crime against woman
-
పోరాటాలు వైఎస్సార్సీపీకి కొత్తేమి కాదు: కారుమూరి
సాక్షి, బాపట్ల జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి కూటమి ప్రభుత్వం దుర్మార్గపు పాలన చేస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎవరు అధైర్య పడాల్సిన పనిలేదని, పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. పోరాటాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొత్తేమి కాదని చెప్పారు.బాపట్ల జిల్లా ఎమ్‌ఎస్సార్ కళ్యాణ మండపంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మేరుగు నాగార్జున ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఎమ్మెల్సీ లేళ్లప్పిరెడ్డి, ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి, నియోజకవర్గ ఇంచార్జీలు వరికుట్టి అశోక్ బాబు, ఈవూరి గణేష్, కరణం వెంకటేష్, హనుమారెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి శ్యామల, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.పోలీసులు కూటమి నాయకులకు కొమ్ముగాస్తున్నారు!అనంతరం మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. తన మీద నమ్మకంతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎంతో పెద్ద బాధ్యత అప్పగించారని తెలిపారు. ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చిన ముందు తాముంటామని పేర్కొన్నారు. కూటమి నాయకులు జిల్లాలో కొన్నిచోట్ల తమ పార్టీ కార్యకర్తలను, నాయకులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలు, చిన్నారులపై దాడులు, అఘాయిత్యాలు హత్యలు పెరిగిపోయాయని అన్నారు. పోలీసులు కూటమి నాయకులకు కొమ్ముగాస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు: శ్యామల‘కోవిడ్ లాంటి భయంకరమైన విపత్తు వస్తే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎవరిని యాచించలేదు. కానీ ఎప్పటి ప్రభుత్వం విపత్తు వస్తే ప్రజల నుంచి విరాళాలు యాచించే పరిస్థితి. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు. రాష్ట్రంలో చిన్నారులపై అఘాయిత్యాలు, మహిళలపై దాడులు హత్యలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం మహిళల భద్రతపైన దృష్టి పెట్టలేదు కానీ మద్యంపైన దృష్టి పెట్టింది’. అని విమర్శలు గుప్పించారు.కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది: లేళ్ల అప్పిరెడ్డి‘పేదలు, అణగారిన వర్గాల ప్రజల జీవితాల్లో మార్పు కోసం వైఎస్ జగన్ ఎన్నో పథకాలు అమలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలని టార్గెట్ చేసి దాడులు చేసి వేదిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికొస్తే చూస్తూ ఊరుకోం. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది’ అన్నారు. -
మహిళలపై జరుగుతున్న నేరాల్లో సినిమా, టీవీషోల ప్రభావం..? మార్పు ఎక్కడ మొదలవ్వాలి ?
-
ఇది ఒక సైకాలం..! ఆన్లైన్ రాక్షసులు..!!
"ఇంటర్నెట్ రాకతో ప్రపంచం కుగ్రామంగా మారింది. సోషల్ మీడియా వల్ల ప్రపంచంలో ఏ మూలనున్న వారితోనైనా స్నేహించే, సంభాషించే అవకాశం దొరుకుతోంది. మరోవైపు ముక్కూమొహం తెలియని వారిపై అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసి, బాధపెట్టి ఆనందించే ట్రోల్స్ అనే ప్రత్యేక జాతిని సృష్టించింది. చక్కగా అమెరికన్ యాక్సెంట్లో ఇంగ్లిష్ మాట్లాడిన బెండపూడి విద్యార్థులను, పిల్లలని కూడా చూడకుండా విపరీతంగా ట్రోల్ చేశారు. ప్రభుత్వం నుంచి ఇంటి స్థలాన్ని పొందిన వివాహితను అసభ్య పదజాలంతో ట్రోల్ చేసి ఆమె ఆత్మహత్యకు కారణమయ్యారు. సినీ తారలు, రాజకీయ నాయకులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్.. వారని వీరని లేదు, అందరూ ట్రోలింగ్ బారిన పడ్డవారే!" అదోరకమైన శాడిజం.. జీవితంలో ఎలాంటి గుర్తింపులేని, ఎవరూ పట్టించుకోని వ్యక్తులకు ఆన్లైన్లో ఐడెంటిటీ బయటపడకుండా మాట్లాడగలగటం ధైర్యాన్నిస్తుంది. తమను ఎవరూ పట్టుకోలేరనే ధైర్యంతోనే నోటికొచ్చినట్లు అసభ్యంగా మాట్లాడుతుంటారు. నిజానికి వీరిలో లోతైన అభద్రత ఉంటుంది. దాన్నుంచి బయట పడేందుకు, ఇతరుల అటెన్షన్‌ను పొందేందుకు ట్రోలింగ్‌ను ఒక సాధనంగా చేసుకుంటారు. ఎమోషనల్ కంట్రోల్ లేనివారు కూడా ట్రోలింగ్‌ను ఎంచుకుంటారు. ట్రోల్స్‌లో నార్సిసిజం, మాకియవెల్లియనిజం, శాడిజం ఉంటాయని అధ్యయనాలు వెల్లడించాయి. నార్సిసిజం అంటే విపరీతమైన స్వీయప్రేమ. వీరికి విపరీతమైన అటెన్షన్ కావాలి. దానికోసం ఇతరులను ట్రోల్ చేస్తుంటారు. మన రియాక్షన్ నుంచి వారికి కావాల్సిన అటెన్షన్ పొందుతారు. మాకియ వెల్లియన్ ట్రోల్స్ మానిప్యులేట్ చేయడానికి అబద్ధాలు, మోసం ఉపయోగిస్తారు. వారిలో ఎలాంటి పశ్చాత్తాపం ఉండదు. ఇతరులు బాధపడుతుంటే లేదా బాధపెట్టి ఆనందించడమే శాడిజం. శాడిస్ట్ ట్రోల్స్ సంబంధంలేని అంశాలలో కూడా చేరి బాధపెట్టి ఆనందిస్తుంటారు. బలమైన కోటను నిర్మించుకోవాలి.. పెద్ద పెద్ద సెలబ్రిటీలకు కూడా ట్రోలింగ్ తప్పలేదని, మీరు ఒంటరి కాదని గుర్తించండి. ట్రోలింగ్ ప్రవర్తనను అర్థం చేసుకోవడం ద్వారా, మీ చుట్టూ బలమైన కోటను నిర్మించుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. మీరు సున్నిత మనస్కులైతే సోషల్ మీడియాకు దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ ఉన్నా, ట్రోలింగ్ జరుగుతున్నంతకాలం డియాక్టివేట్ చేసుకోవాలి. ట్రోల్‌కు ప్రతిస్పందించడమంటే మృగానికి ఆహారం అందివ్వడమే. వారు కోరుకునే గుర్తింపు వారికి అందివ్వడమే. అందువల్ల కష్టమైనప్పటికీ ట్రోల్స్‌ను విస్మరించడమే వారి నుంచి తప్పించుకునే మార్గం. అప్పుడే వారు నిరాయుధులవుతారు, ఆకలితో అలమటిస్తారు. ట్రోల్స్‌ను నిరోధించడానికి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు అందించిన రిపోర్టింగ్ మెకానిజాన్ని ఉపయోగించండి. వారిని బ్లాక్ చేయండి, రిపోర్ట్ చేయండి, వారి అకౌంట్ డిలీట్ అయ్యేలా రిపోర్ట్ చేయండి. ట్రోలింగ్ మీ కంటే ట్రోల్ గురించి ఎక్కువగా వెల్లడిస్తుంది. వారి నీచ మనస్తత్వం అందరికీ తెలిసేలా చేస్తుంది. అందువల్ల ట్రోల్స్ గురించి బాధపడకండి. మిమ్మల్ని మీరు ఒంటరిగా ఉంచుకోకండి. స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆన్లైన్ గ్రూపుల మద్దతు తీసుకోండి. మీ విలువను మీకు గుర్తు చేయగల, మీకు సహాయం చేయగల వ్యక్తులతో ఎక్కువ సమయం గడపండి. ట్రోలింగ్ వల్ల ఆందోళన, నిరాశ, దిగులు, ఆత్మహత్య ఆలోచనలు వస్తుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సైకాలజిస్టును సంప్రదించండి. ట్రోల్స్ 2 రకాలు.. ట్రోలింగ్ చేసేవారిని ట్రోల్ అంటారు. వీరు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటారు. వ్యక్తిగతంగా ఇతరులను ట్రోల్ చేసి ఆనందించేవారు. వీరివల్ల కాస్తంత బాధే తప్ప ప్రమాదం ఉండదు. కానీ ఒక సంస్థ కోసమో, రాజకీయ పార్టీ కోసమో వ్యవస్థీకృతంగా ట్రోల్ చేసేవారు ప్రమాదకరంగా ఉంటారు. ఎందుకంటే వారిలో ఒకరు ట్రోలింగ్ మొదలుపెడితే వందల్లో, వేలల్లో, లక్షల్లో ట్రోల్ చేస్తారు. వారికి ఆయా సంస్థ లేదా పార్టీల మద్దతు కూడా ఉండటంతో విపరీతంగా రెచ్చిపోతారు. ఇవి కొన్నిసార్లు ఆన్లైన్ యుద్ధాలుగా మారవచ్చు. ట్రోలింగ్ సంకేతాలను గుర్తించాలి.. ట్రోల్స్ నుంచి తప్పించుకోవాలంటే ముందు వారి లక్షణాలను, ప్రవర్తనను గుర్తించాలి. అప్పుడే వారికి దూరంగా ఉండవచ్చు. అందుకే వాటిని గుర్తించడం అవసరం. మీతో గొడవపడటం, మిమ్మల్ని రెచ్చగొట్టి, బాధపడేలా చేయడమే ట్రోల్స్ లక్ష్యం. అందుకోసం అవమానకమైన భాష ఉపయోగిస్తారు వాస్తవాలను వక్రీకకరిస్తారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తారు. వాస్తవ సమస్యల నుంచి పక్కదారి పట్టించి, సామాజిక ఉద్రిక్తతలను సృష్టించాలని ప్రయత్నిస్తుంటారు. చర్చను వాదనగా మారుస్తారు. మీ రూపం, విలువలు, విశ్వాసాలను కించపరుస్తూ మాట్లాడతారు. కొందరు మరింత దిగజారి బూతులు కూడా తిడతారు. — సైకాలజిస్ట్ విశేష్ (psy.vishesh@gmail.com) ఇవి చదవండి: Usha Mehta: వెండి తెర మీద రహస్య రేడియో -
హైదరాబాద్‌లో పెరిగిన క్రైమ్ రేట్.. మహిళలపై 12 శాతం పెరిగిన నేరాలు
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో క్రైమ్ రేట్ గత ఏడాదితో పోలిస్తే 2 శాతం పెరిగింది. హైదరాబాద్ కమిషనరేట్ ఇయర్ ఎండింగ్ మీడియా సమావేశం శుక్రవారం జరిగింది. యానివల్ క్రైం రౌండప్ బుక్‌ను హైదరాబాద్ పోలీస్ కమీషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి విడుదల చేశారు. ఈ సమావేశంలో జాయింట్, అడిషనల్ సీపీలు , డీసీపీలు పాల్గొన్నారు. నగరంలో నేరాలకు సంబంధించిన వివరాలు.. హైదరాబాద్‌లో 24,821 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. గత ఏడాది తో పోలిస్తే 2 శాతం పెరిగిన క్రైమ్ రేట్ 9% పెరిగిన దోపిడీలు , మహిళలపై 12 % పెరిగిన నేరాలు గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది 19 % పెరిగిన రేప్ కేసులు గత ఏడాదితో పోలిస్తే చిన్నారులపై 12 % తగ్గిన నేరాలు వివిధ కేసుల్లో జరిగిన నష్టం విలువ రూ.38 కోట్లు , పొగొట్టుకున్న సొత్తులో 75 % రికవరీ హత్యలు 79 , రేప్ కేసులు 403 , కిడ్నాప్ లు 242, చీటింగ్ కేసులు 4,909 రోడ్డు ప్రమాదాలు 2,637, హత్యాయత్నాలు 262, చోరీలు 91 నమోదు ఈ ఏడాది 63 % నేరస్తులకు శిక్షలు 13 కేసులో 13 మందికి జీవిత ఖైదీ శిక్షలు ఈ ఏడాది 83 డ్రగ్ కేసుల్లో 241మంది అరెస్ట్ గత ఏడాది తో పోలిస్తే ఈఏడాది 11 % పెరిగిన సైబర్ నేరాలు ఈ ఏడాది ఇన్వెస్టమెంట్ స్కీమ్ ల ద్వారా 401 కోట్లు మోసాలు మల్టిలెవల్ మార్కెటింగ్ 152 కోట్లు మోసం ఆర్థిక నేరాలు 10 వేల కోట్లు కు పైగా మోసం ల్యాండ్ స్కామ్ లల్లో 245 మంది అరెస్ట్ సైబర్ క్రైమ్స్ నేరాలకు పాల్పడిన 650 మంది అరెస్ట్ పీడీ యాక్ట్ 18 మందిపై నమోదు ట్రాఫిక్ కేసులు ఇలా.. డ్రంక్ డ్రైవ్ లో 37 వేల కేసులు నమోదయ్యాయని సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. డ్రంక్ డ్రైవ్ ద్వారా రూ.91 లక్షలు జరిమానాలు విధించామని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లఘించినవారి 556 డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. రోడ్డు ప్రమాదా ద్వారా మరణాలు 280 నమోదు కాగా.. అందులో పాదచారులు 121 మంది ఉన్నారు. మైనర్ డ్రైవింగ్స్ 1,745 కేసులు నమోదు అయ్యాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించిన రూ. 2.63 లక్షల మందికి ట్రాఫిక్ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. డ్రగ్స్ అనే మాట వినపడొద్దు.. ఈ ఏడాది మత్తు పదార్థాలు వాడిన 740 మందిని అరెస్టు చేశారు. డ్రగ్స్ కేసులో 13 మంది విదేశీయులు ఉన్నట్లు సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తెలంగాణా రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినపడవద్దని హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఎక్కడ ఉన్నా వెతికి అరెస్ట్ చేస్తామని చెప్పారు. డ్రగ్స్ సప్లై, డిమాండ్ పై ఫోకస్ ఉందని తెలిపారు. డ్రగ్స్‌ను పట్టుకునేందుకు రెండు స్నిపర్ డాగ్స్‌కు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఇదీ చదవండి: ఎర్రమంజిల్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం -
పూర్ణానంద స్వామి పై అత్యాచారం కేసు
-
మహిళను పొలంలోకి లాక్కెళ్లి కళ్లు పొడిచి పరార్.. ఏం జరిగింది?
పాట్నా: ఇంట్లో నిద్రిస్తున్న మహిళ(45)ను సమీపంలోని జనుము పంటలోకి లాక్కెళ్లి ఆమె కళ్లు పొడిచేసిన సంఘటన బిహార్‌లోని కటిహార్ జిల్లాలో వెలుగు చూసింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. ఈ విషాద సంఘటన దక్లా ఇంగ్లీష్ గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన అధికారులు నిందితుడుని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. మహిళపై దాడి చేసి చూపు కోల్పోయేలా చేసిన దుండగుడు ఎండీ షామిమ్‌గా గుర్తించారు పోలీసులు. 'నిందితుడు ఎండీ షామిమ్‌ను అరెస్ట్ చేశాం. ఈ ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇది అత్యాచారమా కాదా అనేది ఇంకా తెలియరాలేదు.' అని ఎస్డీపీఓ తెలిపారు. ఏం జరిగింది? పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు గ్రామంలో తన 8 ఏళ్ల కుమార్తెతో జీవిస్తోంది. మంగళవారం రాత్రి తన కూతురితో కలిసి ఇంట్లో నిద్రపోతోంది. ఆమె భర్త నాలుగు రోజుల క్రితం పని కోసం ఢిల్లీ వెళ్లాడు. దుండగుడు అక్కడికి వచ్చి డోర్ కొట్టాడు. బాధితురాలు తలుపు తీయగా.. ఆమెను సమీపంలోని జనుము తోటలోకి లాక్కెల్లాడు. చేతులు కట్టేసి తన తల్లి కంట్లో కర్ర పుల్లలను దూర్చాడని, దాంతో తీవ్రంగా రక్తస్రావం అయినట్లు బాధితురాలి కుమార్తె పోలీసులకు తెలిపింది. దాడికి పాల్పడిన తర్వాత నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి బంధువులు వెంటనే ఆమెను అమ్దాబాద్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా మారటం వల్ల కటిహార్ వైద్య కళాశాల, ఆసుపత్రికి తరలించారు. ఆమెకు చూపు వస్తుందనే నమ్మకం లేదని అక్కడి వైద్యులు తెలిపారు. ఇదీ చూడండి: ప్రియురాలు ద్రోహం చేసిందని తట్టుకోలేక... ఆమెను చంపి... -
అర్ధ నగ్న స్థితిలో యువతి మృతదేహం.. ఆ రాత్రి ఫ్లాట్‌లో ఏం జరిగింది..?
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ యువతి అర్ధ నగ్నంగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఓ వ్యక్తి ఆమెపై లైంగిక దాడి ప్రయత్నం చేసి హత్య చేశాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల ప్రకారం.. బురారీ ప్రాంతంలోని కౌశిక్ ఎన్‌క్లేవ్‌లోని ఓ ఫ్లాట్‌లో అమన్, అతడి భార్య ప్రియాంక నివాసం ఉంటున్నారు. కాగా, శుక్రవారం రాత్రి ప్రియాంక తమ బంధువుల ఇంటికి వెళ్లి రాత్రి తన ఫ్లాట్‌కు వచ్చింది. ఆమె ఇంట్లోకి వెళ్లగానే మంచంపై అర్దనగ్న స్థితిలో ఉన్న ఓ యువతి మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ ఘటన జరిగిన రోజు నుంచి ప్రియాంక భర్త అమన్ ఫ్లాట్‌కు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో అతనే ఆమెను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో, అమన్ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. మరోపైపు ఈ ఘటనపై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. చనిపోయిన యువతితో అమన్‌కు చాలా కాలంగా పరిచయం ఉన్నట్టు వెల్లడించారు. ఈ క్రమంలోనే హత్య జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నట్టు పేర్కొన్నారు. -
యూపీలోనే ఎక్కువ.. ఎందుకిలా?
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కల్లోలం రేపిన హాథ్రస్ దళిత యువతి అత్యాచారం చోటు చేసుకున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గత నాలుగేళ్లలో మహిళలకు వ్యతిరేకంగా క్రైమ్ రేటు ఏకంగా 66.7 శాతం పెరిగిందని సెప్టెంబర్ 19వ తేదీన ‘క్రైమ్ ఇన్ ఇండియా 2019’ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా షెడ్యూల్డ్ కులల మహిళలకు వ్యతిరేకంగా 37 శాతం రేప్ సంఘటనలు పెరగ్గా, 20 శాతం భౌతిక దాడులు పెరిగాయి. దేశవ్యాప్తంగా షెడ్యూల్డ్ కులాల మహిళలకు వ్యతిరేకంగా రేప్ సంఘటనలు సరాసరి 23.3 శాతం పెరగ్గా, హింసాత్మక సంఘటనలు 18.8 శాతం పెరిగింది. షెడ్యూల్డ్ కులాల మహిళలపైనే కాకుండా మొత్తంగా దేశంలోని మహిళలపై దాడులు పెరిగాయి. గత నాలుగేళ్ల కాలంలో దేశంలోని మహిళలకు వ్యతిరేకంగా ఓ పక్క దాడులు పెరగ్గా మరోపక్క పెండింగ్ కేసులు కూడా పెరగడం విచిత్రమే. అన్ని కేటగిరీలకు చెందిన మహిళలపై పెండింగ్ కేసులు 29.3 శాతం పెరగ్గా, ఎస్సీ మహిళలకు వ్యతిరేకంగా పెండింగ్ కేసుల సంఖ్య 33.8 శాతంకు పెరిగాయి. మహిళలపై జరిగిన దాడులకు సంబంధించిన కేసుల్లో కేవలం 7.6 శాతం కేసులే పరిష్కారమయ్యాయి. షెడ్యూల్డ్ మహిళలకు సంబంధించిన కేసుల్లో ఈ సంఖ్య 6.1 శాతానికే పరిమితమైంది. 40 శాతం కేసుల్లో నేరానికి సరైన సాక్ష్యాధారాలు లేవంటూ కొట్టివేయడం కనిపిస్తోంది. మహిళలకు వ్యతిరేకంగా గత నాలుగేళ్లలో పెరుగుతున్న నేరాల్లో కేసులు నమోదవడం కూడా ఎక్కువే జరుగుతోంది. కట్నం చావులు, కట్నం కోసం భర్త, ఇతర కుటుంబ సభ్యులు హింసకు పాల్పడడం, లైంగిక దాడులు, ఆసిడ్ దాడులు, కిడ్నాప్‌లు, అక్రమ రవాణా తదితర నేరాలను మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలుగా పరిగణలోకి తీసుకున్నారు. 2015 సంవత్సరంతో పోలిస్తే 2019 సంవత్సరానికి ఈ కేసుల నమోదు కూడా దేశవ్యాప్తంగా సరాసరి 7.3 శాతం పెరిగింది. ఈ సంఖ్య కూడా యూపీలో ఎక్కువగా ఉంది. యూపీలో 66.7 శాతం కేసులు నమోదుకాగా, హర్యానాలో 54.4 శాతం, రాజస్థాన్‌లో 47.2 శాతం, ఒడిశా, బిహార్ రాష్ట్రాల్లో 34, 35 శాతం కేసులు నమోదయ్యాయి. 2014 సంవత్సరంతో పోలీస్తే 2019 సెప్టెంబర్ 29వ తేదీ నాటికి యూపీలో మహిళలకు వ్యతిరేకంగా జరిగిన దాడుల కేసులో ఏకంగా 15 శాతం పెరిగాయి. (హథ్రాస్ : నిందితుడిపై కేసు నమోదు చేసిన సీబీఐ) -
క్రైమ్ రౌండప్ 2019
-
అత్యాచారం.. ఆపై ఆమెకే శిక్ష
గయా : బీహార్‌లోని గయా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అత్యాచార బాధితురాలికే శిక్ష విధించారు గ్రామ పెద్దలు. నిందితులను వదిలిపెట్టి, బాధితురాలికి శిక్షగా గుండు చేయించి ఊరేగించారు. ఈ దారుణ ఘటన ఈ నెల 14 న జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 14వ తేదీ సాయంత్రం కొంతమంది వ్యక్తులు కలిసి ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి వాహనంలో తీసుకువెళ్లారు. స్థానిక పంచాయతీ భవనంపైకి తీసుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్పృహా కోల్పోయిన బాలికను అక్కడే వదిలేసి పారిపోయారు. మరుసటి రోజు ఓ గ్రామస్తుడు చూసి బాలిక తల్లిదండ్రులు తెలపడంతో వారు వచ్చి ఇంటికి తీసుకువెళ్లారు. మరుసటి రోజు బాలిక తల్లిదండ్రులు గ్రామ పంచాయతీకి ఫిర్యాదు చేశారు. నిందితుల కుటుంబ సభ్యులు, బంధువులు గ్రామంలో పేరు, బలగం ఉన్నవారు కావడంతో బాధితురాలికి న్యాయం చేయాల్సిన పంచాయతీ తిరిగి సదరు మహిళనే దోషిగా తేల్చి శిక్ష విధించింది. బాలికకు గుండు చేయించి ఊరిలో ఊరేగించారు. దీంతో తమకు న్యాయం దక్కలేదని పోలీసులను ఆశ్రయించారు. అక్కడ కూడా ఫలితం లేకుండా పోయింది. దీంతో బాధిత కుటుంబం జిల్లా పోలీసు ఉన్నతాధికారులను కలిసి వేడుకోవడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. గ్రామ సభ నిర్వహించి బాలికకు శిక్షను ఖరారు చేసిన ఐదురుగు పంచాయతీ పెద్దలపై సైతం కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న బిహార్ మహిళా కమిషన్ చైర్పర్సన్ గయా సీనియర్ ఎస్పీకు లేఖ రాశారు. సెప్టెంబర్ 2వ తేదీన పంచాయతీ సభ్యులను తమ ఎదుట హాజరు పరచాలని ఆదేశించారు. -
‘నేర’పురి కేరాఫ్ నెల్లూరు
ప్రశాంతతకు మారుపేరైన జిల్లాలో నేర సంస్కృతి జడలు విప్పుతోంది. పొట్టపోసుకునే వృత్తుల్లాగే ప్రాణాలు తీసే నేర ప్రవృత్తి సమాజంలో వేళ్లూనుకుపోతోంది. హత్యలు వణికిస్తున్నాయి. మహిళలపై అఘాయిత్యాలు సభ్యసమాజం తలదించుకునేలా చేస్తున్నాయి. మనం అనే భావన కన్నా నాది అనే స్వార్థం ఎక్కువైంది. కొందరు డబ్బు కోసం మానవత్వం మరిచి ఎంతకైనా తెగిస్తున్నారు. సాక్షి, నెల్లూరు(క్రైమ్): జిల్లాలో నేరాలు ఏడాదికేడాది పెరిగిపోతున్నాయి. ప్రజలకు భద్రత కరువైందనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. మారుమూల పల్లెల్లో శాంతిభద్రతల పరిరక్షణ సంగతి దేవుడెరుగు.. హైటెక్ వసతులు, అధికార యంత్రాంగం కేందీకృతమైన నగరం, పట్టణాల్లో సైతం శాంతిభద్రతల పరిరక్షణ కష్టతరంగా మారింది. రోజురోజుకు పెరుగుతున్న నేరప్రవృత్తి, పోలీసుల నిర్లక్ష్యం, ఏళ్ల తరబడి సాగుతున్న కేసుల పరిశోధన వెరసి ప్రజలకు సత్వర న్యాయం అందని ద్రాక్షాలా మారుతోంది. నగరవాసులకు సాధారణ భద్రత కల్పించలేని దుస్థితిలో పోలీసు వ్యవస్థ ఉండడం గమనార్హం. సిబ్బంది, ఆర్థిక, మానవ వనరుల కొరతను పోలీసులు సాకుగా చూపుతున్నప్పటికీ పౌరులకు భద్రత కల్పించాలనే ప్రాథమిక బాధ్యతను విస్మరించే పరిస్థితి తలెత్తుతోంది. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, లైంగికదాడులతో జిల్లాలో శాంతిభద్రతలు క్రమేపీ క్షీణదశకు చేరుకుంటున్నాయి. కొరవడిన నిఘా.. జాతీయ రహదారిపై వరుస దోపిడీలు, దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారనే విమర్శలున్నాయి. దీంతో దొంగలు బరితెగిస్తున్నారు. గతంలో వెంకటాచలం పోలీసు స్టేషన్ పరిధిలో ఓ బంగారు వ్యాపారిపై దాడిచేసి సుమారు మూడు కేజీల బంగారు ఆభరణాలతోపాటు ఆయన కారును దుండగులు దోచుకెళ్లారు. ఘటన జరిగి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకూ ఆచూకీ కనుగొనడంలో పోలీసులు సఫలీకృతులు కాలేదు. ఇటీవల తడ శ్రీసిటీ నుంచి రూ.4.50 కోట్ల వ్యయం చేసే సెల్ఫోన్లను తరలిస్తున్న కంటైనర్‌ను దుండగులు దోచుకెళ్లారు. ఇంతవరకూ ఈ కేసులో పురోగతి లేదు. చిన్నాచితకా నేరాలు తరచూ చోటుచేసుకుంటూనే ఉన్నాయి. వీటిని అరికడతామని హైవే పెట్రోలింగ్ ముమ్మరం చేస్తామన్న ఉన్నతాధికారులు మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారు. జనవరి నుంచి చోటుచేసుకున్నవి జనవరి 2న నెల్లూరు రాజీవ్‌గాంధీకాలనీలో శ్యామల అనే మహిళ దారుణ హత్యకు గురైంది. 8న బాలాయపల్లి మండలం చిలమాసూరుగ్రామ తిప్ప సమీపంలో జి.శ్రీనివాసులు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఫిబ్రవరి 1వ తేదీన సీతారామపురం పోరుమామళ్లి ఘాట్‌రోడ్డులో దుండగులు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసి పెట్రోలు పోసి తగులబెట్టారు. 9న ఇందుకూరుపేటలో కూతురిని వేధిస్తున్నాడని అల్లుడిని మామ దారుణంగా హత్య చేశాడు. 11న చిల్లకూరు మండలం నర్రావారిపాళెంలో వెంకటమ్మ (60) అనే వృద్ధురాలిని కుమారుడు చిన చెంచయ్య చంపేశాడు. 11న ప్రశాంతినగర్‌లో సంధ్య అనే మహిళను భర్త మహేష్ అతిదారుణంగా హత్య చేశాడు. 12న కోట మండలంలోని వీరారెడ్డిసత్రం కాలనీలో నరేష్ (45) అనే కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. 13న శ్రీసిటీ నుంచి కోల్‌కత్తాకు రూ.4.50 కోట్లు విలువచేసే సెల్ఫోన్లతో బయలుదేరిన కంటైనర్ అపహరణకు గురైంది. 19న పొదలకూరు మండలంలో మోటారుబైక్పై వెళుతున్న కాంతమ్మ అనే వృద్ధురాలిని బెదిరించి నాలుగు సవర్ల బంగారు గొలుసును లాక్కెళ్లారు. 19న లిఫ్ట్ ఇస్తామని బైక్‌పై ఎక్కించుకుని విశ్రాంత ఉద్యోగి నుంచి నాలుగుసవర్ల బంగారు చైన్, రూ.2 వేల నగదు, సెల్‌ఫోన్‌ను దోచుకెళ్లారు. 24న రాత్రి నెల్లూరు నగరంలోని రాయపుపాళెం విజయకృష్ణ, అతని కుటుంబసభ్యులపై ప్రత్యర్థులు మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడిచేశారు. తీవ్రగాయాలై విజయకృష్ణ మృతిచెందాడు. 26న సూళ్లూరుపేట – శ్రీకాళహస్తి మార్గంలోని సంతవేలూరు నుంచి మంగళంపాడకు వెళ్లే రహదారిలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. 27న నేతాజీనగర్‌లో విశ్రాంత ఉద్యోగి వసంతకుమారి దారుణ హత్యకు గురైంది. నగలు, డాక్యుమెంట్స్‌ను అపహరించారు. బాలికలపై.. జనవరి 9వ తేదీన కోవూరులో బాలికపై యువకుడు లైంగికదాడి యత్నం చేశాడు. 12న డక్కిలి మండలంలో మైనర్ బాలికపై లైంగికదాడి యత్నం జరిగింది. 28న కావలిలో 12 ఏళ్ల కుమార్తెపై తండ్రి లైంగికదాడి చేసి సభ్యసమాజం తలదించుకునేలా చేశాడు. మార్చి 3వ తేదీ రాత్రి తడ మండలంలో పదేళ్ల బాలికను ఓ వ్యక్తి బలవంతంగా తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఏ సంవత్సరంలో ఎన్ని.. నమోదైన కేసులు 2017 2018 2019 దోపిడి హత్యలు 8 8 1 హత్యలు 57 61 9 దోపిడీలు 33 51 10 పగటి దొంగతనాలు 84 61 - రాత్రి దొంగతనాలు 290 325 - సాధారణ చోరీలు 835 693 - అత్యాచారాలు 59 62 10 జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.20 లక్షలు విలువచేసే బంగారు ఆభరణాలు, నగదును దుండగులు అపహరించారు. రోడ్డు ప్రమాదాల్లో సుమారు 30 మందికిపైగా మృతిచెందారు. పదిమంది దారుణహత్యకు గురయ్యారు. ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యం చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నారు. ఒక్కో సమయంలో హత్యలకు వెనుకాడడం లేదు. గతంలో ఉస్మాన్‌సాహెబ్‌పేటలో విశాంత్ర ఆర్జేడీని గుర్తుతెలియని దుండగులు హత్యచేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను అపహరించారు. ఈ ఘటనపై పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. ఇంతవరకూ చిన్నపాటి క్లూ దొరకలేదు. కేసు ఎక్కడివేసిన గొంగళి అక్కడే అన్నచందాన మారింది. తాజాగా నేతాజీనగర్ 6వ వీధిలో విశ్రాంత ఆర్ఐ వసంతకుమారి దారుణహత్యకు గురైంది. ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను దుండగులు అపహరించారు. సూళ్లూరుపేటలో యువతిపై అత్యాచార ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. గంజాయికి అలవాటుపడ్డ కొందరు ఈ దారుణానికి ఒడిగట్టారు. తడ మండలంలో పురుషులపై దాడులకు పాల్పడి, మహిళలపై లైంగిక దాడి చేసే ఓ ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గంజాయి మత్తులో ఆ ప్రాంతంలో నేరాలు జరుగుతున్నట్లు పోలీసులు విచారణలో బయటపడింది. శ్యామల మృతదేహం (ఫైల్) -
ఒక్క పోలీస్ స్టేషన్ తో కథలో మంచి ట్విస్ట్
ఒక్క పోలీస్ స్టేషన్.... ఒక్కటంటే ఒక్క పోలీస్ స్టేషన్ అరుణాచల్ క్రైమ్ చరిత్రను మార్చేసింది. రాజధాని ఈటానగర్ లో ఏర్పాటు చేసిన ఈ పోలీస్ స్టేషన్ మహిళలపై అత్యాచారాలను తగ్గించడంలో కీలకపాత్ర పోషించింది. ఇది అరుణాచల్ ప్రదేశ్ లోని మొట్టమొదటి మహిళా పోలీస్ స్టేషన్. ఇప్పటికి అరుణాచల్ లో ఇదొక్కటే మహిళా పోలీస్ స్టేషన్. ఈ పోలీస్ స్టేషన్ లో పెద్దగా వనరులు లేవు. వసతులు కూడా లేవు. కానీ మహిళలపై హింసను, అత్యాచారాలను అరికట్టడంలో మాత్రం ఈ పోలీస్ స్టేషన్ చాలా కీలకపాత్ర పోషిస్తోంది. మహిళా పోలీస్ స్టేషన్ ఇలాంటి కేసుల విషయంలో సత్వరమే రంగంలోకి దిగడంతో దోషులను పట్టుకోవడం సులువవుతోంది. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రెండేళ్ల క్రితం అన్ని జిల్లా కేంద్రాల్లో ఒక మహిళా పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఇటానగర్ లో ఈ పోలీస్ స్టేషన్ ఏర్పాటైంది. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళపై హింస, దౌర్జన్యం, అత్యాచారం వంటి ఘటనలు తగ్గాయి. పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల్లో 70 శాతం కేసులు పరిష్కరించడం జరిగింది. మొత్తం 123 కేసుల్లో 86 కేసుల్లో చార్జిషీట్లు దాఖలయ్యాయి. 20 కేసుల్లో ఫైనల్ రిపోర్టులు తయారయ్యాయని ఆ స్టేషన్ ఆఫీసర్ చుఖు నాను బుయ్ చెబుతున్నారు. ఇప్పుడు ఇతర జిల్లాలనుంచి కూడా కేసులు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి.