పెద్ద నోట్ల రద్దు అంశం గృహ నిర్మాణ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుంది. రాబోయే 6-12 నెలల కాలంలో దేశీయంగా 42 ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు దాదాపు 30 శాతం మేర పడిపోనున్నారుు. 2008 తర్వాత అమ్ముడైన, అమ్ముడవని రెసిడెన్షియల్ ప్రాపర్టీల మార్కెట్ విలువ సుమారు రూ. 8 లక్షల కోట్ల మేర తుడిచిపెట్టుకుపోనుంది. కన్సల్టెన్సీ సంస్థ ప్రాప్‌ఈక్విటీ ఈ మేరకు అధ్యయన నివేదిక విడుదల చేసింది. ’రియల్ ఎస్టేట్ రంగంపై డీమోనిటైజేషన్ దెబ్బతో వచ్చే 6-12 నెలల కాలంలో రూ. 8,02,874 కోట్ల మేర రెసిడెన్షియల్ ప్రాపర్టీ మార్కెట్ విలువ తుడిచిపెట్టుకుపోనుంది’ అని పేర్కొంది.
Published Fri, Nov 25 2016 7:46 AM | Last Updated on Thu, Mar 21 2024 9:55 AM
Advertisement
Advertisement
Advertisement