Initiation
-
దీక్ష విరమించిన వైఎస్సార్సీపీ నేత అశోక్‌బాబు
సాక్షి, బాపట్ల జిల్లా: చెరుకుపల్లిలో దీక్ష చేపట్టిన వైఎస్సార్సీపీ వేమూరు నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్ బాబుకు మాజీ ఎంపీ నందిగం సురేష్ సంఘీభావం తెలిపారు. అద్దేపల్లిలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని వీడియో కాల్లో అశోక్ బాబుకు నందిగం సురేష్ చూపించారు. 24 గంటల్లో ఎక్కడైతే వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేశారో అక్కడే కొత్త విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. అశోక్ బాబుకి మాజీ ఎంపీ నందిగం సురేష్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరంపజేశారు.కాగా భట్టిప్రోలు పంచాయతీ పరిధిలోని అద్దేపల్లి దళితవాడలో శనివారం ఉదయం 6 గంటలకు అందరూ చూస్తుండగానే టీడీపీ వర్గీయులు దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. వైఎస్సార్సీపీ వేమూరు నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్‌బాబు శనివారం రాత్రి అద్దేపల్లి విచ్చేసి కాలిపోయిన వైఎస్ విగ్రహాన్ని పరిశీలించారు. అక్కడే వైఎస్సార్ మరో విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. విగ్రహం ఏర్పాటు పూర్తయ్యే వరకూ ఆయన స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద కళ్లకు గంతలు కట్టుకుని మౌనదీక్ష చేశారు.దళితవాడ ప్రజలు అండగా వచ్చి ఆయనకు మద్దతుగా దీక్షలో పాల్గొన్నారు. రాత్రి 10గంటల ప్రాంతంలో పోలీసులు అశోక్‌బాబు దీక్షను భగ్నంచేసి ఆయన్ను రేపల్లె తరలించారు. అక్కడా ఆయన పోలీసు వాహనం దిగకుండా దీక్ష కొనసాగించారు. -
కులవాదులను తరిమికొడతాం
తాడికొండ: ఒక సామాజికవర్గానికి చెందిన వారికే రాష్ట్రాన్ని దోచిపెట్టి, పేదల హక్కులను అడ్డుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తున్న చంద్రబాబు అండ్‌కోను రాజకీయంగా తరిమికొడతామని బహుజన పరిరక్షణ సమితి నాయకులు హెచ్చరించారు. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సెస్ రోడ్డు జంక్షన్లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు శనివారం నాటికి 1,168వ రోజుకు చేరుకున్నాయి. పలువురు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఓ సామాజికవర్గమంతా కట్టగట్టుకుని కోల్పోయిన అధికారాన్ని తెచ్చుకునేందుకు చేస్తున్న ఆగడాలు బహుజనులను హక్కులకు దూరం చేస్తున్నాయని మండిపడ్డారు. పేదవారికి ఇళ్ల స్థలాలు, ఇల్లు అందకుండా తప్పుడు కేసులు వేసిన వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పేదలకు ఇంగ్లిష్ మీడియం విద్య, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా సమాన హక్కులు పొందకుండా బాబు అండ్ కో అడ్డుకుంటున్నారన్నారు. రాజధాని పేరుతో రూ.3.50 లక్షల కోట్లు దోపిడీ చేసిన చంద్రబాబు కోర్టుల ద్వారా బెయిల్ తెచ్చుకుని అధికారం కోసం రోడ్ల వెంబడి తిరుగుతూ దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. పలు కుంభకోణాల్లో నిందితుడు, ఆర్థిక ఉగ్రవాది చంద్రబాబును వెంటనే అరెస్టు చేసి జైలులో పెట్టి తమకు రక్షణ కల్పించాలని కోరారు. ప్యాకేజీ ఇస్తేగానీ బయటకు రాని పవన్‌కళ్యాణ్ రాష్ట్రంలో పోటీ చేస్తే.. నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. నాయకులు ఏటూరి ఆదాం, మాదిగాని గురునాధం, పులి దాసు, కారుమూరి పుష్పరాజు, నూతక్కి జోషి తదితరులు పాల్గొన్నారు. -
దోపిడీ చేసి జైలుకు వెళ్లి దీక్షలు చేయడం ఏంటి? సజ్జల ఫైర్
సాక్షి, తాడేపల్లి: స్కిల్ స్కాం కేసులో అడ్డంగా దొరికిపోయి జైలుకు వెళ్లిన చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా గాంధీ జయంతి రోజు నిరాహార దీక్షా చేస్తానంటున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు పచ్చిగా దోపిడీ చేసి జైలుకు వెళ్లారని, బలమైన సాక్ష్యాలు ఉన్నాయని కోర్టు నమ్మి రిమాండ్ విధించిందని తెలిపారు. అయితే దోపిడీ చేసి జైలుకు వెళ్లి దీక్షలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రజల కోసం చేస్తే అర్థం చేసుకోవాలి.. తప్పు చేసినట్లు గుర్తించిన కోర్టు.. రిమాండ్‌కు పంపితే అక్కడ బాబు నిరాహార దీక్ష చేయటంపై సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం ఏదైనా చేశారంటే అర్థం చేసుకోవచ్చని అన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు గమనించాలని స్వాతంత్ర్యం వచ్చాకా ప్రజల్లో మార్పులు వచ్చాయని తెలిపారు. సిద్దాంతాల మీద చర్చలు జరుగుతున్నాయే గానీ, అమలు విషయంలో జరగడం లేదని అన్నారు. హింసలో దోపిడీ ఉందని సజ్జల.. అహింసతో కూడా పోరాటం చేయవచ్చని గాంధీజీ నిరూపించారని గుర్తు చేశారు. గ్రామ స్థాయిలో అనేక మార్పులు సజ్జల మాట్లాడుతూ.. పెత్తందారీతనం లేకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తితో నడవాలంటే కిందిస్థాయి వరకు పథకాలు అమలు చేయాలి. నిరక్షరాస్యత పోవాలి. అప్పట్లో అవసరాలు తక్కువ, అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా మారింది, అందరికీ సమాన అవకాశాలు రావాలి. గ్రామ స్థాయిలో మనం అనేక మార్పులు తేగలిగాం. గ్రామ సచివాలయం ఇరుసుగా ఉంటే దాని చుట్టూ అనేక వ్యవస్థలు పని చేస్తున్నాయి. కార్పొరేట్‌కు ధీటుగా విద్య, వైద్య రంగాల్లో మార్పులు తెచ్చాం. దీనిద్వారా అందరి జీవితాల్లో మార్పులు తెచ్చాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో అద్భుత మార్పులు ఆరోగ్య సురక్ష కార్యక్రమం కూడా అద్భుతంగా జరుగుతోంది. అంతకుముందు 98 లక్షల సర్టిఫికేట్లను కూడా ఇంటికి తీసుకుని వెళ్లి ఇచ్చాం. ఇదంతా కొత్తగా మనం వ్యవస్థను రూపొందించటం వల్లే సాధ్యం. 15 మెడికల్ కాలేజీలు, మండలానికి ముగ్గురు డాక్టర్లు చొప్పున పెట్టాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ సీఎం తెచ్చాక అద్భుతమైన మార్పులు జరుగుతున్నాయి. అందరి ఆరోగ్యంపై పూర్తి సమాచారం వస్తోంది. దీని ద్వారా ఎక్కడ ఎలాంటి రీసెర్చ్ సెంటర్లు పెట్టాలో, ఎలాంటి స్పెషలిస్టు డాక్టర్లను నియమించాలో తెలుస్తుంది. పేరుకు పాలన వైఎస్సార్సీపీదే అయినా ప్రజల చేతుల్లోనే పాలన ఒకప్పుడు ధనవంతులే ఫ్యామిలీ డాక్టర్‌ను పెట్టుకునేవారు. ఇప్పుడు ప్రతి ఇంటికీ ఫ్యామిలీ డాక్టర్‌ను సీఎం జగన్ నియమించారు. మారుమూల గ్రామాల్లోనూ ఈ విధానం అమలవుతోంది. విద్య, వ్వవసాయ రంగాల్లో కూడా అలాంటి మార్పులే చోటు చేసుకున్నాయి. చంద్రబాబు చెప్పిన నవనిర్మాణం అనేది బోగస్. కానీ వైఎస్ జగన్ చేసి చూపించారు. మహిళలకు కూడా అనేక అవకాశాలు కల్పించింది కూడా ముఖ్యమంత్రి జగనే. ఎన్నికలలో మాట ఇచ్చి, తర్వాత వదిలేసే రోజులు పోయాయి. ఇచ్చినమాటకు కట్టుబడి పని చేయాలన్నది వైఎస్ జగన్ విధానం. పేరుకు పాలన వైఎస్సార్సీపీదే అయినా సీఎం ప్రజల చేతుల్లోనే పాలన పెట్టారు. నిశబ్ద విప్లవాన్ని ఆయన తెచ్చారు -
కంపెనీలు తేవడం ఆషామాషీ కాదు
సాక్షి, హైదరాబాద్ / శామీర్‌పేట / మర్కూక్ (గజ్వేల్): రాష్ట్రానికి కొత్త కంపెనీలు తీసుకురావడం అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కొన్నేళ్లుగా తెలంగాణకు అనేక దేశ, విదేశీ కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయంటే, దానివెనుక రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, మంత్రులు పడే శ్రమ చాలా ఎక్కువని ఆయన అన్నారు. హైదరాబాద్‌లోని జినోమ్ వ్యాలీలో గురువారం ఫార్మా కంపెనీ భారత్ సిరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ కర్మాగారానికి శంకుస్థాపన చేసిన మంత్రి మాట్లాడుతూ జీవశాస్త్ర రంగ అభివృద్ధికి, ప్రోత్సాహానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్న ఫలితమే కొత్త కొత్త కంపెనీల రాక అని చెప్పారు. పది ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటవుతున్న బీఎస్వీ కర్మాగారం ద్వారా మహిళల ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే ఉత్పత్తులు తయారు కానుండటం హర్షణీయమైన అంశమన్నారు. జినోమ్ వ్యాలీలో అంచనాలకు మించి వృద్ధి చెందుతోందని, ఈ నేపథ్యంలో దీనిని మరింత విస్తరించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఇప్పటికే 130 ఎకరాల భూమి అదనంగా సేకరించగా, 250 ఎకరాలతో మలిదశ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ ఉపాధ్యక్షుడు ఈవీ నరసింహారెడ్డి, తెలంగాణ లైఫ్ సైన్సెస్ సీఈఓ శక్తి నాగప్పన్, బీఎస్వీ ఎండీ, సీఈఓ సంజీవ్ నవన్‌గుల్ పాల్గొన్నారు. యూరోఫిన్స్ కేంద్రం ప్రారంభం బెల్జియం కేంద్రంగా పనిచేస్తున్న యూరోఫిన్స్ బయో ఫార్మా సర్విసెస్ హైదరాబాద్‌లోని జినోమ్ వ్యాలీలో తన కేంద్రాన్ని గురువారం ప్రారంభించింది.వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులతో సిద్ధమైన ఈ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. అంతర్జాతీయ స్థాయి ఫార్మా కంపెనీలకు బయో అనలిటికల్ సర్విసెస్, ఫార్ములేషన్ డెవలప్మెంట్, సేఫ్టీ టాక్సికాలజీ, డిస్కవరీ కెమిస్ట్రీ అండ్ డిస్కవరీ బయాలజీ వంటి సేవలు అందించే యూరోఫిన్స్ కేంద్రం 15 ఎకరాల్లో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యూరోఫిన్స్ కేంద్రం ద్వారా రానున్న కాలంలో రెండు వేల మందికిపైగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా 33 శాతం వ్యాక్సిన్లు హైదరాబాద్ జినోమ్ వ్యాలీలోనే తయారు అవుతున్నాయని, ప్రపంచానికి వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ మారిందని ఎక్కడికెళ్లినా ధైర్యంగా చెబుతానన్నారు. ఇక్కడ ఏడాదికి 900 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతున్నాయని, వచ్చే ఏడాది నుంచి 1400 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతాయని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో యూరోఫిన్స్ రీజనల్ డైరెక్టర్ నీరజ్ గార్గ్, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికలొస్తేనే కేసీఆర్‌కు హామీలు గుర్తొస్తాయి: బండి సంజయ్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/తొర్రూరు: ఎన్నికల సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హామీలు గుర్తుకొస్తాయని, మోసాలు చేయడంలో ఆయన పీహెచ్డీ పూర్తయిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. ఆదివారం ఖమ్మంలో నిర్వహించిన ‘రైతుగోస– బీజేపీ భరోసా’సభలో ఆయన మాట్లాడారు. ఖమ్మం జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉందని, ఉద్యమాల గడ్డ మాత్రమే కాక కేసీఆర్ దొంగ దీక్షను బయటపెట్టిన జిల్లా అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దొంగ పాస్‌పోర్టులు చేసిన దుబాయ్ శేఖర్ అని, ఆయన కొడుకు పేరు అజయ్‌రావు అయితే టికెట్ కోసం ఎన్టీఆర్ మెప్పు పొందడానికి తారక రామారావు అనే పేరు పెట్టాడని ఆరోపించారు. ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందంతో ముందుకొస్తున్నాయన్నారు. అప్పుల రాష్ట్రం ధనిక రాష్ట్రం కావాలన్నా, ప్రజల బాధలు పోవాలన్నా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పారు. కాగా ఖమ్మం వెళుతూ మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో సంజయ్ కొద్దిసేపు ఆగారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన పార్టీ నాయకుడు అలిసేరి రవిబాబును పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్యాన్సర్ కంటే కేసీఆరే డేంజర్ అని వ్యాఖ్యానించారు. హామీలను విస్మరిస్తూ ప్రజలను నట్టేట ముంచిన బీఆర్ఎస్కు ఓటేయవద్దని, సామాన్యుల కోసం కొట్లాడుతున్న బీజేపీకి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ చేతల ప్రభుత్వం కాదు: ఈటల బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలతోనే సరిపెడుతుంది తప్ప చేతల ప్రభుత్వం కాదని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ విమర్శించారు. ఎన్నికలు వస్తుండడంతో రైతులను మోసం చేసేందుకు కేసీఆర్ కొత్త మాటలు చెబుతున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక తరుగు లేకుండా ధాన్యం కొంటామని, రైతుల హక్కుగా అందాల్సిన అన్ని సబ్సిడీలు అందిస్తామని హామీ ఇచ్చారు. -
ఓటు దొంగలు.. బాబు అండ్‌కో
తాడికొండ: ఎన్నికలు సమీపిస్తుండడంతో బహుజనుల ఓట్లు దోచుకునేందుకు రాష్ట్రంలో బాబు అండ్ కో బ్యాచ్ అడ్డగోలుగా తిరుగుతుందని బహుజన పరిరక్షణ సమితి నాయకులు అన్నారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 1,049వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలో శనివారం పలువురు మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో పక్క రాష్ట్రంలో దాక్కున్న పలు పార్టీల నాయకులు ఇప్పుడు ఓట్లు వేయించుకునేందుకు బహుజనులకు వల విసురుతున్నారన్నారు.14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పేదలకు ఏం చేశాడో చెప్పి ప్రజల్లోకి రావాలని లేకుంటే తరిమికొట్టడం ఖాయమని హెచ్చరించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బహుజనుల కలలు సాకారం చేస్తుంటే చంద్రబాబు,పవన్ కళ్యాణ్ చూడలేక కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు సుపుత్రుడు లోకేశ్, దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్, బీజేపీలోని బాబు బంధువు పురందేశ్వరి.. బాబును గద్దెనెక్కించేందుకే ఎల్లో మీడియాతో కలిసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కులమతాలను రెచ్చగొట్టి లబ్ధిపొందాలని చూస్తున్న చంద్రబాబు.. అన్ని ప్రాంతాల్లో అల్లర్లు సృష్టించేందుకు పావులు కదుపుతున్నాడని చెప్పారు. రిలే నిరాహార దీక్షలో సమితి నాయకులు కారుమూరి పుష్పరాజు, బేతపూడి సాంబయ్య, పులి దాసు, మాదిగాని గురునాథం, ఈపూరి ఆదాం, నూతక్కి జోషి తదితరులు పాల్గొన్నారు. రిలే దీక్షలో బహుజన నేతలు -
చలో ఢిల్లీకి తెలంగాణ జనసమితి పిలుపు: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జనసమితి అధినేత ప్రోఫెసర్ కోదండరాం రేపు చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. తాము విభజన హామీలు, కృష్ణ జలాల సమస్యపై ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మౌన దీక్ష చేయనున్నట్లు తెలిపారు. సుమారు 150 మందితో గంటపాటు మౌనదీక్ష చేపడతామని చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న జలవనరుల దోపిడీ కోసమే తాను ఈ మౌన దీక్ష చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు జనసమితి అధినేత కోదండరాం జనవరి 30న ఢిల్లీలో మౌన దీక్ష చేయనున్నారు. జనవరి 31వ తేదిన కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలన అభివృద్ధి వాస్తవాలు అనే అంశంపై కానిస్టిట్యూషన్ క్లబ్లో సెమినార్ ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. (చదవండి: మోదీ సర్కారే టార్గెట్.. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలన్న కేసీఆర్) -
YS Sharmila: ‘సర్కార్ దిగొచ్చేదాకా దీక్ష ఆపను’
సాక్షి, హైదరాబాద్: వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నగరంలోని లోటస్‌పాండ్‌లోని నివాసం వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్ షర్మిల ఆమరణ నిరహార దీక్ష నేపథ్యంలో.. లోటస్ పాండ్‌ను పోలీసుల దిగ్బంధించారు. కర్ఫ్యూ వాతావరణం నెలకొంది అక్కడ. పార్టీ కార్యకర్తలను ఎవరినీ లోపలకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు. ఇంకోవైపు ఆమె వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు తన దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. నా పాదయాత్రకు అనుమతి ఇవ్వండి అంటూ ఆమె పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. ‘‘బాధితుల మీదే కేసులు పెట్టి వేధిస్తున్నారని, వైఎస్సార్టీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడానికి కారణాలేవీ లేవని, ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్నార’’ని ఆమె మండిపడ్డారు. మరోవైపు వైఎస్ఆర్టీపీ పార్టీ నేతల, కార్యకర్తల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. శుక్రవారం నుంచి బొల్లారం పోలీస్ స్టేషన్లోనే 40 మంది పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు. మరోవైపు బంజారాహిల్స్ పీఎస్‌లో ఏడుగురు పార్టీ నేతలు పోలీసుల అదుపులో ఉన్నారు. అర్ధాంతరంగా నిలిచిపోయిన తన పాదయాత్రను తిరిగి ప్రారంభించేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో పాటు అరెస్ట్ అయిన పార్టీ నేతలను విడుదల చేసేంత వరకు దీక్ష ఆపేది లేదంటున్నారు వైఎస్ షర్మిల. ఈ మేరకు శుక్రవారం ఆమె ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు. హైకోర్టు అనుమతి ఇచ్చినా.. పాదయాత్ర చేసుకోనివ్వకుండా న్యాయస్థానం తీర్పునే సీఎం కేసీఆర్ అగౌరవ పరస్తున్నారన్నారని షర్మిల దీక్ష చేపట్టిన సందర్భంగా మండిపడ్డారు. -
నేడు ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ దీక్ష
-
రేపు తాడిపత్రిలో వైఎస్ షర్మిల దీక్ష
సాక్షి, హైదరాబాద్: ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం చేస్తున్న నిరాహార దీక్ష కార్యక్రమంలో భాగంగా, వైఎస్ షర్మిల ఈ నెల 13వ తేదీ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి నియోజకవర్గంలోని తాడిపత్రి గ్రామంలో ‘నిరుద్యోగ నిరాహార దీక్ష’ చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు, వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు, కార్య కర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ దీక్షకు హాజరై మద్దతు పలకాలని ఆ పార్టీ అడహాక్ కమిటీ సభ్యులు కొండా రాఘవరెడ్డి కోరారు. -
తలైవా.. నువ్వు రావాల్సిందే
టీ.నగర్ : రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలంటూ అభిమానులు ఆర్కాడులో గురువారం నిరాహారదీక్ష చేశారు. హీరో రజనీకాంత్ డిసెంబరు 31వ తేదీన కొత్త పార్టీని ప్రారంభించి రాజకీయాల్లోకి రానున్నట్లు ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలావుండగా తనకు ఆరోగ్యం సరిలేదని, రాజకీయ ప్రవేశం చేయడం లేదని హఠాత్తుగా రజనీ ప్రకటించారు. రజనీ రాజకీయ పార్టీ స్థాపించి ప్రజాసేవ చేస్తాడని భావించిన ఆయన అభిమానులు, మన్రం నిర్వాహకులు ఆయన ప్రకటనతో దిగ్భ్రాంతిలో మునిగారు. అంతేకాకుండా పార్టీ ప్రారంభించి రాజకీయాల్లోకి రావాలని డిమాండ్ చేస్తూ రజనీ నివాసం ఎదుట ధర్నాలు చేపడుతున్నారు. ఆర్కాడు వసిష్టేశ్వర ఆలయం ఎదుట రజనీ పూర్తిగా కోలుకుని రాజకీయాల్లో పాల్గొనాలంటూ అభిమానులు, రజనీ మక్కల్ మండ్రం నిర్వాహకులు నిరాహారదీక్ష చేపట్టి ప్రార్థనలు చేశారు. ఆర్కాడు నగర కార్యదర్శి ఏఎం. వరదన్, యూనియన్ కార్యదర్శి వీఎం సేట్టు సహా వంద మందికి పైగా మండ్రం నిర్వాహకులు పాల్గొన్నారు. -
అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తే ఊరుకోం
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తే ఎన్డీయే ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని దళిత, గిరిజన సంఘాల ప్రతిఘటన దీక్షలో నేతలు హెచ్చరించారు. ఢిల్లీలో జరిగిన ఈ దీక్షలో పలువురు నేతలు మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఉద్యమాలు, త్యాగాలతో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం వచ్చిందని, దళిత గిరిజనులకు అండగా ఉండాల్సిన కేంద్రం ఆ చట్టాన్ని నీరు గార్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. దేశవ్యాప్తంగా దళిత, గిరిజనులపై జరిగిన దాడులు, హత్యలు, అత్యాచారాలు కులదూషణ కేసులు కోర్టు వరకు వెళ్లడం లేదని, పోలీసు స్టేషన్లలోనే రాజీ చేయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టు వరకు వెళ్లిన కేసుల్లో బాధితులను బెదిరించి రాజీ చేయిస్తున్నారని పేర్కొన్నారు. అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరారు. పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపు పాత చట్టాన్ని పటిష్టం చేస్తూ బిల్లు తేవాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షకు టీఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు ఇటుక రాజు మాదిగ అధ్యక్షత వహించారు. ఏపీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ, తెలంగాణ మాల మహానాడు అధ్యక్షుడు ఎర్రవళ్లి రాములు మాల, నేతలు పెబ్బె జీవ మాదిగ, రాయికంటి రాందాస్, కె.సాంబశివరావు, సింగిరెడ్డి పరమేశ్వర్, గడ్డయాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఐదోవ రోజుకు చేరిన కేజ్రీవాల్ నిరసన
-
నాలుగో రోజుకు చేరిన కేజ్రీవాల్ నిరసన
న్యూఢిల్లీ: ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కార్యాలయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ముగ్గురు మంత్రులు చేస్తున్న దీక్ష నాలుగో రోజుకు చేరింది. దీంతో ఎల్జీ ఇంటి నుంచే తన విధులు నిర్వహిస్తున్నారు. కాగా, దీక్ష చేస్తున్న కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఎవరినీ అనుమతించకపోవడంపై ఆప్ నేతలు మండిపడ్డారు. ‘కేజ్రీవాల్‌ను హౌజ్ అరెస్టు చేశారా?’ అని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ప్రశ్నించారు. ఢిల్లీలో ఐఏఎస్ అధికారులు ఆందోళన విరమింపజేసే విషయంలో బైజాల్ చొరవతీసుకోవడం లేదంటూ కేజ్రీవాల్ నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. అటు, ప్రధానమంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్ల తీరును నిరసిస్తూ.. ఎమ్మెల్యేలు, ఆప్ కార్యకర్తలు రాజ్‌ఘాట్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ‘మోదీజీ ఫర్గివ్ ఢిల్లీ’ హ్యాష్‌ట్యాగ్‌తో ఈ ప్రదర్శన కొనసాగింది. నాలుగు నెలలుగా ఆందోళన చేస్తున్న ఢిల్లీ ఐఏఎస్ అధికారుల ఆందోళన విరమించేలా ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. -
సంఘీభావం
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో పదవులను త్యజించి ఢిల్లీలో ఆమరణ దీక్షకు దిగిన వైఎస్సార్సీపీ ఎంపీలకు జిల్లా వ్యాప్తంగా సంఘీభావం వెల్లువెత్తింది. శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల్లో సంఘీభావ దీక్షలను ఏర్పాటు చేసి.. ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ అని నినదించారు. విద్యార్థులు, యువకులు, న్యాయవాదులు స్వచ్ఛందంగా తరలివచ్చి మద్దతు ప్రకటించారు. సీపీఎంతో పాటు పలు ప్రజా సంఘాల నేతలు కూడా మద్దతు తెలిపారు. ఉదయం పది గంటలకు ప్రారంభమైన దీక్షలు సాయంత్రం మానవహారాలతో ముగిశాయి. కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : కర్నూలులోని ధర్నాచౌక్ (శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద)లో వైఎస్సార్సీపీ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య ముఖ్యఅతిథిగా ప్రారంభించారు. ఈ శిబిరంలో హఫీజ్‌ఖాన్, నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్రెడ్డితో పాటు వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువకులు కూర్చున్నారు. ఈ సందర్భంగా బీవై రామయ్య మాట్లాడుతూ..ఎంపీల త్యాగాలను వృథాగా పోనివ్వబోమన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు. నాలుగేళ్లుగా సీఎం చంద్రబాబు చేసిన అవినీతి, అక్రమాల మూలంగానే కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రంపై చిన్నచూపు చూస్తోందన్నారు. ఓటుకు నోట్లు కేసు, అమరావతి, పోలవరం, పట్టిసీమల్లో జరిగిన అవినీతికి భయపడిన చంద్రబాబు..రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టారని దుయ్యబట్టారు. ♦ ప్రత్యేక హోదాపై పలుమార్లు యూటర్న్ తీసుకున్న ముఖ్యమంత్రి దమ్ముంటే ఎంపీలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. కాగా.. ఈ దీక్షలకు సీపీఎం జిల్లా కార్యదర్శి కె.ప్రభాకరరెడ్డి, ఆ పార్టీ నాయకులు నిర్మలమ్మ, గౌస్ దేశాయ్ మద్దతు ప్రకటించారు. టీడీపీ, బీజేపీ కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేశాయని దుయ్యబట్టారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సీహెచ్ మద్దయ్య, నాయకులు రెహమాన్, రాఘవేంద్రారెడ్డి, మాలిక్ కరుణాకరరెడ్డి, ఆదిమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ♦ ఆత్మకూరులోని కొత్తబస్టాండ్ ప్రాంతంలో సంఘీభావ దీక్షలను వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి ప్రారంభించారు. దీక్షలో కౌన్సిలర్లు లాలు, తిమ్మోతి, రాజగోపాల్,నజీర్, కరీముల్లా కూర్చొన్నారు. వీరికి పలు పాఠశాలల విద్యార్థులు సంఘీభావం ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాటాన్ని ఆపబోమని శిల్పా చక్రపాణిరెడ్డి స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు స్వార్థం కోసం ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారని విమర్శించారు. తమ పార్టీ అధినేత మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారని గుర్తు చేశారు. పోరాటాన్ని ఉధృతం చేయడంలో భాగంగానే ఎంపీల రాజీనామా, దీక్షలకు పూనుకున్నట్లు చెప్పారు. ♦ ఆలూరులో దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్యే గుమ్మ నూ రు జయరాం ప్రారంభించారు. సీపీఎం నాయకులు నారాయణ, సత్యనారాయణ, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు షాకీర్, మైనా మద్దతు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం అసమర్థతతోనే ఏపీకి ప్రత్యేక హోదా రావడంలేదన్నారు. సీఎం వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. ♦ నందికొట్కూరు పటేల్ సెంటర్లో దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్యే ఐజయ్య ప్రారంభించారు. విద్యార్థులు మద్దతు తెలిపారు. ఐజయ్య మాట్లాడుతూ ఎంపీల ప్రాణాలకు ముప్పు వాటిల్లితే మోదీ, చంద్రబాబులదే బాధ్యత అన్నారు. కేంద్రం వెంటనే స్పందించి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. ♦ పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి కర్నూలులోని నంద్యాల చెక్ పోస్టు సమీపంలో దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డితో పాటు నాయకులు దేవపూజ ధనుంజయాచారి, రాజేంద్ర ప్రసాద్‌నాయుడు, బెల్లం మహేశ్వరరెడ్డి, సురేంద్రనాథరెడ్డి, ఫిరోజ్, సులోచన, ఉమాబాయి, షబీయా, వెంకటేశ్వరమ్మ, శ్రీనివాసరావు, దొడ్డిపాడు మహబూబ్‌బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. వైఎస్సార్సీపీ చేపట్టిన ఉద్యమానికి అన్ని వర్గాలు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ♦ ఆళ్లగడ్డ నాలుగు రోడ్ల కూడలిలో గంగుల బిజేంద్రారెడ్డి(నాని) ఆధ్వర్యంలో సంఘీభావ దీక్ష నిర్వహించారు. ఈ దీక్షకు పలువురు దివ్యాంగులు మద్దతు తెలిపారు. ♦ డోన్ పాత బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో జెడ్పీటీసీ సభ్యులు శ్రీరాములు, దిలీప్ చక్రవర్తి, బుగ్గన నాగభూషణ్‌రెడ్డి, ముర్తుజావలి, గౌసియా బేగం కూర్చొన్నారు. ♦ నంద్యాలలోని టెక్కె శిల్పా సహకార్ సమీపంలో నిర్వహించిన సంఘీభావ దీక్షలో వైఎస్సార్సీపీ నేత శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీపీ నాగిరెడ్డి, నాయకులు రామలిం గారెడ్డి, ఇషాక్‌బాషా, హబీబుల్లా కూర్చున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు మద్దతు తెలిపారు. ♦ పత్తికొండలో చేపట్టిన సంఘీభావ దీక్షలో నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. దీక్షలో కూర్చున్న వారికి సాయంత్రం కేడీసీసీ మాజీ చైర్మన్ రామచంద్రారెడ్డి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ♦ ఆదోనిలో చేపట్టిన రిలే దీక్షలో పదిమంది వైఎస్సార్సీపీ నాయకులు కూర్చున్నారు. రాష్ట్ర ప్రచార కార్యదర్శి గోపాల్‌రెడ్డి ధ్రుతరాష్ట్రుడి వేషధారణలో ఆకట్టుకున్నారు. సీఎం చంద్రబాబు కళ్లుండి చూడలేని కబోదని, అందుకే ఇలా నిరసన తెలుపుతున్నానని గోపాల్‌రెడ్డి చెప్పారు. ఈ దీక్షలకు సాయంత్రం కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య సంఘీభావం ప్రకటించారు. ♦ ఎమ్మిగనూరులో చేపట్టిన రిలే దీక్షలో నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట జగన్మోహన్రెడ్డి తదితరులు కూర్చున్నారు. వీరికి పలువురు విద్యార్థులు, యువకులు మద్దతు తెలిపారు. సాయంత్రం బీవై రామయ్య దీక్ష విరమింపజేశారు. ♦ కోడుమూరు పాతబస్టాండ్‌లో ఏర్పాటు చేసిన దీక్షలో సమన్వయకర్త మురళీకృష్ణ పాల్గొనగా.. పలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. -
సంతసం.. సన్యాస దీక్ష నిర్ణయం
హిందూపురం అర్బన్: పట్టణంలోని వీడీ రోడ్డులో నివాసముంటున్న కైలాష్మలాని, కరుణదేవిల కుమారుడు కీర్తన్మలానీ(18) జైన సన్యాస దీక్ష స్వీకరించాలని నిర్ణయించుకున్నాడు. నిండా 18 ఏళ్లు కూడా లేని కీర్తన్ మలానీ ఐహిక సుఖాలు త్యజించి సన్యాసిగా మారాలని తీసుకున్న నిర్ణయంతో జైనమత పెద్దలు, కుటుంబీకులు, బంధువులు అతన్ని పెళ్లికొడుకుగా ముస్తాబు చేసి మంగళవారం పల్లకీలో పురవీధుల గుండా ఊరేగిస్తూ నృత్యాలు చేశారు. ఈనెల 27న హుబ్లీలో ఆచార్య అజిత్శేఖర్ సురేజీ ఆధ్వర్యంలో కీర్తన్మలానీ సన్యాసదీక్షను స్వీకరించనున్నారు. -
చెంబు చచ్చింది...ఆత్మగౌరవం దక్కింది
నెల్లూరు / పెళ్లకూరు: అధికారుల అత్యుత్సాహం ప్రజాగ్రహానికి కారణమైంది. శుభకార్యాల్లో కలశంగా.. అంత్యక్రియలు, అనంతర కార్యక్రమాల్లో పవిత్రం గా వినియోగించే చెంబును అవహేళన చేయడం తగదంటూ పెళ్లకూరు గ్రామస్తులు అధికారులపై విరుచుకుపడ్డారు. ‘చెంబు చచ్చింది.. ఆత్మగౌరవం దక్కింది’ అనే నినాదంతో చెంబుకు శవయాత్ర నిర్వహించడాన్ని అడ్డుకున్నారు. తమ సెంటిమెంట్లను అవహేళన చేయడం తగదని, శవయాత్ర నిర్వహించడం వల్ల ఊరికి అరిష్టం కలుగుతుందంటూ నిరసనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. బహిరంగ మల విసర్జనను రూపమాపడానికి, అందరూ మరుగుదొడ్లను వినియోగించేలా చేయడానికి ఆత్మగౌరవ దీక్షల పేరిట జిల్లా యంత్రాం గం 41 రోజులపాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా ‘చెంబు చచ్చింది.. ఆత్మగౌరవం’ దక్కిందనే నినాదంతో చెంబులకు పాడెకట్టి శవయాత్రల పేరిట ఊరేగింపులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మండల టాస్క్‌ఫోర్స్ అధికారి నాగజ్యోతి ఆధ్వర్యంలో గురువారం పెళ్లకూరు దళిత కాలనీలో ఈ కార్యక్రమానికి పూనుకున్నారు. అధికారులు, సిబ్బంది కలిసి డప్పుల మోతల నడుమ ‘చెంబు చచ్చింది.. ఆత్మగౌరవం దక్కింది’ అంటూ నినాదాలు చేస్తూ చెంబుకు పాడెకట్టి శవయాత్ర చేపట్టారు. అంతలో కాలనీకి చెందిన వారంతా ఏకమై అధికారుల తీరుపై నిరసన తెలిపారు. చెంబుకు పాడెకట్టి శవయాత్ర చేస్తూ ఊరంతా తిప్పడం మంచిది కాదని, ఇలాంటి పనులు ఊరికి అరిష్టం తెస్తాయంటూ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ఒకానొక దశలో అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. బహిరంగ మల విసర్జనను నివారించడానికి కార్యక్రమాలు చేపట్టడం, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడం, చైతన్య యాత్రలు చేయడంపై తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే, ప్రజల సెంటిమెంట్స్‌ను కించపరిచేలా చేయడం సరికాదన్నారు. పురాతన కాలం నుంచి చెంబుకు ఎంతో విశిష్టత ఉందని.. ఎన్నో పనులు, అవసరాలతోపాటు సంప్రదాయబద్ధంగా నిర్వర్తించే క్రతువుల్లో దానిని వినియోగిస్తుంటారని తెలిపారు. బహిర్భూమికి మాత్రమే చెంబును వినియోగించరనే విషయాన్ని గుర్తెరగాలని అన్నారు. ఎంత చెప్పినా కాలనీ ప్రజలు వినకపోవడంతో చేసేది లేక అధికారులు కార్యక్రమం పూర్తి కాకుండానే వెనుదిరిగారు. గ్రామస్తుల నిరసనను ఎదుర్కొన్న వారిలో ఎంపీడీఓ నాగప్రసాద్, ఐసీడీఎస్ సూపర్వైజర్ మునికుమారి, ఏఈలు మనోజ్‌కుమార్, కృష్ణారావు, ఏఈఓ పుట్టయ్య, మండల కోఆర్డినేటర్ కృష్ణయ్య పాల్గొన్నారు. -
న్యాయం కోసం భర్త ఇంటి ముందు దీక్ష
-
‘రాజీవ్’ సాక్షిగా దీక్ష
► కాంగ్రెస్‌లో మళ్లీ వివాదం ► అధ్యక్షుడికి వ్యతిరేకత ► చర్యలు తప్పదన్న తిరునావుక్కరసర్ రాహుల్ హిత బోధచేసినా, తామింతే అని కాంగ్రెస్ వర్గాలు చాటుకుంటున్నాయి. ఆ పార్టీ పదవుల పందేరం వివాదానికి దారితీసింది. ఉద్వాసనకు గురైన జిల్లాల అధ్యక్షులు రాజీవ్ స్మారక కేంద్రం వద్ద ఆదివారం దీక్ష నిర్వహించారు. అధ్యక్షుడు తిరునావుక్కరసర్‌కు వ్యతిరేకంగా నినదించారు. కాగా దీక్ష చేపట్టిన వారిపై చర్యలు తప్పదన్న హెచ్చరికలు జారీ అయ్యాయి. సాక్షి, చెన్నై : తమిళనాడు కాంగ్రెస్‌లో ఉన్న గ్రూపులన్నింటినీ ఒకే వేదిక మీదకు తెచ్చేందుకు ఢిల్లీ పెద్దలు తీవ్ర కుస్తీలు పడుతున్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈనెల మూడో తేదీ చెన్నైలో రెండు రోజుల పాటు పర్యటించారు. కాంగ్రెస్ వర్గాలను పిలిపించి ఐక్యతా ఉపదేశం కూడా చేశారు. ఐక్యమత్యమే మహాబలం అని, కుమ్ములాటలు, గ్రూపులు వద్దు అని హితవు పలికారు. తామంతా, ఒకటే అన్నట్టుగా ఆ సమయంలో నేతలు వ్యవహరించినా, తదుపరి వెలువడ్డ జిల్లా అధ్యక్షుల జాబితా వివాదానికి దారితీసింది. తన ఆధిపత్యాన్ని చాటుకునే విధంగా అధ్యక్షుడు తిరునావుక్కరసర్ పావులు కదిపారు. మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్‌కు ఈ జాబితాలో పెద్ద షాకే తగిలింది. ఆయన మద్దతుదారులందరికీ ఉద్వాసన పలికారు. దీంతో గ్రూపు వివాదం మళ్లీ తెరమీదకు వచ్చింది. తాజాగా తొలగింపునకు గురైన అధ్యక్షుడు దివంగత రాజీవ్ గాంధీ స్మారక ప్రదేశం శ్రీ పెరంబదూరు సాక్షిగా దీక్ష చేపట్టడంతో ఈ వివాదం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయోనని కాంగ్రెస్‌లో ఉత్కంఠ బయలు దేరింది. మాజీల దీక్ష తొలగింపునకు గురైన 20 జిల్లాలకు చెందిన అధ్యక్షుడు త్యాగ భూమిగా పేరు గడించిన రాజీవ్‌స్మారక ప్రదేశం శ్రీ పెరంబదూరులో ఆదివారం దీక్ష నిర్వహించారు. తమ గోడును వెల్లబోసుకుంటున్నట్టు, అధ్యక్షుడి తీరుపై శివాలెత్తారు. పార్టీని సర్వనాశనం చేయడం లక్ష్యంగా అధ్యక్షుడు కంకణం కట్టుకుని ఉన్నారని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు.ఈ నిరసనలు ఉధృతం అవుతాయని హెచ్చరించారు. రాజీవ్ గాంధీ మరణించిన ఈ త్యాగ భూమి నుంచి బయలుదేరిన నిరసన, రాష్ట్రవ్యాప్తంగా రగలడం ఖాయం అని హెచ్చరించారు. ఇక, దీక్ష చేస్తూ, పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ వీరిపై వేటుకు తిరునావుక్కరసర్ కసరత్తుల్లో పడ్డారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, త్యాగ భూమిలో వివాదం రేపుతున్నారంటూ ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేయడానికి సిద్ధం అవుతున్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని, శాశ్వత ఉద్వాసన తప్పదంటూ తిరునావుక్కరసర్ హెచ్చరికలు జారీ చేశారు. -
మిర్చి ధరపై దాగుడు మూతలా: గండ్ర
సాక్షి, భూపాలపల్లి : గిట్టుబాటు ధర రాక నష్టాల ఊబిలో కూరుకుపోయిన మిర్చి రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాగుడుమూతలు ఆడుతున్నాయని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి, మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆయన ఆమరణ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్వింటాల్ మిర్చిని బోనస్‌తో కలిపి రూ.6250 కొనుగోలు చేస్తామని కేంద్రం ప్రకటించి పది రోజులు దగ్గర పడుతున్నా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక పోవడం దారుమణమన్నారు. నాఫెడ్ ద్వారా నేరుగా కొనుగోలు చేపట్టే అవకాశం ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఆ పని చేయడం లేదని విమర్శించారు. రెండు ప్రభుత్వాలు దాగుడు మూతలు ఆడుతూ రైతులను మోసం చేస్తున్నాయని విమర్శించారు. -
అసెంబ్లీ వద్ద ఎమ్మెల్యే చెవిరెడ్డి దీక్ష
♦ ఎంపీ కేశినేని బృందాన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ ♦ భగ్నం చేసిన మార్షల్స్, పోలీసులు.. ♦ మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లో ఆరు గంటల నిర్బంధం సాక్షి, అమరావతి: వెలగపూడి తాత్కాలిక అసెంబ్లీ ఆవరణలో చిత్తూరు జిల్లా చంద్రగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సోమవారం ఉదయం చేపట్టిన దీక్ష తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. విజయవాడ నగరంలో రోడ్డు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎన్ బాలసుబ్రహ్మణ్యాన్ని నిర్బంధించి, దూషిస్తూ దాడికి యత్నించిన తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని), విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన ఉదయం 8.50 గంటలకు నాలుగో నంబరు గేటు లోపల అసెంబ్లీ ఎదురుగా దీక్ష చేపట్టారు. ఆయనకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సంఘీభావం తెలిపారు. హైడ్రామా నడుమ దీక్ష భగ్నం నల్ల దుస్తులు ధరించి దీక్ష చేపట్టిన చెవిరెడ్డి వద్దకు ఉదయం 10.05 గంటలకు చీఫ్ మార్షల్ గణేష్ నేతృత్వంలోని బృందం వచ్చిం ది. ఇక్కడ దీక్ష చేసేందుకు వీలు లేదని విరమించాలని కోరారు. అదే సమయంలో గుంటూరు జిల్లా ఎస్పీ నారాయణనాయక్, ఏఎస్పీ విక్రాంత్ పాటిల్‌లు తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. రోప్ పార్టీ సహాయంతో మార్షల్స్ ఎమ్మెల్యే చెవిరెడ్డిని ఎత్తుకొని గేటు బయట ఉంచిన వాహనంలోకి తీసుకెళ్లేందుకు యత్నించగా, ఆయన గట్టిగా ప్రతిఘటించి గేటు ముందు భైఠాయించారు. అయినా పోలీసులు, మార్షల్స్ అందరినీ పక్కకు నెట్టి 10.25 గంటలకు చెవిరెడ్డిని పోలీస్ వాహనంలోకి ఎక్కించి తీసుకుపోయారు. ఎమ్మెల్యే చెవిరెడ్డిని పోలీసులు మంగళగిరి పోలీస్టేషన్లో ఆరు గంటలపాటు నిర్బంధించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, రఘురామిరెడ్డి, తదితరులు పోలీస్టేషన్‌కు చేరుకున్నారు. వారిని స్టేషన్ ప్రాంగణంలోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. సాయంత్రం 4.15 గంటలకు చెవిరెడ్డిని విడిచిపెట్టారు. మీకో చట్టం... నాకో చట్టమా? టీడీపీ నేతలకు ఒక చట్టం, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేనైన తనకు ఓ చట్టం అమలు చేస్తారా అంటూ సీఎం చంద్రబాబును చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రశ్నించారు.ఈ మేరకు ఆయన సీఎంకు ఓ బహిరంగ లేఖరాశారు. -
హామీలతో అన్నివర్గాలను వంచించిన బాబు
–మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి అనంతపురం సప్తగిరి సర్కిల్: ఎన్నికల్లో బూటకపు హామీలతో చంద్రబాబు అధికార పీఠం ఎక్కి ఆ తర్వాత అన్ని వర్గాలవారిని వంచించారని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి తెలిపారు. స్థానిక ఆర్డీఓ కార్యలయం ఎదుట ధర్నా చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల దీక్షా శిబిరాన్ని గురునాథరెడ్డి సందర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో బీజేపీ, సినిమా హీరో పవన్‌కళ్యాణ్‌తో కలిసి హామీలను గుప్పించారన్నారు. హామీలను నెరవేర్చకపోవడంతో వంచనకు గురైనవర్గాలవారు కఽలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల మంది కాంట్రాక్ట్ అధ్యాపకులున్నారని, వారికి సమాన పనికి సమాన వేతనాన్ని అందించడం పెద్ద కష్టమైన పని కాదన్నారు. మంగళవారం విద్యార్థి సంఘాలు, యువజన నాయకులు, కాంట్రాక్ట్ అధ్యాపకులతో కలిసి కలెక్టరేట్ ముట్టడి నిర్వహిస్తామన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి నాగిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రామిరెడ్డి, మైనార్టీ నాయకులు ముక్తియార్, కాంట్రాక్ట్ అధ్యాపకులు హనుమంతరెడ్డి, శివారెడ్డి, ఎర్రప్ప, రామలింగా, రామాంజినేయులు, రాధమ్మ, రాధిక, భాస్కర్‌రెడ్డి, అరుణ, శంకరప్ప, రామన్న, సత్యనారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
హోదాపై దీక్షకు సిద్ధమా?
చంద్రబాబుకు ముద్రగడ సవాల్ సాక్షి ప్రతినిధి, కాకినాడ : ముఖ్యమంత్రి చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే ప్రత్యేక హోదా డిమాండ్‌తో తనతో పాటు ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధం కావాలని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సవాల్ విసిరారు. తనవి దొంగ దీక్షలని సీఎం వందిమాగధులతో పదేపదే చెప్పిస్తున్నారన్నారని, దొంగ దీక్ష అయితే తనను బంధించిన ఆస్పత్రిలో పెద్ద ఎత్తున పోలీసులను ఎందుకు కాపలా పెట్టారని ప్రశ్నించారు. ఈ మేరకు సీఎంకు రాసిన లేఖ ప్రతులను ఆదివారం ఆయన ఇక్కడ పత్రికలకు విడుదల చేశారు. ‘తనవి దొంగదీక్షలని చెప్పిస్తున్న సీఎం.. తుని గర్జన లాంటి మరో సభను తమ జాతితో కిర్లంపూడిలో జరిపించాలని ముద్రగడ సవాల్ విసిరారు. అదే జరిగితే తన కుటుంబం కట్టుబట్టలతో రాష్ట్రం విడిచి పోతుందని, అప్పుడు తమ ఆస్తులు, అప్పులు తీసుకుని అనుభవించాలని సూచించారు. తుని ఐక్యగర్జన సభకు ఎవరికి వారే వాహనాలు ఏర్పాటు చేసుకున్నార ని, తిండి, తాగునీరు కూడా వారే తెచ్చుకున్నారని స్పష్టం చేశారు. కానీ మీరు సీబీసీఐడీ అధికారులతో ‘గర్జన సభ పెట్టడానికి డబ్బు ఎవరిచ్చారు? వెనుక జగన్ ఉన్నారా ? మోదీ, సోనియాగాంధీ ఉన్నారా?’ అని అడిగిస్తున్నారన్నారు. గతంలో సినీ నటుడు బాలకృష్ణ మరొకరి పేరుతో ఉన్న రివాల్వర్ పేల్చిన సందర్భంలో చంద్రబాబు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇంటికి వెళ్లి కాళ్లు పట్టుకుని కాపాడమని వేడుకున్నారని ముద్రగడ ఆ లేఖలో పేర్కొన్నారు. బాలకృష్ణ ఒక్క గంట కూడా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లకుండా, అరెస్టు కాకుండా ఉన్నారంటే అది వైఎస్ పుణ్యమేనని తెలిపారు. ముద్రగడ పర్యటన మళ్లీ వాయిదా: ముద్రగడ పద్మనాభం హైదరాబాద్ పర్యటన వాయిదా పడింది.వర్షాలవల్ల పర్యటన వాయిదా పడినట్టు రిజర్వేషన్ల పోరాట సమితి నేత ఆకుల రామకృష్ణ హైదరాబాదులో ఒక ప్రకటన ద్వారా తెలిపారు. -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి దీక్ష
– పెండ్లి చేసుకోవాలని డిమాండ్ – మంతనాలు జరుపుతున్న పెద్దలు దామరచర్ల (నల్లగొండ) : ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానని ఆ యువతిని నమ్మబలికాడు.. శారీరకంగా అనుభవించాడు. చివరాకరకు వివాహం చేసుకునేందుకు నిరాకరించాడు ఓ యువకుడు. దీంతో ఆ యువతి తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడి ఇంటి ఎదుట దీక్ష చేపట్టిన సంఘటన దామరచర్ల మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకొంది. బాధితురాలి వివరాల ప్రకారం...దామరచర్లకు చెందిన నీరుకంటి శ్రీను, మిర్యాలగూడకు చెందిన మాడిశెట్టి గౌతమి రెండేళ్ల క్రితం ప్రేమించుకున్నారు. ఇద్దరూ ఒకే సామజికవర్గానికి చెందిన కావడంతో వీరి వివాహానికి అప్పట్లో వారిరువురి తల్లిదండ్రులు సమ్మతించారు. అయితే అడిగిన కట్నం ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో శ్రీను తరుఫువారు వివాహానికి నిరాకరించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. మిర్యాలగూడ పోలీస్‌స్టేషన్‌లో రాజీ కుదిరింది. అయితే నాలుగు నెలల కిందట అమ్మాయికి గుంటూరు జిల్లా దుర్గికి చెందిన వ్యక్తితో వివాహమైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి.. ఇటీవల తల్లిగారింటికి వచ్చిన గౌతమి తిరిగి అత్తగారింటికి వెళుతున్న విషయాన్ని పసిగట్టిన శ్రీను ఆమెను అనుసరించి మాయ మాటలు చెప్పి దాచేపల్లి నుంచి అతడి బంధువుల ఇంటికి మంగళగిరికి తీసుకెళ్లాడు. పెండ్లి చేసుకుంటానని నమ్మించి మూడు రోజుల పాటు తనను శారీరకంగా వాడుకున్నాడని, అనంతరం మిర్యాలగూడలో వదిలేశాడని గౌతమి పేర్కొంది. తన అత్తగారి ఇంటి వాళ్లు కూడా తిరిగి తనను తీసుకవెళ్లేందుకు నిరాకరిస్తున్నారని వాపోయింది. తనను వివాహం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ శ్రీను ఇంటి ఎదుట దీక్షకు దిగింది. గౌతమి దీక్షకు బీజేపీ నాయకుడు వనం మధన్మోహన్, ఇతర మహిళా సంఘాల నాయకురాళ్ల మద్దతు పలికారు. అయితే శ్రీను కుటుంబసభ్యులు ఎవరూ అందుబాటులో లేరు. ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు పెద్ద మనుష్యులు మంతనాలు సాగిస్తున్నారు. -
‘పొంగులేటి ఫిరాయింపు అనైతికం’
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దీక్షను సాకుగా చూపించి ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరడం అనైతికమని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి ముసుగులో వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవడానికే పొంగులేటి పార్టీ మారుతున్నారన్నారు. శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యలతో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మ క్షోభిస్తుందన్నారు. ఇలాంటి అవకాశవాద నేతలు చివరి వరకు టీఆర్ఎస్లో ఉంటారనే గ్యారంటీ కూడా లేదన్నారు. పాలేరులో వెంకటరెడ్డి కుటుంబం పట్ల సానుభూతి, మానవీయకోణంతో అండగా ఉంటామన్న వ్యక్తులు వెంటనే పార్టీ మార్చడం అవకాశవాదమేనన్నారు. -
పెరుగుతున్న ప్రజా సంఘాల మద్దతు
వైఎస్ జగన్మోహన్రెడ్డి దీక్షకు ప్రజా సంఘాల మద్దతు రోజు రోజుకు పెరుగు తోంది. లోక్‌సత్తా, ఎమ్మార్పీఎస్, మాలమహానాడు, ఏపీ నిరుద్యోగుల ఐక్యవేదిక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల కంప్యూటర్ టీచర్స్ అసోసియేషన్, నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ, గిరిజనుల సంక్షేమ సంఘంతోపాటు వాణిజ్య సంఘాలు మద్దతు పలికాయి. వివిధ విద్యాసంస్థల అధినేతలు, కొందరు ప్రముఖులు జగన్‌ను వేదికపై కలిసి చర్చలు జరిపారు. జగన్‌తో విజ్ఞాన్ యూనివర్శిటీ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య కొంతసేపు చర్చలు జరిపారు. శిబిరంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, గుంటూ రు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కోన రఘుపతి, నేతలు మేరుగ నాగార్జున, ఆతుకూరి ఆంజనేయులు, ఎండీ నసీర్‌అహ్మద్, రాతంశెట్టి రామాంజనేయులు (లాలుపురంరాము), కావటి మనోహర్‌నాయుడు, పోలూరి వెంకటరెడ్డి, బండారు సాయిబాబు, దేవళ్ల రేవతి, నూనె ఉమాహేశ్వరరెడ్డి, షేక్ గులాం రసూల్, మొగిలి మధు, సయ్యద్‌మాబు, కొత్తా చిన్నపరెడ్డి, తిప్పారెడ్డి రామకృష్ణారెడ్డి, ఉత్తమ్‌రెడ్డి, అంగడి శ్రీనివాసరావు, కొలకలూరి కోటేశ్వరరావు, డైమండ్‌బాబు, శిఖా బెనర్జీ, ఏలికా శ్రీకాంత్‌యాదవ్, కోట పిచ్చిరెడ్డి, ఆతుకూరి నాగేశ్వరరావు, గనిక ఝాన్సీరాణి, పల్లపు రాఘవ, పానుగంటి చైతన్య, షేక్ జానీ, ఉప్పుటూరి నర్సిరెడ్డి, ఆవుల సుందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రాణహిత’ డిజైన్ మార్పుపై ప్రకాశ్‌గౌడ్ దీక్ష
శంషాబాద్ రూరల్: చేవెళ్ల- ప్రాణహిత ప్రాజెక్టు నుంచి రంగారెడ్డి జిల్లాను తప్పించడాన్ని నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ శంషాబాద్‌లో గురువారం ఒక్కరోజు దీక్ష చేపట్టారు. ఆయన దీక్షకు అఖిలపక్ష కమిటీ కన్వీనర్, మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ మద్దతు పలికారు. ఈ సందర్భంగా ప్రకాశ్‌గౌడ్ మాట్లాడుతూ ఉన్నట్టుండి డిజైన్ మార్చడానికి గల కారణాలను అఖిల పక్షానికి వివరించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు డిజైన్ మార్చి జిల్లా ప్రజలకు అన్యాయం చేస్తే కాంగ్రెస్, టీడీపీలు ఏకమై పోరాటం చేస్తాయని మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ తెలిపారు. వైఎస్సార్ తన హయాంలో ‘ప్రాణహిత- చేవెళ్ల’కు జాతీయ హోదాకోసం కృషి చేశారని, కేసీఆర్ మాత్రం ప్రాజెక్టు డిజైన్ మార్చి జిల్లా ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే నిధులు, నీళ్లు, నియామకాలు మనకే చెందుతాయని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు కేవలం తెలంగాణలోని ఒక్క ప్రాంతానికే సీఎం అన్నట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు క్యామ మల్లేష్, ఎంపీలు మల్లారెడ్డి, దేవేందర్‌గౌడ్, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, గోపీనాథ్, అరికపూడి గాంధీ, వివేకానంద, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, టీడీపీ నాయకులు ఎర్ర బెల్లి దయాకర్‌రావు, రావుల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
జగన్ దీక్షను విజయవంతం చేయండి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ మధురవాడ : ప్రభుత్వ వైఫల్యాలు, వాగ్దానాల అమలు గురించి జననేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ నెల 31, ఫిబ్రవరి 1 తేదీల్లో తణుకులో చేపట్టనున్న దీక్షను జయప్రదం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పిలుపు నిచ్చారు. శుక్రవారం చిట్టివలస వచ్చిన ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ వంటి హామీలను అమలు చెయ్యటంతోపాటు తుపాను బాధితులను ఆదుకోవటంతో కూడా విఫలమయ్యారని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టటంతోపాటు వాగ్దానాలు అమలు కోసం జగన్ ఈ దీక్షను చేస్తున్నారని చెప్పారు. దీనిలో పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొని జయప్రదం చెయ్యాలని కోరారు. కార్యక్రమంలో భీమిలి పట్టణ అధ్యక్షుడు అక్రమాని వెంకటరావు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
సమైక్య ‘సారథి’
జనసభలోనే కాదు.. చట్టసభలో సైతం సమైక్య శంఖారావాన్ని పూరించిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. సాక్షాత్తూ పార్లమెంటులో రాష్ట్రం సమైక్యంగానే ఉండాలంటూ ప్లకార్డు పట్టుకుని వెల్‌లో దూసుకెళ్లారు. మన జాతి, నేల విచ్ఛిన్నాన్ని అడ్డుకునేందుకు చివరిదాకా పోరాడారు. కాంగ్రెస్ స్వార్థ రాజకీయాలను దునుమాడుతూ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమానికి ఊపిరి పోశారాయన. అక్రమ కేసులతో జైలులో పెట్టినా సమైక్య రాష్ట్రం కోసం దీక్ష బూనారు. ప్రాణత్యాగానికీ సిద్ధపడ్డారు. బయటికొచ్చాక అలుపెరుగని పోరు సాగించారు. ఢిల్లీలోనూ ‘సమైక్య’ నినాదాన్ని మార్మోగించారు. హైదరాబాద్‌లో ‘శంఖారావం’ పూరించారు. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ ఉద్యమానికి అండగా నిలవాలంటూ దేశంలోని వివిధ పార్టీల అధినేతలను కలిసి విజ్ఞప్తి చేశారు. సమైక్యమన్న మాటకే కట్టుబడి జనహృదయ స్పందనను చాటిన నేత జగన్ మాత్రమే! -
ఆరోగ్యమిత్రల దీక్ష
మహారాణిపేట,న్యూస్‌లైన్ : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పీహెచ్‌సీల్లోని ఆరోగ్యమిత్రలు, నెట్వర్క్ మిత్రలు, డీటీఎల్, ఎన్‌టీఎల్‌ఎస్ తదితర సిబ్బంది ఏఐటీయూసీ అనుబంధ ఏపీ ఆరోగ్యమిత్ర కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.పద్మ, కార్యదర్శి సీహెచ్ గోవింద్ మాట్లాడుతూ నిత్యావసర వస్తువులు, వైద్య, విద్య ఖర్చులు పెరిగినందున జీవో 3 ప్రకారం వేతనాలు పెంచి అమలు చేయాలని డిమాండ్ చే శారు. థర్డ్‌పార్టీ కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలని, ఆరోగ్యమిత్ర, నెట్వర్క్ మిత్ర, టీడీఎల్‌లు, ప్రభుత్వ ఆరోగ్యశ్రీ ట్రస్టు ఆధ్వర్యంలో విధులు నిర్వర్తించేటట్లు చేసి వేతనాలను ట్రస్టు ద్వారా నేరుగా చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మన్మధరావు, ప్రధాన కార్యదర్శి వై.ఎన్.భద్రం, కె.కరుణ, పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. -
7న మిర్యాలగూడలో లక్ష మందితో దీక్ష
మిర్యాలగూడ, న్యూస్‌లైన్ : పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 7వ తేదీన మిర్యాలగూడలోని రాజీవ్‌చౌక్ వద్ద రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో లక్ష మందితో దీక్ష నిర్వహించనున్నట్టు నియోజకవర్గ రాజకీయ జేఎసీ కన్వీనర్ మాలి ధర్మపాల్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక శాంతినికేతన్ బీఈడీ కళాశాలలో రాజకీయ జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటును సీమాంధ్రులు అడ్డుకునే కుట్ర చేస్తున్నారన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందన్నారు. లక్ష దీక్ష కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. తెలంగాణలో నిర్వహించే శాంతి ర్యాలీలు ఇరు ప్రాంతాల మధ్య శాంతిని నెలకొల్పేవిధంగా ఉంటాయన్నారు. ఈ సందర్భంగా జేఎసీ నాయకులు తెలంగాణ నినాదాలు చేశారు. సమావేశంలో జేఏసీ నాయకులు మువ్వా రామారావు, డాక్టర్ రాజు, తిరునగరు భార్గవ్, వనం మదన్మోహన్, అన్నబీమోజు నాగార్జునచారి, గాయం ఉపేందర్‌రెడ్డి, బండి యాదగిరిరెడ్డి, రేపాల పురుషోత్తంరెడ్డి, బంటు వెంకటేశ్వర్లు, కుందూరు శ్యాంసుందర్‌రెడ్డి, హనుమంతరెడ్డి, కృష్ణారెడ్డి, అమరావతి సైదులు, కొత్త వెంకట్, ఉదయభాస్కర్‌గౌడ్, చందుయాదవ్, రాములు, అంజయ్య, సత్యనారాయణ, నాగభూషణం, కమలాకర్‌రెడ్డి, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జగన్‌కు బాసటగా జనం దీక్ష
సాక్షి, నెల్లూరు: సమైక్యాంధ్ర రాష్ట్రం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం చంచల్‌గూడ జైల్లో చేపట్టిన ఆమరణదీక్షకు మద్దతుగా జిల్లాలోని పలుచోట్ల రిలేదీక్షలు చేపట్టారు. సూళ్లూరుపేటలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు దబ్బల రాజారెడ్డి, నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో దీక్షలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఉదయగిరిలో దీక్షలు చేపట్టిన కార్యకర్తలకు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సంఘీభావం ప్రకటించారు. నెల్లూరులోని బారాషహీద్ దర్గాలో తాటి వెంకటేశ్వర్లు, కేవీ రాఘవరెడ్డి తదితరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనేక చోట్ల సంఘీభావ దీక్షలు జరిగాయి. జగన్‌కు మద్దతుగా పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామని పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ తెలిపారు. సోమవారం నుంచి నిరాహారదీక్షలతో పాటు నిరసన కార్యక్రమాలున ఉధృతం చేయనున్న ట్టు పార్టీ నాయకులు కాకా ణి గోవర్ధన్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రకటించారు. -
అమానుషంగా ప్రవర్తించారు
సాక్షి, రాజమండ్రి :రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ప్రజల పక్షాన ఐదు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో ప్రభుత్వం అవలంబించిన వైఖరి అమానుషంగా ఉందని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు, దివంగత ముఖ్యమంత్రి సతీమణి అని కూడా చూడకుండా పోలీసులు వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. స్థానిక కోటగుమ్మం వద్ద శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు వైఎస్ కుటుంబాన్ని ఎంత ఇబ్బందులకు గురిచేస్తున్నా, ఆ కుటుంబానికి ఇంకా ప్రజాబలం పెరుగుతూనే ఉందన్నారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడుతున్న వైఎస్సార్ సీపీని కుయుక్తులతో ప్రజల నుంచి వేరు చేయలేరన్నారు. అర్ధరాత్రి 1.55 గంటలకు పోలీసులు కనీసం అంబులెన్స్ కూడా లేకుండా వచ్చి దీక్షను భగ్నం చేయడం దారుణమన్నారు. కాకినాడలో మంత్రి తోట నరసింహం సతీమణి నిరవధిక దీక్ష చేపట్టినప్పుడు వ్యవహరించినట్టుగా కూడా ప్రవర్తించలేదని విచారం వ్యక్తం చేశారు. వేదికపై ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సైతం కిందకు నెట్టేసి విజయమ్మను తరలించారన్నారు. బుచ్చయ్యా.. ఆలోచించి మాట్లాడు వైఎస్‌పై టీడీపీ నాయకుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి చేసిన వ్యాఖ్యలను ఆదిరెడ్డి ఖండించారు. గతంలో వైఎస్ తెలంగాణపై కేంద్రానికి ఓ నివేదిక మాత్రమే పంపారని, తెలంగాణ ఇమ్మని సిఫారసు చేయలేదని గుర్తు చేశారు. తెలంగాణ ఇవ్వాలనుంటే 2004, 2009లో అధికారం చేపట్టినప్పుడే అలా జరిగి ఉండేదని వివరించారు.చంద్రబాబునాయుడు సమైక్య రాష్ట్ర ఆశయాన్ని ముక్కలు చేస్తూ లేఖ ఇచ్చినందువల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి దాపురించిందని విచారం వ్యక్తం చేశారు. పజలు తిరగబడుతుండడం వల్ల దిక్కుతోచని ఆ పార్టీ నేతలు ఆత్మరక్షణ కోసం అర్ధంలేని ఆరోపణలకు దిగుతున్నారని విమర్శించారు. సచివాలయంలో ఉద్యోగులు సమైక్యాంధ్రకు మద్దతు పలకాలని చంద్రబాబును కోరగా, రాష్ట్ర విభజనకు తాను కట్టుబడి ఉన్న విషయాన్ని ప్రకటించడాన్ని గుర్తుచేశారు. జిల్లాలో పెద్దఎత్తున సమైక్యాంధ్ర ఉద్యమాలు సాగుతున్నా, ముందుకు రాని టీడీపీ నేతలు ఎదుటివారిని ఎలా విమర్శిస్తారని ప్రశ్నించారు. సమైక్య ఉద్యమాన్నిముందుకు తీసుకెళ్తాం పార్టీ శ్రేణులతో చర్చించి రాజమండ్రి 50 డివిజన్లలోను సమైక్య ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని ఆదిరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు సోమవారం నుంచి డివిజన్ల వారీగా నిరసనలు చేపట్టేందుకు ఉద్యమ ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గంతో పాటు రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్, రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని బలపరిచేందుకు కృషి చేస్తానని చెప్పారు. సమావేశంలో పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి టీకే విశ్వేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.