సమైక్య ‘సారథి’
జనసభలోనే కాదు.. చట్టసభలో సైతం సమైక్య శంఖారావాన్ని పూరించిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. సాక్షాత్తూ పార్లమెంటులో రాష్ట్రం సమైక్యంగానే ఉండాలంటూ ప్లకార్డు పట్టుకుని వెల్‌లో దూసుకెళ్లారు. మన జాతి, నేల విచ్ఛిన్నాన్ని అడ్డుకునేందుకు చివరిదాకా పోరాడారు. కాంగ్రెస్ స్వార్థ రాజకీయాలను దునుమాడుతూ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమానికి ఊపిరి పోశారాయన. అక్రమ కేసులతో జైలులో పెట్టినా సమైక్య రాష్ట్రం కోసం దీక్ష బూనారు.
ప్రాణత్యాగానికీ సిద్ధపడ్డారు. బయటికొచ్చాక అలుపెరుగని పోరు సాగించారు. ఢిల్లీలోనూ ‘సమైక్య’ నినాదాన్ని మార్మోగించారు. హైదరాబాద్‌లో ‘శంఖారావం’ పూరించారు. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ ఉద్యమానికి అండగా నిలవాలంటూ దేశంలోని వివిధ పార్టీల అధినేతలను కలిసి విజ్ఞప్తి చేశారు. సమైక్యమన్న మాటకే కట్టుబడి జనహృదయ స్పందనను చాటిన నేత జగన్ మాత్రమే!