చలో ఢిల్లీకి తెలంగాణ జనసమితి పిలుపు: కోదండరాం | Telangana Jana Samithi Leader Kodandaram Took Up Silence Initiation | Sakshi
Sakshi News home page

చలో ఢిల్లీకి తెలంగాణ జనసమితి పిలుపు..జంతర్‌మంతర్‌ వద్ద మౌనదీక్ష

Published Sun, Jan 29 2023 7:35 PM | Last Updated on Sun, Jan 29 2023 8:38 PM

Telangana Jana Samithi Leader Kodandaram Took Up Silence Initiation  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ జనసమితి అధినేత ప్రోఫెసర్‌ కోదండరాం రేపు చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. తాము విభజన హామీలు, కృష్ణ జలాల సమస్యపై ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద మౌన దీక్ష చేయనున్నట్లు తెలిపారు. సుమారు 150 మందితో గంటపాటు మౌనదీక్ష చేపడతామని చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న జలవనరుల దోపిడీ కోసమే తాను ఈ మౌన దీక్ష చేపట్టినట్లు పేర్కొన్నారు.

ఈ మేరకు జనసమితి అధినేత కోదండరాం జనవరి 30న ఢిల్లీలో మౌన దీక్ష చేయనున్నారు. జనవరి 31వ తేదిన కేసీఆర్‌ తొమ్మిదేళ్ల పాలన అభివృద్ధి వాస్తవాలు అనే అంశంపై కానిస్టిట్యూషన్‌ క్లబ్‌లో సెమినార్‌ ఇవ్వనున్నట్లు పార్టీ  వర్గాలు పేర్కొన్నాయి. 

(చదవండి: మోదీ సర్కారే టార్గెట్‌.. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలన్న కేసీఆర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement