హైదరాబాద్: గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, బీజేపీ సస్పెండెడ్ నేత రాజాసింగ్ తెలుగుదేశం పార్టీలో చేరతారంటూ ప్రచారం తెర మీదకు వచ్చింది. బీజేపీపై అసంతృప్తితో ఉన్న ఆయన సైకిల్ ఎక్కుతారంటూ ఆ ప్రచారంలో ఉంది. అయితే.. ఈ ప్రచారంపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. తనకు పార్టీ మారే ఉద్దేశ్యం లేదని ఆయన స్పష్టం చేశారు.
టీడీపీలో చేరతానన్న వార్తలు అవాస్తవం. బీజేపీలోనే కొనసాగుతాను. వచ్చే ఎన్నికల్లో గోషామహల్ స్థానం నుంచి పోటీ చేస్తా. నా మెంటాలిటీకి బీజేపీ తప్ప వేరే పార్టీ సెట్ కాదు అంటూ జంపింగ్ వార్తలకు పుల్‌స్టాప్ పెట్టారాయన. ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో రాజాసింగ్‌ను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. టీడీపీలోకి రాజాసింగ్ అంటూ ఆంధ్రజ్యోతి తాజాగా ఓ కథనం ప్రచురించింది. సస్పెన్షన్ తర్వాత బీజేపీ పట్టించుకోవడం లేదని, అందుకే ఆయన పార్టీ మారతారని, ఈ మేరకు ఇప్పటికే టీడీపీ నేతలతో చర్చలు జరిపారంటూ సుదీర్ఘంగా ఆ కథనంలో చర్చించింది. కానీ, ఆంధ్రజ్యోతిది తప్పుడు ప్రచారమేనని రాజాసింగ్ తేల్చేశారు.
ఇదీ చదవండి: వాళ్ల ఉద్యోగాలు ఊడితేనే.. మన ఉద్యోగాలు
Comments
Please login to add a commentAdd a comment