అంత మంచి ఆఫర్‌ను వద్దంటే నన్నేమనేవారు?: వైఎస్‌ జగన్‌ | Adani Row: AP EX CM YS Jagan Reacts on Power Sale Agreement Allegations | Sakshi
Sakshi News home page

అంత మంచి ఆఫర్‌ను తిరస్కరించి ఉంటే నన్నేమనేవారు?: వైఎస్‌ జగన్‌

Published Thu, Nov 28 2024 5:11 PM | Last Updated on Thu, Nov 28 2024 5:37 PM

Adani Row: AP EX CM YS Jagan Reacts on Power Sale Agreement Allegations

గుంటూరు, సాక్షి: విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల విషయంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని బద్నాం  చేసేందుకు జరుగుతున్న కుట్రలను.. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎండగట్టారు. ఒప్పందం జరిగింది కేంద్ర ప్రభుత్వం(సెకి), రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమేనని.. ఏపీ చరిత్రలోనే నిలిచిపోయే అత్యంత చవకైన ఈ ఒప్పందంపై బురద జల్లుతూ రాతలు రాయడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారాయన. తాడేపల్లిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

‘‘రైతులకు ఉచిత కరెంట్‌ అనేది ఒక కల. దీనివల్ల రైతుల పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి. బాబు హయాంలో డిస్కంల పరిస్థితి దయనీయంగా మారింది. డిస్కంలను నిర్వీర్యం చేశారాయన. చంద్రబాబు చేసిన సోలార్‌ పవర్‌ ఒప్పందాలు రూ.5.90తో చేసుకున్నారు. డిస్కంల అప్పులను 86 వేల కోట్లకు పెంచారు. మా హయాంలో డిస్కంలను నిలబెట్టే ప్రయత్నం చేశాం. పగటి పూటే రైతులకు 9 గంటల కరెంట్‌ ఇవ్వగలిగాం. ఉచిత కరెంట్‌ కోసం రూ.9 వేల కోట్లు ఖర్చు చేశాం. ఆ టైంలో యూనిట్‌ను 2.40 నుంచి 2.50 రూ. చొప్పున సప్లై సేందుకు 24 బిడ్లు వచ్చాయి. కానీ, చంద్రగ్రహణం(చంద్రబాబును ఉద్దేశించి).. ఆ ప్రక్రియకు అడ్డం పడింది. కోర్టుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనికోసం మేం వివిధ కోర్టులో పోరాడాల్సి వచ్చింది. అలాంటి టైంలో..

.. 2021 సెప్టెంబర్‌ 15వ తేదీన కేంద్ర ప్రభుత్వం (సెకి) నుంచి తియ్యటి కబురుతో ఓ లేఖ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను పొగుడుతూ.. రైతుల పట్ల ప్రదర్శిస్తున్న ప్రత్యేక శ్రద్ధను సెకీ అభినందించింది. యూనిట్‌కు రూ.2.49కే.. మొత్తంగా 9 వేల మెగా వాట్ల పవర్‌ను అందుబాటులోకి ఇస్తాం అంటూ పేర్కొంది. ఇందులో 2024 సెప్టెంబర్‌లో 3 వేల మెగా వాట్ల విద్యుత్‌ అందుబాటులోకి వస్తుందని చెప్పింది. ఇది ఏపీ చరిత్రలోనే అతితక్కువ ధరకు అందించిన పవర్‌ ఆఫర్‌ ఇది.

.. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రశంసిస్తూ.. ఆ సంకల్పానికి తోడుగా ఉంటామని లేఖ రాసింది. మేమే పవర్‌ సప్లై చేస్తామని చెప్పింది. ఇక్కడ మూడో పార్టీ ఎక్కడుంది?. రెండోది.. రూ.2.49కి  అందుబాటులోకి ఇస్తాం అంటూ పేర్కొంది. ఇది ఏపీ చరిత్రలోనే అతితక్కువ ధరకు అందించే ఒప్పందం. ఐఎస్‌టీఎస్‌ (ఇంటర్‌ స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ ఛార్జీలు) ఛార్జీలు లేకుండా(యూనిట్‌కు రూ.1.98పైసా చొప్పున).. స్పెషల్‌ ఇంటెన్సివ్‌ ఇస్తానంది. ఇక్కడ.. యూనిట్‌ రూ.2.61 మనకు కలిసి వస్తుంది. ఏడాది 4,400 కోట్లు కలిసి వస్తాయి. ఒప్పందం ప్రకారం పాతికేళ్లకు.. లక్షల కోట్లు కలిసి వచ్చేవి.

.. ఏపీ చరిత్రలోనే అత్యంత చవకైన విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం ఇది. లక్షల కోట్లు ఆదాయం ఆదా కావడం సంపద సృష్టి కాదా?. 
ఇది చరిత్రలో నిలిచిపోయే ఒప్పందం. ఇలాంటి ఒప్పందానికి స్పందించకున్నా.. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా ఊరుకునేవా?. నన్ను ఏమనేవారు.

.. చంద్రబాబు హయాంలో చేసుకున్న విండ్‌, సోలార్‌ పవర్‌ ఒప్పందాలతో ఏపీకి అదనపు భారం పడింది. చంద్రబాబు పీపీఏల వల్ల రూ.2 వేల కోట్ల భారం పడింది. అదనంగా రూ.3.41రూ. కట్టాల్సి వచ్చింది.  రూ.5.90 తక్కువా? రూ.2.49 తక్కువా?. అంత దిక్కుమాలిన రేట్లకు ఒప్పందాలు చేసిన చంద్రబాబు మంచోడా?. ఇంత తక్కువ ధరకు ఆఫర్‌కు స్పందించి.. రాష్టట్రానికి మంచి జరిగే ఒప్పందం చేసుకున్న నేను మంచివాడినా?.  జగన్‌ ఆలోచనలతో.. 25 ఏళ్లకు లక్షల కోట్ల ఆదాయం కలిసొస్తే.. చంద్రబాబు ఒప్పందాలతో అదే పాతికేళ్లకు 87 వేల కోట్ల సంపద ఆవిరి అయ్యేది. సంపదను ఆవిరి చేసిన చంద్రబాబు మంచోడా?. భవిష్యత్తు కోసం ఆలోచించిన నేను మంచోడినా?. చంద్రబాబు తెలిసి చేస్తోంది ధర్మమేనా?. 

.. కేంద్రం ప్రతిపాదన టైంలోనే.. కేబినెట్‌ సమావేశం జరిగింది. సెకి ప్రతిపాదనపై.. మంచి చెడులు చెప్పాలని ఇంధన శాఖను ఆదేశించాం. సుమారు 40 రోజలు అధ్యయనం జరిగింది. కేబినెట్‌ సుదీర్ఘంగా చర్చించి జరిపిన ఒప్పందం ఇది. 2021 నవంబర్‌ 11న ఏపీఈఆర్సీ అనుమతించింది. ఏపీ గవర్నమెంట్‌(+డిస్కంలు), సెకి మధ్య జరిగిన ఒప్పందమే ఇది.  2021 డిసెంబర్‌ 1వ తేదీన జరిగిన ఈ పవర్‌ సేల్‌ అగ్రిమెంట్‌లో మూడో పార్టీనే లేదు. చారిత్రక ఘట్టం జరిగితే.. దుష్‌ప్రచారం చేస్తున్నారు ’’ అని జగన్‌ స్పష్టం చేశారాయన.

ఇదే సెకి మరికొన్ని స్టేట్స్‌తో కూడా పవర్‌ సేల్‌ ఒప్పందం చేసుకుంది. అన్నింటికంటే తక్కువ ఇచ్చింది ఏపీకే. ఇంత చవకైన ఒప్పందం ఇంతకు ముందెన్నడూ జరగలేదు.కానీ, చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా, సగం సగం తెలివి ఉన్న ఆయన తరఫునవాళ్లు కొందరు ఈ ఒప్పందాన్ని వక్రీకరిస్తున్నారు. గుజరాత్‌లో 1.90తో ఒప్పందం చేసుకుంటుందని చంద్రబాబు అంటున్నారు. ఈనాడు గుజరాత్‌ను రిఫరెన్స్‌గా చెబుతోంది. కానీ, గుజరాత్‌ నుంచి తెప్పించి ఉంటే.. ఇంటర్‌ మిషన్‌ ట్రాన్స్‌మిషన్‌ ఛార్జీలు పడేవి. గుజరాత్‌, రాజస్థాన్‌ పవర్‌ జనరేషన్‌ కాస్ట్‌ గురించి మాట్లాడుతున్నారు. ట్రాన్స్‌మిషన్‌ ఛార్జ్‌ గురించి ఎందుకు మాట్లాడడం లేదు. ఈనాడుగానీ, ఆంధ్రజ్యోతిగానీ ఇవేం చెప్పడం లేదు. ఇప్పుడు గుజరాత్‌లో సెకీ పిలిచిన టెండర్లు రూ.2.62కి తక్కువ లేవు. మంచి చేసిన వాళ్ల మీద రాళ్లు వేస్తునన్నారు. ఇది చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. అయినా.. చంద్రబాబు, ఆయన సోషల్‌ మీడియా ఇంతలా వక్రీకరించి మాట్లాడడం ధర్మమేనా?. ఈనాడు, ఆంధ్రజ్యోతి.. ఇంతలా వకక్రీకరించాలా?. టీవీ రేట్లు తగగ్గినట్లు కరెంట్‌ రేట్లు తగ్గాలని ఈనాడు రాసింది. ఇక్కడే వక్రీకరణ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అని జగన్‌ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement