
2 నుంచి ‘సాక్షి’ ప్రాపర్టీ షో
♦ మాదాపూర్‌లోని హోటల్ ఆవాసాలో
♦ భారీగా పాల్గొంటున్న రియల్టీ సంస్థలు
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ ఊపందుకుంటున్న ప్రస్తుత తరుణంలో నగర వాసుల సొంతింటి కలను సాకారం చేసేందుకు... రియల్టీ సంస్థల్ని ఒకేవేదిక మీదికి తెస్తూ ‘సాక్షి’ మరోసారి ప్రాపర్టీ షో నిర్వహిస్తోంది. వచ్చేనెల 2, 3 తేదీల్లో (శని, ఆదివారాల్లో) మాదాపూర్‌లోని హోటల్ ఆవాసాలో ఈ షోను నిర్వహిస్తోంది. పలు రియల్టీ సంస్థలతో పాటు బ్యాంకులు, ఇంటీరియర్ సంస్థలు ఈ షోలో పాల్గొంటున్నాయి. వివరాలు తెలుసుకోవటంతో పాటు... నచ్చినవారు అక్కడికక్కడే ఇల్లు, ప్లాట్ లే దా ఫ్లాట్‌ను బుక్ చేసుకునే అవకాశముంది.
ఈ షోకు ప్రధాన స్పాన్సర్‌గా ఇప్పటికే నగరంలో పలు ప్రాజెక్టులు పూర్తిచేసిన అపర్ణా కన్‌స్ట్రక్షన్స్ వ్యవహరిస్తోంది. అనుబంధ స్పాన్సర్లుగా ప్రధాన రియల్టీ సంస్థలు ఎస్‌ఎంఆర్ బిల్డర్స్, ఆదిత్యా కన్‌స్ట్రక్షన్స్, ప్రావిడెంట్ హౌసింగ్, సహ స్పాన్సర్లుగా రాంకీ ఎస్టేట్స్, సైబర్‌సిటీ బిల్డర్స్, మ్యాక్ ప్రాజెక్ట్స్ వ్యవహరిస్తున్నాయి. ఎన్‌సీసీ అర్బన్, జనప్రియ ఇంజనీర్స్, శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్, ఏక్సాన్ హౌసింగ్, నార్త్‌స్టార్ హోమ్స్, మంజీరా కన్‌స్ట్రక్షన్స్, యాక్యురేట్ డెవలపర్స్, మహీంద్రా లైఫ్‌స్పేస్, సాకేత్ ఇంజనీర్స్, ప్రణీత్ గ్రూప్, గ్రీన్‌హోమ్, ఆర్క్ అండ్ టెర్మినస్ ఇన్‌ఫ్రా తదితర సంస్థలు పాల్గొంటున్నాయి. గృహ రుణాలు, వడ్డీ గురించి వివరించేందుకు పలు బ్యాంకులు కూడా ఈ షోలో అందుబాటులో ఉంటాయి.