రియల్టీపై నోట్ల రద్దు ప్రభావం లేదు
• 2017 ప్రథమార్థం వరకూ స్థిరంగానే ధరలు
• ఆ తర్వాత 10-12 శాతం పెరిగే అవకాశం
• హైదరాబాద్‌లో కొనుగోళ్లకు తరుణమిదే
• ఆఫీసు, వాణిజ్య విభాగాలపై తాత్కాలిక ప్రభావం
• జీఎస్టీ, రెరా బిల్లులతో ప్రాపర్టీ విలువలు పెరుగుతాయ్
• క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ అంచనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెద్ద నోట్ల రద్దు ప్రభావం హైదరాబాద్ స్థిరాస్తి రంగంపై... అందులోనూ నివాస సముదాయాల విభాగంపై ఏమాత్రం లేదని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) హైదరాబాద్ చాప్టర్ చెప్పింది. ‘‘ఇక్కడ స్థిరాస్తి రంగంలో 90-95 శాతం మార్కెట్ మధ్య తరగతి గృహ విభాగానిదే. పైగా 80-85 శాతం స్థిరాస్తి కొనుగోళ్లు గృహ రుణాలు, పొదుపు చేసిన సొమ్ముతోనే జరుగుతారుు. అంటే నగదు రూపంలో లావాదేవీలు చాలా తక్కువగా. ఎక్కువ శాతం చెక్ రూపంలోనే జరుగుతుంటారుు’’ అని క్రెడాయ్ అధ్యక్షుడు ఎస్.రాంరెడ్డి తెలియజేశారు. మంగళవారమిక్కడ ‘‘హైదరాబాద్ రియల్టీ రంగంపై నోట్ల రద్దు, జీఎస్టీ, రెరా బిల్లుల ప్రభావం’’ అనే అంశంపై క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ జనరల్ సెక్రటరీ పి.రామకృష్ణారావుతో కలిసి ఆయన మాట్లాడారు. వారింకా ఏమన్నారంటే..
⇔ ఇక్కడ రూ.25 లక్షల నుంచి కోటి రూపాయల వరకూ వుండే ప్రాపర్టీలు ఎక్కువ. వీటి కస్టమర్లు ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్, మెడికల్, సర్వీస్ సెక్టార్ ఉద్యోగులే. వీరంతా చెక్ రూపంలోనే కొనుగోళ్లు జరుపుతుంటారు.
⇔ బల్క్ ల్యాండ్‌స, లే అవుట్ల మార్కెట్లో నగదు లావాదేవీలు కాస్త ఎక్కువ జరుగుతుంటారుు. ఈ విభాగంలో కొంత ప్రభావం ఉంటుంది. అరుుతే హైదరాబాద్‌లో బల్క్ ల్యాండ్‌స, లే అవుట్ల మార్కెట్ 5-10 శాతమే. కార్యాలయ, వాణిజ్య విభాగంలో కొనుగోళ్ల కంటే ఎక్కువగా లీజు, అద్దె ఒప్పందాలే ఉంటారుు. వాటిపై ఈ ప్రభావం అంతగా ఉండదు.
⇔ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్‌లో స్టాంప్ డ్యూటీ, వ్యాట్, సర్వీస్ ట్యాక్స్‌లు తక్కువగా 11 శాతం వరకు ఉన్నారుు. అదే కర్ణాటకలో 15-16 శాతం ఉన్నారుు. దీనికితోడు ఇతర మెట్రోలతో పోలిస్తే హైదరాబాద్‌లో స్థిరాస్తి ధరలూ తక్కువే. తాజా పరిస్థితుల నేపథ్యంలో 2017 ప్రథమార్థం వరకు నగరంలో రియల్టీ ధరలు స్థిరంగా ఉంటారుు. కాబట్టి కొనుగోలు దారులకు ఇదే సరైన సమయం.
⇔ ఒకసారి వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ), స్థిరాస్తి నియంత్రణ బిల్లు (రెరా) అమలులోకి వచ్చాక స్థిరాస్తి రంగంలో పారదర్శకత నెలకొంటుంది. ఆయా చట్టాల్లోని నిబంధనలతో అసంఘటిత బిల్డర్లు/డెవలపర్లు నిలదొక్కుకోలేరు. దీంతో పెద్ద బిల్డర్లు మార్కెట్‌లో ధరలను కృత్రిమంగా పెంచే ప్రమాదం ఉంటుంది. 10-12 శాతం మేర ధరలు పెరిగే అవకాశముంది. ప్రస్తుత పన్నులు 11 శాతం కాగా జీఎస్టీ సుమారు 18 శాతం ఉండొచ్చు. అంటే జీఎస్టీ అమల్లోకి వస్తే స్థిరాస్తి ధరలు పెరిగే అవకాశముందన్నమాట.
⇔ స్థిరాస్తి రంగంలోని రకరకాల పన్నుల వల్లే నగదు రూపంలో లావాదేవీలు జరుగుతున్నారుు. వాటిని తగ్గిస్తే అందరూ చెక్ రూపంలోనే క్రయవిక్రయాలు జరుపుతారు. పన్నులు తగ్గించాలని క్రెడాయ్ తరుఫున ప్రభాత్వాన్ని కోరుతున్నాం.