
సాక్షి, హైదరాబాద్ : సామాన్య, మధ్య తరగతి వర్గాలకు ఇళ్లు, ప్లాట్లు అందించాలనే ఉద్ధేశ్యంతో హైదరాబాద్ కూకట్‌పల్లిలోని భ్రమరాంబా మల్లికార్జున ఫంక్షన్‌హాల్‌లో సాక్షి టీవీ ప్రత్యేకంగా ప్రాపర్టీ షో 2020 నిర్వహిస్తోంది. క్రెడాయ్ తెలంగాణ చైర్మన్ గుమ్మిరాంరెడ్డి, ప్రెసిడెంట్ ఆర్వీ రామచంద్రారెడ్డి, కెనరా బ్యాంక్ హైదరాబాద్ సర్కిల్ జీఎం వీరభద్రారెడ్డిలు హాజరై ప్రాపర్టీ షోను ప్రారంభించారు.దాదాపుగా 30మంది డెవలపర్స్, బిల్డర్స్ ఈ ప్రదర్శనలో తమ ప్రాపర్టీలను ప్రదర్శనకు ఉంచారు.
ప్లాట్ కానీ ఇళ్ళు కానీ సెలక్ట్ చేసుకున్న వెంటనే వారికి తగిన రుణం ఇచ్చే విధంగా ప్రత్యేకంగా కెనరా బ్యాంక్ స్టాల్‌ను కూడా ఏర్పాటు చేసింది. అంతేకాదు తొలిసారి ప్రాపర్టీ ఎక్స్ పోలో ఈఎమ్‌ఐల ద్వారా ప్లాట్లు విక్రయించే బృహత్తర కార్యక్రమాన్ని సైతం సాక్షిటివి ఎక్స్‌పో కల్పిస్తోంది. రెండు రోజుల పాటు ప్రాపర్టీ షో కొనసాగుతుంది. కేవలం రియల్ ఎస్టేట్ సంస్ధలే కాదు ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ డిజైన్స్ సంస్ధలు కూడా ఎక్స్‌పోలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment