
గుంటూరు, సాక్షి: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తప్పుడు కథనం ప్రచురించిన మీడియా సంస్థపై, వాటి ఆధారంగా విమర్శలకు దిగిన తెలుగు దేశం పార్టీపై వైఎస్సార్‌సీపీ తీవ్రంగా మండిపడింది. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక ఇలా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని.. ఇలాంటి ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలకు దిగుతామని హెచ్చరించింది.
‘‘తనను చూసుకునేవారు లేక ఒక నాయకుడు వివాహం చేసుకుంటే…, ఆ మహిళనుద్దేశించి మీరు నడిపిన కథలు, కథనాలు ఈ రాష్ట్ర ప్రజలకు ఇంకా గుర్తున్నాయి. మీ రాజకీయ ప్రత్యర్థులపైన, మీ వ్యతిరేక పార్టీలపైన మీరు ప్రయోగించే అనైతిక సూత్రమే “వ్యక్తిత్వ హననం’’. మీరు నమ్మిన సిద్ధాంతమే ఇది.
ఇదీ చదవండి: నారా లోకేష్ లేడుగా.. అందుకే క్యాన్సిల్!
.. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంపేస్తే దాన్ని ప్రజాస్వామ్యమని రాశారు. బాలకృష్ణ తుపాకీతో కాల్పులు జరిపితే, ఆయనకు మెంటల్ అని సర్టిఫికెట్ తెచ్చారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ ఫీజులను ఒక పారిశ్రామిక వేత్తతో కట్టించి, అది నారా లోకేష్ ప్రతిభ అన్నారు. మహిళలతో అసభ్యంగా తైతక్కలాడితే అవి చిన్ననాటి సరదాలు అంటారు. ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియోలతో అడ్డంగా దొరికిపోతే కనీసం వాయిస్ శాంపిల్ ఇవ్వకుండా ఆ పార్టీ అధినేత చంద్రబాబు తప్పించుకున్నారు. మీలో నీతి లేదు, నిజాయితీ అంతకన్నా లేదు, నైతికత ఇసుమంతైనా మీలో కనిపించడం లేదు అంటూ పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచింది.
‘‘తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి’’
రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక ఇలా నిరాధార ఆరోపణలా @JaiTDP?
తనను చూసుకునేవారు లేక ఒక నాయకుడు వివాహం చేసుకుంటే…, ఆ మహిళనుద్దేశించి మీరు నడిపిన కథలు, కథనాలు ఈ రాష్ట్ర ప్రజలకు ఇంకా గుర్తున్నాయి.
మీ రాజకీయ… https://t.co/v8xK6Q3lqe— YSR Congress Party (@YSRCParty) August 27, 2024