- వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్
మధురవాడ : ప్రభుత్వ వైఫల్యాలు, వాగ్దానాల అమలు గురించి జననేత వైఎస్ జగన్‌మోహనరెడ్డి ఈ నెల 31, ఫిబ్రవరి 1 తేదీల్లో తణుకులో చేపట్టనున్న దీక్షను జయప్రదం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ పిలుపు నిచ్చారు. శుక్రవారం చిట్టివలస వచ్చిన ఆయన మాట్లాడారు.
చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ వంటి హామీలను అమలు చెయ్యటంతోపాటు తుపాను బాధితులను ఆదుకోవటంతో కూడా విఫలమయ్యారని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టటంతోపాటు వాగ్దానాలు అమలు కోసం జగన్ ఈ దీక్షను చేస్తున్నారని చెప్పారు. దీనిలో పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొని జయప్రదం చెయ్యాలని కోరారు. కార్యక్రమంలో భీమిలి పట్టణ అధ్యక్షుడు అక్రమాని వెంకటరావు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.