సాక్షి, అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అత్యంత బాధ్యతతో వ్యవహరిస్తూ ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా.. ఎల్లో మీడియాలో వస్తున్న వార్తలపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ఆయన ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. 'కరోనా వైరస్ నిర్మూలనతో పాటు ఎల్లో వైరస్ వ్యాప్తిని కూడా నియంత్రించాలి. ఎల్లో మీడియా తుమ్ములు, దగ్గులతో పచ్చ వైరస్‌ను వదులుతూనే ఉంది. అధికార పీఠం నుంచి తరిమివేసినా చంద్రబాబు బ్యాచ్ తమ మీడియాను అడ్డం పెట్టుకుని ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తోంది. తస్మాత్ జాగ్రత్త! అంటూ ప్రజలకూ సూచించారు.
మరో ట్వీట్‌లో.. అత్యంత బాధ్యతతో వ్యవహరించే జగన్ గారి పాలనలో ఉన్నందుకు రాష్ట్ర ప్రజలు సంతోషించాలి. అనుభవజ్ఞుడు అని చెప్పుకునే వ్యక్తిని తరిమేసి ఉండకపోతే ఇవాళ కరోనా నియంత్రణ కంటే తన ప్రచారం ఎక్కువగా ఉండేది. జాగ్రత్తల పేరుతో వాణిజ్య ప్రకటనలు జారీ చేసి పచ్చమీడియాకు వేల కోట్లు దోచి పెట్టేవాడు' అంటూ చంద్రబాబుపై ట్విటర్ వేదికగా మండిపడ్డారు. చదవండి: చంద్రబాబు భయపడిందక్కడే..
కాగా మరో ట్వీట్‌లో.. 'పవర్ పోయిన దిగులులో ఉన్నాడు కానీ లేకపోతే జనతా కర్ఫ్యూ ఐడియా ప్రధానికిచ్చింది తనేనని బొంకేవాడు. చైనా ప్రెసిడెండ్‌కు ధైర్యం చెప్పిన బాబు అంటూ ఎల్లో మీడియా రోజంతా దంచేది. వీడియో కాన్ఫరెన్సులతో అధికారులను ఏడిపించేవాడు. నిధులు నాకేందుకు రకరకాల స్కీమ్స్ మొదలయ్యేవి' అంటూ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment