Telangana Real Estate Developers Association
-
వెలవెలబోయిన ట్రెడా ప్రాపర్టీ షో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) ప్రాపర్టీ షో నిరుత్సాహంగా మొదలైంది. ఇప్పటివరకు ట్రెడా 10 ప్రాపర్టీ షోలు జరిగాయి. ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా ఓ సినీ నటుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రాపర్టీ షోను ప్రారంభించారు. సాధారణం గా ఏ డెవలపర్ల సంఘం ప్రాప ర్టీ షో నిర్వహించినా నిర్మాణ రంగానికి సంబంధించిన మంత్రులనో లేదా ప్రభుత్వ అధికారులనో ముఖ్య అతిథిగా హాజరవటం ఆనవాయితీ. కానీ, ట్రెడా ఈ ఆనవాయితీని పాటించలేదు. సదరు నిర్వాహకులు ప్రభుత్వాధికారులు లేదా రాజకీయ నేతలను ముఖ్య అతిథిగా ఆహ్వానించగా.. ఎవరూ సరిగా స్పందించలేదని ట్రెడా సభ్యుడు ఒకరు తెలిపారు. నిర్మాణ సంస్థలు, బ్యాంక్‌లు కలిపి మొత్తం 105 స్టాల్స్‌ను ఏర్పాటు చేయగా.. ఇందులో 20–25 కంపెనీలు మినహా మిగిలిన స్టాల్స్ అన్నీ చిన్నా చితక నిర్మాణ సంస్థలకు చెందినవే. ఎక్కువగా ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన స్టాల్సే. చాలా వరకు స్టాళ్లు ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చాయి. ప్రతి ఏటా అక్టోబర్–నవంబర్ మధ్య కాలంలో ట్రెడా ప్రాపర్టీ షో నిర్వహించాలి కాబట్టి ఏదో మొక్కుబడిగా నిర్వహించినట్లు కనిపించింది. తొలి రోజు పైగా వర్కింగ్ డే కాబట్టి పెద్దగా సందర్శకులు రాలేదని.. శని, ఆది వారాలు సెలవు రోజులు కావటంతో సందర్శకులు వచ్చే అవకాశం ఉందని ఓ స్టాల్ నిర్వాహకుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రదర్శనలో అనుమతులు లేని ప్రాజెక్ట్‌లు కూడా.. నిర్మాణ అనుమతులు రాని ప్రాజెక్ట్‌లు, భవిష్యత్తులో నిర్మించబోయే ప్రాజెక్ట్‌లకు సంబంధించిన కరపత్రాలు, హోల్డింగ్స్ ప్రదర్శిస్తూ ట్రెడా ప్రాపర్టీ షోలో స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. రెరా నిబంధనల ప్రకారం రెరా అనుమతి తీసుకోకుండా ప్రాజెక్ట్‌లను ప్రకటనలు చేయడం, ప్రదర్శించడం నేరం. కానీ నిర్వాహకులు ఇవేవి పట్టించుకోలేదు. పైగా ఆయా స్టాళ్ల వద్దకు వచ్చిన సందర్శకులతో ‘త్వరలోనే ప్రాజెక్ట్‌ను లాంచింగ్ చేయనున్నాం. ఇప్పుడే కొనుగోలు చేస్తే ధర తక్కువకు వస్తుందని ప్రీలాంచ్లో బుకింగ్ చేసుకోండని’ సదరు నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసిన స్టాల్ నిర్వాహకులు చెబుతున్నారు. యూడీఎస్ విధానంలో ఫ్లాట్లను విక్రయిస్తున్న ఓ కంపెనీ ఏకంగా స్పాన్సర్లలో ఒకటిగా నిలిచింది. సందర్శకులను ఆకట్టుకునేలా ఆకర్షణీయంగా స్టాల్‌ను ఏర్పాటు చేయడం గమనార్హం. -
ప్రారంభమైన ట్రెడా ప్రాపర్టీ షో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) 9వ ప్రాపర్టీ షో శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా పాల్గొన్న చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి మాట్లాడుతూ.. తెలంగాణలో 2008–14 మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొందని.. కానీ, గత నాలుగేళ్లుగా ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయాలు, రాయితీలు, ప్రోత్సాహకాలతో రియల్టీ రంగానికి మళ్లీ మంచి రోజులొచ్చాయని గుర్తు చేశారు. నగరానికి ఐటీ, ఇతర రంగాల్లో అంతర్జాతీయ కంపెనీలు రావటం, ఉన్న కంపెనీలు విస్తరణ కార్యకలాపాలు చేపట్టడంతో ఆఫీసు స్పేస్‌కే కాకుండా గృహాలకు కూడా డిమాండ్ పెరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ బీఈ పాపారావు, ట్రెడా ప్రెసిడెంట్ పీ రవీందర్ రావు, ట్రెజరర్ శ్రీధర్ రెడ్డి కే, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ సాయి ఎం, సెక్రటరీ జనరల్ సునీల్ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేడు, రేపు కూడా.. మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరుగుతున్న ఈ ప్రాపర్టీ షో శని, ఆదివారాల్లోనూ అందుబాటులో ఉంటుంది. ప్రవేశం ఉచితం. ఇందులో నగరానికి చెందిన వందకు పైగా నిర్మాణ సంస్థలు 145 స్టాళ్లను ఏర్పాటు చేసి ప్రాజెక్ట్‌లను, వెంచర్లను ప్రదర్శించాయి. ఈ షోలో 11 బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు, 15 నిర్మాణ సామగ్రి, ఇంటరీయర్ కంపెనీలు ఆయా ఉత్పత్తుల, ఆఫర్లను ప్రదర్శించాయి. ట్రెడా 9వ ప్రాపర్టీ షోకు వాసవి గ్రూప్, అపర్ణా, మై హోమ్, గ్రీన్ రిచ్ ఎస్టేట్స్, హోల్‌మార్క్ బిల్డర్స్, సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, రాంకీ ఎస్టేట్స్ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి. రెయిన్బో విస్టాస్‌కు ఐజీబీసీ అవార్డు సాక్షి, హైదరాబాద్: సైబర్‌సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ నిర్మిస్తున్న రెయిన్బో విస్టాస్ రాక్ గార్డెన్ ప్రాజెక్ట్‌ను ఐజీబీసీ గ్రీన్ హోమ్స్ అవార్డు వరించింది. హెచ్ఐసీసీలో జరుగుతున్న ఐజీబీసీ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్–2018లో ఈ అవార్డును కంపెనీ ఎండీ వేణు వినోద్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐజీబీసీ హైదరాబాద్ ప్రెసిడెంట్ సీ శేఖర్ రెడ్డి, వరల్డ్ జీబీసీ మాజీ చైర్మన్ టై లీ, ఏపీ–రెరా చైర్మన్ రామనాథన్, టీ–రెరా చైర్మన్ రాజేశ్వర్ తివారీ పాల్గొన్నారు. రెయిన్బో విస్టాస్ మూసాపేట్లో 45 లక్షల చ.అ.ల్లో 2,500 గృహాలతో ఉంటుంది. -
నవంబర్ 2 నుంచి ట్రెడా ప్రాపర్టీ షో
సాక్షి, హైదరాబాద్: నవంబర్ 2 నుంచి 4 తేదీల్లో తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా)9వ ప్రాపర్టీ షో జరుగనుంది. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరగనున్న ఈ ప్రదర్శనలో 100కు పైగా నిర్మాణ సంస్థలు, 11 బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు, 15 నిర్మాణ సామగ్రి, ఇంటీరియర్ సంస్థలు పాల్గొంటున్నాయి. ప్రవేశం ఉచితం. ఈ షోకు ప్లాటినం స్పాన్సర్‌గా వాసవి గ్రూప్, గోల్డ్ స్పాన్సర్‌గా అపర్ణా కన్స్ట్రక్షన్స్, మై హోమ్ గ్రూప్, సిల్వర్ స్పాన్సర్‌గా గ్రీన్ రిచ్ ఎస్టేట్స్, హాల్‌మార్క్ బిల్డర్స్, హాల్ స్పాన్సర్‌గా సైబర్‌సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, రాంకీ ఎస్టేట్స్ వ్యవహరిస్తున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రెడా ప్రెసిడెంట్ పీ రవీందర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం వేగవంతమైన నగరంతో పాటూ శివారు, దూర ప్రాంతాల్లోనూ రహదారులు, మౌలిక వసతులను అభివృద్ధి చేయడంతో ఆయా ప్రాంతాలన్నీ అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. దీంతో నివాస, వాణిజ్య సముదాయాలకు డిమాండ్ పెరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రెడా ట్రెజరర్ కే శ్రీధర్ రెడ్డి, సెక్రటరీ జనరల్ సునీల్ చంద్రా రెడ్డి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్స్ ఆర్ చలపతి రావు, విజయ్‌సాయి పాల్గొన్నారు. -
180 స్టాళ్లతో.. ట్రెడా ప్రాపర్టీ షో షురూ!
హైదరాబాద్: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 180 స్టాళ్ల ద్వారా తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) స్థిరాస్తి ప్రదర్శన ప్రారంభమైంది. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ప్రారంభమైన ఈ ప్రదర్శనను మంత్రులు జూపల్లి కృష్ణారావు, మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ‘‘టీఎస్ ఐపాస్ తరహాలోనే నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక పాలసీని తీసుకురానున్నట్లు చెప్పారు. దీంతో దేశ, విదేశాలకు చెందిన స్థిరాస్తి సంస్థలకు నగరానికి క్యూ కడతాయని పేర్కొన్నారు. టీఎస్ ఐపాస్ వచ్చాక 15 రోజుల్లో ఫార్మా, తయారీ వంటి సుమారు 250 పరిశ్రమలకు అనుమతులిచ్చామని ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. వివిధ దేశాలకు చెందిన ప్రముఖ ఐటీ కంపెనీలు హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయని.. ఇప్పటికే ఉన్న కంపెనీలు విస్తరణ బాట పట్టనున్నాయని చెప్పారు. దీంతో వచ్చే రెండేళ్లలో హైటెక్ సిటీ ప్రాంతంలో 10 లక్షల ఉద్యోగాలు రానున్నాయని పేర్కొన్నారు. చైనాలో నిర్మాణ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగిస్తారని.. అందుకే అక్కడ వంద అంతస్తుల భవంతిని కేవలం 6 నెలల్లోనే నిర్మించడం సాధ్యమవుతుందన్నారు. అలాంటి నిర్మాణాలు, ఆధునికత భాగ్యనగర నిర్మాణ సంస్థలు చేపట్టాలని సూచించారు. అప్పుడే నగర నిర్మాణ రంగానికి అంతర్జాతీయ స్థాయిలో పేరొస్తుందని తెలిపారు. ఇందులో నగరానికి చెందిన స్థిరాస్తి సంస్థలతో పాటుగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఆర్కిటెక్చర్లు వంటి వారెందరూ పాల్గొన్నారు. నేడు, రేపు కూడా అందుబాటులో ఉంటుంది. 9-10 శాతం ధరలు పెరుగుతాయ్ ప్రస్తుతం నగర స్థిరాస్తి సంస్థలు నాలా పన్ను, ఇంపాక్ట్ ఫీజు, సీనరేజ్ చార్జీలు, పరిపాలన పరమైన సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ విషయమై పలుమార్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాం. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. టీఎస్-ఐపాస్ తరహాలోనే నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక పాలసీని రూపొందించనున్నట్లు సమాచారం. నాలుగేళ్లుగా నగర నిర్మాణ రంగం తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొన్న విషయం వాస్తవమే. కానీ, తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు.. ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ధి చర్యలు, ప్రోత్సాహకరమైన పాలసీలతో స్థిరాస్తి రంగం మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందని నమ్మకం ఉంది. రాష్ట్రంలో నిర్మాణ రంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఫలితంగా వచ్చే ఏడాదిలో హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 9-10 శాతం మేర పెరుగుతాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కొంత మంది బిల్డర్లు 5 శాతం వరకు స్థిరాస్తి ధరలను పెంచేశారు కూడా. - ట్రెడా అధ్యక్షుడు పి. దశరథ్‌రెడ్డి -
ట్రెడాకు కొత్త కార్యవర్గం
హైదరాబాద్: తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) కొత్త కార్యవర్గం ఎన్నికైంది. గురువారమిక్కడ జరిగిన 19వ వార్షిక జనరల్ బాడీ సమావేశంలో ట్రెడా అధ్యక్షుడిగా పీ దశరథ్ రెడ్డి ఎంపికైనట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఈయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. అలాగే చలపతిరావు, సునీల్ చంద్రారెడ్డిలు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్స్‌గా, విజయసాయి రెడ్డి సెక్రటరీ జనరల్‌గా, కే గోపాలకృష్ణ ట్రెజరర్‌గా నియమితులయ్యారు. -
ట్రెడా షో ప్రారంభం
నేడు, రేపు కూడా అందుబాటులో సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో స్థిరాస్తి కొనుగోలు అంటే మామూలు విషయం కాదు. స్థలం కొనుగోలు నుంచి అందమైన ఇల్లు కట్టుకునే వరకు అన్నీ దగ్గరుండి చూసుకోవాలనుకుంటారు. దీని కోసం ఎక్కడెక్కడో తిరిగి వివరాలు సేకరించే సమస్య లేకుండా అన్ని వివరాలు ఒకే చోట లభ్యమయ్యేలా తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) అవకాశం కల్పిస్తోంది. మూడు రోజుల ప్రాపర్టీ షో మాదాపూర్‌లోని హైటెక్స్ ప్రాంగణంలో శుక్రవారం ప్రారంభమైంది. ప్రదర్శనలో 180 స్టాళ్లు: నగదు పొదుపు నుంచి బ్యాంకులు అందించే రుణ సదుపాయాల వరకు అన్నింటి సమాచారం ఈ షో అందిస్తుంది. రియల్టర్లను, డెవలపర్లను, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి కొనుగోలుదారులకు నాణ్యమైన ఇళ్లను అందించడమే ఈ ప్రాపర్టీ షో లక్ష్యమని ట్రెడా అధ్యక్షులు దశ్థ్ర్రెడ్డి చెప్పారు. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, మెటీరియల్ తయారీదారులు, ఇంటీరియర్ డిజైనర్లు, బ్యాంకులు వంటి ఎన్నో సంస్థలు పాల్గొనే ఈ ప్రాపర్టీషోలో డెవలపర్లు 180 స్టాళ్ల ద్వారా వారి వారి ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఇప్పటికే 40 వేల సందర్శకులు వారి పేర్లను నమోదుచేసుకున్నారు. ప్రవేశం ఉచితం. ఈ అవకాశాన్ని నగరవాసులతోపాటు, ప్రవాసాంధ్రులు, నగరంలో నివసిస్తున్న ఇతర జిల్లాల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. లక్కీ డిప్ విజేతగా ఆర్. మహేష్ (కూపన్ నంబర్: 35476) మారుతీ ఆల్టో కారును గెలుచుకున్నాడు. ఇంటి శోభ: ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడానికి ఇటీవల అందరూ ప్రాధాన్యం ఇస్తున్నారు. దీని కోసం ఆర్కిటెక్చర్లపైన ఆధారపడుతున్నారు. అందమైన ఏవియేషన్ ఆపై చక్కని గాలి వెలుతురు వచ్చేలా ఇంటి డిజైన్ రూపొందించడంలో ఆర్కిటెక్చర్లదే ప్రధాన పాత్ర. దీనికోసం స్థిరాస్తి వ్యాపారులు ఆర్కిటెక్చర్లతో అపార్ట్మెంట్లు, డ్యూప్లెక్స్ నిర్మాణాలు, విల్లాలకు డిజైన్లు చేయిస్తున్నారు. మదిని దోచే ముచ్చటైన రూపాలను అందరికీ అందుబాటులోకి తెస్తున్నారు.