సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో గృహాల ధరలు 2 శాతం పెరిగాయి. అలాగే ప్రధాన నగరాల్లో అద్దెలు 5 శాతం పెరిగాయని తాజా అధ్యయనం తేల్చింది. ఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపదికన జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో అద్దెలు 5 శాతానికి పెరిగాయని రియాల్టీ పోర్టల్ 99 ఏకర్స్. కామ్ నివేదించింది. రియల్టీ సెక్టార్‌లో కొత్తగా తీసుకొచ్చిన రెరా చట్టం వినియోగదారుల్లో నమ్మకాన్ని పెంచిందని.. దీంతో ఈ ఫెస్టివ్ సీజన్‌లో అమ్మకాలు బావున్నాయని తెలిపింది.
జులై-సెప్టెంబరు త్రైమాసికంలో హైదరాబాద్ హౌసింగ్ మార్కెట్ క్యాపిటల్ విలువ 2 శాతం పెరగగా, అద్దెలు 5 శాతం పెరిగింది. రిపోర్టు ప్రకారం హౌసింగ్ ధర బెంగళూరులో 1 శాతం తగ్గింది. అయితే అద్దెలు 3 శాతం పెరిగాయి. ఢిల్లీ-ఎన్సిఆర్ మార్కెట్లో హౌసింగ్ ధరలు, అద్దెలు (సమీక్ష సమయంలో) స్థిరంగా ఉన్నాయని తెలిపింది. అటు ముంబైలో గృహాల ధరలు స్థిరంగా ఉన్నాయి కానీ అద్దెలు మాత్రం 2 శాతం పెరిగాయి. చెన్నైలో గృహాల ధరలు ఒక శాతం, అద్దెలు 2 శాతం పెరిగాయి. కోల్‌కతాలో గృహాల ధరలు, అద్దెలు వరుసగా 1 శాతం, 2 శాతం పెరిగాయి. పూణెలో అద్దెలు మాత్రం2 శాతం పెరిగింది.
భారతదేశంలోని ఎనిమిది మెట్రో నగరాల్లో నివాస మార్కెట్లో మూలధన విలువ , అద్దె ధరల ధోరణులపై సంస్థ త్రైమాసిక నివేదిక 'ఇన్‌సైట్’ను 99 ఏకర్స్ .కాంవిడుదల చేసింది. రియల్ ఎస్టేట్ మార్కెట్ లో బలహీనత ..పేలవమైన విక్రయాలకు దారితీసిందని నివేదించింది. అలాగే గృహనిర్మాణ ప్రాజెక్టులను పూర్తిచేయడంలో గణనీయమైన జాప్యంకారణంగా ధరలు కూడా పడిపోవడం లేదా స్థిరంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఈ పండుగ సీజన్లో కొనుగోళ్లు పుంజుకునే అవకాశం ఉందని సంస్థ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నరసింహ జయకుమార్ అన్నారు. అంతేకాకుండా, ఇంతకుముందెన్నడూ లేనంతగా వడ్డీ రేట్లు వినియోగదారులకి అనుకూలంగా ఉన్నాయనీ, ఇది రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు మంచి పరిణామమని వ్యాఖ్యానించారు.
కాగా రియల్ ఎస్టేట్ సొల్యూషన్స్ కోసం నెలకు 99 లక్షల మందికి 99 ఏకర్స్ సైట్‌ను సందర్శిస్తుండగా..దాదాపు 8 లక్షలకు పైగా కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఇక్కడ లిస్ట్ అయి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment