న్యూఢిల్లీ: ఇళ్ల ధరల తగ్గింపునకు ఇక ఎలాంటి అవకాశం లేదని రియల్టర్ల సమాఖ్య క్రెడాయ్ పేర్కొంది. కాగా ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ సోమవారం ఒకానొక సందర్భంలో చాలా మంది ప్రజలు ప్రాపర్టీని కొనుగోలు చేయడానికి అనువుగా రియల్ ఎస్టేట్ డెవలపర్లు ఇంటి ధరలను తగ్గించాలని కోరారు. దేశంలోని రియల్టీ ధరలు దాదాపు 20-30 శాతంమేర తగ్గాయని, ఇక అంతకు మించి ఇంకా ధరలు తగ్గే అవ కాశం లేదని క్రెడాయ్ పేర్కొంది. మళ్లీ ఏమైనా ధర తగ్గింపు జరిగితే ఎన్‌పీఏలు పెరిగే అవకాశముందని, ప్రాజెక్టుల డె లివరీ నిలిచిపోవచ్చని అభిప్రాయపడింది.