సాక్షి, బాపట్ల: టీడీపీ అధినేత చంద్రబాబు నమ్మించి గొంతుకోసే రకమని ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాలను చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారని తెలిపారు. బడుగు బిడ్డలకు సీఎం జగన్ పాలనలోనే మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. సీఎం ప్రజలకు చేసిన మేలే మళ్లీ జగన్‌ను ముఖ్యమంత్రిని చేస్తుందని అన్నారు.
బాపట్ల జిల్లా చీరాలలో పార్టీ ఇంచార్జి కరణం వెంకటేష్ ఆధ్వర్యంలో సోమవారం వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార సభ నిర్వహించారు. ఈ సభలో మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్ , రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే కరణం బలరాం, ఎమ్మెల్సీ పోతుల సునీత, వైఎస్సార్‌సీపీ యువనాయలు, ఏపీఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ యనమల నాగార్జున యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
సీఎం జగన్ పేదల పక్షపాతి అని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. బాబుకు దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే తెలుసన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆత్మ బంధువు సీఎం జగన్ అంటూ ప్రశంసించారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని తెలిపారు. బీసీలను ఎప్పుడూ బాబు బ్యాక్‌వర్డ్‌గానే చూశారని మేరుగు నాగార్జున మండిపడ్డారు. బాబు హయాంలో దళితులపై జరిగినన్ని దాడులు దేశంలో ఎక్కడా జరగలేదని పర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అక్కున చేర్చుకున్న ఘనత సీఎం జగన్‌దేనని అన్నారు.
సోనియా, రాహుల్, బాబు చేతుల్లో షర్మిల కీలు బొమ్మ అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో షర్మిల ఉనికి కోల్పోయి, కాంగ్రెరస్‌లో పార్టీనిని వీలినం చేశారంటూ దుయ్యబట్టారు. సీఎం జగన్ పాలనను తప్పుబట్టే అర్హత షర్మిలకు లేదని తెలిపారు. వైఎస్సార్‌సీపీపై షర్మిల విమర్శలు రాజకీయ స్వార్థంతో చేసినవని మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆమెకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
చదవండి: AP: ఓటర్ల తుది జాబితా విడుదల.. జిల్లాల వారీగా లిస్ట్ ఇదే
Comments
Please login to add a commentAdd a comment