
సాక్షి, గుంటూరు: ప్రకాశం, బాపట్ల జిల్లాల వైఎస్సార్‌సీపీ నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, జిల్లా అధ్యక్షుల ఎంపిక తదితర అంశాలపై చర్చిస్తున్నారు.
కాగా, నిన్న(గురువారం) కూడా పలు జిల్లాల వైఎస్సార్‌సీపీ నేతలతో జగన్ భేటీ అయ్యారు. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లాల వైఎస్‌ఆర్‌సీపీ నేతలతో సమావేశమయ్యారు. జిల్లాల్లో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ నిర్మాణ విషయాలపై చర్చించారు. వైఎస్సార్‌సీపీలో పలు కీలక నియామకాలను చేపట్టారు.
ఇదీ చదవండి: తిరుమల లడ్డూ వివాదంపై హైకోర్టుకు వైఎస్సార్‌సీపీ
శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణదాస్, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులుగా తమ్మినేని సీతారాంను, విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులుగా జెడ్పీ చైర్మన్‌గా మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను)ను, పార్వతీపురం మన్యం జిల్లా పార్టీ అధ్యక్షులుగా శత్రుచర్ల పరీక్షిత్‌రాజులను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం పేర్కొంది.

Comments
Please login to add a commentAdd a comment