
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్ (హెచ్‌ఆర్‌ఏ) తొలి ప్రాపర్టీ షో మొదలైంది. మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జీహెచ్‌ంఎసీ కమిషనర్ బి జనార్ధన్ రెడ్డి, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శని, ఆది వారాల్లోనూ ఈ ప్రదర్శన అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
ఎస్‌అండ్‌ఎస్ గ్రీన్ ప్రాజెక్ట్స్, ఫోనిక్స్, జయభేరి, ఆదిత్య వంటి నిర్మాణ సంస్థలు 200లకు పైగా ప్రాజెక్ట్‌లను ప్రదర్శనలో ఉంచాయి. షోలో కౌన్సిలింగ్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. స్థిరాస్తి నిపుణులు, సలహాదారులు స్థిరాస్తి కొనుగోళ్లలో, గృహ రుణాల ఎంపికలో సలహాలు, సూచనలిచ్చారు. ‘‘నేషనల్ రియల్టర్స్ అసోసియేషన్– ఇండియా (ఎన్‌ఏఆర్) అనుబంధ సంస్థే హెచ్‌ఆర్‌ఏ. ఇందులో 80కి పైగా సభ్యులున్నారు. రియల్టీ రంగంలో ప్రొఫిషనలిజం, సమగ్రతను తీసుకురావడానికి హెచ్‌ఆర్‌ఏ ప్రధాన లక్ష్యమని’’ హెచ్‌ఆర్‌ఏ ప్రెసిడెంట్ సుమంత్ రెడ్డి తెలిపారు.