మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో.. ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు, ఇండిపెండెంట్ హౌజ్‌లన్నీ ఒకే చోట
‘‘సార్.. సొంతింటి ప్రయత్నం ఎంతవరకు వచ్చింది?’’ ఇలా అడగ్గానే చాలా మంది చెప్పే సమాధానం.. ‘ఏం చెప్పమంటారండి. నా బడ్జెట్‌లో ఇల్లు దొరకడం లేదనే’! ఇల్లు నచ్చితే ధర ఎక్కువని.. ధర కుదిరితే ప్రాంతం బాగోలేదని ఏళ్ల తరబడి సొంతింటి అన్వేషణ కొనసాగుతూనే ఉంటారు మనలో చాలా మంది. లేకపోతే ఏదో ఒకదానికి రాజీ పడుతుంటారు. మీ బడ్జెట్‌లో ఇంటి ఎంపికను సులభతరం చేసేందుకు సాక్షి ప్రాపర్టీ షో మరోసారి మీ ముందుకొచ్చింది. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో చేపట్టిన ప్రముఖ నిర్మాణ సంస్థల ప్రాజెక్ట్‌లను కొనుగోలుదారులకు చేరువ చేసి.. సొంతింటి అన్వేషణను ఈజీ చేయడమే ఈ షో ప్రధాన ఉద్దేశం.
సాక్షి, హైదరాబాద్ : నగరానికి చెందిన 25 ప్రముఖ నిర్మాణ సంస్థలు.. 36 స్టాళ్లన ఏర్పాటు చేస్తున్నాయి. వీటిల్లో నగరం నలుమూలల వెంచర్లు, వ్యక్తిగత గృహాలు, విల్లాలు, అపార్ట్‌మెంట్లు, కార్యాలయ సముదాయాల వివరాలను అందుబాటులో ఉంచుతాయి. ఎస్‌బీఐ బ్యాంక్ గృహ రుణం కోసం దరఖాస్తు చేసిన వారికి ప్రాసెసింగ్ ఫీజు లేకుండా రుణాలను మంజూరు చేస్తుంది. సిరి సంపద హోమ్స్ ప్రతి రోజు బంపర్ డ్రా కూడా ఉంటుంది. మరెందుకు ఆలస్యం? కుటుంబ సమేతంగా విచ్చేసి అన్ని విధాల నప్పే ఇంటిని ఆనందంగా ఎంచుకోండి!
స్థిరమైన అభివృద్ధి ఉన్న వైపే..
మెరుగైన రవాణా సదుపాయాలు, విద్యా, వైద్యం, వినోద కేంద్రాలున్న ప్రాంతాల్లోనే కొనుగోళ్లకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. నిర్మాణ సంస్థలూ అలాంటి ప్రాజెక్ట్‌లకే శ్రీకారం చుడుతున్నాయి. మరోవైపు చెన్నై, బెంగళూరు వంటి ఇతర మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో నేటికీ ఇళ్ల ధరలు అందుబాటులోనే ఉన్నాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాం తాల్లో ఫ్లాట్ల రేట్లు పెరిగినప్పటికీ హైదరాబాద్‌లో నేటికీ తక్కువకే దొరుకుతున్నాయి. జిమ్, క్లబ్‌హౌజ్, స్విమ్మింగ్‌పూల్ వంటి ఆధునిక సదుపాయాలు గల గేటెడ్ కమ్యూనిటీల్లో బిల్డర్లు చెబుతోన్న రేట్లు బేరీజు వేశాక కొనుగోలుదారులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సొంతింటిని కొంటున్నారు. భవిష్యత్తులో ఇంతకంటే తక్కువ ధరకు దొరకుతాయన్న నమ్మకం లేదు కాబట్టి సొంతింటి కల సాకారానికి ఇదే సరైన సమయమని డెవలపర్లు చెబుతున్నారు.
పాల్గొనే సంస్థలివే..
మెయిన్ స్పాన్సర్: అపర్ణా కన్‌స్ట్రక్షన్స్
అసోసియేట్ స్పాన్సర్స్: ఆదిత్య కన్‌స్ట్రక్షన్, రాంకీ గ్రూప్
కో–స్పాన్సర్: విర్టుసా లైఫ్ స్పేసెస్
పాల్గొనే సంస్థలు: సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్, సాకేత్ ఇంజనీర్స్, ఏఆర్కే టెర్మినస్ ఇన్‌ఫ్రా, మంజీరా, మ్యాక్ ప్రాజెక్ట్స్, ఫార్చ్యూన్ బటర్‌ఫ్లై సిటీ, గ్రీన్ హోమ్, ఆర్వీ నిర్మాణ్ ప్రై.లి., అమృత ప్రాజెక్ట్స్, ఆక్సాన్ హౌజింగ్, అయ్యన్న బిల్డర్స్ అండ్ డెవలపర్స్, సార్క్ ప్రాజెక్ట్స్, జెమ్ వివెండాస్, ముప్ప ప్రాజెక్ట్స్, అక్యురేట్ డెవలపర్స్, కార్పొరేట్ వెంచర్స్, ఐబీ డెవలపర్స్, స్పేస్ విజన్ గ్రూప్, వర్ధన్ డెవలపర్స్, ఎస్‌బీఐ బ్యాంక్
ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు: ప్రవేశం ఉచితం
సాక్షి ప్రాపర్టీ షో నేడే!
Published Sat, Sep 2 2017 2:43 AM | Last Updated on Tue, Sep 4 2018 5:29 PM
Advertisement
Advertisement