సాక్షి, హైదరాబాద్: నవంబర్ 2 నుంచి 4 తేదీల్లో తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా)9వ ప్రాపర్టీ షో జరుగనుంది. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరగనున్న ఈ ప్రదర్శనలో 100కు పైగా నిర్మాణ సంస్థలు, 11 బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు, 15 నిర్మాణ సామగ్రి, ఇంటీరియర్ సంస్థలు పాల్గొంటున్నాయి. ప్రవేశం ఉచితం. ఈ షోకు ప్లాటినం స్పాన్సర్‌గా వాసవి గ్రూప్, గోల్డ్ స్పాన్సర్‌గా అపర్ణా కన్‌స్ట్రక్షన్స్, మై హోమ్ గ్రూప్, సిల్వర్ స్పాన్సర్‌గా గ్రీన్ రిచ్ ఎస్టేట్స్, హాల్‌మార్క్ బిల్డర్స్, హాల్ స్పాన్సర్‌గా సైబర్‌సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, రాంకీ ఎస్టేట్స్ వ్యవహరిస్తున్నాయి.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రెడా ప్రెసిడెంట్ పీ రవీందర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం వేగవంతమైన నగరంతో పాటూ శివారు, దూర ప్రాంతాల్లోనూ రహదారులు, మౌలిక వసతులను అభివృద్ధి చేయడంతో ఆయా ప్రాంతాలన్నీ అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. దీంతో నివాస, వాణిజ్య సముదాయాలకు డిమాండ్ పెరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రెడా ట్రెజరర్ కే శ్రీధర్ రెడ్డి, సెక్రటరీ జనరల్ సునీల్ చంద్రా రెడ్డి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్స్ ఆర్ చలపతి రావు, విజయ్‌సాయి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment