Bapatla Assembly Constituency
-
బాపట్లలో బాహాబాహీ
బాపట్ల టౌన్: తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. సాక్షాత్తూ జిల్లా కేంద్రం బాపట్లలోని టీడీపీ కార్యాలయంలోనే ఆ పార్టీ ఐ టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు మానం శ్రీనివాసరావు, తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు బాహాబా హీకి దిగారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ దుర్భాషలాడుకున్నారు. రా తేల్చుకుందాం అంటూ తొడలు చరుచుకున్నారు. మాటల తీవ్రత పెరిగి, దాడికి తెగబడ్డారు. పార్టీ కార్యకర్తల సమక్షంలోనే కలబడ్డారు. ఇదే అదునుగా పార్టీకి చెందిన కమ్మ, యాదవ సామాజిక వర్గాలు రెండుగా విడిపోయి చెరో పక్షం చేరి సవాళ్లు విసురుకున్నాయి. శనివారం జరిగిన ఈ ఘటన తెలుగుదేశం పార్టీలోని వర్గ విభేదాలను మరోమారు బట్టబయలు చేసింది. అసలేం జరిగిందంటే.. బాపట్ల మండలంలోని రెండో క్లస్టర్ పరిధి నాయకులతో ఐ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు మానం శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. సమావేశం జరుగుతుండగా అక్కడే ఉన్న పార్టీ పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు ‘‘ఇన్నాళ్లూ ఎక్కడున్నారు? సమావేశాల్లో మినహా గ్రౌండ్ లెవల్లో ఐ టీడీపీ ఎక్కడా పనిచేస్తున్నట్లు లేదు’’ అని అనడంతో ఒక్కసారిగా మానం శ్రీనివాసరావు ఆగ్రహానికి గురయ్యారు. మమ్మల్ని అడిగేందుకు నువ్వెవరు? అంటూ దురుసుగా మాట్లాడుతూ గొలపలపైకి దూసుకొచ్చారు. గొలపల కూడా అంతే స్థాయిలో నేనెవరో నీకు తెలీదా? అంటూ ఎదురుతిరిగారు. ఒక్కసారిగా ఇద్దరూ తన్నులాటకు దిగారు. దూషణలు చేసుకుంటూ, తొడలు చరుచుకున్నారు. వీరు తన్నులాటకు దిగడంతో ఓ వైపు కమ్మ సామాజిక వర్గం నాయకులు, మరోవైపు యాదవ సామాజిక వర్గం నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పరం దాడికి యత్నించారు. వెంటనే స్పందించిన పార్టీ నాయకులు ఇరువర్గాలకూ సర్దిచెప్పారు. యాదవ నేతపై గతంలోనూ దాడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొంతకాలంగా కొనసాగుతున్న ముసలం శనివారంతో బట్టబయలైంది. గతంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వేగేశన నరేంద్రవర్మ, అతని తనయుడు రాకేష్ వర్మ యాదవ సామాజికవర్గానికి చెందిన మద్దిబోయిన రాంబాబుపై తనకు రావాల్సిన డెకరేషన్ డబ్బులు అడిగాడనే కోపంతో దాడి చేశారు. దీంతో రాంబాబు బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే శనివారం కమ్మ సామాజిక వర్గానికి చెందిన మానం శ్రీనివాసరావు కూడా వర్మ, అతని తనయుడి బాటలోనే యాదవ సామాజిక వర్గానికి చెందిన పార్టీ పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావుపై దాడికి దిగడంతో ఒక్కసారిగా బీసీ నేతలు భగ్గుమన్నారు. పార్టీకి తమ సత్తా చూపిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఎవరికి వారే..'బాపట్ల' తీరే !
బాపట్ల తెలుగుదేశం పార్టీలో ఐక్యత కొరవడింది. వర్గపోరుతో అట్టుడికిపోతోంది. ఏ నియోజకవర్గం చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు ప్రతి చోటా తమ్ముళ్ల తగవులాటే కనిపిస్తోంది. జిల్లా కేడర్ ఎవరికివారే యమునాతీరే అన్నట్టు వ్యవహరిస్తోంది. కారంచేడులో సొంత పార్టీ ఫ్లెక్సీలనే కార్యకర్తలు చింపేయడం... ఎమ్మెల్యేపై దూషణల పర్వానికి దిగడం... అధిష్టానానికి మింగుడుపడటం లేదు. చీరాలలో కొండయ్య నాయకత్వాన్ని బహిరంగంగానే వ్యతిరేకించడం... వేమూరులో ఓ వర్గానికి నక్కా కొమ్ముకాయడం... బాపట్ల ఇన్చార్జి రోజుకో నాయకుడ్ని వెనకేసుకు రావడం... అక్కడి కార్యకర్తలకు రుచించడం లేదు. రేపల్లె... అద్దంకిలో ఇంటిపోరు తీవ్రరూపం దాల్చడం అధినాయకత్వాన్ని ఇరకాటంలో పడేస్తోంది. సాక్షి ప్రతినిధి, బాపట్ల: ఎన్నికల వేళ పచ్చపార్టీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ ముఖ్యనేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒకరంటే మరొకరికి గిట్టక వెన్నుపోట్లకు సిద్ధపడుతున్నారు. ఆధిపత్యపోరుతో అమీతువీుకి సిద్ధపడుతున్నారు. రేపల్లెలో సొంత పార్టీనేతనే ఏకంగా హత్య చేసిన ఘటన జరగ్గా మిగిలిన నియోజకవర్గాల్లో తమ్ముళ్ల మధ్య వర్గ విభేదాలు ముదిరి ఘర్షణలకు దిగిన ఘటనలు కోకొల్లలు. ‘ఏలూరి’ తీరుపై కేడర్ విసుగు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తీరుపై కేడర్ విసిగెత్తిపోతోంది. ఇటీవల కారంచేడులో మండల టీడీపీ నేతలు వర్గాలుగా విడిపోయి సొంతపార్టీ ఫ్లెక్సీలనే చింపేసి, ఎమ్మెల్యేపై దూషణలకు దిగారు. పోపూరి శ్రీనివాసరావు, ద్రోణాల దరశి, ఇంకొల్లులో పార్టీ సీనియర్ నేత కొల్లూరు నాయుడమ్మ ఎమ్మెల్యే తీరుపై అసంతృప్తితో ఉన్నారు. గతంలో టీడీపీ అధికారంలోకి రావాలని ఈయన తిరుపతి వరకూ వెనక్కు నడిచారు. ఇప్పుడు ఆయనే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కొండయ్యా... ఏందయ్యా ఇది? చీరాల టీడీపీ ఇన్చార్జ్ ఎం.ఎం.కొండయ్యను ఆ పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఆయన్ను మార్చాలని చంద్రబాబు, లోకేశ్‌లకు ఫిర్యాదు చేస్తున్నారు. మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు, చీరాలకు చెందిన డాక్టర్ సజ్జా హేమలత, సజ్జా వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి పాలేటి రామారావు తదితరులు ఇక్కడ టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. పట్టణ పార్టీ మాజీ అధ్యక్షుడు డేటా నాగేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొడుగుల గంగరాజుతో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు కొండయ్యను వ్యతిరేకిస్తున్నవారిలో ఉన్నారు. మరోవైపు తమ వర్గానికి కాకుండా వేరొకరికి టికెట్ ఇస్తే తాము సహకరించేది లేదని యాదవ సామాజికవర్గం తేల్చి చెబుతోంది. ‘నక్కా’నూ... పక్కన పెట్టేస్తారా? వేమూరు నియోజకవర్గంలో అన్ని మండలాల్లోనూ టీడీపీలో అంతర్గత పోరు నడుస్తోంది. వేమూరు మండల టీడీపీ అధ్యక్షుడు దండె సుబ్బారావు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబుల మధ్య విభేదాలున్నాయి. కొల్లూరు మండలంలో మాజీ ఎంపీపీ మైనేని మురళి, మధుసూదనరావుకు, అమృతలూరులో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, మాజీ జెడ్పీటీసీ చరణ్గిరి, భట్టిప్రోలులో మాజీ ఎంపీపీ తూనుగుంట్ల సాయిబాబు, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు కరణ శ్రీనివాసరావు మధ్య వర్గపోరు నడుస్తోంది. ఈ మండలాలన్నింట్లో ఓ వర్గానికి ఆనందబాబు కొమ్ముకాయడంతో రెండో వర్గం ఆయనకు దూరంగా ఉంటోంది. ‘వేగేశన’తో వేగలేం ! బాపట్ల నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జి వేగేశన నరేంద్రవర్మ వైఖరి నచ్చక అన్నం సతీష్ ప్రభాకర్ దూరంగా ఉంటున్నారు. పైగా ఈయన హయాంలో పట్టణ పార్టీ అధ్యక్షునిగా నియమించిన తానికొండ దయాబాబును తొలగించి వడ్లమూడి వెంకటేశ్వరరావును నియమించడం, తర్వాత ఆయన్నూ తొలగించి గోలపల శ్రీనివాసరావును నియమించడం, సతీష్ మండల పార్టీ అధ్యక్షుడిగా నియమించిన కావూరి శ్రీనివాసరెడ్డిని తొలగించి ముక్కాముల శివను నియమించడంపై కేడర్ గుర్రుగా ఉంది. వీరే గాకుండా బాపట్ల మాజీ ఎంపీపీ మానం విజేత, వడ్లమూడి వెంకటేశ్వరరావు, ముక్కాముల శివ, గొలపల శ్రీను, నక్కల వెంకటస్వామి, ఏపూరి భూపతిరావు, కర్లపాలెం మండలంలో తెలుగురైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పమిడి భాస్కరరావు, మాజీ జెడ్పీటీసీ గుంపులకన్నయ్య, మైనారిటీ సెల్ మాజీ మండల అధ్యక్షుడు మహ్మద్ హజీజుల్లాబేగ్, పార్టీ అధ్యక్షుడు వసంతారెడ్డితో కూడిన ఒక వర్గం వర్మను వ్యతిరేకిస్తోంది. కర్లపాలెం మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నక్కల వెంకటస్వామిని తొలగించి ఏపూరి భూపతిరావును నియమించడం, పిట్టలవానిపాలెం మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్న గోకరాజు శ్రీధర్‌వర్మ స్థానంలో కనుమూరి సాంబమూర్తిరాజును నియమించడం, కొన్నాళ్ళ తర్వాత మహ్మద్ అబ్జల్‌ను నియమించడంతో అక్కడ అసంతృప్తి నెలకొంది. ‘అన్నే’ మరణం.. ‘అనగాని’కి శరాఘాతం.. రేపల్లె పట్టణానికి చెందిన 14వ వార్డు కౌన్సిలర్ అన్నే రామకృష్ణను సొంత పార్టీలోని పరిటాల యువసేన నేతలు హత్య చేయడంతో నియోజకవర్గ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌పై వ్యతిరేకత చోటు చేసుకుంది. రాబోయే ఎన్నికల్లో దీని ప్రభావం స్పష్టం కానుంది. ఈ సారి ‘గొట్టిపాటి’కి గట్టిదెబ్బే.. అద్దంకి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కొందరికే ప్రాధాన్యమిస్తుండటం,ప్రధానంగా సంతమాగులూరు, బల్లికురవ, అద్దంకి తదితర మండలాల్లో విభేదాలు అధికంగా ఉన్నాయి. సంతమాగులూరు మండల పార్టీ మాజీ అధ్యక్షుడు నాగబోతు రామాంజనేయులు, కొరిశపాడు మాజీ జెడ్పీటీసీ ముత్తవరపు రమణయ్య మరికొందరు నేతలు ఇప్పటికే పార్టీని వీడి అధికార వైఎస్సార్ సీపీలో చేరారు. ఇటీవల సంతమాగులూరు మండలం కొప్పరం, అద్దంకి మండలం మోదేపల్లి, జె.పంగులూరు మండలాల పరిధిలో వందలాది కుటుంబాలు టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరాయి. రాబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
చీరాలలో బడుగుల జాతర
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో బడుగు, బలహీనవర్గాల సాధికార జాతర జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో తాము సాధించిన సామాజిక సాధికారతను చీరాల పట్టణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎలుగెత్తి చాటారు. సోమవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన సామాజిక సాధికార బçస్సు యాత్రలో నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కదం తొక్కారు. మళ్లీ జగన్ సీఎం అయితేనే తమ జీవితాల్లో వెలుగులు కొనసాగుతాయంటూ నినాదాలు చేశారు. ఆర్ అండ్ బీ అతిథి గృహం నుంచి ప్రారంభమైన యాత్రకు వీధి వీధిలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. యాత్ర అనంతరం నియోజకవర్గ సమన్వయకర్త కరణం వెంకటేష్ నేతృత్వంలో గడియారం సెంటర్లో జరిగిన బహిరంగ సభకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. వైఎస్ జగనే మళ్లీ సీఎం అంటూ స్లోగన్లతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. అంబేడ్కర్, పూలే ఆశయాల సాధకుడు సీఎం వైఎస్ జగన్: మంత్రి నాగార్జున దేశ చరిత్రలో అంబేడ్కర్, పూలే, సాహూ మహరాజ్, పెరియార్, వంటి మహనీయుల ఆశయాలను సాకారం చేస్తున్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. సీఎం జగన్ ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక విప్లవం సాధించారని అన్నారు. చంద్రబాబు కులాలను అడ్డుపెట్టుకుని రాజకీయంగా ఎదిగారని, జగన్ మాత్రం అంబేడ్కర్ ఆశయాన్ని ముందుకు తీసుకొచ్చి పేద పిల్లలను ఇంగ్లిష్ మీడియం చదివించి, వారికి విదేశాల్లో చదివే అవకాశాలు కల్పించి ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేశారన్నారు. అంబేడ్కర్ విగ్రహాన్ని చంద్రబాబు ముళ్లపొదల్లో పడేస్తే వైఎస్ జగన్ విజయవాడ నడిబొడ్డులో నిలబెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీలు తల ఎత్తుకునేలా చేశారన్నారు. తెలంగాణలో పార్టీని పెట్టి, ఏపీతో సంబంధం లేదని చెప్పిన షర్మిల.. ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి చంద్రబాబు కుట్రలో పావుగా మారారన్నారు. సీఎం జగన్ దళిత క్రైస్తవులను ఎస్సీలుగా చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తుచేశారు. బడుగు, బలహీన వర్గాలను దోషులుగా చిత్రీకరించింది బాబే: ఎంపీ నందిగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలపై అక్రమంగా కేసులు పెట్టి దొంగలుగా, దోషులుగా చిత్రీకరీంచి చిత్రహింసలకు గురిచేసింది చంద్రబాబేనని ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. సీఎం జగన్ ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అనేక పదవులిచ్చి దొరలను చేస్తున్నారన్నారు. ఎంపీలను చేసి పార్లమెంటులో ప్రధాని పక్కన కూర్చోబెట్టారన్నారు. బడుగు, బలహీన వర్గాలు జగనన్నతోనే: కరణం వెంకటేష్ చీరాల నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు సుపరిపాలన అందిస్తున్న జగనన్నతోనే ఉన్నాయని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంకటేష్ అన్నారు. అర్హతే ప్రామాణికంగా బడుగు బలహీన వర్గాలకు సీఎం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అందించారని చెప్పారు. చీరాలలో జరిగిన అభివృద్ధిని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత, అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్, దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర, మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మళ్లీ జగనన్నను సీఎంగా ఎందుకు చేయాలంటే..: మోపిదేవి రాష్ట్రంలో సామాజిక న్యాయం, బడుగుల సాధికారత, పేదలకు పథకాలు కొనసాగాలంటే సీఎం వైఎస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏనాడూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆలోచించలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు సామాజికంగా, రాజకీయంగా ముందంజలో ఉండాలన్నదే సీఎం జగన్ తపన అని తెలిపారు. 2024 ఎన్నికల్లో బాపట్ల నుంచి ఎంపీగా నందిగం సురేష్, చీరాల అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా కరణం వెంకటేష్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. -
చంద్రబాబు నమ్మించి గొంతుకోసే రకం: నందిగం సురేష్
సాక్షి, బాపట్ల: టీడీపీ అధినేత చంద్రబాబు నమ్మించి గొంతుకోసే రకమని ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాలను చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారని తెలిపారు. బడుగు బిడ్డలకు సీఎం జగన్ పాలనలోనే మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. సీఎం ప్రజలకు చేసిన మేలే మళ్లీ జగన్‌ను ముఖ్యమంత్రిని చేస్తుందని అన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో పార్టీ ఇంచార్జి కరణం వెంకటేష్ ఆధ్వర్యంలో సోమవారం వైఎస్సార్సీపీ సామాజిక సాధికార సభ నిర్వహించారు. ఈ సభలో మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్ , రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే కరణం బలరాం, ఎమ్మెల్సీ పోతుల సునీత, వైఎస్సార్సీపీ యువనాయలు, ఏపీఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ యనమల నాగార్జున యాదవ్, తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్ పేదల పక్షపాతి అని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. బాబుకు దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే తెలుసన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆత్మ బంధువు సీఎం జగన్ అంటూ ప్రశంసించారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని తెలిపారు. బీసీలను ఎప్పుడూ బాబు బ్యాక్వర్డ్గానే చూశారని మేరుగు నాగార్జున మండిపడ్డారు. బాబు హయాంలో దళితులపై జరిగినన్ని దాడులు దేశంలో ఎక్కడా జరగలేదని పర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అక్కున చేర్చుకున్న ఘనత సీఎం జగన్‌దేనని అన్నారు. సోనియా, రాహుల్, బాబు చేతుల్లో షర్మిల కీలు బొమ్మ అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో షర్మిల ఉనికి కోల్పోయి, కాంగ్రెరస్లో పార్టీనిని వీలినం చేశారంటూ దుయ్యబట్టారు. సీఎం జగన్ పాలనను తప్పుబట్టే అర్హత షర్మిలకు లేదని తెలిపారు. వైఎస్సార్సీపీపై షర్మిల విమర్శలు రాజకీయ స్వార్థంతో చేసినవని మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆమెకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. చదవండి: AP: ఓటర్ల తుది జాబితా విడుదల.. జిల్లాల వారీగా లిస్ట్ ఇదే -
ఎంపీ అభ్యర్థులు కావలెను
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి పైన పటారం లోన లొటారం అన్నట్లుగా ఉంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబువి అన్నీ ఢాంబికాలేనని క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే.. రాజధాని ప్రాంతం, మాకు పట్టుందని చెప్పుకుంటున్న ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మూడు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు దొరక్క తెలుగుదేశం పార్టీ తలలు పట్టుకుంటోంది. గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీచేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడం ఇందుకు కారణం. దీంతో ఎన్ఆర్ఐలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుంటూరు ఎంపీగా గల్లా జయదేవ్ వరసగా రెండుసార్లు గెలిచినా ఇప్పుడు పోటీచేయడానికి ఆయన సుముఖంగా లేకపోవడం.. పైగా ఎవరూ ముందుకు రాకపోవడం ఆ పార్టీలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గల్లా జయదేవ్ 2019లో గెలిచిన తర్వాత రాజకీయాల్లో చురుగ్గాలేరు. ఆయన గుంటూరులో అడుగుపెట్టి రెండేళ్లు దాటింది. మళ్లీ పోటీచేయబోనని అధిష్టానానికి తెగేసి చెప్పేశారు. దీంతో గుంటూరులో పోటీచేసే అభ్యర్థుల కోసం టీడీపీ అన్వేషిస్తున్నా ఫలితం ఉండడంలేదు. మాజీమంత్రి ఆలపాటి రాజా, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను పోటీచేయాలని అడిగినా వారు ససేమిరా అంటున్నారు. దీంతో గుంటూరులోని ఒక విద్యాసంస్థల చైర్మన్‌ను పోటీచేయాలని కోరినట్లు కూడా సమాచారం. నిజానికి.. 2019లో పోటీచేయడానికి ఆయన ముందుకొచ్చినా అధిష్టానం అప్పట్లో ఆయన్ను పట్టించుకోలేదు. ఇప్పుడు పోటీచేయడానికి ఆయన ముందుకొచ్చి కొంత మొత్తం డిపాజిట్ చేసినప్పటికీ తాను పోటీచేయబోనంటూ ఆయన తప్పుకున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. తర్వాత రాజ్యసభకు అవకాశం కల్పించాలని కోరి పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఎన్ఆర్ఐల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. నరసరావుపేట, బాపట్లకూ ససేమిరా.. ఇదిలా ఉంటే.. నరసరావుపేట లోక్‌సభ స్థానానికి కూడా ఇప్పటివరకూ అభ్యర్థి దొరకలేదు. 2014లో చివరి నిముషంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన రాయపాటి సాంబశివరా>వుకు టిక్కెట్ ఇచ్చారు. 2019లో రాయపాటి వద్దంటున్నా బలవంతంగా ఇచ్చారు. ఇప్పుడాయన వయస్సు రీత్యా పోటీకి సిద్ధంగాలేరు. దీంతో ఇక్కడ పోటీచేసేవారి కోసం వెతుకుతున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ అనే ఎన్ఆర్ఐ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే, ఆయన కూడా అంత ఆసక్తి చూపడంలేదని సమాచారం. ఇక బాపట్ల ఎస్సీ నియోజకవర్గం కావడంతో ఇక్కడ అభ్యర్థి దొరకడం టీడీపీకి తలనొప్పిగా మారింది. 2014, 2019లో పోటీచేసిన మాల్యాద్రి ఇప్పుడు రాజకీయాల్లో చురుగ్గా లేకపోవడం, పోటీకి ఆసక్తి చూపకపోవడంతో కొత్త అభ్యర్థి కోసం అధిష్టానం వెతుకుతోంది. ఇక్కడ నుంచి గుంటూరు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ను పోటీచేయించాలని పార్టీ భావిస్తున్నా ఆయన ససేమిరా అంటున్నారు. దీంతో బాపట్ల ఎంపీ అభ్యర్థి కోసం ఆ పార్టీ బుర్ర బద్దలుకొట్టుకుంటోంది. రూ.వంద కోట్లు చూపిస్తేనే.. మరోవైపు.. ఒక్కో ఎంపీ అభ్యర్థి పోటీ చేయాలంటే కనీసం రూ.వంద కోట్లు చూపించాలని లోకేశ్ అడుగుతున్నారని, అందుకెవ్వరూ ముందుకు రావడంలేదని పార్టీ నాయకులు చెబుతున్నారు. -
పచ్చ పార్టీకి దొంగఓట్లే పెద్దదన్ను
ప్రజా సంక్షేమం కోసం పథకాలు అమలు చేయడం... చేసిన పనులు సగర్వంగా చెప్పుకోవడం... తద్వారా ఎన్నికల సమయంలో ఓట్లడగటం నిజమైన నాయకుడి లక్షణం. అదే దొంగ ఓట్లను నమ్ముకోవడం... అధికారంకోసం అడ్డదారులు ఎంచుకోవడం... అందుకోసం కుట్రలు, కుతంత్రాలకు తెరతీయడం... ఎంతటి అక్రమానికైనా వెరవకపోవడం కుటిల నీతికి నిదర్శనం. రెండో కేటగిరీకి చెందినవారే మన పచ్చనేతలు. విజయమే పరమావధిగా దొంగ ఓట్లను ఇష్టానుసారంగా చేరి్పంచేసి వారిద్వారా గెలవడం అలవాటు చేసుకున్నారు. ఇందుకు పర్చూరు, రేపల్లె, అద్దంకి నియోజకవర్గాలే సాక్ష్యం. అక్కడ అధికారుల తనిఖీల్లో వేలాది దొంగఓట్లు బహిర్గతమయ్యాయి. వాటి ద్వారానే గతంలో వారు విజయం సాధించారని ఈ సంఘటన రుజువు చేస్తోంది. సాక్షి ప్రతినిధి, బాపట్ల: ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని పలు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ దొంగ ఓట్లతోనే గత ఎన్నికల్లో గెలుపొందింది. తాజాగా బయటపడ్డ దొంగ ఓట్ల వ్యవహారం చూస్తే ఈ విషయం తేటతెల్లమవుతోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న దొంగ ఓట్లను తొలగించాలని అధికారపార్టీ నేతలు జిల్లా కలెక్టర్‌తో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారులకు పలుదఫాలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వాటి తొలగింపునకు ఫారం–7 దరఖాస్తులు పెట్టారు. జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టగా పెద్ద ఎత్తున అక్రమ ఓట్లు ఉన్నట్లు తేలింది. ప్రధానంగా ఇతర రాష్ట్రాల్లో ఓట్లున్నవారికీ ఇక్కడ ఓట్లుండటం, స్థానికంగా ఒకే నియోజకవర్గంలో రెండు చోట్ల ఓట్లు నమోదు కావడం, చని పోయినవారి ఓట్లు జాబితాలో ఉండటం బయటపడింది. ఈ విధంగా బాపట్ల జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 46,116 దొంగ ఓట్లను అధికారులు తొలగించారు. గత ఎన్నికల్లో టీడీపీ గెలుపొందిన పర్చూరు, రేపల్లె, అద్దంకి నియోజకవర్గాల్లో దొంగ ఓట్లు అధికంగా బయటపడ్డాయి. అక్రమ ఓట్ల వల్లే గత ఎన్నికల్లో టీడీపీ గెలుపొందినట్లు స్పష్టమవుతోంది. ఇప్పుడు వాటిని తొలగించడం వల్ల రాబోయే ఎన్నికల్లో వారి విజయం ప్రశ్నార్థకంగా మారనుంది. పర్చూరులో పదివేలకు పైగా దొంగ ఓట్లు పర్చూరు నియోజకవర్గంలో 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు గెలుపొందారు. 2014లో 10,775 ఓట్లు, 2019లో 1647 ఓట్ల మెజారిటీ వచ్చింది. నియోజకవర్గం ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరగ్గా 1967, 1991, 2004, 2019లో మాత్రమే పదివేలకుపైబడి మెజార్టీవచ్చింది. మిగిలిన 11 ఎన్నికల్లో 7 వేలకు మించలేదు. తాజాగా అధికారులు ఈ నియోజకవర్గంలో 10,468 దొంగ ఓట్లను తొలగించారు. మరిన్ని దొంగ ఓట్లు బయటపడే అవకాశముంది. దీన్నిబట్టి పర్చూరులో టీడీపీ దొంగ ఓట్లవల్లే గెలుపొందినట్లు తెలుస్తోంది. రేపల్లెలోనూ దొంగ ఓట్ల హవా... రేపల్లె నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ 2014లో 13,355 ఓట్లు, 2019లో 11,555 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకూ జరిగిన 15 ఎన్నికల్లో 8 సార్లు 10 వేలకు మించి మెజార్టీ రాగా 7 సార్లు 10వేలలోపు మెజార్టీ వచ్చింది. ఇక్కడ ఓట్ల విచారణ పూర్తికాక ముందే 8,880 దొంగ ఓట్లను గుర్తించారు. ఇంకా మరికొన్ని దొంగ ఓట్లు బయటపడే అవకాశముంది. దొంగ ఓట్ల తొలగింపు రాబోయే ఎన్నికల్లో పచ్చపార్టీపై ప్రభావం చూపనున్నట్టు తెలుస్తోంది. అద్దంకిలోనూ అదే తీరు... అద్దంకి నియోజకవర్గంలో గత మూడు ఎన్నికల్లో గొట్టిపాటి రవికుమార్ కాంగ్రెస్(ఐ), వైఎస్సార్సీపీ, టీడీపీ అభ్యరి్థగా పోటీచేసి గెలుపొందారు. గత ఎన్నికల్లో ఆయనకు 12,991 మెజార్టీ వచ్చింది. 2009, 2019 ఎన్నికల్లో మాత్రమే ఈ నియోజకవర్గంలో 10 వేలకు మించి మెజార్టీ వచ్చింది. మిగిలిన 12 ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సగటున 5 వేలకు మించి మెజార్టీ రాలేదు. తాజాగా ఈ నియోజకవర్గం పరిధిలో అధికారులు 7,207 దొంగ ఓట్లను తొలగించారు. విచారణ పూర్తయితే మొత్తం 8 వేల పైచిలుకు దొంగ ఓట్లను తొలగించే అవకాశముంది.