
‘పొంగులేటి ఫిరాయింపు అనైతికం’
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీక్షను సాకుగా చూపించి ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడం అనైతికమని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి ముసుగులో వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవడానికే పొంగులేటి పార్టీ మారుతున్నారన్నారు. శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యలతో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మ క్షోభిస్తుందన్నారు. ఇలాంటి అవకాశవాద నేతలు చివరి వరకు టీఆర్‌ఎస్‌లో ఉంటారనే గ్యారంటీ కూడా లేదన్నారు. పాలేరులో వెంకటరెడ్డి కుటుంబం పట్ల సానుభూతి, మానవీయకోణంతో అండగా ఉంటామన్న వ్యక్తులు వెంటనే పార్టీ మార్చడం అవకాశవాదమేనన్నారు.