Housing prices
-
ఇక్కడ ఇళ్ల ధరలకు రెక్కలు..
దేశవ్యాప్తంగా ద్వితీయ శ్రేణి నగరాల్లో (టైర్–2) ఇళ్ల ధరలు ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్ మధ్య కాలంలో గణనీయంగా పెరిగాయి. 23 ప్రముఖ పట్టణాల్లో సగటున 65 శాతం ఎగిసినట్టు ప్రాప్ ఈక్విటీ సంస్థ వెల్లడించింది. అదే విధంగా ఐదు నగరాల్లో ధరలు తగ్గాయి.ముఖ్యంగా దక్షిణాదిన గుంటూరు పట్టణంలో 51 శాతం మేర ధరల్లో పెరుగుదల కనిపించింది. ఆ తర్వాత విశాఖపట్టణంలో 29 శాతం, విజయవాడలో 21 శాతం చొప్పున పెరిగాయి. దక్షిణాదిలోనే మంగళూరులో 41 శాతం, కోయింబత్తూర్‌లో 11 శాతం, గోవాలో 6 శాతం, కోచిలో 2 శాతం చొప్పున వృద్ధి చెందాయి. త్రివేండ్రంలో మాత్రం 4 శాతం, మైసూర్లో 14 శాతం చొప్పున ధరలు తగ్గాయి. జైపూర్ టాప్.. టైర్–2 పట్టణాల్లో దేశంలోనే అత్యధికంగా జైపూర్‌లో 65 శాతం మేర ధరలు పెరిగినట్టు ప్రాప్ ఈక్విటీ నివేదిక తెలిపింది. జనవరి–సెప్టెంబర్ మధ్య కాలంలో కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్టుల్లో చదరపు అడుగు (ఎస్ఎఫ్టీ) ధర రూ.6,979కు చేరింది. క్రితం సంవత్సరం ఇదే కాలంలో రూ.4,240గా ఉండడం గమనార్హం. ఉత్తరాదిన ఆగ్రా.. ఉత్తరాదిన ఆగ్రాలో ఇళ్ల ధరలు 59 శాతం పెరిగాయి. ఆ తర్వాత చండీగఢ్‌లో 34 శాతం, బివాండిలో 25 శాతం, ఇండోర్‌లో 20 శాతం, డెహ్రాడూన్‌లో 14 శాతం, లుధియానాలో 11 శాతం, లక్నోలో ఒక శాతం చొప్పున ధరల్లో వృద్ధి కనిపించింది. భోపాల్‌లో 5 శాతం, మోహాలిలో 8 శాతం, సోనేపట్‌లో 26 శాతం చొప్పున ధరలు పతనమయ్యాయి.పశ్చిమాన గాంధీనగర్ పశ్చిమభారత్లో గాంధీనగర్‌లో అత్యధికంగా 19 శాతం మేర ఇళ్ల ధరలు ఎగిశాయి. ఆ తర్వాత సూరత్‌లో 14 శాతం, నాగ్‌పూర్‌లో 12 శాతం, వడోదరలో 10 శాతం, నాసిక్‌లో 4 శాతం, అహ్మదాబాద్‌లో 4 శాతం చొప్పున ధరలు పెరిగాయి. తూర్పున భువనేశ్వర్‌లో 15 శాతం, రాయ్‌పూర్‌లో 14 శాతం చొప్పున ఇళ్ల ధరల్లో వృద్ధి కనిపించింది.బలంగా డిమాండ్.. ‘‘టైర్–2 నగరాల్లో డెవలపర్లు, కార్పొరేట్లు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్లు, ఇన్వెస్టర్ల సమూహం నుంచి ఇళ్లకు ఆసక్తి పెరిగింది. ఈ నగరాల్లో భూమి చౌకగా లభించడం, మౌలిక ససతులతో పెద్ద ఎత్తున అనుసంధానత, బలమైన డిమాండ్ వెరసి ప్రీమియం, లగ్జరీ ఇళ్ల సరఫరా మెరుగుపడింది’’అని ప్రాప్‌ఈక్విటీ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ జసూజా తెలిపారు. -
రాజధానిలో ఇళ్ల ధరలు రెట్టింపు..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతమైన గురుగ్రామ్, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ (ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం) పరిధిలో గడిచిన ఐదేళ్ల కాలంలో కొత్త ప్రాజెక్టుల్లోని ఇళ్ల ధరలు సగటున రెట్టింపైనట్టు రియల్ ఎస్టేట్ డేటా అనలైటిక్ సంస్థ ప్రాప్ ఈక్విటీ తెలిపింది. 2019 నుంచి 2024 సెప్టెంబర్ మధ్య కాలంలో నోయిడాలో అత్యధికంగా చదరపు అడుగు (ఎస్ఎఫ్టీ) ధర 152 శాతం మేర పెరిగి రూ.5,910 నుంచి రూ.14,946కు చేరింది.ఘజియాబాద్‌లో 139 శాతం పెరిగి రూ.3,691 నుంచి రూ.8,823కు చేరింది. గురుగ్రామ్‌లో ఎస్ఎఫ్టీ ధర రూ.19,535కు చేరింది. 2019లో ఉన్న రూ.8,299తో పోల్చి చూస్తే 135 శాతం పెరిగింది. గ్రేటర్ నోయిడాలో చదరపు అడుగు ధర 121 శాతం పెరిగి రూ.8,601గా ఉంది. 2019లో ఇక్కడ చదరపు అడుగు రేటు రూ.3,900గా ఉంది. -
ఇళ్ల ధరలకు రెక్కలు.. రెండేళ్లలో ఇంత తేడానా!
భారతదేశంలో రియల్ ఎస్టేట్ రంగం భారీగా వృద్ధి చెందుతోంది. ఈ తరుణంలో ఇళ్ల ధరలకు రెక్కలొచ్చాయి. 2021 నుంచి 2023 మధ్య ఇళ్ల ధరలు ఏకంగా 20 పెరిగినట్లు హౌసింగ్ ప్రైస్ ట్రాకర్ క్రెడాయ్ (CREDAI) నివేదిక ద్వారా తెలిసింది. దేశంలో నిర్మాణ వ్యయం పెరగటం మాత్రమే కాకుండా.. ఇళ్ల కొనుగోళ్ళకు కస్టమర్లు కూడా పెద్ద ఎత్తున ఎగబడటమే ధరలు పెరగటానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. దేశంలో సుమారు 8 పెద్ద నగరాల్లో ధరలు ఎక్కువగా ఉన్నట్లు నివేదిక ద్వారా తెలిసింది. ముఖ్యంగా బెంగళూరులో 2021 - 2023 కాలంలో ఇళ్ల ధరలు 31 శాతం పెరిగాయి. వైట్‌ఫీల్డ్, కెఆర్ పురం, సర్జాపూర్ వంటి ఐటీ హబ్‌లకు సమీపంలో ఉన్న ప్రాంతాల్లో డిమాండ్ బలంగా ఉంది, ప్రత్యేకించి లగ్జరీ సెగ్మెంట్లో కొత్త లాంచ్‌లు పెరగటం వల్ల కూడా ధరలు ఆకాశాన్ని తాకాయని తెలుస్తోంది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ ధరల విషయానికి వస్తే.. 2021 కంటే 2023లో గృహాల ధరలలో 2 శాతం పెరుగుదల ఉందని నివేదికలో స్పష్టమైంది. కరోనా మహమ్మారి తగ్గిన తరువాత ఈ ప్రాంతాల్లో ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి. ఇదీ చదవండి: గోడ కట్టేస్తున్న రోబోట్.. వీడియో వైరల్ హైదరాబాద్‌లో కోటి రూపాయల కంటే ఎక్కువ ధర వద్ద ఉన్న విల్లాలు, రూ. 50 లక్షల లోపు ఉన్న అపార్ట్మెంట్లకు డిమాండ్ ఎక్కువగా ఉందని తెలుస్తోంది. కేవలం రెండు సంవత్సరాల్లోనే ధరలు 20 శాతం పెరగటం వల్ల దేశంలోని మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కల కలగానే మిగిలిపోయే అవకాశం ఉంది. -
ముంబై తర్వాత హైదరాబాదే.. భారీగా పెరిగిన హౌసింగ్ ప్రాపర్టీల విలువ
సాక్షి, హైదరాబాద్: అఫర్డబుల్ హౌసింగ్‌కు మారుపేరుగా నిలిచిన హైదరాబాద్.. క్రమంగా కాస్ట్లీ సిటీగా మారుతుంది. దేశంలోని ఏ మెట్రో నగరంతో పోల్చినా భాగ్యనగరంలో ప్రాపర్టీ ధరలు తక్కువని అవకాశం దొరికినప్పుడల్లా వేదికల మీద డెవలపర్లు ఊదరగొట్టేవాళ్లు. కానీ, దేశంలో ముంబై తర్వాత అత్యంత ఖరీదైన నగరంగా నిలిచిందని ప్రాప్‌టైగర్.కామ్ తాజా నివేదిక వెల్లడించింది. వార్షిక ప్రాతిపదికన హైదరాబాద్‌లో ప్రాపర్టీల విలువ 6 శాతం వృద్ధి చెంది.. చ.అ. ధర సగటున రూ.5,800 నుంచి రూ.6,000 వేలకు పెరిగిందని పేర్కొంది. ముంబైలో ఏడాదిలో 3 శాతం పెరిగి.. రూ.9,600 నుంచి రూ.9,800లుగా ఉంది. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలలో గృహాల విక్రయాలలో హైదరాబాద్‌లో అత్యధిక వృద్ధి నమోదవుతుంది. బాచుపల్లి, తెల్లాపూర్, గండిపేట, దుండిగల్, మియాపూర్ ప్రాంతాలలో గృహ విక్రయాలకు డిమాండ్ విపరీతంగా ఉంది. ఆయా ప్రాంతాలలో ఇళ్ల ధరలు పెరుగుతున్నప్పటికీ.. డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. దాదాపు పదేళ్ల కాలంలో అతి తక్కువ గృహ రుణ వడ్డీ రేట్లు ఉండటం, స్టాంప్ డ్యూటీలను తగ్గించడం, సర్కిల్ ధరలలో సవరణలతో పాటు గృహ కొనుగోళ్లలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలతో అందుబాటు ధరలలోని ఇళ్ల విక్రయాలలో అత్యధిక వృద్ధి నమోదయిందని ప్రాప్‌టైగర్.కామ్ బిజినెస్ హెడ్ రాజన్ సూద్ అభిప్రాయపడ్డారు. -
షాకింగ్:హైదరాబాద్ మార్కెట్లో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల ధరలు
న్యూఢిల్లీ: హైదాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇళ్ల ధరలు ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య 13 శాతం పెరిగాయి. చదరపు అడుగు రూ.10,410గా ఉంది. ఈ వివరాలను క్రెడాయ్, కొలియర్స్, లైసెస్ ఫొరాస్ సంయుక్తంగా విడుదల చేసిన ‘హౌసింగ్ ప్రైస్ ట్రాకర్ రిపోర్ట్ క్యూ1 2023’ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఇళ్ల ధరలు చదరపు అడుగుకు సగటున 8 శాతం మేర క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు పెరిగాయి. ► అత్యధికంగా ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో ఇళ్ల ధరలు జనవరి-మార్చి కాలంలో 16 శాతం పెరగ్గా, కోల్‌కతాలో 15 శాతం, బెంగళూరులో 14 శాతం చొప్పున వృద్ధి చెందాయి. ► ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఇళ్ల ధరలు పెరగడం వరుసగా 11వ త్రైమాసికంలోనూ నమోదైంది. చదరపు అడుగు ధర 16 శాతం వృద్ధి చెంది రూ.8,432కు చేరుకుంది. ► ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాంతంలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇళ్ల ధరలు 59 శాతం మేర పెరిగాయి. గురుగ్రామ్‌లోని గోల్ఫ్‌కోర్స్ రోడ్డులో 42 శాతం పెరిగాయి. ► ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఇళ్ల ధరలు అత్యధికంగా ఇక్కడే ఉన్నాయి. ►అహ్మదాబాద్ ప్రాంతంలో 11 శాతం వృద్ధి కనిపించింది. చదరపు అడుగు ధర రూ.6,324గా ఉంది. ►బెంగళూరులో చదరపు అడుగు ధర 14 శాతం పెరిగి రూ.8,748కి చేరుకుంది. చెన్నైలో చదరపు అడుగు ధర 4 శాతం వృద్ధితో రూ.7,395కు చేరింది. ► కోల్‌కతాలో 15 శాతం పెరిగి చదరపు అడుగు ధర రూ.7,211గా ఉంది. ► పుణెలో 11 శాతం పెరిగి రూ.8,352గా నమోదైంది. ► ముంబై మెట్రో పాలిటన్ రీజియన్‌లో మాత్రం 2 శాతం తగ్గి చదరపు అడుగు ధర రూ.19,219గా నమోదైంది. (యూట్యూబర్లకు గుడ్ న్యూస్, 500 చాలట!) వృద్ధి కొనసాగుతుంది.. రానున్న రోజుల్లో ధరల పెరుగుదల మోస్తరుగా ఉండొచ్చని లైసెస్ ఫొరాస్ ఎండీ పంకజ్ కపూర్ అభిప్రాయపడ్డారు. ‘‘ఇళ్ల నిర్మాణంలో వినియోగించే మెటీరియల్ ధరల ఫలితంగా ఇళ్ల ధరలు కూడా పెరిగాయి. అయినా కానీ, స్థిరమైన డిమాండ్ నెలకొంది. ఈ బలమైన ధోరణి కొనసాగుతుందని అంచనా వేస్తున్నాం. కొత్త ఇల్లు కొనుగోలు పట్ల వినియోగదారులు స్పష్టమైన ఆసక్తి చూపిస్తున్నారు. పెద్ద ఇళ్లు, మెరుగైన సౌకర్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు’’అని క్రెడాయ్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ పేర్కొన్నారు. అంతర్జాతీయ అనిశ్చితులు, వడ్డీ రేట్ల రూపంలో ఎదురైన సవాళ్ల మధ్య హౌసింగ్ రంగం బలంగా నిలబడినట్టు కొలియర్స్ సర్వీసెస్ కు చెందిన అక్యుపయర్ సర్వీసెస్ ఎండీ పీయూష్ జైన్ అభిప్రాయపడ్డారు. సొంతిల్లు కలిగి ఉండేందుకు ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో అందుబాటు ధరలు, నాణ్యతో కూడిన ప్రాజెక్టులు ఈ రంగం వృద్ధికి తోడ్పడతాయన్నారు. (కేటీఎం తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది: ఫీచర్లు ఎలా ఉంటాయంటే!) -
Hyderabad: హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు పెరిగాయ్
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 11.5 శాతం పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో దేశవ్యాప్తంగా 42 పట్టణాల్లో ఇళ్ల ధరలు పెరిగినట్టు నేషనల్ హౌసింగ్ బ్యాంకు (ఎన్‌హెచ్‌బీ)కు చెందిన రెసిడెక్స్ (ఇళ్ల ధరల సూచీ) ప్రకటించింది. ఎనిమిది మెట్రోల్లోనూ ధరల పెరుగుదల నమోదైనట్టు పేర్కొంది. ఎనిమిది మెట్రోల్లో అహ్మదాబాద్‌లో అత్యధికంగా 13.5 శాతం, చెన్నైలో 12.5 శాతం చొప్పున ధరల పెరుగుదల ఉండగా, ఆ తర్వాత ఎక్కువగా పెరిగింది హైదరాబాద్ మార్కెట్లోనే కావడం గమనించాలి. బెంగళూరులో 3.4 శాతం, ఢిల్లీలో 7.5 శాతం, కోల్‌కతాలో 6.1 శాతం, ముంబైలో 2.9 శాతం, పుణెలో 3.6 శాతం చొప్పున ఇళ్ల ధరల్లో వృద్ధి నెలకొంది. ఇక దేశవ్యాప్తంగా ఐదు పట్టణాల్లో ఇళ్ల ధరలు తగ్గగా, మూడు పట్టణాల్లో స్థిరంగా ఉన్నాయి. ఎన్‌హెచ్‌బీ రెసిడెక్స్ ఇండెక్స్ 50 పట్టణాల గణాంకాలను ట్రాక్ చేస్తుంటుంది. సీక్వెన్షియల్‌గా చూస్తే (మార్చి త్రైమాసికం నుంచి) ఈ 50 పట్టణాల్లో ఇళ్ల ధరలు 1.7 శాతం పెరిగాయి. 2017–18 నుంచి 50 పట్టణాల్లో ఇళ్ల ధరలను త్రైమాసికం వారీగా ఎన్‌హెచ్‌బీ రెసిడెక్స్ ప్రకటిస్తోంది. చదవండి: (Electric Vehicles In India: 2030 నాటికి 5 కోట్ల ఈవీలు) -
హైదరాబాదీలకు షాక్..భారీగా పెరిగిన ఇళ్ల ధరలు!
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో నివాస గృహాల ధర ఏప్రిల్–జూన్ మధ్య చదరపు అడుగుకు సగటున రూ.9,218గా ఉంది. గత ఏడాది కాలంతో పోలిస్తే ఇది 8 శాతం పెరిగింది. మొత్తం ఎనిమిది నగరాల్లో ఈ కాలంలో సగటు ధర పెరుగుదల రేటు 5 శాతంగా ఉంది. హౌసింగ్ డిమాండ్ పునరుద్ధరణ, నిర్మాణ వ్యయాల్లో పెరుగుదల వంటి అంశాలు దీనికి కారణమని హౌసింగ్ ప్రైస్ ట్రాకర్ నివేదిక– 2022 తెలిపింది. రియల్టర్ల అత్యున్నత సంస్థ క్రెడాయ్, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా, డేటా అనలిటిక్ సంస్థ లియాసెస్ ఫోరాస్‌లు సంయుక్తంగా రూపొందించిన ఈ నివేదికలో హైదరాబాద్‌సహా ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం (ఎంఎంఆర్), చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, పూణె, అహ్మదాబాద్‌ల రెసిడెన్షియల్ ప్రాపర్టీ సగటు ధరలను ప్రాతిపదికగా తీసుకోవడం జరిగింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు.. ► కార్పెట్ ఏరియా (గోడలు కాకుండా ఇంటి లోపలి స్థలం) ఆధారంగా ధరలను లెక్కించడం జరిగింది. ► 2022 ఏప్రిల్–జూన్ సమయంలో భారతదేశంలో గృహాల ధరలు మహమ్మారికి ముందు స్థాయిలను అధిగమించాయి. భారీ డిమాండ్, దీనికి తగిన సరఫరాలను ఇది సూచిస్తోంది. ► భవిష్యత్తులో ధరలు భారీ ఒడిదుడుకులు లేకుండా ఒక నిర్దిష్ట శ్రేణిలో ఉండే అవకాశం ఉంది. ► పెరుగుతున్న వడ్డీరేట్ల ప్రభావాన్ని డెవలపర్లు ముందే గ్రహించి, తగ్గింపు ఈఎంఐ పథకాలతో కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. పండుగ ఆఫర్లు, సరఫరా పరిస్థితి బాగుండడం వంటి అంశాల నేపథ్యంలో విక్రయాల పరిమాణం మెరుగుపడే అవకాశం ఉంది. ► గృహాల ధరల పెరుగుదలకు కీలకమైన నిర్మాణ సామగ్రి రేట్లు, కార్మికుల వేతనాల వంటివి ప్రధాన కారణాలు. ► గృహ రుణాలపై వడ్డీ రేట్ల పెంపు ప్రభావం డిమాండ్‌పై స్వల్పంగానే ఉండవచ్చు. సెప్టెంబర్ నుంచి విక్రయాలు పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ► రాబోయే పండుగ సీజన్ మార్కెట్ సెంటిమెంట్‌ను సానుకూలంగా ఉంచే అవకాశం ఉంది. ఫలితంగా వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ అమ్మకాలు ఎక్కువగా ఉంటాయన్న అభిప్రాయం నెలకొంది. ► ఢిల్లీ–ఎన్సీఆర్కు సంబంధించి చూస్తే, గురుగ్రామ్‌లోని గోల్ఫ్‌కోర్సు రోడ్డులో ఇండ్ల ధర అత్యధికంగా 21 శాతం ఎగసింది. ► అహ్మదాబాద్‌లో గృహాల ధరలు 3 సంవత్సరాలలో అత్యధికం. గాంధీనగర్ సబర్బ్‌లో అత్యధికంగా 13 శాతం పెరుగుదల కనిపించింది. ► సెంట్రల్ చెన్నైలో ధరలు దాదాపు 13 శాతం క్షీణించగా, పశ్చిమ పూనమల్లిలో అత్యధికంగా 13 శాతం పెరిగింది. ► కోల్‌కతా నైరుతి, హౌరాలో అత్యధికంగా 13 శాతం ధరలు పెరిగాయి. ► ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం (ఎంఎంఆర్) మార్కెట్లో పశ్చిమ శివారు ప్రాంతాల్లో (దహిసర్‌కు ఆవల) 12 శాతం చొప్పున ధరలు పెరిగాయి. ► పూణె మార్కెట్లోని కోత్రుడ్, బ్యానర్ గృహాల ధరలు గరిష్టంగా 9–10 శాతం శ్రేణిలో పెరిగాయి. బడా రియల్టర్ల హవా... గత దశాబ్ద కాలంలో ఇళ్ల ధరలు పెద్దగా పెరగలేదు. బిల్డర్లు చాలా తక్కువ మార్జిన్లో పనిచేస్తున్నారు. కీలకమైన నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదలతో రియల్ ఎస్టేట్ డెవలపర్లు వినియోగదారులపై భారం మోపడం మినహా వేరే మార్గం లేదు. అయినప్పటికీ ఈ రంగంలో బడా, విశ్వసనీయ బిల్డర్లు ఇతరుల కంటే మెరుగైన డిమాండ్‌ను చూస్తున్నారు. వారు మార్కెట్లో ప్రీమియంను (అధిక ధరల స్థితిని) నియంత్రించగలుగుతున్నారు. తద్వారా ప్రయోజనమూ పొందుతున్నారు. – పంకజ్ పాల్, ఏఐపీఎల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -
పుంజుకున్న హైదరాబాద్ రియల్టీ..ఇళ్ల ధరలు ఎంత శాతం పెరిగాయంటే!
న్యూఢిల్లీ: హైదరాబాద్ రియల్టీ మార్కెట్ గత ఆర్థిక సంవత్సరంలో పుంజుకుంది. ఇళ్ల ధరలు సగటున 11 శాతం పెరిగాయి. దేశవ్యాప్తంగా 41 పట్టణాల్లో 2021–22లో ఇళ్ల ధరలు పెరిగినట్టు నేషనల్ హౌసింగ్ బ్యాంకు (ఎన్‌హెచ్‌బీ) విడుదల చేసిన రెసిడెక్స్ సూచీ గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. హైదరాబాద్ కాకుండా మిగిలిన ఏడు ప్రధాన పట్టణాలను పరిశీలించినట్టయితే.. అహ్మదాబాద్‌లో అత్యధికంగా 13.8 శాతం, బెంగళూరులో 2.5 శాతం, చెన్నైలో 7.7 శాతం, ఢిల్లీలో 3.2 శాతం, కోల్‌కతాలో 2.6 శాతం, ముంబైలో 1.9 శాతం, పుణెలో 0.9 శాతం చొప్పున ఇళ్ల ధరల్లో వృద్ధి కనిపించింది. సీక్వెన్షియల్‌గా (అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే) చూస్తే.. 50 పట్టణాలతో కూడిన రెసిడెక్స్ ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య 2.6 శాతం వృద్ధి చెందింది. అంతకుముందు త్రైమాసికంలో ఉన్న 1.7 శాతంతో పోలిస్తే పుంజుకుంది. అంతేకాదు, 2021 జూన్ నుంచి త్రైమాసికం వారీగా ఇళ్ల ధరల్లో వృద్ధి కనిపిస్తోందని.. హౌసింగ్ మార్కెట్ కరోనా లాక్డౌన్ల నుంచి కోలుకున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా 50 పట్టణాల్లో ఇళ్ల ధరలను త్రైమాసికం వారీగా ట్రాక్ చేసేందుకు ఎన్‌హెచ్‌బీ 2007లో రెసిడెక్స్ ఇండెక్స్‌ను ప్రారంభించింది. -
ఇళ్ల ధరలకు రెక్కలు!
ముంబై: నిర్మాణ వ్యయం 20–25 శాతం పెరిగిందని రియల్టర్ల సంస్థ క్రెడాయ్ (భారత రియల్ ఎస్టేట్ డెవలపర్ల సంఘాల సమాఖ్య– సీఆర్‌ఈడీఏఐ) సోమవారం తెలిపింది. ప్రధానంగా గత 45 రోజులలో ఈ పెరగుదల భారీగా ఉందని పేర్కొంది. ఉక్కు వంటి ముడి ఉత్పత్తుల ధరలు పెరుగడం దీనికి కారణమని వివరించింది. ఈ నేపథ్యంలో బిల్డర్లు వచ్చే నెల నుంచి ప్రాపర్టీ ధరలను సగటున 10–15 శాతం పెంచాల్సి వస్తుందని వెల్లడించింది. క్రెడాయ్, ఆ సంస్థ మహారాష్ట్ర విభాగం ఎంసీహెచ్ఐ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశాయి. డెవలపర్లకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ని అనుమతించడంతోపాటు స్టాంప్ డ్యూటీ, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్లను తగ్గించాలని ఈ ప్రకటనలో డిమాండ్ చేశాయి. తద్వారా పరిశ్రమకు ఉపశమనం కలిగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాయి. ప్రస్తుతానికి నిర్మాణ పనులను నిలిపివేయమని సభ్య డెవలపర్లకు సలహా ఇవ్వబోమని, అయితే ధరల పెరుగుదల కొనసాగితే బిల్డర్లకు ప్రాజెక్ట్ సైట్లలో పనులను నిలిపివేయడం,ముడిపదార్థాల కొనుగోలును వాయిదా వేయడం తప్ప వేరే మార్గం లేదని ప్రకటన తెలిపింది. తక్షణ ప్రాపర్టీ ధరల (10 నుంచి 15 శాతం శ్రేణిలో) పెరుగుదల వల్ల మహా రాష్ట్రలోని 2,773 ప్రాజెక్టులపై (గ్రేటర్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ 2021లో ఆమోదించిన) ప్రభావం పడుతుందని ప్రకటన తెలిపింది. దాదాపు 2,60,000 గృహాలు ఈ ప్రాజెక్టులకు సంబంధించి విక్రయించాల్సి ఉందని వివరించింది. క్రెడాయ్ భారతదేశంలోని ప్రైవేట్ రియల్టీ డెవలపర్ల అత్యున్నత వేదిక. 1999లో స్థాపించబడిన ఈ అసోసియేషన్ 21 రాష్ట్రాల్లోని 221 సిటీ చాప్టర్లలో 13,000 మంది డెవలపర్లకు ప్రాతినిధ్యం వహిస్తోంది. చౌక గృహాలపై ఎఫెక్ట్... ‘నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ. 400–500 పెరిగింది. ప్రధానంగా గత 45 రోజుల్లో ధరల తీవ్రత ఎక్కువగా ఉంది. చౌక గృహాల విభాగంపై ఈ ప్రభావం ఎక్కువగా కనబడుతోంది. భౌగోళిక–రాజకీయ పరిస్థితుల కారణంగా పెరిగిన ముడిసరుకు ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం స్టాంప్ డ్యూటీని 5–6% నుండి 3%కి కుదించాలి. సిమెంట్ వంటి ముడి పదార్థాలపై 18% జీఎస్టీ రేటును తగ్గించాలి. సిమెంట్, స్టీల్ ఎగుమతులను కొద్దికాలం పాటు నిషేధించాలి. డెవలపర్లు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ని క్లెయిమ్ చేసుకోడానికి అనుమతించాలి. ఇప్పటికే డెవలపర్ల మార్జిన్లు పడిపోయిన పరిస్థితుల్లో డెవలపర్లు వచ్చే నెల నుంచి తమ అపార్ట్మెంట్ల ధరలను పెంచాల్సి ఉంటుంది. ధరల పెరుగుదల సగటున 10–15% వరకు ఉండవచ్చు. పెరుగుతున్న ఇన్పుట్ వ్యయాల భారాన్ని తగ్గించుకోడానికి ఈ తక్షణ పెంపు తప్పని పరిస్థితి ఉంది’ అని క్రెడా య్ సెక్రటరీ (మహారాష్ట్ర) అజ్మీరా చెప్పారు. వ్యయ భారాలు స్టీల్ ధర కిలోకు రూ.35–40 నుంచి రూ.85–90కి చేరింది. సిమెంట్ ధరలు బస్తాకు రూ.100 వరకు పెరిగాయి. ఇంధనం, రవాణా ఖర్చులు పెరిగాయి. దీంతో మొత్తం నిర్మాణ వ్యయం 20–25 శాతం పెరిగింది. గృహ నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపే వ్యయ భారాలివి. – దీపక్ గొరాడియా, క్రెడాయ్–ఎంసీహెచ్ఐ ప్రెసిడెంట్ రికవరీకి విఘాతం రెసిడెన్షియల్ సెక్టార్ సెగ్మెంట్లలో డిమాండ్ ఇప్పుడిప్పుడే పునరుద్ధరణ జరుగుతోంది. తాజా ముడిపదార్థాల పెరుగుదల నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇది రికవరీలో ఉన్న పునరుద్ధరణ ప్రక్రియను దెబ్బతీసే అవకాశం ఉంది. – రమేష్ నాయర్, కొలియర్స్ ఇండియా సీఈఓ గత రెండేళ్లుగా సిమెంట్, స్టీల్ ధరలు భారీగా పెరిగాయి. దీనితో ప్రతి చదరపు అడుగుల నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగింది. ఇన్పుట్ ధర పెరుగుదలను మేము వినియోగదారులకు బదలాయించలేకపోతున్నాము. దీనితో మా లాభాల మార్జిన్లు పెద్దఎత్తున దెబ్బతింటున్నాయి. ఈ పరిణామాలు మమ్మల్ని భవిష్యత్ కార్యాచరణ గురించి ఆలోచించేలా చేస్తున్నాయి. – సరాంశ్ ట్రెహాన్, ట్రెహాన్ గ్రూప్ ఎండీ -
హైదరాబాద్‌లో ఇళ్ల రేట్లు రయ్...
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల ధరలు గణనీయంగా 7 శాతం మేర పెరిగాయి. దేశవ్యాప్తంగా ఎనిమిది మెట్రో నగరాల్లో 2021 సంవత్సరంలో ఇళ్ల ధరలు 3–7 శాతం మధ్య పెరిగినట్టు ప్రాప్‌టైగర్.కామ్ రూపొందించిన ‘రియల్ ఎస్టేట్ ఇన్సైట్ రెసిడెన్షియల్ – యాన్యువల్ రౌండప్ 2021’ నివేదిక తెలియజేసింది. నిర్మాణంలో వినియోగించే సిమెంట్, స్టీల్ తదితర రేట్లు పెరగడమే ఇళ్ల ధరల వృద్ధికి దారితీసినట్టు పేర్కొంది. గతేడాది హైదరాబాద్ మార్కెట్లో 22,239 ఇళ్లు అమ్ముడుపోయాయి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 36 శాతం వృద్ధి నమోదైంది. నివేదికలోని అంశాలు.. ► ఎనిమిది నగరాల్లో ఇళ్ల విక్రయాలు 2021లో 13 శాతం పెరిగి 2,05,936 యూనిట్లుగా ఉన్నాయి. 2020లో విక్రయాలు 1,82,639 యూనిట్లుగా ఉండడం గమనించాలి. ► కొత్తగా ఆరంభించిన ఇళ్ల యూనిట్లు 75 శాతం పెరిగి 2.14 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. ► అహ్మదాబాద్ మార్కెట్లో ఇళ్ల ధరలు 7 శాతం పెరగ్గా, బెంగళూరులో 6 శాతం, పుణేలో 3 శాతం, ముంబైలో 4 శాతం, చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్, కోల్‌కతా మార్కెట్లలో 5 శాతం చొప్పున ధరలు 2021లో పెరిగాయి. ► బెంగళూరు మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు 7 శాతం పెరిగి 24,983 యూనిట్లుగా ఉన్నాయి. ► చెన్నై మార్కెట్లో 25 శాతం వృద్ధితో 13,055 యూనిట్లు అమ్ముడుపోయాయి. ► ఢిల్లీ ఎన్సీఆర్లో ఒక శాతమే పెరిగి 17,907 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. ► కోల్‌కతా మార్కెట్లో 9% వృద్ధితో 9,896 యూనిట్లు అమ్ముడుపోయాయి. ► ముంబైలో 8 శాతం పెరిగి 58,556 యూనిట్లు అమ్ముడయ్యాయి. ► పుణేలో 9% మేర విక్రయాల్లో వృద్ధి నమోదైంది. 42,425 ఇళ్లు విక్రయమయ్యాయి. ధరలు ఇంకా పెరుగుతాయి 55% మంది కొనుగోలుదారుల అభిప్రాయం సీఐఐ అనరాక్ సర్వే న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇళ్ల ధరలు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలే కాదు.. కొనుగోలుదారులూ అభిప్రాయపడుతున్నారు. నిర్మాణంలో వినియోగించే ముడి సరుకుల ధరలు గణనీయంగా పెరిగిపోవడం తెలిసిందే. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్.. సీఐఐతో కలసి వినియోగదారుల అభిరుచులపై ఒక సర్వే నిర్వహించింది. 2021 జూలై నుంచి డిసెంబర్ మధ్య ఈ సర్వే జరిగింది. ఈ వివరాలను అనరాక్ వెల్లడించింది. ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి 5,210 మంది తమ అభిప్రాయాలు వెల్లడించారు. నిర్మాణ వ్యయాలు, నిర్వహణ వ్యయాలు పెరిగిపోవడంతో ఇళ్ల ధరలు పెరుగుతాయని అంచనాతో ఉన్నట్టు 55 శాతం మంది చెప్పారు. అయితే ధరలు పెరగడం 10 శాతం లోపు ఉంటే డిమాండ్‌పై మోస్తరు నుంచి, తక్కువ ప్రభావమే ఉంటుందని.. 10 శాతానికి మించి పెరిగితే మాత్రం కొనుగోళ్ల సెంటిమెంట్‌పై గట్టి ప్రభావమే చూపిస్తుందని ఈ సర్వే నివేదిక పేర్కొంది. రియల్ ఎస్టేట్‌ను ఒక ఆస్తిగా పరిగణిస్తున్నవారి సంఖ్య 2021 తొలి ఆరు నెలల్లో 54 శాతంగా ఉండగా, ద్వితీయ ఆరు నెలల్లో 57 శాతానికి పెరిగింది. ఈ ఏడాది ద్వితీయ భాగంలో వడ్డీ రేట్లు పెరగడం కొనుగోళ్ల వ్యయాన్ని పెంచుతుందన్న అంచనా వ్యక్తం అయింది. ఇంటి యజమానులు కావాలన్న ధోరణిలోనూ పెరగుదల కనిపించింది. 63 శాతం మంది రూ.45 లక్షల నుంచి రూ.1.5 కోట్ల బడ్జెట్ ఇళ్ల పట్ల ఆసక్తిగా ఉన్నారు. అందుబాటు ధరల ఇళ్లకు డిమాండ్ 2021 ద్వితీయ ఆరు నెలల్లో 40% నుంచి 27 శాతానికి తగ్గింది. 32% మంది గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్ల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. -
భారీగా పెరగనున్న ఇళ్ల ధరలు, కారణం అదేనా..!
సాక్షి, హైదరాబాద్: సిమెంట్, స్టీల్ వంటి నిర్మాణ సామగ్రి ధరలు, నైపుణ్యమైన కార్మికుల వ్యయం పెరిగిన నేపథ్యంలో దాని ప్రభావం రియల్టీ మార్కెట్లపై పడనుంది. సమీప భవిష్యత్తులో ప్రాపర్టీ ధరలు 10–15 శాతం మేర పెరుగుతాయని డెవలపర్ల సంఘాలు తెలిపాయి. నిర్మాణ సామాగ్రిపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) తగ్గించి ఉపశమనాన్ని కలిగించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే గతేడాదితో పోలిస్తే ప్రాపర్టీల ధరలు 10–20 శాతం పెరిగాయని ట్రెహాన్ డెవలపర్స్ ఎండీ సరన్షా ట్రెహాన్ తెలిపారు. కరోనా మహమ్మారి తర్వాతి నుంచి ఇన్పుట్ కాస్ట్ పెరిగినప్పటికీ.. డెవలపర్లు డిమాండ్‌ను కొనసాగించడం కోసం ప్రాపర్టీ ధరలను తక్కువ స్థాయిలోనే కొనసాగించారని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. చదవండి: ఇస్మార్ట్ హోటల్..ఇవేమన్నా "మార్చురీ" గదులా?,సెటైర్లు పడ్డా ఎలా సక్సెస్ అయ్యిందంటే -
ప్రధాన నగరాల్లో పెరిగిన ఇంటి అద్దెలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో గృహాల ధరలు 2 శాతం పెరిగాయి. అలాగే ప్రధాన నగరాల్లో అద్దెలు 5 శాతం పెరిగాయని తాజా అధ్యయనం తేల్చింది. ఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపదికన జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో అద్దెలు 5 శాతానికి పెరిగాయని రియాల్టీ పోర్టల్ 99 ఏకర్స్. కామ్ నివేదించింది. రియల్టీ సెక్టార్లో కొత్తగా తీసుకొచ్చిన రెరా చట్టం వినియోగదారుల్లో నమ్మకాన్ని పెంచిందని.. దీంతో ఈ ఫెస్టివ్ సీజన్లో అమ్మకాలు బావున్నాయని తెలిపింది. జులై-సెప్టెంబరు త్రైమాసికంలో హైదరాబాద్ హౌసింగ్ మార్కెట్ క్యాపిటల్ విలువ 2 శాతం పెరగగా, అద్దెలు 5 శాతం పెరిగింది. రిపోర్టు ప్రకారం హౌసింగ్ ధర బెంగళూరులో 1 శాతం తగ్గింది. అయితే అద్దెలు 3 శాతం పెరిగాయి. ఢిల్లీ-ఎన్‌సిఆర్ మార్కెట్లో హౌసింగ్ ధరలు, అద్దెలు (సమీక్ష సమయంలో) స్థిరంగా ఉన్నాయని తెలిపింది. అటు ముంబైలో గృహాల ధరలు స్థిరంగా ఉన్నాయి కానీ అద్దెలు మాత్రం 2 శాతం పెరిగాయి. చెన్నైలో గృహాల ధరలు ఒక శాతం, అద్దెలు 2 శాతం పెరిగాయి. కోల్‌కతాలో గృహాల ధరలు, అద్దెలు వరుసగా 1 శాతం, 2 శాతం పెరిగాయి. పూణెలో అద్దెలు మాత్రం2 శాతం పెరిగింది. భారతదేశంలోని ఎనిమిది మెట్రో నగరాల్లో నివాస మార్కెట్లో మూలధన విలువ , అద్దె ధరల ధోరణులపై సంస్థ త్రైమాసిక నివేదిక 'ఇన్సైట్’ను 99 ఏకర్స్ .కాంవిడుదల చేసింది. రియల్ ఎస్టేట్ మార్కెట్ లో బలహీనత ..పేలవమైన విక్రయాలకు దారితీసిందని నివేదించింది. అలాగే గృహనిర్మాణ ప్రాజెక్టులను పూర్తిచేయడంలో గణనీయమైన జాప్యంకారణంగా ధరలు కూడా పడిపోవడం లేదా స్థిరంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఈ పండుగ సీజన్లో కొనుగోళ్లు పుంజుకునే అవకాశం ఉందని సంస్థ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నరసింహ జయకుమార్ అన్నారు. అంతేకాకుండా, ఇంతకుముందెన్నడూ లేనంతగా వడ్డీ రేట్లు వినియోగదారులకి అనుకూలంగా ఉన్నాయనీ, ఇది రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు మంచి పరిణామమని వ్యాఖ్యానించారు. కాగా రియల్ ఎస్టేట్ సొల్యూషన్స్ కోసం నెలకు 99 లక్షల మందికి 99 ఏకర్స్ సైట్‌ను సందర్శిస్తుండగా..దాదాపు 8 లక్షలకు పైగా కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఇక్కడ లిస్ట్ అయి ఉన్నాయి. -
రియల్టీపై తీవ్ర ప్రభావం!
-
రియల్టీపై తీవ్ర ప్రభావం!
• 30 శాతం పడిపోనున్న ఇళ్ల ధరలు.. • రూ. 8 లక్షల కోట్ల విలువ ఆవిరి న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అంశం గృహ నిర్మాణ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుంది. రాబోయే 6-12 నెలల కాలంలో దేశీయంగా 42 ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు దాదాపు 30 శాతం మేర పడిపోనున్నారుు. 2008 తర్వాత అమ్ముడైన, అమ్ముడవని రెసిడెన్షియల్ ప్రాపర్టీల మార్కెట్ విలువ సుమారు రూ. 8 లక్షల కోట్ల మేర తుడిచిపెట్టుకుపోనుంది. కన్సల్టెన్సీ సంస్థ ప్రాప్‌ఈక్విటీ ఈ మేరకు అధ్యయన నివేదిక విడుదల చేసింది. ’రియల్ ఎస్టేట్ రంగంపై డీమోనిటైజేషన్ దెబ్బతో వచ్చే 6-12 నెలల కాలంలో రూ. 8,02,874 కోట్ల మేర రెసిడెన్షియల్ ప్రాపర్టీ మార్కెట్ విలువ తుడిచిపెట్టుకుపోనుంది’ అని పేర్కొంది. దేశవ్యాప్తంగా 42 నగరాల్లో 22,202 మంది డెవలపర్లకు చెందిన 83,650 ప్రాజెక్టులకు సంబంధించిన రియల్ ఎస్టేట్ గణాంకాలు, విశ్లేషణను ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ ప్రాతిపదికన ప్రాప్‌ఈక్విటీ అందిస్తోంది. పీఈ ఆనలిటిక్స్ దీనికి మాతృ సంస్థ. అధ్యయన నివేదిక ప్రకారం 42 టాప్ నగరాల్లో ప్రస్తుతం రూ. 39,55,044 కోట్ల స్థారుులో ఉన్న రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ విలువ దాదాపు రూ. 8,02,874 కోట్ల మేర తగ్గి రూ. 31,52,170 కోట్లకు పడిపోనుంది. ఆయా నగరాల్లో 2008 తర్వాత నుంచి నిర్మాణం పూర్తరుున, నిర్మాణంలో ఉన్న, కొత్తగా నిర్మాణం ప్రారంభమవుతున్న దాదాపు 49,42,637 యూనిట్ల విలువను ప్రాప్‌ఈక్విటీ లెక్కగట్టింది. లెక్కల్లో చూపని ఆదాయాలను హడావుడిగా రియల్ ఎస్టేట్‌లోకి మళ్లించేందుకు చాలా మంది ప్రయత్నిస్తుండటంతో గడచిన 15 రోజుల్లో ఈ రంగంలో అసాధారణ స్థారుులో లావాదేవీలు జరిగాయని తెలిపింది. ముంబైలో అత్యధికంగా క్షీణత.. అన్ని నగరాలకన్నా అత్యధికంగా ముంబైలో ప్రాపర్టీల విలువ పతనం కానుంది. ముంబైలో మొత్తం మార్కెట్ వేల్యుయేషన్ గరిష్టంగా రూ. 2,00,330 కోట్లుగా ఉండనుంది. సుమారు రూ. 99,983 కోట్లతో బెంగళూరు, రూ. 79,059 కోట్ల క్షీణతతో గుర్గావ్ తర్వాత స్థానాల్లో ఉండనున్నారుు. ’భారత రియల్టీ మార్కెట్ ముందు ప్రస్తుతం సబ్-ప్రైమ్ స్థారుు సంక్షోభం ఉంది. ఇది అసంఘటిత రియల్ ఎస్టేట్, బ్లాక్ మనీ మొదలైన వాటి మూలాలపై తీవ్ర ప్రభావం చూపనుంది’ అని ప్రాప్‌ఈక్విటీ వివరించింది. రాబోయే రోజుల్లో సెకండరీ మార్కెట్ లావాదేవీల (రీసేల్స్) పరిమాణం కూడా గణనీయంగా తగ్గొచ్చని సంస్థ వ్యవస్థాపకుడు సమీర్ జసూజా పేర్కొన్నారు. లావాదేవీ మొత్తాన్ని పూర్తిగా చెక్ రూపంలో ఇచ్చేందుకు ప్రతి అరుుదుగురు కొనుగోలుదారుల్లో ఒక్కరు మాత్రమే సిద్ధంగా ఉంటారని ఆయన చెప్పారు. సాధారణంగా కనీసం 20 నుంచి 30 శాతం దాకా నగదు రూపంలో చాలా మంది నిర్వహించాలనుకుంటారని, కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో కొంతకాలం పాటు ఈ ధోరణి కనిపించకపోవచ్చని ఆయన తెలిపారు. ’ప్రస్తుత పరిణామాలను జీర్ణించుకుని సర్దుకునేందుకు రియల్ ఎస్టేట్ రంగానికి కొంత సమయం పడుతుంది కనుక రాబోయే వారాల్లో రీసేల్స్ దాదాపు నిల్చిపోవచ్చు’ అని జసూజా అభిప్రాయపడ్డారు. రియల్టీ పెట్టుబడులకు బెంగళూరు, ముంబై టాప్: పీడబ్ల్యూసీ వచ్చే ఏడాది ఆసియా-పసిఫిక్ (ఏపీఏసీ) ప్రాంతంలో రియల్టీ పెట్టుబడులకు సంబంధించి బెంగళూరు, ముంబై టాప్ నగరాలుగా నిల్చారుు. పీడబ్ల్యూసీ-అర్బన్ ల్యాండ్ ఇనిస్టిట్యూట్ రూపొందించిన నివేదిక ప్రకారం ఫిలిప్పీన్‌స రాజధాని మనీలా మూడో స్థానం దక్కించుకుంది. అటు వియత్నాంలోని హో చి మిన్ సిటీ, చైనాలోని షెంజెన్ వరుసగా ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారుు. మెరుగైన రాబడులనిచ్చే అధిక విలువ ప్రాపర్టీల అందుబాటు, కిరారుుకి డిమాండ్ పెరగడం, రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతుండటం వంటివి భారత్ రియల్టీ మార్కెట్‌కు ఊతమివ్వగలవని నివేదిక వివరించింది. -
ఇక ఇళ్ల ధరలు తగ్గించం: క్రెడాయ్
న్యూఢిల్లీ: ఇళ్ల ధరల తగ్గింపునకు ఇక ఎలాంటి అవకాశం లేదని రియల్టర్ల సమాఖ్య క్రెడాయ్ పేర్కొంది. కాగా ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ సోమవారం ఒకానొక సందర్భంలో చాలా మంది ప్రజలు ప్రాపర్టీని కొనుగోలు చేయడానికి అనువుగా రియల్ ఎస్టేట్ డెవలపర్లు ఇంటి ధరలను తగ్గించాలని కోరారు. దేశంలోని రియల్టీ ధరలు దాదాపు 20-30 శాతంమేర తగ్గాయని, ఇక అంతకు మించి ఇంకా ధరలు తగ్గే అవ కాశం లేదని క్రెడాయ్ పేర్కొంది. మళ్లీ ఏమైనా ధర తగ్గింపు జరిగితే ఎన్పీఏలు పెరిగే అవకాశముందని, ప్రాజెక్టుల డె లివరీ నిలిచిపోవచ్చని అభిప్రాయపడింది. -
హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 2% అప్
విజయవాడలో 0.6% క్షీణత ఎన్‌హెచ్‌బీ త్రైమాసిక నివేదిక న్యూఢిల్లీ: హైదరాబాద్, ఢిల్లీ, ముంబై సహా దేశవ్యాప్తంగా 12 ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు జనవరి - మార్చి క్వార్టర్లో 7.1 శాతం వరకు పెరిగాయి. డిమాండు పెరగడమే ఇందుకు కారణమని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) నివేదికలో తెలిపింది. ఇదే త్రైమాసికంలో మరో 12 నగరాల్లో ధరలు తగ్గాయని పేర్కొంది. అక్టోబరు - డిసెంబరు క్వార్టర్‌తో పోలిస్తే జనవరి - మార్చి మధ్యకాలంలో అహ్మదాబాద్‌లో 6.1, చెన్నైలో 5.8, కోల్‌కతాలో 5.1, లక్నోలో 4.9, రాయిపూర్లో 4.4, ముంబైలో 3.2, నాగ్‌పూర్‌లో 2.9, డెహ్రాడూన్‌లో 2.7, హైదరాబాద్‌లో 2.2, ఢిల్లీలో 1.5, భోపాల్‌లో 1.3 శాతం ధరలు వృద్ధిచెందాయి. ఇదేకాలంలో జైపూర్‌లో 3.8, గువాహటిలో 3.75, బెంగలూరులో 3.6, మీరట్‌లో 3.5, భువనేశ్వర్‌లో 3.47, లూధియానాలో 3.3, కోయంబత్తూరులో 1.7, విజయవాడలో 0.6 శాతం మేరకు ఇళ్ల ధరలు క్షీణించాయి. ఫరీదాబాద్, కోచ్చిల్లో రేట్లు స్థిరంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 26 నగరాల్లో వివరాలను సేకరించింది. రియల్టీలోకి రూ.4,800 కోట్లు మార్చి క్వార్టర్లో దేశీయ రియల్టీ రంగంలోకి సుమారు 80 కోట్ల డాలర్ల (రూ.4,800 కోట్లు) పెట్టుబడులు వచ్చాయని సీబీఆర్ఈ సౌత్‌ఆసియా ఓ ప్రకటనలో తెలిపింది. ప్రైవేట్ ఈక్విటీల రూపంలో ఈ పెట్టుబడులు పెట్టారని పేర్కొంది.