ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై రాయితో దాడికి పాల్పడ్డాడు ఓ ఆగంతకుడు. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా సింగ్‌నగర్‌కు చేరుకున్న క్రమంలో సీఎం జగన్‌పై రాయితో దాడి చేశారు. బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో సీఎం జగన్‌పై దాడి జరిగింది. ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు తాకింది. ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సుయాత్ర కొనసాగింది.
అనంతరం వైద్యుల సలహామేరకు మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి కేసరపల్లి క్యాంప్‌నుండి సీఎం జగన్ చేరుకున్నారు. అక్కడ వైద్యులు సీఎం జగన్ గాయానికి తదుపరి చికిత్స చేశారు. గాయానికి రెండు కుట్లు పడ్డాయని వైద్యులు తెలిపారు. వైద్యుల చికిత్స అనంతరం సీఎం జగన్ కేసరపల్లికి బయల్దేరారు. సీఎం జగన్‌తో పాటుగా వైఎస్ భారతీ ఉన్నారు.
గాయం కారణంగా సీఎం వైయస్ జగన్‌ను విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచించారు. దీంతో నేడు సీఎం జగన్ యాత్రకు విరామం ప్రకటించారు. తదుపరి కార్యక్రమాన్ని ఆదివారం విడుదల చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
కాగా, సీఎం జగన్‌పై దాడి ఘటన నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు స్పందించారు. ట్విట్టర్ వేదికగా కేటీఆర్..‘జగన్ అన్నా జాగ్రత్తలు తీసుకోండి. మీరు సురక్షితంగా ఉన్నారు సంతోషం. సీఎం జగన్‌పై జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు. ఎన్నికల సంఘం ద్వారా కఠినమైన చర్యలు చేపట్టాలని నేను ఆశిస్తున్నాను’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
Glad you are Safe. Take care @ysjagan Anna
— KTR (@KTRBRS) April 13, 2024
Strongly condemn the attack on AP CM Jaganmohan Reddy Garu.
Violence has no place in democracy and I hope strict preventive measures are put in place by ECI pic.twitter.com/fTBTe17I2T
మరోవైపు హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘సీఎం జగన్‌పై దాడి హేయమైన చర్య. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు’ అని పేర్కొన్నారు. ఘటనకు బాధ్యులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సైతం జగన్‌పై దాడిని ఖండించారు. రాజకీయ విభేదాలు ఎప్పుడూ హింసాత్మకంగా మారకూడదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు సభ్యత, పరస్పర గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు.
I condemn the stone-throwing on Hon'ble Andhra Pradesh CM Thiru @ysjagan.
— M.K.Stalin (@mkstalin) April 13, 2024
Political differences should never escalate to violence. Let's uphold civility and mutual respect as we engage in the democratic process. Wishing him a quick recovery. https://t.co/YtYoOJbVy1
సీఎం జగన్‌పై రాయితో జరిగిన దాడి ప్రధాని నరేంద్ర మోదీ స్పంధించారు. సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నానంటూ ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
I pray for the speedy recovery and good health of Andhra Pradesh CM @ysjagan Garu.
— Narendra Modi (@narendramodi) April 13, 2024
అంబటి రాంబాబు మాట్లాడుతూ.. సీఎం జగన్‌పై దాడి చంద్రబాబు పనే అన్నారు. ఈ ఘటన బాబు ప్రోద్భలంతోనే జరిగింది. చంద్రబాబు దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు చేయడం సరికాదు. చంద్రబాబు, పవన్, బిజెపి ముగ్గురూ కలిసినా జగన్‌ను ఏమీ చేయలేరు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదని అంబటి రాంబాబు అన్నారు.
పేర్ని నాని మాట్లాడుతూ.. సీఎం జగన్కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక ఇలా దాడులు చేయడానికి తెగబడ్డారు. ఎంతమంది కలి వచ్చినా జగన్‌ను ఏమీ చేయలేక రాళ్ల దాడి చేశారు. సీఎం జగన్‌కు లోతుగా గాయమైంది. రెండు కుట్లు పడే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. తల నుంచి రక్తం కారుతుంటే వైద్యులు ప్రధమ చికిత్స చేశారు. త్వరలోనే సీఎం జగన్‌పై ఎవరు దాడి చేయించారో అన్నీ బయటకు వస్తాయి అన్నారు.
మేకపాటి విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్‌పై జరిగిన దాడిని ఖండిస్తున్నా. సీఎంపై టీడీపీ గూండాలు దాడి చేయడం అమానుషం. ఇలాంటి దాడులు చేయడమే టీడీపీ పాలసీ. ఎన్నికల్లో ఓటమి తప్పదని టీడీపీ నేతలు ఇలా దాడులకు తెగబడుతున్నారు అని విక్రమ్‌రెడ్డి అన్నారు.
ట్విట్టర్లో రాజ్యసభ సభ్యులు, ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి..
► రాష్ట్ర ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.
► చంద్రబాబు నాయుడు ఏనాడు అభివృద్ధి నమ్ముకుని రాజకీయాలు చెయ్యలేదు.
► హింస, కుట్రలు, కుతంత్రాలు నమ్ముకుని పిరికిపంద రాజకీయాలు చేస్తున్నారు.
► చంద్రబాబు పిరికిపంద రాజకీయాలు చేస్తున్నారని ఇవాళ జరిగిన దాడితో మరోసారి రుజువైంది.
నారాయణ స్వామి,డిప్యూటీ సీఎం కామెంట్స్
► మానవ జన్మ ఎత్తున చంద్రబాబు నాయుడు నరరూప రాక్షసుడు
► సిఎం జగన్ మోహన్ రెడ్డి కు బస్సు యాత్ర లో వస్తున్న ప్రజాభిమానం చూసి తట్టుకోలేక రాళ్ళ దాడి చేయించాడు
► నర హంతకుడు చంద్రబాబు నాడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచాడు, ఇప్పుడు ప్రజాభిమానంతో దూసుకువెళ్తున్న జగన్ యాత్ర పై రాళ్ళ దాడి చేయించాడు
► చంద్రబాబు ను ప్రజలు క్షమించరు, రానున్న ఎన్నికలలో ప్రజలు తగిన బుద్ధి చెప్తారు
► మా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎంతో సహనంతో ఉండమంటున్నారు, చంద్రబాబుకు ప్రజలే మీ అంతుచూస్తారు
► మా ముఖ్యమంత్రి కి ఏదైనా జరిగితే మేమే మీ అంతు చూస్తాం అంటూ హెచ్చరిక
మాజీమంత్రి బాలినేని కామెంట్స్
► విజయవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి పై దాడి హేయమైన చర్య
► దాడి వెనుక కుట్రకోణం ఉంది..పూర్తి స్థాయి విచారణ జరగాలి
► దాడులతో ఎన్నికలలో గెలవాలని చంద్రబాబు చూస్తున్నారు
► దాడులు చేసి వైఎస్సార్సీపీని బయపెట్టాలనేది మీ భ్రమ
► చంద్రబాబు కి మతి భ్రమించింది....ప్రస్ట్రేషన్ లో చంద్రబాబు ఏమి చేస్తున్నాడో ఆయనకే తెలియదు
► బస్సు యాత్రలో జగన్మోహన్ రెడ్డి కి వస్తున్న ప్రజాదరణ చూసి టీడీపీ ఓర్వలేకపోతోంది
► టీడీపీ సభలకు జనం రాకపోవడం తో చంద్రబాబు కి ఫ్రైస్ట్రేషన్ ఎక్కువైంది
సీఎం జగన్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గం ఇంచార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి..
► పక్క ప్లాన్ ప్రకారమే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై టిడిపి గుండాలు రాళ్లతో దాడి చేశారు
► సీఎం జగన్కు వస్తున్న ఆదరణను చూసి టిడిపి నేతల కడుపు మండుతోంది.. వచ్చే ఎన్నికల్లో టిడిపికి ప్రజలు సరైన గుణపాఠం చెబుతారు
సీఎం జగన్ పై దాడిని ఖండించిన ప్రభుత్వ విప్ భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్
► విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ప్రతిపక్షాలు దాడి చేయడం దారుణం
► ప్రజాదారణ కలిగిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కొనలేక ఇటువంటి దాడులు చేయడం సిగ్గుచేటు
► రాష్ట్రంలో 175 సీట్లకు గాను 175 సీట్లను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెలుచుకుంటున్నారని అనేక సర్వేల ఫలితాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు వైసిపికి రాబోయే విజయాన్ని తట్టుకోలేకపోతున్నాయి
► ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి దిగిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేసిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్
ముఖ్యమంత్రి మీద భౌతిక దాడులు చేసే స్థాయికి దిగజారిపోయారు: హోం మంత్రి తానేటి వనిత
► బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్ పై టిడిపి నాయకులు చేసిన రాళ్లదాడిని ఖండిస్తున్నా
► జగనన్న బస్సు యాత్ర ఎంతో ప్రజాధరణ పొందడం చూడలేక దాడికి దిగారు
► ఒంటరిగా జగనన్నను ఢీకొట్టలేక నిన్న మొన్న జనసేన ను తెచ్చుకున్నా ఏమీ చేయలేకపోయారు
► తాజాగా బిజెపితో జతకట్టిన మైలేజ్ సాధించలేకపోయారు
► జగన్ను ఏమీ చేయలేని పరిస్థితుల్లో షర్మిలమ్మను ఇంటి నుంచి బయటకు లాగి కాంగ్రెస్లో పెట్టారు
► ఎంతసేపు జగన్ మీద రాజకీయంగా కుట్ర చేయాలి అదే వారి ఆలోచన
సీఎం జగన్ పై దాడి పిరికిపంద చర్య: అవంతి శ్రీనివాస్ మాజీ మంత్రి
► సీఎం జగన్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
► దాడులు తెలుగుదేశం పార్టీ సంస్కృతి
► గత కొన్ని రోజుల నుంచి టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు లోకేష్ రెచ్చగొడుతున్నారు
► సీఎం జగన్ కు ప్రపంచవ్యాప్తంగా కరుడుగట్టిన అభిమానులు ఉన్నారు
► వారు కూడా తిరిగి దాడులు చేస్తే టిడిపి నేతలు పరిస్థితి ఏంటి
► దాడులు అనేవి వైఎస్ఆర్సిపి సంస్కృతి కాదు
సీఎం జగన్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: గుడివాడ అమర్నాథ్
► చంద్రబాబు పాతకాలపు రాజకీయాలను మానుకోవాలి
► సీఎం జగన్ పై దాడి చేస్తే భయపడతారని చంద్రబాబు భ్రమ పడుతున్నారు
► గతంలో వంగవీటి రంగాను చంద్రబాబు కిరాతకంగా చంపించారు
► నేడు మళ్లీ సీఎం జగన్ పై విజయవాడలో దాడి చేయించారు
► దాడులు చేయిస్తే సీఎం సభలు సమావేశాలు నిర్వహించరని చంద్రబాబు భ్రమ పడుతున్నారు
► మూడు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్న చంద్రబాబు సభలకు జనాలు రావడం లేదు
► ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులకు పాల్పడుతున్నారు
► చంద్రబాబు రోడ్లు మీద తిరుగుతున్నారు
► మేము దాడులు చేయాలంటే నిమిషం పని..దాడులు చేయడం వైఎస్ఆర్సిపి సంస్కృతి కాదు
► 2019 ఎన్నికల ఫలితాలే మళ్లీ పునరావతమవుతాయి
Comments
Please login to add a commentAdd a comment