
సాక్షి, హైదరాబాద్: ఆన్‌లైన్ రియల్టీ వెబ్‌పోర్టల్ రూఫ్‌అండ్‌ఫ్లోర్.కామ్ ప్రాపర్టీ షోతో నగరవాసుల ముందుకొచ్చింది. హైటెక్‌సిటీలోని మేదాన్ ఎక్స్‌పో సెంటర్‌లో జూన్ 24, 25 తేదీల్లో నిర్వహించనుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రదర్శన అందుబాటులో ఉంటుంది. ప్రవేశం ఉచితం.
ఈ ప్రాపర్టీ షో ద్వారా గృహ కొనుగోలుదారులను, డెవలపర్లను అనుసంధానించే సరైన వేదికని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. అపర్ణ కన్‌స్ట్రక్షన్స్, వాసవి గ్రూప్, శేత్రా ఫామ్స్, సెన్సేషన్ ఇన్‌ఫ్రాకాన్, జీ స్క్వేర్, రిధిరా లైఫ్ స్పేసెస్, ఎన్‌సీసీ అర్బన్, శిల్పా ఇన్‌ఫ్రా, జీకే బిల్డర్స్, ప్రణీత్ గ్రూప్, శాంతా శ్రీరాం, వజ్ర, గోల్డెన్‌కీ ప్రైమ్ ప్రాపర్టీస్‌తో పాటు కెనరా బ్యాంక్ ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment