ఎల్లో మీడియా అసత్య కథనాలను ఆధారాలతో సహా వివరిస్తున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
సాక్షి, ధర్మవరం: ‘‘నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తున్నాం. అందువల్లే జనమంతా మా వెంట నడుస్తున్నారు. దీన్ని జీర్ణించుకోలేని పచ్చ నేతలు ఎల్లో మీడియాలో తప్పుడు రాతలు రాయిస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా నాకు ఆపాదిస్తున్నారు. అయినా ఇంతవరకూ ఓపిక పట్టాను. ఇకపై సహించే ప్రసక్తే లేదు. అవాస్తవాలతో బురదజల్లుడు రాజకీయాలు చేస్తే ఊరుకోను’’ అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎల్లో మీడియా, టీడీపీ నాయకులను హెచ్చరించారు. శుక్రవారం ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
►ఇటీవల కందిపంట ధ్వంసం... వైకాపా నాయకుడి దౌర్జన్యం అనే కథనాన్ని ఓ ఎల్లో మీడియా వండి వార్చిందన్నారు. కందిపంట సాగు చేసిన భూమిని 2004లోనే ప్రభుత్వం సేకరించి రైతు గోనుగుంట్ల రమణప్ప అనే టీడీపీ కార్యకర్తకు పరిహారం ఇచ్చిందన్నారు. ఆ తర్వాత భూమిలో పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేసిందన్నారు. ఈ క్రమంలో కొందరు ఆ భూమిలో కందిపంట సాగుచేయగా, అధికారులు తొలగించారన్నారు. దాన్ని కూడా ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యమంటూ తప్పుడు కథనాలు రాస్తారా అని మండిపడ్డారు.
►ధర్మవరం పట్టణం సర్వే నంబర్ 661లోని స్థలం ఇరిగేషన్ శాఖ ఆధీనంలో ఉండగా, ఈ స్థలాన్ని ‘అమృత్’ పథకంలో భాగంగా సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు కేటాయించామన్నారు. కానీ ఎల్లో మీడియా మాత్రం దర్జాగా కబ్జా అంటూ కథనం అల్లేసిందన్నారు. అలాగే ఓ సర్వేనంబర్ 536లో స్థలాన్ని ఎవరో శుభ్రం చేయిస్తుంటే దాన్ని కూడా ఎమ్మెల్యే అనుచరులంటూ అసత్య కథనాలు ప్రచురిందని కేతిరెడ్డి మండిపడ్డారు. అలాగే అప్రాచెరువు సర్పంచ్ ఈశ్వర్‌రెడ్డి మార్కెట్ ధరకు స్థలం కొనుగోలు చేస్తే కబ్జా చేశారంటూ కథనాలు రాశారన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ ఏం జరిగినా తప్పుడు రాతలు రాయడం ఎల్లో మీడియాకు దాని వెనుక ఉన్న పచ్చ నేతలకు అలవాటైందన్నారు. ఇప్పటికైనా ఇలాంటి నిరాధార కథనాలు రాయడం మానుకోవాలన్నారు. లేదంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
ఉనికి కోసమే విమర్శలు..
ధర్మవరం నియోజకవర్గంలోని టీడీపీ, బీజేపీ నాయకులకు కేతిరెడ్డిని విమర్శిస్తే తప్ప ఉనికిలేదన్నారు. భూకబ్జాల గురించి పరిటాల శ్రీరామ్ మాట్లాడటం చూస్తే నవ్వు వస్తోందన్నారు. అవినీతికి కేరాఫ్ అడ్రెస్‌గా మారిన వరదాపురం సూరి... చివరకు అక్రమంగా డీజిల్‌ను అమ్ముకునే స్థాయికి దిగజారారన్నారు. తాను ఆధారాలతో సహా సూరి అవినీతిని బయటపెడుతున్నానన్నారు. అనంతపురం నడిబొడ్డున రూ.వంద కోట్ల ప్రాపరీ్టని తన సొంత ఊరికి చెందిన సబ్ రిజి్రస్టార్‌తో దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకుని భూమిని కొట్టేయడం వాస్తవం కాదా.. అని ప్రశ్నించారు. అలాగే ముదిగుబ్బ మండలంలో 151 ఎకరాల ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని స్వాహా చేయలేదా...? మీరా నన్ను విమర్శించేది అని ప్రశ్నించారు. ఇప్పటికైనా నీతిమాలిన రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment