
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి కలిశారు. ఆత్మకూరు ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలిచిన విక్రమ్‌రెడ్డిని సీఎం జగన్ అభినందించారు. ఎమ్మెల్యే వెంట మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారు.
చదవండి: జగన్ మావయ్యా.. మీరు మాలాంటి పిల్లలకు విద్యాదేవుడు
ఈ సందర్భంగా విక్రమ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ప్రతి ఇంటికి జగనన్న అండగా నిలిచారని.. ప్రజల్లోకి సంక్షేమ పథకాలు వెళ్లాయి అనడానికి ఆత్మకూరు ఫలితాలే నిదర్శనమన్నారు. ప్రచారం సందర్భంగా గడప గడపకి వెళ్లినపుడు స్పష్టంగా కనిపించిందని.. అందుకే ఇంత పెద్ద మెజార్టీతో ప్రజలు ఆదరించారన్నారు. నియోజకవర్గంలో చేయాల్సిన పనుల గురించి సీఎం చర్చించారన్నారు. పారిశ్రామిక ప్రగతి పై దృష్టి పెడుతున్నానని, నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. జులైలో అన్న గౌతమ్ రెడ్డి పేరుపై ఉన్న సంగం బ్యారేజినీ సీఎం ప్రారంభిస్తారని ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment