పోరాటాలు వైఎస్సార్‌సీపీకి కొత్తేమి కాదు: కారుమూరి | Karumuri And Merugu Nagarjuna Comments At Bapatla | Sakshi
Sakshi News home page

పోరాటాలు వైఎస్సార్‌సీపీకి కొత్తేమి కాదు: కారుమూరి

Oct 21 2024 4:03 PM | Updated on Oct 21 2024 4:34 PM

Karumuri And Merugu Nagarjuna Comments At Bapatla

సాక్షి, బాపట్ల జిల్లా:  వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి కూటమి ప్రభుత్వం దుర్మార్గపు పాలన చేస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఎవరు అధైర్య పడాల్సిన పనిలేదని, పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. పోరాటాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొత్తేమి  కాదని చెప్పారు.

బాపట్ల జిల్లా ఎమ్‌ఎస్సార్‌ కళ్యాణ మండపంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మేరుగు నాగార్జున ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో  మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఎమ్మెల్సీ లేళ్లప్పిరెడ్డి, ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి, నియోజకవర్గ ఇంచార్జీలు  వరికుట్టి అశోక్ బాబు, ఈవూరి గణేష్, కరణం వెంకటేష్, హనుమారెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి శ్యామల, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

పోలీసులు కూటమి నాయకులకు కొమ్ముగాస్తున్నారు!
అనంతరం మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. తన మీద నమ్మకంతో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఎంతో పెద్ద బాధ్యత అప్పగించారని తెలిపారు. ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చిన ముందు తాముంటామని పేర్కొన్నారు. కూటమి నాయకులు జిల్లాలో కొన్నిచోట్ల తమ పార్టీ కార్యకర్తలను, నాయకులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలు, చిన్నారులపై దాడులు, అఘాయిత్యాలు హత్యలు పెరిగిపోయాయని అన్నారు. పోలీసులు కూటమి నాయకులకు కొమ్ముగాస్తున్నారని దుయ్యబట్టారు. 

రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు: శ్యామల
‘కోవిడ్ లాంటి భయంకరమైన విపత్తు వస్తే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ఎవరిని యాచించలేదు. కానీ ఎప్పటి ప్రభుత్వం విపత్తు వస్తే ప్రజల నుంచి విరాళాలు యాచించే పరిస్థితి. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు. రాష్ట్రంలో చిన్నారులపై అఘాయిత్యాలు, మహిళలపై దాడులు హత్యలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం మహిళల భద్రతపైన దృష్టి పెట్టలేదు కానీ మద్యంపైన దృష్టి పెట్టింది’. అని విమర్శలు గుప్పించారు.

కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది: లేళ్ల అప్పిరెడ్డి
‘పేదలు, అణగారిన వర్గాల ప్రజల జీవితాల్లో మార్పు కోసం వైఎస్ జగన్‌ ఎన్నో పథకాలు అమలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలని టార్గెట్ చేసి దాడులు చేసి వేదిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికొస్తే చూస్తూ ఊరుకోం. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement