ఆంధ్రప్రదేశ్‌లో విద్వేషపూరిత రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. ప్రతిపక్షాలు ఏకమై.. సంక్షేమ ప్రభుత్వంగా ప్రజల మన్ననలు అందుకుంటున్న వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయి. టీడీపీ, జనసేనకు బాకా ఊదే యెల్లో మీడియా పత్రికలు, పేపర్లు ఈ విషప్రచారానికి తమవంతు కృషి చేస్తున్నాయి. సోషల్ మీడియాలో పచ్చ మంద చేస్తున్న హడావిడికి హద్దు లేకుండా పోతోంది. మరోవైపు మౌత్ టాక్ పేరిట నడుస్తున్న యవ్వారం.. టీడీపీ దిగజారుడుతనానికి నిదర్శనంగా కనిపిస్తోంది.
క్షేత్రస్థాయిలో CM జగన్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు జరిగే కుట్ర.. నీచ రాజకీయాలకు పరాకాష్టగా నిలుస్తోంది. బస్సులు, రైళ్లు, ఆటోలు.. ఆఖరికి జనం గుమిగూడే టీ స్టాల్ లాంటి చోట్లా మౌత్ టాక్ పేరిట హడావిడి చేస్తున్నారు. ఈ క్రమంలో.. వైఎస్సార్‌సీపీ మీద లేని ప్రజా వ్యతిరేకత చూపించేందుకు నానా తంటాలు పడుతోంది పచ్చ బ్యాచ్. అయితే ప్రశ్నించే ముందు.. తమ దగ్గరా వాటికి సమాధానాలు లేవనే విషయాన్ని మాత్రం గ్రహించలేకపోతోంది.
స్టేట్‌మెంట్ 1 : రాష్ట్రం నాశనం అయ్యిందట!
సుభిక్షంగా ఉన్న రాష్ట్రాన్ని.. అప్పుల ఊబిలో ఉందని.. శ్రీలంక అయ్యిందని.. ఏవేమో ప్రచారాలు చేస్తారు. మరి రాష్ట్రం ఎలా నాశనం అయ్యింది? అది ఎలాగో చెప్పమని అడిగితే మాత్రం మౌనంగా ఉండిపోతారు
స్టేట్‌మెంట్ 2 : ప్రజల్ని సోమరిపోతుల్ని చేశారంట!
సంక్షేమ విషయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేసిన కాలానికి.. సీఎంగా జగన్ అందించిన సంక్షేమానికి అసలు పోల్చడానికి కూడా వీలు లేదు. అన్ని వర్గాలకు ఆసరాగా నిలిస్తే.. ఇదిగో ప్రజల్ని సోమరిపోతుల్ని చేశారనే మాట అంటారు. సంవత్సరానికి నీకు ఒక 15 వేలు ఇస్తా నువ్వు ఏమి పని చెయ్య కుండా ఉంటావా అంటే ఏమి పలకరు.
స్టేట్‌మెంట్ 3 : ఎన్నికల్లో 160 సీట్లు టీడీపీవేనట!
ఏపీలో పొత్తు రాజకీయాలకు ఓ నీతి అంటూ లేకుండా పోయింది. జనసేన టీడీపీ పోటీ స్థానాల కోసం కొట్లాడుకునే స్టేజ్‌కి వచ్చేశాయి. కుదరితే ఒకపార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ చేసైనా పోటీ చేయాలని ఆ రెండు పార్టీల వాళ్లు ప్రయత్నాలు చేయడం కొసమెరుపు. అసలు సైకిల్ సింబల్ మీద ఎన్ని పోటీ చేస్తారు అంటే చెప్పరు, పందెం ఉంటే పెట్టు అంటే పారిపోతారు.
స్టేట్‌మెంట్ 4 : స్కూల్స్‌కి జగన్ రంగులు మాత్రమే వేశాడట!
నాడు-నేడు ఆ కళ్లకు కనిపించడం లేదేమో. ఏపీలో స్కూల్ డ్రాపింగ్ సంఖ్య తగ్గి.. కేరళతో పోటీ పడే స్థాయికి చేరిందని గుర్తిండం లేదేమో. ప్రభుత్వ స్కూల్స్ కి వెళ్లి విజిట్ చేద్దాము అంటే రాడు
స్టేట్‌మెంట్ 5 : రోడ్లు నాశనం అయ్యాయట!
గతంలో సంగతి ఏంటి? మరి 2014 - 2019 అంత బాగా రోడ్స్ వేస్తే ఎందుకు నాశనం అయ్యాయి? అసలు ఎవరి హయాంలో రోడ్స్ కోసం ఎక్కువ ఫండ్స్ ఇచ్చారు? అంటే మాత్రం మాట్లాడరు.
స్టేట్‌మెంట్ 6 : ఉద్యోగాల్లేవ్..
వలంటీర్ వ్యవస్థ దగ్గరి నుంచి పరిశ్రమల స్థాపన దాకా.. ఉద్యోగాల రూపకల్పనలో సీఎం జగన్ చొరవకు దేశమే హ్యాట్సాఫ్ చెప్పింది. అయినా కూడా జాబ్ క్యాలెండర్ పేరిట బాబు అనుచరులు చేసే విమర్శలకు అంతే లేకుండా పోతోంది. వచ్చిన ఉద్యోగాల గురించి మాట్లాడితే.. అక్కడి నుంచి జంప్ అవుతారు
స్టేట్‌మెంట్ 7 : పరిశ్రమలు పారిపోతున్నాయట!
ఏ పరిశ్రమలు.. ఎక్కడి నుంచి ఎక్కడికి పారిపోయాయి? ఎందుకు పారిపోయాయి? అంటే సమాధానం ఉండదు. ఆ సమాచారం ఇవ్వమన్నా.. ఇవ్వరు. తన హెరిటేజ్ మాత్రం పారిపోకుండా అలాగే ఉండిపోతుందా? మరి.
స్టేట్‌మెంట్ 8 : ఐటీ కంపెనీలు రావట!
ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ కంపెనీలు 2014-2019 ఎక్కువ వచ్చాయా ? 2019 - 2024 లో ఎక్కువ వచ్చాయా అంటే పలకడు, ఉలకడు, జారుకుంటారు
స్టేట్‌మెంట్ 9 : రాజధాని ఏది?
రాజధాని కోర్టులో ఉంది అంటే ఏమి పలకడు, సుప్రీం కోర్టుకి వెళ్లారు వాళ్ళు డిసైడ్ చేస్తారు.. కానీ, మాకు రియల్ ఎస్టేట్ అమరావతి కావాలి అంటారు.
స్టేట్‌మెంట్ 10 : ఆయన వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందట!
2014-2019లో రాష్ట్రానికి ఏమి చేశారు అంటే మాత్రం పలకరు. ఎందుకంటే.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేయలేనిది, ఈ ఐదేళ్లలోనే సీఎం జగన్ ఎన్నో రెట్లు ఎక్కువ చేసి చూపించారు కాబట్టి.
ఇదీ చదవండి: కుట్రదారు.. లబ్ధిదారు అంతా చంద్రబాబే!
Comments
Please login to add a commentAdd a comment