ఆన్‌లైన్‌లో ప్రాపర్టీ షో! | Property show in Online! | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో ప్రాపర్టీ షో!

Published Sat, Apr 9 2016 12:00 AM | Last Updated on Sun, Sep 3 2017 9:29 PM

ఆన్‌లైన్‌లో ప్రాపర్టీ షో!

ఆన్‌లైన్‌లో ప్రాపర్టీ షో!

వినూత్న సేవలతో మార్కెట్లోకి బిల్డ్‌ఈజీ.కామ్
* స్థిరాస్తి సమాచారమంతా ఒకే వేదికగా పొందే వీలు
* ఇల్లు నుంచి ఇంట్లోని ఫర్నిచర్ దాకా..
* వాస్తు నుంచి ప్లంబింగ్ వర్క్ వరకూ.. బిల్డ్‌ఈజీ.కామ్‌లో
సాక్షి, హైదరాబాద్: ఎంతో కష్టపడి.. పైసా పైసా కూడబెట్టి బైకో, కారో కొనాలంటేనే నలుగురిని సంప్రదిస్తాం. షాపింగ్ వెళ్లి దుస్తులు కొంటే మన శరీరానికి నప్పుతాయో లేవోనని ఒకటికి రెండు సార్లు ట్రయల్ వేసుకొని మరీ చూస్తాం... మరి జీవితకాలం నివాసముండే సొంతిల్లు ఎంపికంటే? ఒకట్రెండు ప్రాపర్టీ షోలకు వెళ్లో.. ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసో నిర్ణయం తీసుకునే విషయమేమీ కాదు.

మరె లా? ప్రతీదానికి ఆన్‌లైన్ కొనుగోళ్లు అలవాటైన ఈ రోజుల్లో ప్రాపర్టీని కూడా ఆన్‌లైన్‌లో కొనేస్తే! నేరుగా ఆన్‌లైన్‌లో ప్రాపర్టీ షోలో పాల్గొంటే!! అచ్చం ఇదే వ్యాపా ర సూత్రంగా మార్చుకుంది బిల్డ్‌ఈజీ.కామ్. వినూత్న సేవలతో త్వరలోనే మార్కెట్లోకి రానున్న ఈ సంస్థ మరిన్ని సేవలను బిల్డ్‌ఈజీ.కామ్ వ్యవస్థాపకులు రాంగోపాల్, లక్ష్మీనారాయణలు‘సాక్షి రియల్టీ’తో పంచుకున్నారు.
 
ఫిజికల్‌గా ప్రాపర్టీ షో నిర్వహించడమంటే మామూలు విషయం కాదు. అటు నిర్వాహకులకు, ఇటు ఎగ్జిబిటర్లకూ ఎంతో వ్యయ, ప్రయాసలతో కూడుకున్న పని. నిర్వాహకుల విషయానికొస్తే.. లొకేషన్ ఎంపిక నుంచి స్టాల్ ఏర్పాటు, భోజన కార్యక్రమాలు, ఎగ్జిబిటర్లను ఒప్పించడం వరకు ప్రతీదీ పనే. ఇక ఎగ్జిబిటర్ల విషయానికొస్తే.. షో ఉన్నన్ని రోజులు ఉద్యోగుల డ్యూటీ నుంచి ప్రాజెక్ట్‌ల డిస్‌ప్లే, వాక్ త్రూ ఏర్పాట్లు, కరపత్రాలు, బ్రోచర్ల ప్రింట్లు, పంపిణీ, సందర్శకులను ఒప్పించడం వరకూ ప్రతీదీ కష్టంతో కూడుకున్నదే.

* ఈ కష్టాలకు పరిష్కారం చూపించేదే ఆన్‌లైన్ ప్రాపర్టీ షో. బిల్డ్‌ఈజీ.కామ్‌తో ఆఫీసులోని కంప్యూటర్ ముందు కూర్చొని నేరుగా ఆన్‌లైన్‌లో ప్రాపర్టీ షోలో పాల్గొనొచ్చు. కస్టమర్ ఓకే అంటే అక్కడికక్కడే డీల్‌ను క్లోజ్ చేయొచ్చు కూడా.

* ఆన్‌లైన్ ప్రాపర్టీ షోలో ఏముంటుందంటే.. ఎగ్జిబిటర్లకు సంబంధించిన సమాచారం, ప్రాజెక్ట్ వివరాలు, ఎలివేషన్, స్పెసిఫికేషన్స్, ఫ్లోర్ ప్లాన్, వసతులు, ప్రాజెక్ట్ ఏరియల్ వ్యూ, లొకేషన్, భవిష్యత్తు వృద్ధి వంటి వివరాలెన్నో ఉంటాయి. కస్టమర్ సమాచారం, ఫీడ్ బ్యాక్, ఫోన్ నంబర్ వంటి సమాచారాన్ని స్థిరాస్తి సంస్థలకు అందిస్తాం.

* మరి ఆన్‌లైన్ ప్రాపర్టీ షోకు లీడ్స్‌ను ఎలా ఆకర్షిస్తామంటే.. కరపత్రాలు, పోస్టర్లు, పేపర్ ప్రకటనలు, హోర్డింగ్స్, ఆటో, బస్ క్యాంపెయిన్, ప్రసార మాధ్యమాల్లో డిస్‌ప్లే, స్క్రోలింగ్ యాడ్స్, డిజిటల్ మార్కెటింగ్, ఫేస్‌బుక్, ట్వీటర్, యూట్యూట్, లింక్‌డిన్ వంటి సామాజిక మాధ్యమాల, ఎస్‌ఎంఎస్, ఈ-మెయిల్, వాట్సప్ క్యాంపెయిన్ ద్వారా ప్రాపర్టీ షోకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తాం.

* బిల్డ్‌ఈజీ.కామ్‌లో ప్రాపర్టీ షోనే కాకుండా స్థిరాస్తులకు సంబంధించిన సమస్త సమాచారం ఒకే వేదికగా పొందొచ్చు. అంటే స్థిరాస్తి కొనుగోళ్లు, అద్దెలు, లీజు, అర్కిటెక్ట్‌లు, నిర్మాణ సామగ్రి, గృహ రుణాలు, నిర్మాణ సంస్థలు, యాజమాన్యాలు, వాస్తు పండితులు, ఇంటీరియర్ డిజైనర్లు, ప్లంబర్, శానిటేషన్ నిపుణులు, పెయింటర్స్, అగ్నిమాపక నియంత్రణ నిపుణులు, కార్పెంటర్లు.. ఇలా నిర్మాణ రంగానికి సంబంధించిన సమాచారమంతా ఇక్కడుంటుందన్నమాట.

స్థిరాస్తి రంగంలో వస్తున్న నూతన ఒరవడి, సరికొత్త ట్రెండ్స్, ఆధునిక వసతులకు సంబంధించిన ఆర్టికల్స్, వార్తా కథనాలనూ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు కూడా.

* కొనుగోలుదారులు, స్థిరాస్తి సంస్థలకు మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. అంటే వీరిద్దరి మధ్య వారధిగా నిలుస్తుందన్నమాట.

* నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లు, గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్ట్‌లను నేరుగా ఆన్‌లైన్ ద్వారా ప్రాపర్టీ షో నిర్వహించి కొనుగోలుదారులకు మరింత చేరువ చేస్తుంది.

* కొనుగోలుదారుల సొంతింటి కలను తీర్చేందుకు అవసరమైన గృహరుణాలనూ అందించేందుకు బ్యాంకింగ్ రంగంతోనూ ఒప్పందం చేసుకున్నాం. దీంతో ఆన్‌లైన్‌లోనే అప్పటికప్పుడే లోన్ విధానాన్ని పూర్తి చేయవచ్చు కూడా.

* బిల్డ్‌ఈజీ.కామ్ స్టార్టప్ మాతృ సంస్థ గ్రాఫిక్స్ ఇన్ఫర్మేటిక్స్. వెబ్ డెవలప్‌మెంట్, మల్టిమీడియా, ప్రింట్ విభాగాల్లో జేఎన్‌టీయూ దగ్గర్లో 2005లో కార్యాలయాన్ని ప్రారంభించి సేవలందిస్తుందీ సంస్థ.
 
బిల్డ్‌ఈజీ.కామ్ సేవలు రెండు రకాలు..
 1. ప్రీమియర్ పార్టిసిపెంట్
 2. ప్రైమ్ పార్టిసిపెంట్
* ప్రీమియర్ చార్జీ ఏడాదికి రూ.3.50 లక్షలు+ పన్నులు.
* వీళ్లు చానల్ స్పాన్సర్‌గానూ కొనసాగుతారు. ఏడాది పాటు బిల్డ్‌ఈజీ.కామ్ సేవలను పొందొచ్చు.
* ఆన్‌లైన్ ప్రాపర్టీ షోలో నిశ్చల స్థానం. లీడ్ డిస్ట్రిబ్యూషన్‌లో మొదటి స్థానం వీరిదే.
* ప్రైమ్ పార్టిసిపెంట్ చార్జీ రూ.2.50 లక్షలు+ పన్నులు.
* ఆన్‌లైన్ ప్రాపర్టీ షోలో రాండమ్ స్థానాన్ని పొందుతారు. మూడు నెలల పాటు సేవలు.
* 50 శాతం నగదును ముందుగా చెల్లించాలి. మిగతా మొత్తాన్ని ప్రాపర్టీ షో ప్రారంభ తేదీ కంటే వారం ముందుగా చెల్లించాల్సి ఉంటుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement