Delhi Death News: Semi Naked Women Body Found In Burari - Sakshi
Sakshi News home page

Delhi: బెడ్‌పై అర్ధ నగ్నంగా యువతి మృతదేహం.. ఆ రాత్రి ఫ్లాట్‌లో ఏం జరిగింది..? 

Published Sat, Feb 19 2022 3:24 PM | Last Updated on Sat, Feb 19 2022 6:16 PM

Semi Naked Women Body Found At Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ యువతి అర్ధ నగ్నంగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఓ వ్యక్తి ఆమెపై లైంగిక దాడి ప్రయత్నం చేసి హత్య చేశాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

వివరాల ప్రకారం.. బురారీ ప్రాంతంలోని కౌశిక్‌ ఎన్‌క్లేవ్‌లోని ఓ ఫ్లాట్‌లో అమన్‌, అతడి భార్య ప్రియాంక నివాసం ఉంటున్నారు. కాగా, శుక్రవారం రాత్రి ప్రియాంక తమ బంధువుల ఇంటి​కి వెళ్లి రాత్రి తన ఫ్లాట్‌కు వచ్చింది. ఆమె ఇంట్లోకి వెళ్లగానే మంచంపై అర్దనగ్న స్థితిలో ఉన్న ఓ యువతి మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

 ఇదిలా ఉండగా ఈ ఘటన జరిగిన రోజు నుంచి ప్రియాంక భర్త అమన్‌ ఫ్లాట్‌కు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో అతనే ఆమెను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో, అమన్‌ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. మరోపైపు ఈ ఘటనపై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. చనిపోయిన యువతితో అమన్‌కు చాలా కాలంగా పరిచయం ఉన్నట్టు వెల్లడించారు. ఈ క్రమంలోనే హత్య జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నట్టు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement