సాక్షి, బాపట్ల జిల్లా: చెరుకుపల్లిలో దీక్ష చేపట్టిన వైఎస్సార్‌సీపీ వేమూరు నియోజకవర్గ ఇన్‌చార్జి వరికూటి అశోక్ బాబుకు మాజీ ఎంపీ నందిగం సురేష్ సంఘీభావం తెలిపారు. అద్దేపల్లిలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని వీడియో కాల్‌లో అశోక్ బాబుకు నందిగం సురేష్ చూపించారు. 24 గంటల్లో ఎక్కడైతే వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేశారో అక్కడే కొత్త విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. అశోక్ బాబుకి మాజీ ఎంపీ నందిగం సురేష్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరంపజేశారు.
కాగా భట్టిప్రోలు పంచాయతీ పరిధిలోని అద్దేపల్లి దళితవాడలో శనివారం ఉదయం 6 గంటలకు అందరూ చూస్తుండగానే టీడీపీ వర్గీయులు దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. వైఎస్సార్‌సీపీ వేమూరు నియోజకవర్గ ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు శనివారం రాత్రి అద్దేపల్లి విచ్చేసి కాలిపోయిన వైఎస్ విగ్రహాన్ని పరిశీలించారు. అక్కడే వైఎస్సార్ మరో విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. విగ్రహం ఏర్పాటు పూర్తయ్యే వరకూ ఆయన స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద కళ్లకు గంతలు కట్టుకుని మౌనదీక్ష చేశారు.
దళితవాడ ప్రజలు అండగా వచ్చి ఆయనకు మద్దతుగా దీక్షలో పాల్గొన్నారు. రాత్రి 10గంటల ప్రాంతంలో పోలీసులు అశోక్‌బాబు దీక్షను భగ్నంచేసి ఆయన్ను రేపల్లె తరలించారు. అక్కడా ఆయన పోలీసు వాహనం దిగకుండా దీక్ష కొనసాగించారు.
Comments
Please login to add a commentAdd a comment