Breadcrumb
Atmakur Bypoll Results 2022 Updates: 82 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో వైఎస్సార్సీపీ విజయం
Published Sun, Jun 26 2022 7:20 AM | Last Updated on Sun, Jun 26 2022 3:04 PM
Live Updates
ఆత్మకూరు ఉప ఎన్నిక లెక్కింపు
ఆత్మకూరులో ఫ్యాన్ ప్రభంజనం
ఆత్మకూరు ఉపఎన్నిక: ఫ్యాన్ జోరులో కొట్టుకుపోయిన కమలం
ఆత్మకూరు ఉపఎన్నికలో బీజేపీ ఏ రౌండ్లోనూ వైఎస్సార్సీపీకి పోటీ ఇవ్వలేక చతికిలపడిపోయింది. ఈ ఫలితంతో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పార్టీ వరుస ఓటముల పాలైంది. గతంలో తిరుపతి, బద్వేలు, తాజాగా ఆత్మకూరులో అదే ఫలితం పునరావృతం అయ్యింది. ఈ ఉపఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి 82,888 ఓట్ల మెజారిటీని దక్కించుకున్నారు.
మేకపాటి విక్రమ్‌రెడ్డికి పోలైన ఓట్లు- 102240, (మెజారిటీ -82,888) బీజేపీ అభ్యర్థి భరత్కుమార్కి పోలైన ఓట్లు- 19352 ,
ఆత్మకూరు ఉప ఎన్నిక: వైఎస్సార్సీపీ భారీ విజయం
ఆత్మకూరు ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ భారీ విజయం సాధించింది. వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి 82వేలకు పైగా ఓట్ల మెజారిటీతో అఖండ విజయాన్ని అందుకున్నారు. ఉప ఎన్నికలో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ డిపాజిట్ కోల్పోయారు.
ఆత్మకూరు ఉప ఎన్నిక: డిపాజిట్ కోల్పోయిన బీజేపీ
ఆత్మకూరు ఉప ఎన్నిక ఫలితం ఏకపక్షంగా సాగడంతో వైఎస్సార్సీపీ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో బీజీపీ డిపాజిట్ కోల్పోయింది.
19వ రౌండ్: 80వేలు దాటిన వైఎస్సార్సీపీ మెజారిటీ
రౌండ్ రౌండ్‌కి భారీగా ఆధిక్యంతో వైఎస్సార్సీపీ దూసుకుపోతోంది. 19 రౌండ్లు పూర్తయ్యేసరికి విక్రమ్‌రెడ్డికి 80,161 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
18వ రౌండ్: 75 వేలు దాటిన వైఎస్సార్సీపీ మెజారిటీ
18 రౌండ్లు పూర్తయ్యేసరికి విక్రమ్‌రెడ్డికి 75,785 ఓట్ల ఆధిక్యం
70 వేలు దాటిన వైఎస్సార్సీపీ మెజారిటీ
ఆత్మకూరు ఉప ఎన్నికలో రౌండ్ రౌండ్‌కు వైఎస్సార్సీపీ అధిక్యంతో దూసుకుపోతోంది. 17 రౌండ్లు పూర్తయ్యేసరికి విక్రమ్‌రెడ్డికి 71,887 ఓట్ల అధిక్యం
16 రౌండ్లు కౌంటింగ్ పూర్తి
16 రౌండ్లు పూర్తయ్యేసరికి 66,477 ఓట్ల ఆధిక్యంతో భారీ మెజారిటీ దిశగా వైఎస్సార్సీపీ దూసుకుపోతోంది.
పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ భారీ ఆధిక్యం
పోస్టల్ బ్యాలెట్లో వైఎస్సార్సీపీ భారీ ఆధిక్యం లభించింది. మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 217, అందులో
పోస్టల్ బ్యాలెట్లలో చెల్లిన ఓట్లు- 205. వైఎస్సార్సీపీకి పోలైన ఓట్లు-167
భారీ మెజారిటీ దిశగా వైఎస్సార్సీపీ
ఆత్మకూరు ఉపఎన్నిక ఫలితం ఏకపక్షంగా సాగుతోంది. 13 రౌండ్లు పూర్తయ్యేసరికి విక్రమ్‌రెడ్డికి 54,448 ఓట్ల ఆధిక్యం
12వ రౌండ్: 50 వేలు దాటిన వైఎస్సార్సీపీ మెజారిటీ
12 రౌండ్లు పూర్తయ్యేసరికి విక్రమ్‌రెడ్డికి 50,654 ఓట్ల ఆధిక్యం
11 రౌండ్లోనూ వైఎస్సార్సీపీ హవా
11 రౌండ్లు పూర్తయేసరికి 46,604 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్సీపీ
పదో రౌండ్: వైఎస్సార్సీపీ 42 వేల మెజారిటీ
10 రౌండ్లు పూర్తయ్యేసరికి విక్రమ్‌రెడ్డికి 42, 254 ఓట్ల ఆధిక్యం
8,9 రౌండ్లలోనూ వైఎస్సార్సీపీదే హవా
8 రౌండ్ పూర్తయ్యేసరికి విక్రమ్‌రెడ్డి 32,892 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, 9 రౌండ్ పూర్తయ్యేసరికి 37,609 ఓట్ల ఆధిక్యంతో భారీ మెజారిటీ దిశగా వైఎస్సార్సీపీ దూసుకుపోతోంది.
ఏడో రౌండ్లో వైఎస్సార్సీపీ హవా
ఏడో రౌండ్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డికి 28వేలకు పైగా మెజారిటీ
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా
ఆరు రౌండ్లు పూర్తయ్యే సరికి వైఎస్సార్సీపీ హవా కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి 31వేలకు పైగా మెజారిటీ సాధించారు.
కౌంటింగ్ హాల్ నుంచి వెళ్లిపోయిన బీజేపీ అభ్యర్థి
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి ప్రతీ రౌండ్లోనూ స్పష్టమైన ఆధిక్యం సాధించి భారీ మెజారిటీ దిశగా దూసుకుపోతోంది. కాగా, బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ కౌంటింగ్ హాలు నుంచి వెళ్లిపోయారు.
ఐదో రౌండ్: వైఎస్సార్సీపీకి 21 వేలకు పైగా మెజారిటీ
ఐదో రౌండ్ పూర్తయ్య సరికి వైఎస్సార్సీపీకి 21, 241 ఓట్ల మెజారిటీ. ఆది నుంచి ఆధిక్యంలో కొనసాగుతున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి విక్రమ్‌రెడ్డి ఐదో రౌండ్లోనూ హవా కొనసాగించారు.
17వేలకు పైగా ఆధిక్యంలో విక్రమ్‌రెడ్డి
నాల్గో రౌండ్ పూర్తయ్యే సరికి 17వేలకు పైగా ఆధిక్యంలో మేకపాటి విక్రమ్‌రెడ్డి
ఆత్మకూరు ఉప ఎన్నిక: భారీ మెజారిటీ దిశగా వైఎస్సార్సీపీ
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ మెజారిటీ దిశగా దూసుకుపోతుంది. మూడో రౌండ్ పూర్తయ్యే సరికి వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి 12, 864 ఓట్ల మెజారిటీ సాధించి భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతున్నారు.
రెండో రౌండ్: విక్రమ్‌రెడ్డికి 10వేలకు పైగా మెజారిటీ
రెండో రౌండ్ పూర్తయ్యే సరికి వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డికి 10వేలకు పైగా మెజారిటీ. మూడో రౌండ్లోనూ ఆధిక్యంలో కొనసాగుతున్న విక్రమ్‌రెడ్డి.
తొలిరౌండ్లోనే వైఎస్సార్సీపీకి 5వేల ఓట్ల మెజార్టీ
తొలిరౌండ్లోనే వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డికి 5,337వేల ఓట్ల మెజార్టీ లభించింది. మేకపాటి విక్రమ్‌రెడ్డికి 6 వేలకు పైగా ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్‌కు 700 పైచిలుకు ఓట్లు వచ్చాయి.
ఆత్మకూరు ఉపఎన్నిక కౌంటింగ్ ప్రారంభం
ఆత్మకూరు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం
ఆత్మకూరు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఆంధ్రా ఇంజినీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది.
పోటీలో 14 మంది అభ్యర్థులు
రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం కారణంగా ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి, బీజేపీ నుంచి భరత్‌కుమార్ యాదవ్ సహా మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
20 రౌండ్లలో ఓట్ల లెక్కింపు
ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. 14 టేబుళ్ల ద్వారా 20 రౌండ్లలో లెక్కించనున్నారు. రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపుతో ప్రక్రియ మొదలై మధ్యాహ్నానికి ముగియనుంది.
8 గంటల నుంచి ఆత్మకూరు ఉప ఎన్నిక లెక్కింపు
నెల్లూరు: ఆత్మకూరు ఉపఎన్నిక ఫలితం ఆదివారం వెలువడనుంది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది.
Related News By Category
Related News By Tags
-
గౌతం అన్న పేరు నిలబెడతాను: మేకపాటి విక్రమ్ రెడ్డి
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి భారీ మెజార్టీ విజయాన్ని అందుకున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం మేకపాటి విక్రమ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్ను గెలిపించిన ఆత్మకూర...
-
ఆత్మకూరు ఉప ఎన్నిక: భారీ మెజార్టీతో మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపు
ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ పార్టీ భారీ విజయాన్ని అందుకుంది. ఏకపక్షంగా సాగిన ఈ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి.. 82,888 ఓ...
-
ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభం
సాక్షి, నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీకి అధికారులు ఎన్నికల సామాగ్రిని తరలించారు. 279 పోలింగ్ కేంద్రాల్లో 377 ఈవీఎంలను ఎన్నికల అధికారులు సిద్ధ...
-
ఆత్మకూరు ఉప ఎన్నిక: పోలింగ్‌కు ఏర్పాటు పూర్తి
ఆత్మకూరు: ఈ నెల 23న జరగనున్న ఆత్మకూరు శాసనసభ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రిటర్నింగ్ అధికారి, జేసీ ఎంఎన్ హరేందిర ప్రసాద్ తెలిపారు. ఆత్మకూరు ఆర్డీఓ క...
-
ఆత్మకూరు ఉప ఎన్నిక.. సంకటస్థితిలో బీజేపీ!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచార ఘట్టం మంగళవారం సాయంత్రానికి ముగిసింది. చివరి క్షణం వరకు రాజకీయ పార్టీ అగ్రనేతల హడావుడి కొనసాగింది. మంగళవారం సాయంత్రం 6 గంటలతో ప్రచారం పూర్తి కావడ...
Comments
Please login to add a commentAdd a comment