ఖైరతాబాద్, న్యూస్‌లైన్: జలవిహార్‌లో గత మూడు రోజులుగా కాన్పెడరేషన్ ఆఫ్ రియలెస్టేట్ డెవలఫ్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో ఆదివారంతో ముగిసింది. దాదాపు వంద స్టాళ్ళల్లో డెవలఫర్స్ వివిధ రకాల ప్రాపర్టీ షోలను ప్రదర్శించారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం రాష్ట్ర విభజన - అభివృద్ది అనే అంశంపై చర్చా వేదికను నిర్వహించారు.
చర్చా వేదికలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న మెట్రో రైల్ ఎండీ ఎన్.వి.ఎస్. రెడ్డి మాట్లాడుతూ విభజన నేపద్యంలో రాజకీయాలను పక్కన పెట్టి, అభివృద్దిపై దృష్టి సారించాలన్నారు. మెట్రోకు ముందు తర్వాత నగరం ఎంతో అభివృద్ది పథంలో ముందుకు వెళ్తుందన్నారు. హైదరాబాద్ మెట్రోరైల్ నా కళ అన్నారు. విభజన నేపద్యంలో రాబోయే రోజుల్లో విజయవాడ, విశాఖపట్నంలలో మెట్రో రైల్ ఏర్పాటు విషయంపై అడిగిన ప్రశ్నకు ఇంకా కొంత సమయం పడుతుందన్నారు.
ఐటి రంగ నిపుణులు మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఐటి రంగం నగరంలో ఎంతో అభివృద్దిం చెందిందని, అయితే విభజన వల్ల దీనిపై కొంత ప్రభావం ఉంటుందన్నారు. నగరంలో మౌళిక వసతులు, వాతావరణం అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉండటం వల్ల అభివృద్ది వేగంగా జరిగిందన్నారు. రాబోయే ప్రభుత్వం నిజాయితిగా వ్యవహరిస్తే అదే స్థాయిలో ఐటి రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళేందుకు అవకాశముంటుందన్నారు. అనంతరం జె.ఏ చౌదరి మాట్లాడుతూ ప్రపంచంలోనే హైదరాబాద్ నగరం ప్రత్యేక నంగరంగా గుర్తింపు ఉందన్నారు.
సాఫ్ట్ వేర్ రంగంతో పాటు హార్ట్ వేర్ రంగాన్ని అంతే వేగంగా అభివృద్ది చేయగలిగితే చైనాను మించిన నగరంగా మనం ముందుకు వెళ్ళవచ్చన్నారు. అడ్వకేట్ ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల వారిని ఆహ్వానించే గొప్ప చరిత్ర హైదరాబాద్ నగరానికి ఉందన్నారు. ఆంధ్రాలో కూడా అభివృద్దికి పూర్తి అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ ఈ చర్చావేదికలో పాత్రికేయులు వసంత్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ముగిసిన ప్రాపర్టీ షో
Published Mon, Mar 3 2014 4:40 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 AM
Advertisement
Advertisement