ప్రారంభమైన ‘క్రెడాయ్ కాన్‌క్లేవ్-2013’ | CREDAI conclave opens in Delhi | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన ‘క్రెడాయ్ కాన్‌క్లేవ్-2013’

Published Sat, Dec 14 2013 6:45 AM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM

భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) కాన్‌క్లేవ్-2013 శుక్రవారం ఢిల్లీలో ప్రారంభమైంది.

సాక్షి, హైదరాబాద్: భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) కాన్‌క్లేవ్-2013 శుక్రవారం ఢిల్లీలో ప్రారంభమైంది. రెండు రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుందని క్రెడాయ్ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
 
 భారత స్థిరాస్తి రంగ ప్రాముఖ్యతను చాటి చెప్పడానికి , ఈ రంగాన్ని ప్రోత్సహించడం వల్ల జరిగే అభివృద్ధిని వివరించడానికి ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మెకిన్సే నివేదిక ప్రకారం ప్రస్తుతం మన దేశంలో 1.87 కోట్ల ఇళ్ల కొరత ఉందని, 2030 నాటికి పట్టణ జనాభా 59 కోట్లకు చేరుకుంటుందని అప్పుడు మరింత ఇళ్ల అవసరం ఉంటుందని చెప్పారు. ఈ స్థాయిలో ఇళ్ల కొరత తీర్చాలంటే సుమారు 1.2 ట్రిలియన్ డాలర్ల నిధులు  అవసరమన్నారు. మరి ఈ స్థాయిలో పెట్టుబడులు పెరగాలంటే స్థిరాస్తి రంగాన్ని కేంద్రం ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం నగరంలో స్థిరాస్తి ప్రాజెక్టులకు ఎన్‌ఓసీ సర్టిఫికేట్ తీసుకోవడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతోందని దీంతో ఒక్కో భవనం మీద సుమారు 40 శాతం భారం పడుతోందన్నారు. ఈ భారాన్ని తగ్గించేందుకు సింగిల్ విండో సిస్టం, ఆన్‌లైన్‌లో అనుమతుల మంజూరు విధానాలను అమలులోకి తీసుకురావాలని సూచించారు. దీంతో ధరలు 10 నుంచి 25 శాతానికి తగ్గే అవకాశం ఉందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement