ ఫ్లోర్ ప్రాపర్టీ షో
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ రియల్టీ వెబ్‌పోర్టల్ రూఫ్‌అండ్‌ఫ్లోర్.కామ్ ప్రాపర్టీ షోతో నగరవాసుల ముందుకొచ్చింది. హైటెక్‌సిటీలోని మేదాన్ ఎక్స్పో సెంటర్లో జూన్ 24, 25 తేదీల్లో నిర్వహించనుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రదర్శన అందుబాటులో ఉంటుంది. ప్రవేశం ఉచితం. ఈ ప్రాపర్టీ షో ద్వారా గృహ కొనుగోలుదారులను, డెవలపర్లను అనుసంధానించే సరైన వేదికని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. అపర్ణ కన్స్ట్రక్షన్స్, వాసవి గ్రూప్, శేత్రా ఫామ్స్, సెన్సేషన్ ఇన్ఫ్రాకాన్, జీ స్క్వేర్, రిధిరా లైఫ్ స్పేసెస్, ఎన్సీసీ అర్బన్, శిల్పా ఇన్ఫ్రా, జీకే బిల్డర్స్, ప్రణీత్ గ్రూప్, శాంతా శ్రీరాం, వజ్ర, గోల్డెన్కీ ప్రైమ్ ప్రాపర్టీస్‌తో పాటు కెనరా బ్యాంక్ ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి. -
హరిత భవనాలు: దేశంలోనే తొలిసారిగా గ్రీన్ ప్రాపర్టీ షో!
సాక్షి, హైదరాబాద్: హరిత భవనాలలో ప్రపంచంలోనే ఇండియా మూడో స్థానంలో నిలిచింది. గత రెండు దశాబ్దాల కాలంలో దేశంలో 1,027 కోట్ల చ.అ. విస్తీర్ణంలో 11 వేలకు పైగా ప్రాజెక్ట్‌లు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) గుర్తింపు పొందాయి. తెలంగాణలో 112 కోట్ల చ.అ.లలో 700లకు పైగా ప్రాజెక్ట్‌లు ఐజీబీసీ ధ్రువీకరణ దక్కించుకున్నాయి. ఈక్రమంలో దేశంలోనే తొలిసారిగా హరిత భవనాల స్థిరాస్తి ప్రదర్శనను నిర్వహించాలని ఐజీబీసీ నిర్ణయించింది. జూలై 28-30 తేదీలలో మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో గ్రీన్ ప్రాపర్టీ షోను నిర్వహించనుంది. ఈమేరకు మంత్రులు కేటీ రామారావు, టీ హరీశ్‌రావులు ప్రాపర్టీ షో బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ వీసీ అండ్ ఎండీ ఈవీ నరసింహారెడ్డి పాల్గొన్నారు. (రూ. 1600 కోట్ల ఇంద్రభవనం అమ్మకానికి ఎక్కడో తెలుసా? భారతీయుడి మోజు) ఈ సందర్భంగా ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్, సీఐఐ తెలంగాణ చైర్మన్ సీ శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. గృహ కొనుగోలుదారులు, పెట్టుబడిదారులకు హరిత భవనాల ప్రాముఖ్యత, పర్యావరణ బాధ్యత, ఆవశ్యకతలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్రాపర్టీ షోకు శ్రీకారం చుట్టామని తెలిపారు. నిర్వహణ వ్యయం, విద్యుత్, నీటి బిల్లుల తగ్గింపులతో పాటు ఆరోగ్యకరమైన జీవన విధానం వంటి వాటిపై అవగాహన పెరుగుతుందన్నారు. 75కి పైగా ఐజీబీసీ సర్టిఫైడ్, ప్రీ-సర్టిఫైడ్ నివాస, వాణిజ్య సముదాయ ప్రాజెక్ట్‌లతోపాటు హరిత నిర్మాణ ఉత్పత్తులు, సాంకేతికత, సేవల సంస్థలు కూడా ఈ ప్రాపర్టీ షోలో పాలుపంచుకోనున్నారని వివరించారు. -
సందడిగా ‘సాక్షి’ ప్రాపర్టీ షో (ఫొటోలు)
-
వెలవెలబోయిన ట్రెడా ప్రాపర్టీ షో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) ప్రాపర్టీ షో నిరుత్సాహంగా మొదలైంది. ఇప్పటివరకు ట్రెడా 10 ప్రాపర్టీ షోలు జరిగాయి. ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా ఓ సినీ నటుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రాపర్టీ షోను ప్రారంభించారు. సాధారణం గా ఏ డెవలపర్ల సంఘం ప్రాప ర్టీ షో నిర్వహించినా నిర్మాణ రంగానికి సంబంధించిన మంత్రులనో లేదా ప్రభుత్వ అధికారులనో ముఖ్య అతిథిగా హాజరవటం ఆనవాయితీ. కానీ, ట్రెడా ఈ ఆనవాయితీని పాటించలేదు. సదరు నిర్వాహకులు ప్రభుత్వాధికారులు లేదా రాజకీయ నేతలను ముఖ్య అతిథిగా ఆహ్వానించగా.. ఎవరూ సరిగా స్పందించలేదని ట్రెడా సభ్యుడు ఒకరు తెలిపారు. నిర్మాణ సంస్థలు, బ్యాంక్‌లు కలిపి మొత్తం 105 స్టాల్స్‌ను ఏర్పాటు చేయగా.. ఇందులో 20–25 కంపెనీలు మినహా మిగిలిన స్టాల్స్ అన్నీ చిన్నా చితక నిర్మాణ సంస్థలకు చెందినవే. ఎక్కువగా ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన స్టాల్సే. చాలా వరకు స్టాళ్లు ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చాయి. ప్రతి ఏటా అక్టోబర్–నవంబర్ మధ్య కాలంలో ట్రెడా ప్రాపర్టీ షో నిర్వహించాలి కాబట్టి ఏదో మొక్కుబడిగా నిర్వహించినట్లు కనిపించింది. తొలి రోజు పైగా వర్కింగ్ డే కాబట్టి పెద్దగా సందర్శకులు రాలేదని.. శని, ఆది వారాలు సెలవు రోజులు కావటంతో సందర్శకులు వచ్చే అవకాశం ఉందని ఓ స్టాల్ నిర్వాహకుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రదర్శనలో అనుమతులు లేని ప్రాజెక్ట్‌లు కూడా.. నిర్మాణ అనుమతులు రాని ప్రాజెక్ట్‌లు, భవిష్యత్తులో నిర్మించబోయే ప్రాజెక్ట్‌లకు సంబంధించిన కరపత్రాలు, హోల్డింగ్స్ ప్రదర్శిస్తూ ట్రెడా ప్రాపర్టీ షోలో స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. రెరా నిబంధనల ప్రకారం రెరా అనుమతి తీసుకోకుండా ప్రాజెక్ట్‌లను ప్రకటనలు చేయడం, ప్రదర్శించడం నేరం. కానీ నిర్వాహకులు ఇవేవి పట్టించుకోలేదు. పైగా ఆయా స్టాళ్ల వద్దకు వచ్చిన సందర్శకులతో ‘త్వరలోనే ప్రాజెక్ట్‌ను లాంచింగ్ చేయనున్నాం. ఇప్పుడే కొనుగోలు చేస్తే ధర తక్కువకు వస్తుందని ప్రీలాంచ్లో బుకింగ్ చేసుకోండని’ సదరు నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసిన స్టాల్ నిర్వాహకులు చెబుతున్నారు. యూడీఎస్ విధానంలో ఫ్లాట్లను విక్రయిస్తున్న ఓ కంపెనీ ఏకంగా స్పాన్సర్లలో ఒకటిగా నిలిచింది. సందర్శకులను ఆకట్టుకునేలా ఆకర్షణీయంగా స్టాల్‌ను ఏర్పాటు చేయడం గమనార్హం. -
అక్టోబర్‌లో ట్రెడా ప్రాపర్టీ షో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) అక్టోబరు 1, 2,3 తేదీల్లో 11వ ఎడిషన్ ప్రాపర్టీ షోను నిర్వహించనుంది. మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరగనుంది. సుమారు 150 నిర్మాణ సంస్థలు, 400 ప్రాపర్టీలను ప్రదర్శనలో ఉంచనున్నట్లు ట్రెడా జనరల్ సెక్రటరీ సునీల్ చంద్రారెడ్డి తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడిప్పుడే పుంపుకుంటోంది. ఇటీవల ఆగస్టులో క్రెడాయ్ ఆధ్వర్యంలో హైటెక్స్, హైదరాబాద్‌లో జరిగిన ప్రాపర్టీ షోకి సైతం మంచి స్పందన లభించింది. చదవండి: CII-Anarock survey: రూ.90 లక్షల్లోపు బడ్జెట్ ఇళ్లను తెగకొనేస్తున్నారు -
అందుబాటు గృహాలు కట్టండి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూడా సొంతింటి కలను సాకారం చేసుకునే దిశగా డెవలపర్లు అందుబాటు గృహాలను నిర్మించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. ప్రస్తుతం ఐటీ, ఫార్మా రంగాలు బాగున్నాయి కాబట్టి పెద్ద సైజు గృహాలు, లగ్జరీ ప్రాపర్టీ విక్రయాలు బాగానే సాగుతున్నాయని.. ఇది ఎల్లకాలం ఉండదని గృహ విక్రయాలలో స్థిరత్వం ఉండాలంటే మధ్యతరగతి గృహాలను నిర్మించాలని చెప్పారు. ఆయా ప్రాజెక్ట్‌ల నిర్మాణాలకు అవసరమైన భూముల కొనుగోళ్లు, అనుమతుల మంజూరు, నిర్మాణ రాయితీలు వంటి వాటి కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావులతో చర్చిస్తానని.. సానుకూల నిర్ణయం వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. గచ్చిబౌలిలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో శుక్రవారం కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో 10వ ప్రాపర్టీ షో ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) వెలుపల 20–30 కి.మీ. దూరంలో రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) నిర్మాణం కోసం కేంద్రం అంగీకారం తెలిపిందన్నారు. ల్యాండ్ పూలింగ్ కోసం సుమారు రూ.3 వేల కోట్లు వ్యయమవుతుందని అంచనా వేయగా.. ఇందులో రూ.1,500 కోట్లు భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఆర్ఆర్ఆర్ అందుబాటులోకి వస్తే రియల్టీ పరిశ్రమ 20–30 ఏళ్లు ముందుకెళుతుందని చెప్పారు. ఎక్కువ స్థలం అందుబాటులోకి వచ్చి చౌక ధరలలో స్థలాలు దొరుకుతాయని పేర్కొన్నారు. రెరాకు శాశ్వత చైర్మన్.. త్వరలోనే తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)కు శాశ్వత చైర్మన్, పూర్తి స్థాయి అధికారులను నియమించడంతో పాటు రిటైర్డ్ జడ్జి లేదా పరిశ్రమలోని నిపుణులను అథారిటీగా నియమించే అంశం తుదిదశకు చేరుకుందని మంత్రి వివరించారు. ధరణిలో అర్బన్ ఏరియాలతో ముడిపడి ఉన్న వ్యవసాయ భూములలో కొన్ని మినహా.. గ్రామీణ ప్రాంతాలలోని వ్యవసాయ భూములకు ఎలాంటి సమస్యలు లేవని దీంతో ఆయా స్థలాల క్రయవిక్రయాల సమయంలో 15–20 నిమిషాలలోనే రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయని చెప్పారు. సాఫ్ట్వేర్, బ్యాండ్‌విడ్త్ రిలేటెడ్ సమస్యలే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ధరణిలో నమోదైన భూములకు చట్టబద్ధత వస్తుందని.. దీంతో భవిష్యత్తు తరాలకు ఎలాంటి ఇబ్బందులు రావని పేర్కొన్నారు. వ్యవసాయ భూముల క్రయవిక్రయాలకు, లావాదేవీలకు ఏ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా కూర్చున్న చోటు నుంచి పని చేసుకునే విధంగా సులభతరంగా ధరణిని రూపొందించామని చెప్పారు. ధరణిలో లీగల్ ప్రొవిజన్స్ లేవు.. ఇప్పటికీ ధరణిలో పలు సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని... ప్రధానంగా న్యాయమపరమైన నిబంధనలు (లీగల్ ప్రొవిజన్స్) లేవని తెలంగాణ ప్రెసిడెంట్ సీహెచ్ రామచంద్రారెడ్డి చెప్పారు. దీంతో భూ యజమానులకు, కొనుగోలుదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ), తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ)లతో కలిపి మరొక సమావేశం నిర్వహించాలని ఆయన కోరారు. ధరణి విధానాన్ని ముందుగా ఒకట్రెండు జిల్లాలలో పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టి వాటి ఫలితాలను అంచనా వేసుకున్నాక రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాల్సిందని క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ పీ రామకృష్ణారావు సూచించారు. ప్రతి 10 ప్రాపర్టీలలో 7 ధరణి సమస్యలలో చిక్కుకున్నాయన్నారు. వేలాది దరఖాస్తుల కరెక్షన్స్ పెండింగ్‌లో ఉన్నాయని, ఆయా సమస్యలను పరిష్కరించే సమయం కలెక్టర్లకు ఉండటం లేదని చెప్పారు. ధరణి సమస్యల పరిష్కారానికి ప్రస్తుతం 5–6 నెలల సమయం పడుతుందన్నారు. ప్రతి జిల్లాలోనూ స్పెషల్ ఐఏఎస్ ఆఫీసర్లను నియమిస్తే పది రోజుల్లో పరిష్కరించవచ్చని చెప్పారు. టీఎస్–బీపాస్ పర్మిషన్స్ సంపూర్ణంగా లేవు.. టీఎస్–బీపాస్‌తో 21 రోజుల్లోనే నిర్మాణ అనుమతులు వస్తున్నప్పటికీ అవి సంపూర్ణంగా లేవని రామకృష్ణారావు పేర్కొన్నారు. ఎలక్ట్రిసిటీ, ఎన్విరాన్మెంటల్, వాటర్ బోర్డ్ విభాగాలు టీఎస్–బీపాస్‌లో అనుబంధమై లేవని.. దీంతో ఆయా విభాగాల కార్యాలయాల చుట్టూ మళ్లీ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. హైదరాబాద్‌లో లేదా అర్బన్ ఏరియా ప్రాంతాలలో కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (కార్డ్) విధానాన్నే ఉంచాలని కోరారు. గ్రిడ్, వేర్‌హౌస్ పాలసీలు, ఈ–సిటీ, ఎంఎస్ఎంఈ, మెడికల్ డివైజ్ వంటి పార్క్‌లు, ఫార్మా సిటీ వంటి కొత్త కొత్త అభివృద్ధి పనులు జరుగుతున్నాయని క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ వీ రాజశేఖర్‌రెడ్డి చెప్పారు. దీంతో అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కాకుండా నగరం నలువైపులా విస్తరిస్తుందని తెలిపారు. పాలసీల రూపకల్పనలో రియల్టీ నిపుణులను కూడా భాగస్వామ్యం చేయాలని కోరారు. నేడు, రేపు కూడా ప్రాపర్టీ షో క్రెడాయ్ హైదరాబాద్ 10వ ప్రాపర్టీ షోలో నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు వంద స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి. 15 వేలకు పైగా ప్రాజెక్ట్‌లు ప్రదర్శనలో ఉన్నాయి. శని, ఆదివారాలలో కూడా ప్రాపర్టీ షో అందుబాటులో ఉంటుంది. ఐసీఐసీఐ, ఎస్బీఐ వంటి బ్యాంక్‌లు, పలు నిర్మాణ సామగ్రి సంస్థలు కూడా స్టాళ్లను ఏర్పాటు చేశాయి. మూడు రోజుల్లో కలిపి సుమారు 60 వేల మంది సందర్శకులు వస్తారని క్రెడాయ్ హైదరాబాద్ అంచనా వేసింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జీ ఆనంద్ రెడ్డి, కే రాజేశ్వర్, ఎన్ జైదీప్ రెడ్డి, బీ జగన్నాథ్ రావు, ట్రెజరర్ ఆదిత్య గౌరా, జాయింట్ సెక్రటరీలు శివరాజ్ ఠాకూర్, కే రాంబాబు, క్రెడాయ్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గుమ్మి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సాక్షి టీవీ ప్రాపర్టీ షో 2020
-
సాక్షి టీవీ ప్రాపర్టీ షో ప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : సామాన్య, మధ్య తరగతి వర్గాలకు ఇళ్లు, ప్లాట్లు అందించాలనే ఉద్ధేశ్యంతో హైదరాబాద్ కూకట్‌పల్లిలోని భ్రమరాంబా మల్లికార్జున ఫంక్షన్హాల్లో సాక్షి టీవీ ప్రత్యేకంగా ప్రాపర్టీ షో 2020 నిర్వహిస్తోంది. క్రెడాయ్ తెలంగాణ చైర్మన్ గుమ్మిరాంరెడ్డి, ప్రెసిడెంట్ ఆర్వీ రామచంద్రారెడ్డి, కెనరా బ్యాంక్ హైదరాబాద్ సర్కిల్ జీఎం వీరభద్రారెడ్డిలు హాజరై ప్రాపర్టీ షోను ప్రారంభించారు.దాదాపుగా 30మంది డెవలపర్స్, బిల్డర్స్ ఈ ప్రదర్శనలో తమ ప్రాపర్టీలను ప్రదర్శనకు ఉంచారు. ప్లాట్ కానీ ఇళ్ళు కానీ సెలక్ట్ చేసుకున్న వెంటనే వారికి తగిన రుణం ఇచ్చే విధంగా ప్రత్యేకంగా కెనరా బ్యాంక్ స్టాల్‌ను కూడా ఏర్పాటు చేసింది. అంతేకాదు తొలిసారి ప్రాపర్టీ ఎక్స్ పోలో ఈఎమ్ఐల ద్వారా ప్లాట్లు విక్రయించే బృహత్తర కార్యక్రమాన్ని సైతం సాక్షిటివి ఎక్స్పో కల్పిస్తోంది. రెండు రోజుల పాటు ప్రాపర్టీ షో కొనసాగుతుంది. కేవలం రియల్ ఎస్టేట్ సంస్ధలే కాదు ఇంటీరియర్, ఎక్స్టీరియర్ డిజైన్స్ సంస్ధలు కూడా ఎక్స్‌పోలో ఉన్నాయి. -
ప్రారంభమైన ట్రెడా ప్రాపర్టీ షో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) 9వ ప్రాపర్టీ షో శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా పాల్గొన్న చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి మాట్లాడుతూ.. తెలంగాణలో 2008–14 మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొందని.. కానీ, గత నాలుగేళ్లుగా ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయాలు, రాయితీలు, ప్రోత్సాహకాలతో రియల్టీ రంగానికి మళ్లీ మంచి రోజులొచ్చాయని గుర్తు చేశారు. నగరానికి ఐటీ, ఇతర రంగాల్లో అంతర్జాతీయ కంపెనీలు రావటం, ఉన్న కంపెనీలు విస్తరణ కార్యకలాపాలు చేపట్టడంతో ఆఫీసు స్పేస్‌కే కాకుండా గృహాలకు కూడా డిమాండ్ పెరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ బీఈ పాపారావు, ట్రెడా ప్రెసిడెంట్ పీ రవీందర్ రావు, ట్రెజరర్ శ్రీధర్ రెడ్డి కే, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ సాయి ఎం, సెక్రటరీ జనరల్ సునీల్ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేడు, రేపు కూడా.. మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరుగుతున్న ఈ ప్రాపర్టీ షో శని, ఆదివారాల్లోనూ అందుబాటులో ఉంటుంది. ప్రవేశం ఉచితం. ఇందులో నగరానికి చెందిన వందకు పైగా నిర్మాణ సంస్థలు 145 స్టాళ్లను ఏర్పాటు చేసి ప్రాజెక్ట్‌లను, వెంచర్లను ప్రదర్శించాయి. ఈ షోలో 11 బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు, 15 నిర్మాణ సామగ్రి, ఇంటరీయర్ కంపెనీలు ఆయా ఉత్పత్తుల, ఆఫర్లను ప్రదర్శించాయి. ట్రెడా 9వ ప్రాపర్టీ షోకు వాసవి గ్రూప్, అపర్ణా, మై హోమ్, గ్రీన్ రిచ్ ఎస్టేట్స్, హోల్‌మార్క్ బిల్డర్స్, సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, రాంకీ ఎస్టేట్స్ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి. రెయిన్బో విస్టాస్‌కు ఐజీబీసీ అవార్డు సాక్షి, హైదరాబాద్: సైబర్‌సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ నిర్మిస్తున్న రెయిన్బో విస్టాస్ రాక్ గార్డెన్ ప్రాజెక్ట్‌ను ఐజీబీసీ గ్రీన్ హోమ్స్ అవార్డు వరించింది. హెచ్ఐసీసీలో జరుగుతున్న ఐజీబీసీ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్–2018లో ఈ అవార్డును కంపెనీ ఎండీ వేణు వినోద్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐజీబీసీ హైదరాబాద్ ప్రెసిడెంట్ సీ శేఖర్ రెడ్డి, వరల్డ్ జీబీసీ మాజీ చైర్మన్ టై లీ, ఏపీ–రెరా చైర్మన్ రామనాథన్, టీ–రెరా చైర్మన్ రాజేశ్వర్ తివారీ పాల్గొన్నారు. రెయిన్బో విస్టాస్ మూసాపేట్లో 45 లక్షల చ.అ.ల్లో 2,500 గృహాలతో ఉంటుంది. -
నవంబర్ 2 నుంచి ట్రెడా ప్రాపర్టీ షో
సాక్షి, హైదరాబాద్: నవంబర్ 2 నుంచి 4 తేదీల్లో తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా)9వ ప్రాపర్టీ షో జరుగనుంది. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరగనున్న ఈ ప్రదర్శనలో 100కు పైగా నిర్మాణ సంస్థలు, 11 బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు, 15 నిర్మాణ సామగ్రి, ఇంటీరియర్ సంస్థలు పాల్గొంటున్నాయి. ప్రవేశం ఉచితం. ఈ షోకు ప్లాటినం స్పాన్సర్‌గా వాసవి గ్రూప్, గోల్డ్ స్పాన్సర్‌గా అపర్ణా కన్స్ట్రక్షన్స్, మై హోమ్ గ్రూప్, సిల్వర్ స్పాన్సర్‌గా గ్రీన్ రిచ్ ఎస్టేట్స్, హాల్‌మార్క్ బిల్డర్స్, హాల్ స్పాన్సర్‌గా సైబర్‌సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, రాంకీ ఎస్టేట్స్ వ్యవహరిస్తున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రెడా ప్రెసిడెంట్ పీ రవీందర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం వేగవంతమైన నగరంతో పాటూ శివారు, దూర ప్రాంతాల్లోనూ రహదారులు, మౌలిక వసతులను అభివృద్ధి చేయడంతో ఆయా ప్రాంతాలన్నీ అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. దీంతో నివాస, వాణిజ్య సముదాయాలకు డిమాండ్ పెరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రెడా ట్రెజరర్ కే శ్రీధర్ రెడ్డి, సెక్రటరీ జనరల్ సునీల్ చంద్రా రెడ్డి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్స్ ఆర్ చలపతి రావు, విజయ్‌సాయి పాల్గొన్నారు. -
నేడు, రేపు హిందు గ్రూప్ ప్రాపర్టీ షో
సాక్షి, హైదరాబాద్: నగరవాసుల సొంతింటి కలను సాకారం చేసేందుకు ది హిందు గ్రూప్ ఆధ్వర్యంలో ప్రాపర్టీ షో జరగనుంది. లివింగ్ స్పేస్ పేరిట హైటెక్స్ రోడ్‌లోని సైబర్ కన్వెన్షన్‌లో శని, ఆదివారాల్లో ఈ ప్రాపర్టీ షో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రదర్శనకు ప్రవేశం ఉచితం. ఈ షోలో నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలకు చెందిన వ్యక్తిగత గృహాలు, అపార్ట్మెంట్లు, విల్లాలు, లగ్జరీ ఫ్లాట్లు ప్రదర్శనలో ఉంటాయి. ఈ ప్రాపర్టీ షోకు టైటిల్ స్పాన్సర్‌గా అపర్ణా కన్స్ట్రక్షన్స్, పవర్డ్ బై రాజపుష్ప ప్రాపర్టీస్, అసోసియేట్ స్పాన్సర్‌గా ఆదిత్య కన్స్ట్రక్షన్స్, సాకేత్ ఇంజనీర్స్ వ్యవహరిస్తున్నాయి. -
హైదరాబాద్‌లో 6వ క్రెడాయి ప్రాపర్టీ షో ప్రారంభం
-
హెచ్ఆర్ఏ ప్రాపర్టీ షో షురూ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్ఏ) తొలి ప్రాపర్టీ షో మొదలైంది. మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జీహెచ్ంఎసీ కమిషనర్ బి జనార్ధన్ రెడ్డి, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శని, ఆది వారాల్లోనూ ఈ ప్రదర్శన అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఎస్అండ్ఎస్ గ్రీన్ ప్రాజెక్ట్స్, ఫోనిక్స్, జయభేరి, ఆదిత్య వంటి నిర్మాణ సంస్థలు 200లకు పైగా ప్రాజెక్ట్‌లను ప్రదర్శనలో ఉంచాయి. షోలో కౌన్సిలింగ్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. స్థిరాస్తి నిపుణులు, సలహాదారులు స్థిరాస్తి కొనుగోళ్లలో, గృహ రుణాల ఎంపికలో సలహాలు, సూచనలిచ్చారు. ‘‘నేషనల్ రియల్టర్స్ అసోసియేషన్– ఇండియా (ఎన్‌ఏఆర్) అనుబంధ సంస్థే హెచ్ఆర్ఏ. ఇందులో 80కి పైగా సభ్యులున్నారు. రియల్టీ రంగంలో ప్రొఫిషనలిజం, సమగ్రతను తీసుకురావడానికి హెచ్ఆర్ఏ ప్రధాన లక్ష్యమని’’ హెచ్ఆర్ఏ ప్రెసిడెంట్ సుమంత్ రెడ్డి తెలిపారు. -
ప్రాపర్టీప్లస్ 29nd October 2017
-
ప్రాపర్టీప్లస్ 22nd October 2017
-
సాక్షి ప్రాపర్టీ షో నేడే!
మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో.. ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు, ఇండిపెండెంట్ హౌజ్‌లన్నీ ఒకే చోట ‘‘సార్.. సొంతింటి ప్రయత్నం ఎంతవరకు వచ్చింది?’’ ఇలా అడగ్గానే చాలా మంది చెప్పే సమాధానం.. ‘ఏం చెప్పమంటారండి. నా బడ్జెట్లో ఇల్లు దొరకడం లేదనే’! ఇల్లు నచ్చితే ధర ఎక్కువని.. ధర కుదిరితే ప్రాంతం బాగోలేదని ఏళ్ల తరబడి సొంతింటి అన్వేషణ కొనసాగుతూనే ఉంటారు మనలో చాలా మంది. లేకపోతే ఏదో ఒకదానికి రాజీ పడుతుంటారు. మీ బడ్జెట్లో ఇంటి ఎంపికను సులభతరం చేసేందుకు సాక్షి ప్రాపర్టీ షో మరోసారి మీ ముందుకొచ్చింది. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో చేపట్టిన ప్రముఖ నిర్మాణ సంస్థల ప్రాజెక్ట్‌లను కొనుగోలుదారులకు చేరువ చేసి.. సొంతింటి అన్వేషణను ఈజీ చేయడమే ఈ షో ప్రధాన ఉద్దేశం. సాక్షి, హైదరాబాద్ : నగరానికి చెందిన 25 ప్రముఖ నిర్మాణ సంస్థలు.. 36 స్టాళ్లన ఏర్పాటు చేస్తున్నాయి. వీటిల్లో నగరం నలుమూలల వెంచర్లు, వ్యక్తిగత గృహాలు, విల్లాలు, అపార్ట్మెంట్లు, కార్యాలయ సముదాయాల వివరాలను అందుబాటులో ఉంచుతాయి. ఎస్బీఐ బ్యాంక్ గృహ రుణం కోసం దరఖాస్తు చేసిన వారికి ప్రాసెసింగ్ ఫీజు లేకుండా రుణాలను మంజూరు చేస్తుంది. సిరి సంపద హోమ్స్ ప్రతి రోజు బంపర్ డ్రా కూడా ఉంటుంది. మరెందుకు ఆలస్యం? కుటుంబ సమేతంగా విచ్చేసి అన్ని విధాల నప్పే ఇంటిని ఆనందంగా ఎంచుకోండి! స్థిరమైన అభివృద్ధి ఉన్న వైపే.. మెరుగైన రవాణా సదుపాయాలు, విద్యా, వైద్యం, వినోద కేంద్రాలున్న ప్రాంతాల్లోనే కొనుగోళ్లకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. నిర్మాణ సంస్థలూ అలాంటి ప్రాజెక్ట్‌లకే శ్రీకారం చుడుతున్నాయి. మరోవైపు చెన్నై, బెంగళూరు వంటి ఇతర మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో నేటికీ ఇళ్ల ధరలు అందుబాటులోనే ఉన్నాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాం తాల్లో ఫ్లాట్ల రేట్లు పెరిగినప్పటికీ హైదరాబాద్‌లో నేటికీ తక్కువకే దొరుకుతున్నాయి. జిమ్, క్లబ్‌హౌజ్, స్విమ్మింగ్‌పూల్ వంటి ఆధునిక సదుపాయాలు గల గేటెడ్ కమ్యూనిటీల్లో బిల్డర్లు చెబుతోన్న రేట్లు బేరీజు వేశాక కొనుగోలుదారులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సొంతింటిని కొంటున్నారు. భవిష్యత్తులో ఇంతకంటే తక్కువ ధరకు దొరకుతాయన్న నమ్మకం లేదు కాబట్టి సొంతింటి కల సాకారానికి ఇదే సరైన సమయమని డెవలపర్లు చెబుతున్నారు. పాల్గొనే సంస్థలివే.. మెయిన్ స్పాన్సర్: అపర్ణా కన్స్ట్రక్షన్స్ అసోసియేట్ స్పాన్సర్స్: ఆదిత్య కన్స్ట్రక్షన్, రాంకీ గ్రూప్ కో–స్పాన్సర్: విర్టుసా లైఫ్ స్పేసెస్ పాల్గొనే సంస్థలు: సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్, సాకేత్ ఇంజనీర్స్, ఏఆర్కే టెర్మినస్ ఇన్ఫ్రా, మంజీరా, మ్యాక్ ప్రాజెక్ట్స్, ఫార్చ్యూన్ బటర్‌ఫ్లై సిటీ, గ్రీన్ హోమ్, ఆర్వీ నిర్మాణ్ ప్రై.లి., అమృత ప్రాజెక్ట్స్, ఆక్సాన్ హౌజింగ్, అయ్యన్న బిల్డర్స్ అండ్ డెవలపర్స్, సార్క్ ప్రాజెక్ట్స్, జెమ్ వివెండాస్, ముప్ప ప్రాజెక్ట్స్, అక్యురేట్ డెవలపర్స్, కార్పొరేట్ వెంచర్స్, ఐబీ డెవలపర్స్, స్పేస్ విజన్ గ్రూప్, వర్ధన్ డెవలపర్స్, ఎస్బీఐ బ్యాంక్ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు: ప్రవేశం ఉచితం -
విజయవాడలో ప్రాపర్టీ షో
విజయవాడ: రియల్ ఎస్టేట్ పరిశ్రమను అభివృద్ధి చేసే క్రమంలో విజయవాడలో త్వరలో ప్రాపర్టీ షో నిర్వహించనున్నట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా(క్రెడాయ్) విజయవాడ చాప్టర్ ప్రతినిధులు తెలిపారు. మంగళవారం సాయంత్రం వారు విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. జనవరి ఆరో తేదీ నుంచి స్థానిక ఏ కన్వెన్షన్ సెంటర్లో జరుగనున్న ఈ ప్రదర్శన 8వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న సుప్రసిద్ధ సంస్థలు దాదాపు 80 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నాయి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షోను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని సంస్థ ప్రెసిడెంట్ సీహెచ్.సుధాకర్, ప్రధాన కార్యదర్శి పీవీఆర్ రాజు తెలిపారు. -
తిరుపతిలో క్రెడయ్ ప్రాపర్టీ షో
– 76 నిర్మాణ సంస్థల హాజరు – మూడు రోజుల పాటు ప్రత్యేక ఎగ్జిబిషన్ – నిర్మాణ రంగంలో సరికొత్త మార్పులు – తిరుపతి పరిసరాల్లో 49 కొత్త వెంచర్లు సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుపతి పీఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం నుంచి క్రెడయ్ (కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ప్రాపర్టీ షో ప్రారంభమైంది. తిరుపతి మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వీ దుర్గాభవాని, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్‌రెడ్డి, నగరంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ సుధారాణి ముఖ్య అతిథులుగా హాజరై ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. క్రెడయ్ తిరుపతి చాప్టర్ ఆధ్వర్యంలో ఇది రెండో ఎగ్జిబిషన్. మూడు రోజుల పాటు ఇది కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. అవగాహన కోసమే... రాష్ట్రంలోని 76 భవన నిర్మాణ సంస్థలు, కంపెనీలు ఎగ్జిబిషన్లో స్టాళ్లను ఏర్పాటు చేశాయి. ఆకాశ హార్మ్యాలాంటి నివాస భవనాల నిర్మాణంలో వస్తున్న సరికొత్త మార్పులు, డిజైన్లు, నాణ్యత వంటి అంశాలపై సరైన అవగాహన కల్పించడమే కాకుండా ఏఏ బిల్డింగ్ మెటీరియల్ ఎక్కడ, ఏఏ ధరల్లో లభ్యమవుతుందో తెలియజేసేందుకు ప్రాపర్టీ షో ఎంతగానో దోహదపడుతుందని నిర్వాహకులు వీ శ్రీనివాసులు,వెంకటేశ్‌బాబు తెలిపారు. నిర్మాణ రంగంలో విశేష అనుభవం ఉన్న నిర్మాణ సంస్థలు, వాటికి సంబంధించిన బిల్డర్లు హాజరైనట్లు తెలిపారు. ఆకట్టుకున్న స్టాళ్లు... ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన వివిధ నిర్మాణ సంస్థల స్టాళ్లు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఏఏ నిర్మాణ సంస్థ ఎక్కడ, ఎన్ని ఫ్లోర్లతో ఏ తరహా భవనాలను నిర్మిస్తోంది..వాటి ధరలు ఎలా ఉన్నాయి...ఎంత విస్తీర్ణం కొనుగోలుదారులకు దక్కుతుందనే వివరాలతో కూడిన బ్రోచర్లు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను అందుబాటులో ఉంచడంతో సందర్శకులు ఆసక్తి కనబరిచారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సుమారు 5 వేల మంది ఎగ్జిబిషన్‌కు హాజరయ్యారని నిర్వాహకులు వివరించారు. 11న జరిగే ముగింపు కార్యక్రమానికి క్రెడయ్ రాష్ట్ర అధ్యక్షుడు ఆలా శివారెడ్డి (విజయవాడ), కార్యదర్శి ఆళ్ల శివారెడ్డి (గుంటూరు) హాజరవుతారని వెంకటేశ్‌బాబు తెలిపారు. ఎస్బీఐ డీజీఎం పవన్‌కుమార్, క్రెడయ్ జాతీయ మాజీ అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి, పలువురు నగర ప్రముఖులు, రియల్టర్లు, బిల్డర్లు హాజరయ్యారు. -
మూడు నెలల్లో కొత్త మాస్టర్ ప్లాన్
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సమగ్ర అభివృద్ధి కోసం రానున్న 3 నెలల్లో నూతన మాస్టర్ ప్లాన్‌ను రూపొందించనున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. నగరంలో ప్రణాళికాబద్ధంగా నిర్మాణాలు జరిగేందుకు ఈ మాస్టర్ ప్లాన్ ఎంతో దోహదం చేస్తుందని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో నిర్మాణ రంగంపై పలు అనుమానాలు చోటు చేసుకున్నాయని, వాటన్నింటినీ అధిగమించి ప్రపంచ దేశాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రస్తుతం నిర్మాణ రంగం అభివృద్ధి చెందిందన్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో శనివారం 5వ క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోను ఆయన ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఉన్న నిర్మాణ సంస్థలు దేశవ్యాప్తంగా వ్యాపించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూం నిర్మాణాల్లో సామాజికంగా ఆలోచించి నిర్మాణ సంస్థలు తమతో కలసి పనిచేయాలని సూచించారు. నిర్మాణ రంగానికి సంబంధించి ఒకే రోజు 41 జీవోలు పాస్ చేశామని, 30 రోజుల్లో అన్ని అనుమతులను ఆన్లైన్ ద్వారా తీసుకునేందుకు పూర్తి ఏర్పాటు చేశామని చెప్పారు. జీహెచ్ఎంసీలో లంచగొండితనం లేకుండా పనులు జరుగుతాయని, ఏ ఫైల్ ఎక్కడ ఆగిందో వెంటనే తెలిసిపోతోందని తెలిపారు. విద్యుత్ రంగంలో పవర్‌కట్ అంటే ఏమిటో తెలియని విధంగా ప్రణాళికలను రూపొందించామని చెప్పారు. క్రెడాయ్ ప్రతినిధుల సూచనలు తెలుసుకుంటామన్నారు. నిర్మాణ సంస్థలు ఒకేచోట కాకుం డా హైదరాబాద్ నలుమూలలా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. నిర్మాణ సంస్థలకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలను ఇవ్వనున్నట్లు చెప్పారు. మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, హరితహారం, ఇంటింటికీ నల్లా కనెక్షన్ తదితర కార్యక్రమాలకు అందరూ సహకరించాలని కోరారు. కాగా, ప్రాపర్టీ షో 15వ తేదీ వరకు కొనసాగనుందని, 115కుపైగా డెవలపర్లు తమ ప్రాజెక్టులను ప్రదర్శిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. వాసవీ గ్రూప్ ఈ కార్యక్రమానికి మెయిన్ స్పాన్సర్‌గా వ్యవహరించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఖమ్మం ఎమ్మెల్యే అజయ్, క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షులు ఎస్.రాంరెడ్డి, జి.రాంరెడ్డి, హైదరాబాద్ క్రెడాయ్ జనరల్ సెక్రటరీ రామకృష్ణారెడ్డి, తెలంగాణ క్రెడాయ్ జనరల్ సెక్రటరీ సీహెచ్.రామచంద్రారెడ్డి, ఉపాధ్యక్షులు ఆదిత్యగౌరా, ఆనంద్‌రెడ్డి, ఎం.ఎస్.ఆనంద్‌రావు, టి.మురళీ కృష్ణారెడ్డి, జాయింట్ సెక్రటరీలు జి.మురళీ మోహన్, వి.రాజేశ్వర్‌రెడ్డి, సీఈవో ఎం.వి.రాజేశ్వర్రావులతో పాటు డెవలపర్లు, స్టేక్ హోల్డర్లు తదితరులు పాల్గొన్నారు. -
గృహప్రవేశం చేద్దాం!
*నేడే ఇండియా ప్రాపర్టీ.కామ్ ప్రాపర్టీ షో *65కు పైగా నిర్మాణ సంస్థలు.. 300లకు పైగా ప్రాజెక్ట్‌ల ప్రదర్శన సాక్షి, హైదరాబాద్: అభివృద్ధికి పక్కా ప్రణాళికలు.. చక్కటి పరిపాలన.. శాంతిభద్రతలకు పెద్దపీట.. పూర్తిస్థాయి పారదర్శకత.. భాగ్యనగరికి పెరుగుతున్న ఆదరణ.. టీఎస్-ఐపాస్, ఐటీ పాలసీలతో నగరానికి క్యూ కడుతున్న ఐటీ, ఇతర కంపెనీలు, నిర్మాణ రంగ వృద్ధికి సరికొత్త నిర్ణయాలు.. మొత్తానికి తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వం నడుం బిగించింది. ఇదే సమయంలో ప్రపంచ దిగ్గజ కంపెనీలు నగరంలో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. దీంతో మళ్లీ హైదరాబాద్ స్థిరాస్తి రంగం పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. * కొంతకాలం నుంచి నగరంలో స్థిరాస్తి ధరలు పెద్దగా పెరగలేదు. దీంతో ఇళ్ల రేట్లు అందుబాటులోనే ఉన్నాయని చెప్పాలి. చెన్నై, బెంగళూరు, పుణె వంటి నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో నేటికీ రేట్లు తక్కువగా ఉన్నాయి. త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న ఓఆర్ఆర్, జోరుగా సాగుతున్న మెట్రో రైలు పనులు, వేల సంఖ్యలో స్టార్టప్ సంస్థలు, ఐటీ కంపెనీల విస్తరణ వంటి వాటితో మరో ఆరు నెలల్లో స్థిరాస్తి ధరలు పెరగనున్నాయి. * మరి నగరం నలువైపులా నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌ల వివరాల్ని ఒకేచోట తెలుసుకోవటం కష్టమైన పనే. దీనికి పరిష్కారం చూపించేందుకు ఇండియా ప్రాపర్టీ.కామ్ సిద్ధమైంది. గృహప్రవేశం పేరుతో శని, ఆదివారాల్లో మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో 82వ ప్రాపర్టీ షోను నిర్వహించనుంది. ఈ సందర్భంగా నిర్వాహకులు, పలువురు బిల్డర్లతో ‘సాక్షి రియల్టీ’ చర్చించింది. * ఇందులో నగరానికి చెందిన 65కు పైగా నిర్మాణ సంస్థలు 300లకు పైగా ప్రాజెక్ట్‌లను ప్రదర్శించనున్నారు. ఇందులో లేఔట్ల నుంచి ఫ్లాట్లు, లగ్జరీ హోమ్స్, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలూ ఉన్నాయి. అపర్ణా కన్స్ట్రక్షన్స్, రాంకీ, మై హోమ్, ఎస్ఎంఆర్, ఆదిత్య కన్స్ట్రక్షన్స్, సైబర్‌సిటీ, హిల్‌కౌంటీ, రహేజా, ప్రిస్టిజ్, ఆకృతి, దక్షిణ్, త్రిశూల్, ఏఆర్కే, వెర్టిక్స్ హోమ్స్, ముప్పా, గౌతమి, లన్సమ్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు తమ ప్రాజెక్ట్‌లను ఈ ప్రాపర్టీ షోలో ప్రదర్శించనున్నాయి. * గృహ రుణాలకు సంబంధించిన వివరాలను అందించేందుకు, అక్కడికక్కడే అనుమతులూ ఇచ్చేందుకు ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు కూడా తమ స్టాళ్లను ఏర్పాటు చేయనున్నాయి. సందర్శకుల్లో ఉత్సాహం నింపేందుకు లక్కీ డ్రా ద్వారా ప్రత్యేక బహుమతులనూ ఇవ్వనున్నారు. భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) నుంచి కొంత మంది బిల్డర్లు ఈ షోలో పాల్గొని హైదరాబాద్ స్థిరాస్తి రంగం అభివృద్ధిపై బృంద చర్చలు చేస్తారు. *‘‘గృహప్రవేశం అనేది బిల్డర్లను, కొనుగోలుదారులను సాంకేతికత ద్వారా కలిపే సరైన వేదిక. కస్టమర్లు తమ బడ్జెట్లో ఎలాంటి ప్రాపర్టీలను ఎంచుకోవాలి? ఏ ప్రాజెక్ట్‌లో ఇంటితో పాటూ లగ్జరీ వసతులనూ పొందొచ్చు? భవిష్యత్తులో రేట్లు పెరిగే ప్రాంతాలేవి? వంటి అనేక అంశాలపై క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. అలాగే ట్రూవ్యూ, డిస్కవరీ వంటి టెక్నాలజీ ద్వారా నేరుగా ప్రాపర్టీల వద్దకు వెళ్లకుండా ఆన్లైన్ ద్వారా వీక్షించే అవకాశముందని’’ ఇండియా ప్రాపర్టీ.కామ్ సీఈఓ గణేష్ వాసుదేవన్ చెప్పారు. * అపర్ణా కన్స్ట్రక్షన్స్ ప్రై.లి. డిప్యూటీ మేనేజర్ శ్రీనివాస్ దివాకర్ల మాట్లాడుతూ.. ఇండియా ప్రాపర్టీ.కామ్ ఎక్కడ ప్రాపర్టీ షో నిర్వహించిన అందులో టైటిల్/ప్లాటినం స్పాన్సర్‌గా వ్యవహరిస్తాం. ఒకే వేదికగా అన్ని తరగతుల కొనుగోలుదారులను చేరుకునేందుకు గృహప్రవేశం సరైన వేదిక అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కేవలం ప్రాజెక్ట్‌లను ప్రదర్శించేందుకు ఈ షోలో పరిమితం కాదు.. ప్రస్తుత మార్కెట్ స్థితిగతులు, అభివృద్ధి అవకాశాలను క్షుణ్ణంగా వివరిస్తూ, బృంద చర్చలు నిర్వహించడం ముదావ హం. * ఎస్వీసీ వెంచర్స్ ప్రై.లి. హెడ్సేల్స్ అండ్ మార్కెటింగ్ వీ. రమేష్ మాట్లాడుతూ.. నగరం వేదికగా జరిగే ప్రాపర్టీ షోలో గృహప్రవేశానికి ప్రత్యేక స్థానం ఉంది. నిర్వహణలో కాదు ఇదే వేదికగా బుకింగ్స్ జరగడమూ చాలా సందర్భాల్లో ఎదురైంది. * రాంకీ ఫామ్స్ అండ్ ఎస్టేట్స్ లి. సీరియర్ మార్కెటింగ్ మేనేజర్ రేష్మ మాట్లాడుతూ.. ఇండియా ప్రాపర్టీ.కామ్‌తో మా అనుబంధం చాలా దగ్గరిది. గృహప్రవేశంలో పాల్గొనడం ఇది నాలుగోసారి. పాల్గొన్న ప్రతీసారి మంచి స్పందన వస్తుంది. * ఇంటికి వేసే రంగుల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇవి మనిషిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయట. * ఎరుపు రంగును చిన్న పిల్లల గదుల్లో ఉపయోగించడం మం చిది కాదు. నీలం రంగు శరీరం లో కొన్ని రకాల రసాయనాలు ఉత్పత్తి చేస్తుంది. దీంతో మనిషి మెదడు స్థిమితంగా ఉంటుంది. ముదురు నీలం లివింగ్‌రూమ్, వంట గదిలో వాడకం ఉత్తమం. * ఆకుపచ్చ రంగును బెడ్ రూమ్ లో వినియోగించడం మంచిది. చిన్నారుల గదుల్లో ఏర్పాటు చేయడం వల్ల వారి చదువుకు ఆటంకం లేకుండా ఉంటుంది. * పసుపు రంగు మెదడులో పాజి టివ్ రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఒత్తిడిలో ఉన్న వారికి ఈ రంగు ఔషదంగా పనిచేస్తుంది. * సంప్రదాయమైన రంగు తెలుపు. అందుకే పెళ్లిళ్లు, సంప్రదాయాలను ప్రతిబింబించే వివిధ అంశాలలో ఈ రంగును అధికంగా వినియోగిస్తుంటారు. సర్దుబాటుతో విశాలంగా! ఇంట్లో స్థలాన్ని ఎలాగూ పెంచలేం. అలాగనీ అవసరాలకు తగ్గట్టుగా ఫర్నిచర్‌ను మార్చుకోలేం కదా. అందుకే ఉన్నంతలో స్థలాన్ని సద్వినియోగం చేసుకుంటే సరి. * తలుపు తీయగానే పెద్ద పెద్ద వస్తువులు కన్పిస్తే.. ఇల్లు చిన్నదిగా కన్పిస్తుంది. అందుకే లివింగ్ రూమ్ ప్రవేశ ద్వారం ముందు పెద్ద మొత్తంలో ఫర్నిచర్ ఉండకుండా చూసుకోవాలి. మడిచిపెట్టడానికి అనువుగా ఉండే కుర్చీలు, టేబుళ్లు, సోఫా కమ్ బెడ్, బీన్ బ్యాగ్‌లు వంటివి అయితే మరీ మంచిది. * సోఫాలు, కుర్చీలన్నింటినీ ఒకే వరుసలో, గోడకు పక్కన ఏర్పాటు చేయకండి. సీట్లు ఒకదానికోటి ఎదురెదురుగా, కనీసం నాలుగు నుంచి ఆరడుగుల దూరంతో ఉంటే బావుంటుంది. ూ బరువుగా ఉండే ఫర్నిచర్ మొత్తాన్ని గదిలో ఒకే వైపు పెట్టొద్దు. ఇలా చేస్తే సీటింగ్ ఏర్పాటులో సమతుల్యతతో పాటూ వాస్తూ దెబ్బతింటుంది. భాగ్యనగరం.. విశ్వనగరంగా! ఇదంతా సరేగానీ అసలు హైదరాబాద్‌లో స్థిరాస్తిని ఎందుకు కొనుగోలు చేయాలి? బెంగళూరు, చెన్నై, ముంబై వంటి నగరాలను కాదని ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి ఏంటనే ప్రశ్న తలెత్తడం సహజం. అయితే గత కొంత కాలంగా ప్రపంచ దిగ్గజ కంపెనీలు అమెరికా తర్వాత ఇండియాలో తమ తొలి కేంద్రం ఏర్పాటుకు భాగ్యనగరాన్నే ఎంచుకుంటున్నాయి. అందులో కొన్ని.. * ప్రపంచ దిగ్గజ కంపెనీ యాపిల్.. అమెరికా తర్వాత తన తొలి కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకుంది. రూ.170 కోట్లతో వేవ్‌రాక్ సెజ్‌లో మ్యాప్స్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. * ఏడాదికి రూ.2.7 లక్షల కోట్ల అమ్మకాలు జరిపే స్వీడన్‌కు చెందిన గృహ ఫర్నిషింగ్ సంస్థ ఐకియా.. దేశంలోనే తొలి స్టోర్నూ ఇక్కడే ఏర్పాటు చేస్తోంది. ఐటీ హబ్‌కు చేరువలో రూ.20 కోట్లతో 13 ఎకరాల స్థలంలో స్టోర్‌ను నిర్మిస్తోంది కూడా. * ఈ-కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్లూ నగర శివార్లలో అతిపెద్ద గిడ్డంగిలు ఏర్పాటు చేస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్.. గుండ్లపోచంపల్లిలో 2.20 లక్షల చ.అ.ల్లో, అమెజాన్.. కొత్తూర్‌లో 2.80 లక్షల చ.అ.ల్లో ఈ గిడ్డంగులను ఏర్పాటు చేస్తున్నాయి. * అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ ఏర్పాటుకు గూగుల్ సిద్ధమైంది. రూ.1,000 కోట్లతో గచ్చిబౌలిలో 2 మిలియన్ చ.అ.ల్లో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. * అమెరికాకు చెందిన సేల్స్‌ఫోర్స్ ఐటీ కంపెనీ.. మాదాపూర్‌లో 2 లక్షల చ.అ.ల్లో ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తోంది. * చౌక విమానయాన సంస్థ ఫ్లై దుబాయ్.. శంషాబాద్ సమీపంలో రూ.100 కోట్లతో 15 వేల చ.అ.ల్లో ఇండియన్ డెవలప్మెంట్ సెంటర్‌ను (ఐడీసీ) ఏర్పాటు చేస్తోంది. * ఇవీ భాగ్యనగరం ప్రధాన కేంద్రంగా వివిధ కంపెనీలు ప్రకటించిన కార్యకలాపాలు. ఇవి చాలవూ హైదరాబాద్ విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేందుకు. ఇవే కాదు ఉబర్, డీఈ-షా, బ్లాక్‌స్టోన్, టాటా వంటి కంపెనీలనేకం నగరం వేదికగా కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి. -
ఆన్లైన్లో ప్రాపర్టీ షో!
వినూత్న సేవలతో మార్కెట్లోకి బిల్డ్‌ఈజీ.కామ్ * స్థిరాస్తి సమాచారమంతా ఒకే వేదికగా పొందే వీలు * ఇల్లు నుంచి ఇంట్లోని ఫర్నిచర్ దాకా.. * వాస్తు నుంచి ప్లంబింగ్ వర్క్ వరకూ.. బిల్డ్‌ఈజీ.కామ్‌లో సాక్షి, హైదరాబాద్: ఎంతో కష్టపడి.. పైసా పైసా కూడబెట్టి బైకో, కారో కొనాలంటేనే నలుగురిని సంప్రదిస్తాం. షాపింగ్ వెళ్లి దుస్తులు కొంటే మన శరీరానికి నప్పుతాయో లేవోనని ఒకటికి రెండు సార్లు ట్రయల్ వేసుకొని మరీ చూస్తాం... మరి జీవితకాలం నివాసముండే సొంతిల్లు ఎంపికంటే? ఒకట్రెండు ప్రాపర్టీ షోలకు వెళ్లో.. ఆన్లైన్లో సెర్చ్ చేసో నిర్ణయం తీసుకునే విషయమేమీ కాదు. మరె లా? ప్రతీదానికి ఆన్లైన్ కొనుగోళ్లు అలవాటైన ఈ రోజుల్లో ప్రాపర్టీని కూడా ఆన్లైన్లో కొనేస్తే! నేరుగా ఆన్లైన్లో ప్రాపర్టీ షోలో పాల్గొంటే!! అచ్చం ఇదే వ్యాపా ర సూత్రంగా మార్చుకుంది బిల్డ్‌ఈజీ.కామ్. వినూత్న సేవలతో త్వరలోనే మార్కెట్లోకి రానున్న ఈ సంస్థ మరిన్ని సేవలను బిల్డ్‌ఈజీ.కామ్ వ్యవస్థాపకులు రాంగోపాల్, లక్ష్మీనారాయణలు‘సాక్షి రియల్టీ’తో పంచుకున్నారు. ఫిజికల్‌గా ప్రాపర్టీ షో నిర్వహించడమంటే మామూలు విషయం కాదు. అటు నిర్వాహకులకు, ఇటు ఎగ్జిబిటర్లకూ ఎంతో వ్యయ, ప్రయాసలతో కూడుకున్న పని. నిర్వాహకుల విషయానికొస్తే.. లొకేషన్ ఎంపిక నుంచి స్టాల్ ఏర్పాటు, భోజన కార్యక్రమాలు, ఎగ్జిబిటర్లను ఒప్పించడం వరకు ప్రతీదీ పనే. ఇక ఎగ్జిబిటర్ల విషయానికొస్తే.. షో ఉన్నన్ని రోజులు ఉద్యోగుల డ్యూటీ నుంచి ప్రాజెక్ట్‌ల డిస్ప్లే, వాక్ త్రూ ఏర్పాట్లు, కరపత్రాలు, బ్రోచర్ల ప్రింట్లు, పంపిణీ, సందర్శకులను ఒప్పించడం వరకూ ప్రతీదీ కష్టంతో కూడుకున్నదే. * ఈ కష్టాలకు పరిష్కారం చూపించేదే ఆన్లైన్ ప్రాపర్టీ షో. బిల్డ్‌ఈజీ.కామ్‌తో ఆఫీసులోని కంప్యూటర్ ముందు కూర్చొని నేరుగా ఆన్లైన్లో ప్రాపర్టీ షోలో పాల్గొనొచ్చు. కస్టమర్ ఓకే అంటే అక్కడికక్కడే డీల్‌ను క్లోజ్ చేయొచ్చు కూడా. * ఆన్లైన్ ప్రాపర్టీ షోలో ఏముంటుందంటే.. ఎగ్జిబిటర్లకు సంబంధించిన సమాచారం, ప్రాజెక్ట్ వివరాలు, ఎలివేషన్, స్పెసిఫికేషన్స్, ఫ్లోర్ ప్లాన్, వసతులు, ప్రాజెక్ట్ ఏరియల్ వ్యూ, లొకేషన్, భవిష్యత్తు వృద్ధి వంటి వివరాలెన్నో ఉంటాయి. కస్టమర్ సమాచారం, ఫీడ్ బ్యాక్, ఫోన్ నంబర్ వంటి సమాచారాన్ని స్థిరాస్తి సంస్థలకు అందిస్తాం. * మరి ఆన్లైన్ ప్రాపర్టీ షోకు లీడ్స్‌ను ఎలా ఆకర్షిస్తామంటే.. కరపత్రాలు, పోస్టర్లు, పేపర్ ప్రకటనలు, హోర్డింగ్స్, ఆటో, బస్ క్యాంపెయిన్, ప్రసార మాధ్యమాల్లో డిస్ప్లే, స్క్రోలింగ్ యాడ్స్, డిజిటల్ మార్కెటింగ్, ఫేస్బుక్, ట్వీటర్, యూట్యూట్, లింక్డిన్ వంటి సామాజిక మాధ్యమాల, ఎస్ఎంఎస్, ఈ-మెయిల్, వాట్సప్ క్యాంపెయిన్ ద్వారా ప్రాపర్టీ షోకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తాం. * బిల్డ్‌ఈజీ.కామ్‌లో ప్రాపర్టీ షోనే కాకుండా స్థిరాస్తులకు సంబంధించిన సమస్త సమాచారం ఒకే వేదికగా పొందొచ్చు. అంటే స్థిరాస్తి కొనుగోళ్లు, అద్దెలు, లీజు, అర్కిటెక్ట్‌లు, నిర్మాణ సామగ్రి, గృహ రుణాలు, నిర్మాణ సంస్థలు, యాజమాన్యాలు, వాస్తు పండితులు, ఇంటీరియర్ డిజైనర్లు, ప్లంబర్, శానిటేషన్ నిపుణులు, పెయింటర్స్, అగ్నిమాపక నియంత్రణ నిపుణులు, కార్పెంటర్లు.. ఇలా నిర్మాణ రంగానికి సంబంధించిన సమాచారమంతా ఇక్కడుంటుందన్నమాట. * స్థిరాస్తి రంగంలో వస్తున్న నూతన ఒరవడి, సరికొత్త ట్రెండ్స్, ఆధునిక వసతులకు సంబంధించిన ఆర్టికల్స్, వార్తా కథనాలనూ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు కూడా. * కొనుగోలుదారులు, స్థిరాస్తి సంస్థలకు మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. అంటే వీరిద్దరి మధ్య వారధిగా నిలుస్తుందన్నమాట. * నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లు, గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్ట్‌లను నేరుగా ఆన్లైన్ ద్వారా ప్రాపర్టీ షో నిర్వహించి కొనుగోలుదారులకు మరింత చేరువ చేస్తుంది. * కొనుగోలుదారుల సొంతింటి కలను తీర్చేందుకు అవసరమైన గృహరుణాలనూ అందించేందుకు బ్యాంకింగ్ రంగంతోనూ ఒప్పందం చేసుకున్నాం. దీంతో ఆన్లైన్లోనే అప్పటికప్పుడే లోన్ విధానాన్ని పూర్తి చేయవచ్చు కూడా. * బిల్డ్‌ఈజీ.కామ్ స్టార్టప్ మాతృ సంస్థ గ్రాఫిక్స్ ఇన్ఫర్మేటిక్స్. వెబ్ డెవలప్మెంట్, మల్టిమీడియా, ప్రింట్ విభాగాల్లో జేఎన్టీయూ దగ్గర్లో 2005లో కార్యాలయాన్ని ప్రారంభించి సేవలందిస్తుందీ సంస్థ. బిల్డ్‌ఈజీ.కామ్ సేవలు రెండు రకాలు.. 1. ప్రీమియర్ పార్టిసిపెంట్ 2. ప్రైమ్ పార్టిసిపెంట్ * ప్రీమియర్ చార్జీ ఏడాదికి రూ.3.50 లక్షలు+ పన్నులు. * వీళ్లు చానల్ స్పాన్సర్‌గానూ కొనసాగుతారు. ఏడాది పాటు బిల్డ్‌ఈజీ.కామ్ సేవలను పొందొచ్చు. * ఆన్లైన్ ప్రాపర్టీ షోలో నిశ్చల స్థానం. లీడ్ డిస్ట్రిబ్యూషన్లో మొదటి స్థానం వీరిదే. * ప్రైమ్ పార్టిసిపెంట్ చార్జీ రూ.2.50 లక్షలు+ పన్నులు. * ఆన్లైన్ ప్రాపర్టీ షోలో రాండమ్ స్థానాన్ని పొందుతారు. మూడు నెలల పాటు సేవలు. * 50 శాతం నగదును ముందుగా చెల్లించాలి. మిగతా మొత్తాన్ని ప్రాపర్టీ షో ప్రారంభ తేదీ కంటే వారం ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. -
2 నుంచి ‘సాక్షి’ ప్రాపర్టీ షో
♦ మాదాపూర్‌లోని హోటల్ ఆవాసాలో ♦ భారీగా పాల్గొంటున్న రియల్టీ సంస్థలు హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ ఊపందుకుంటున్న ప్రస్తుత తరుణంలో నగర వాసుల సొంతింటి కలను సాకారం చేసేందుకు... రియల్టీ సంస్థల్ని ఒకేవేదిక మీదికి తెస్తూ ‘సాక్షి’ మరోసారి ప్రాపర్టీ షో నిర్వహిస్తోంది. వచ్చేనెల 2, 3 తేదీల్లో (శని, ఆదివారాల్లో) మాదాపూర్‌లోని హోటల్ ఆవాసాలో ఈ షోను నిర్వహిస్తోంది. పలు రియల్టీ సంస్థలతో పాటు బ్యాంకులు, ఇంటీరియర్ సంస్థలు ఈ షోలో పాల్గొంటున్నాయి. వివరాలు తెలుసుకోవటంతో పాటు... నచ్చినవారు అక్కడికక్కడే ఇల్లు, ప్లాట్ లే దా ఫ్లాట్‌ను బుక్ చేసుకునే అవకాశముంది. ఈ షోకు ప్రధాన స్పాన్సర్‌గా ఇప్పటికే నగరంలో పలు ప్రాజెక్టులు పూర్తిచేసిన అపర్ణా కన్స్ట్రక్షన్స్ వ్యవహరిస్తోంది. అనుబంధ స్పాన్సర్లుగా ప్రధాన రియల్టీ సంస్థలు ఎస్ఎంఆర్ బిల్డర్స్, ఆదిత్యా కన్స్ట్రక్షన్స్, ప్రావిడెంట్ హౌసింగ్, సహ స్పాన్సర్లుగా రాంకీ ఎస్టేట్స్, సైబర్‌సిటీ బిల్డర్స్, మ్యాక్ ప్రాజెక్ట్స్ వ్యవహరిస్తున్నాయి. ఎన్సీసీ అర్బన్, జనప్రియ ఇంజనీర్స్, శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్, ఏక్సాన్ హౌసింగ్, నార్త్‌స్టార్ హోమ్స్, మంజీరా కన్స్ట్రక్షన్స్, యాక్యురేట్ డెవలపర్స్, మహీంద్రా లైఫ్‌స్పేస్, సాకేత్ ఇంజనీర్స్, ప్రణీత్ గ్రూప్, గ్రీన్‌హోమ్, ఆర్క్ అండ్ టెర్మినస్ ఇన్ఫ్రా తదితర సంస్థలు పాల్గొంటున్నాయి. గృహ రుణాలు, వడ్డీ గురించి వివరించేందుకు పలు బ్యాంకులు కూడా ఈ షోలో అందుబాటులో ఉంటాయి. -
ఏప్రిల్ 2, 3 తేదీల్లో సాక్షి ప్రాపర్టీ షో
గచ్చిబౌలిలోని హోటల్ ఆవాసాలో.. సాక్షి, హైదరాబాద్: నగరవాసుల సొంతింటి కలను సాకారం చేసేందుకు సాక్షి మరో సదవకాశాన్ని కల్పిస్తోంది. గత ప్రాపర్టీ షో స్పందనకు అపూర్వ స్పందన రావడంతో మళ్లీ నిర్వహించేందుకు ముందుకొచ్చింది. అయితే ఈసారి ఏప్రిల్ 2, 3 తేదీల్లో గచ్చిబౌలిలోని హోటల్ ఆవాసాలో ప్రాపర్టీ షోను నిర్వహించాలని నిర్ణయించారు. నగరానికి చెందిన వందలాది స్థిరాస్తి సంస్థలు, బ్యాంకులు, ఇంటీరియర్ సంస్థలు ఈ షోలో పాల్గొంటాయి. నగరంలో విస్తరించిన తమ ప్రాజెక్ట్‌లు, వెంచర్ల, లే-అవుట్ల గురించి స్టాళ్లను ఏర్పాటు చేసి సందర్శకులకు వివరిస్తారు. నచ్చితే అక్కడిక్కడే బుకింగ్ చేసుకునే వీలు కూడా ఉంటుంది. గృహ రుణాలు, వడ్డీల గురించి వివరించేందుకు బ్యాంకులు కూడా పాల్గొంటాయి. ఫర్నిచర్, ఇంటీరియర్ డిజైన్ సంస్థలూ తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. స్టాళ్లను బుకింగ్ చేయాలనుకునేవారు 99122 20380, 99516 03004 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. -
నేడు,రేపు సాక్షి ’ప్రాపర్టీ షో’
-
నేడు, రేపు ‘సాక్షి’ ప్రాపర్టీ షో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నగరంలో సొంతిల్లు ఉండాలనుకునే వారి కోసం ‘సాక్షి’ సదవకాశాన్ని కల్పిస్తోంది. శని, ఆది వారాల్లో బంజారాహిల్స్ రోడ్ నం.1లోని హోటల్ తాజ్‌కృష్ణలో ఉ. 10 గంటలకు ‘ప్రాపర్టీ షో’ నిర్వహించనుంది. తెలంగాణ రాష్టం ఏర్పడి.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘సాక్షి’ ఆధ్వర్యంలో జరుగుతున్న తొలి ప్రాపర్టీ షో ఇదే. అపర్ణ కన్స్ట్రక్షన్స్ మెయిన్ స్పాన్సర్‌గా, ఆదిత్య కన్స్ట్రక్షన్స్ అసోసియేట్ స్పాన్సర్‌గా, హిల్ కౌంటీ ప్రాపర్టీస్, సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, సిరి సంపద ఫామ్స్ అండ్ ఎస్టేట్స్ కో- స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఈ ప్రదర్శనలో నగరంలోని పలు నిర్మాణ సంస్థలు తమ ఫ్లాట్లు, ప్లాట్లు, విల్లాలు, ఇండివిడ్యువల్ హౌస్‌ల నమూనాలను ప్రదర్శించనున్నాయి. -
సాక్షి ప్రోపర్టీ షో 8th June 2014
-
ముగిసిన ప్రాపర్టీ షో
ఖైరతాబాద్, న్యూస్‌లైన్: జలవిహార్‌లో గత మూడు రోజులుగా కాన్పెడరేషన్ ఆఫ్ రియలెస్టేట్ డెవలఫ్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో ఆదివారంతో ముగిసింది. దాదాపు వంద స్టాళ్ళల్లో డెవలఫర్స్ వివిధ రకాల ప్రాపర్టీ షోలను ప్రదర్శించారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం రాష్ట్ర విభజన - అభివృద్ది అనే అంశంపై చర్చా వేదికను నిర్వహించారు. చర్చా వేదికలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న మెట్రో రైల్ ఎండీ ఎన్.వి.ఎస్. రెడ్డి మాట్లాడుతూ విభజన నేపద్యంలో రాజకీయాలను పక్కన పెట్టి, అభివృద్దిపై దృష్టి సారించాలన్నారు. మెట్రోకు ముందు తర్వాత నగరం ఎంతో అభివృద్ది పథంలో ముందుకు వెళ్తుందన్నారు. హైదరాబాద్ మెట్రోరైల్ నా కళ అన్నారు. విభజన నేపద్యంలో రాబోయే రోజుల్లో విజయవాడ, విశాఖపట్నంలలో మెట్రో రైల్ ఏర్పాటు విషయంపై అడిగిన ప్రశ్నకు ఇంకా కొంత సమయం పడుతుందన్నారు. ఐటి రంగ నిపుణులు మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఐటి రంగం నగరంలో ఎంతో అభివృద్దిం చెందిందని, అయితే విభజన వల్ల దీనిపై కొంత ప్రభావం ఉంటుందన్నారు. నగరంలో మౌళిక వసతులు, వాతావరణం అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉండటం వల్ల అభివృద్ది వేగంగా జరిగిందన్నారు. రాబోయే ప్రభుత్వం నిజాయితిగా వ్యవహరిస్తే అదే స్థాయిలో ఐటి రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళేందుకు అవకాశముంటుందన్నారు. అనంతరం జె.ఏ చౌదరి మాట్లాడుతూ ప్రపంచంలోనే హైదరాబాద్ నగరం ప్రత్యేక నంగరంగా గుర్తింపు ఉందన్నారు. సాఫ్ట్ వేర్ రంగంతో పాటు హార్ట్ వేర్ రంగాన్ని అంతే వేగంగా అభివృద్ది చేయగలిగితే చైనాను మించిన నగరంగా మనం ముందుకు వెళ్ళవచ్చన్నారు. అడ్వకేట్ ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల వారిని ఆహ్వానించే గొప్ప చరిత్ర హైదరాబాద్ నగరానికి ఉందన్నారు. ఆంధ్రాలో కూడా అభివృద్దికి పూర్తి అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ ఈ చర్చావేదికలో పాత్రికేయులు వసంత్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
ప్రాపర్టీ ప్లస్ 2nd july 2013