న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతమైన గురుగ్రామ్, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ (ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతం) పరిధిలో గడిచిన ఐదేళ్ల కాలంలో కొత్త ప్రాజెక్టుల్లోని ఇళ్ల ధరలు సగటున రెట్టింపైనట్టు రియల్ ఎస్టేట్ డేటా అనలైటిక్ సంస్థ ప్రాప్ ఈక్విటీ తెలిపింది. 2019 నుంచి 2024 సెప్టెంబర్ మధ్య కాలంలో నోయిడాలో అత్యధికంగా చదరపు అడుగు (ఎస్‌ఎఫ్‌టీ) ధర 152 శాతం మేర పెరిగి రూ.5,910 నుంచి రూ.14,946కు చేరింది.
ఘజియాబాద్‌లో 139 శాతం పెరిగి రూ.3,691 నుంచి రూ.8,823కు చేరింది. గురుగ్రామ్‌లో ఎస్‌ఎఫ్‌టీ ధర రూ.19,535కు చేరింది. 2019లో ఉన్న రూ.8,299తో పోల్చి చూస్తే 135 శాతం పెరిగింది. గ్రేటర్ నోయిడాలో చదరపు అడుగు ధర 121 శాతం పెరిగి రూ.8,601గా ఉంది. 2019లో ఇక్కడ చదరపు అడుగు రేటు రూ.3,900గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment