
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వరద బాధితుల సహాయార్థం రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం ప్రకటించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.20 కోట్లు అందజేసింది. ఈమేరకు రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు చైర్‌పర్సన్ నీతా అంబానీ తరపున జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్‌ను అందజేశారు.
వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రిలయన్స్ ఫౌండేషన్‌ను అభినందించారు. సీఎంని కలిసినవారిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, బోర్డు సభ్యుడు పీఎంఎస్ ప్రసాద్, రిలయన్స్ గ్రూప్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మెంటార్ పీవీఎల్ మాధవరావు ఉన్నారు.
