
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ వివాదంపై వైఎస్సార్‌సీపీ.. హైకోర్టును ఆశ్రయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపణలను హైకోర్టు ధర్మాసనం వద్ద వైఎస్సార్‌సీపీ న్యాయవాదులు మెన్షన్ చేశారు.
ఇక, సీఎం చంద్రబాబు ఇటీవలే తిరుమల లడ్డూ ప్రసాదాల్లో జంతువుల ఫ్యాట్ కలిపారని ఆరోపణలు చేసిని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలపై సిట్టింగ్ జడ్డీతో లేకపోతే హైకోర్టు ఓ కమిటీ ఏర్పాటు చేసి విచారించాలని లాయర్లు కోరారు. ఈ సందర్భంగా ధర్మాసనం.. బుధవారం రోజున దీనిపై వాదనలు వింటామని తెలిపింది.
తిరుమల లడ్డు ప్రసాదం పై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఆరోపణలపై హైకోర్టు ధర్మాసనం వద్ద మెన్షన్ చేసిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున న్యాయవాదులు
ప్రసాదాల్లో జంతువుల ఫ్యాట్ కలిపారని ముఖ్యమంత్రి @ncbn చేసిన వ్యాఖ్యలపై సిట్టింగ్ జడ్జితో లేదా హైకోర్టు ఒక కమిటీ ఏర్పాటు చేసి విచారించాలని…— YSR Congress Party (@YSRCParty) September 20, 2024

ఇది కూడా చదవండి: ఆవు నెయ్యి.. టీడీపీకి గొయ్యి!