సాక్షి, హైదరాబాద్: వరద సహాయక చర్యల నిమిత్తం పలు సంస్థల నుంచి ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు వెల్లువలా వస్తున్నా యి. జీఎంఆర్ గ్రూప్ సంస్థల నుంచి రూ.2.5 కోట్లు విరాళంగా ప్రకటించారు. కెమిలాయిడ్స్ కంపెనీ చైర్మన్ రంగరాజు రూ.కోటి విరాళం ఇవ్వగా, శ్రీచైతన్య విద్యాసంస్థలు రూ.కోటి, విర్కో ఫార్మా రూ.కోటి, అపోలో హాస్పిటల్స్ జేఎండీ సంగీతారెడ్డి రూ.కోటి విరాళంగా అందజేసినట్లు శుక్రవారం సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
అలాగే భువనగిరి ఎంపీ చామల కిరణ్‌రెడ్డి వరద బాధితులకు తన వంతుగా నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో ము ఖ్యమంత్రి ప్రత్యేక అధికారి (ఓఎస్డీ) వేముల శ్రీనివాసులును కలిసి రూ.1.85 లక్షల చెక్కు ను అందజేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వాణిజ్య సంఘాలు, కార్పొరేట్ సంస్థలు తమ వంతు విరాళాలు ఇచ్చి వరద బాధితుల పక్షాన నిలవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment